03-07-2023, 10:15 PM
సుజాత ఫొటో అది. ఎర్ర పట్టులాంటి చీరలో, చామనఛాయ అయినా కూడా మెరిసిపోతున్నట్టు, చాలా ఆకర్షణగా కనిపించింది మధుకి. చూపు తిప్పుకోలేకపోతున్నాడు మధు.
మధు నోటి నించి వచ్చిన మాటలు... "వావ్, ఎక్స్క్విజిట్".
ఎదురుగా చూసాడు మధు, శీను ఇంకా రాలేదు.
సుజాత ఫొటోలు ఇంకేవన్నా ఉన్నాయేమోనని చూస్తున్నాడు.
అదే ఎర్రచీరలో పండగ జరుపుకుంటున్న ఫోటోలు చాలా ఉన్నాయి. తోరణాలు కడుతూ నడుం మడత కనిపిస్తూ, ఆ వాలుజడ, తలలో కనకాంబరాలు, మరువం పూలు, ఆ నల్లపూసలు, నడుస్తున్నప్పుడు కాళ్లకి పట్టీలు, మధుకి పిచ్చిపిచ్చిగా నచ్చసాగింది సుజాత.
శీను వచ్చాడేమోనని మళ్ళీ చూసాడు, రాలేదు. మళ్ళీ ఫోటోస్ చూడసాగాడు.
ఒక్కోటి చూస్తున్నాడు. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నట్టుగా, అన్ని ఫోటోల్లో సుజాత మధుని లాగసాగింది.
మొబైల్ స్క్రీన్ స్వైప్ చేస్తున్నాడు. ఒక్కసారిగా ఆగాడు. అదే ఎర్రచీరలో ఫోటో తీస్తుంటే వద్దు అన్నట్టుగా, సిగ్గుపడుతున్నట్టుగా, పదహారణాల తెలుగుపడుచు అందం, సిగ్గు, ముగ్ధలా, మనోహరంగా నవ్వుతూ సుజాత. మొబైల్ పక్కన పెట్టేసాడు మధు. అదే టైంకి లోపలికొచ్చాడు శీను.
మధుకి ఒక ఆలోచన రాసాగింది. ఆలోచిస్తూ ఉన్నాడు. శీను వచ్చి పక్కన కూర్చున్నది గమనించకుండా మనసులో ప్లాన్ వేయసాగాడు.
అలవాటు లేని స్కాచ్, అందులోను ఎక్కువ తాగడంతో, మాట్లాడకుండా కళ్ళుమూసుకుని అలా నిద్రపోసాగాడు శీను.
శీను వైపు చూసాడు మధు. శీను నిద్రపోతున్నట్టుగా సన్నగా గురక వినిపిస్తోంది. మళ్ళీ మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు మధు.
సుజాత చివరి ఫోటో మళ్ళీ చూసాడు. అదే ముగ్ధమనోహర నవ్వు, రూపం, ఆ చీర, ఆ కుంకుమ, ఆ నల్లపూసలు, ఆ పూలు, ఆ మొత్తం లుక్, మధు క్లీన్ బౌల్డ్.
జూమ్ చేసి మరీ చూడసాగాడు. సుజాత నవ్వు రారమ్మని పిలుస్తున్నట్టుగా, తనని సొంతం చేసుకోమని అడుగుతున్నట్టుగా, నీ కోసమే నేనున్నాను అని అంటున్నట్టు అనిపించసాగింది. వల్లకావట్లేదు మధుకి.
ఆ నవ్వుతో పాటే కింద నల్లపూసలు కనిపించాయి. మరొకరి భార్య, ఒక బిడ్డకి తల్లి. వద్దు అనే ఆలోచన వచ్చింది. అమాయకమైన మురళి మొహం గుర్తొచ్చింది. వెంటనే శీను చెప్పిన మురళి ఆత్మహత్య మాట కూడా గుర్తొచ్చింది.
"లెట్స్ గో ఫార్వర్డ్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్" అని నిర్ణయానికొచ్చాడు.
వేలితో సుజాత నవ్వుతున్న ఫొటో మీద రాయసాగాడు.
"వాట్ ఏ బ్యూటీ" అనుకున్నాడు.
శీను వైపు చూసాడు, ఇంకా గురక వినిపిస్తోంది. వెంటనే శీను మొబైల్ స్క్రీన్ మీద నవ్వుతున్న సుజాత ఫొటోని తన మొబైల్ నించి ఫోటో తీసుకున్నాడు.
"చూసావా ఫొటోస్" కళ్ళు తెరుస్తూ అడిగాడు శీను.
తన మొబైల్ పక్కన పెట్టేసి, శీను మొబైల్ స్క్రీన్ క్లియర్ చేసి శీనుకి మొబైల్ ఇస్తూ తల ఊపాడు మధు.
మత్తు కాస్త దిగటంతో మధు వైపు చూస్తూ..."ఏమంటావు " అడిగాడు శీను.
"ఆలోచిస్తున్నా"... సుజాత నవ్వుతున్న రూపాన్ని తలుచుకుంటూ అన్నాడు మధు.
"ఒక్కమాట కూడా నీకు అబద్దం చెప్పలేదు మధూ"
ఆలోచిస్తూ తల ఊపసాగాడు మధు.
"మురళికి ఏదన్నా అయితే అందులో నాకు కూడా భాగం ఉన్నట్టే, నేను కూడా వాడిని ముందుకితోసాను. నాకు కూడా భయంగా ఉంది. నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, మాకు సాయం చెయ్యి"... ఏడుస్తూ మధు కాళ్ళమీద పడ్డాడు శీను.
"రేయ్ ఏంటిది, లే, మనం ఫ్రెండ్స్, ఏంటిది, లే ముందు" అంటూ శీనుని లేపాడు మధు.
లేచి సోఫాలో కూర్చున్నాడు శీను.
"నేను ఆలోచిస్తున్నా మీకు ఎలా సాయం చెయ్యాలా అని" అన్నాడు మధు.
కళ్ళు తుడుచుకుంటూ, నవ్వుతూ తలూపాడు శీను.
"ఔను మురళి వాళ్ళ పాప ఎక్కడుంది"
"సుజాత వాళ్ళ అమ్మవాళ్ళు అదే ఏరియాలో అరగంట దూరంలో ఉంటారు, అక్కడ ఉంటోంది. ఈ సమస్య తీరేవరకూ అక్కడే ఉంచుతానంది సుజాత"
సుజాత పేరు వినేసరికి మళ్ళీ ఆ చివరి ఫోటో గుర్తొచ్చింది, మనసంతా చెప్పలేనట్టుగా అయింది మధుకి.
"సరే మీరు పొద్దున్నే రెడీగా ఉండండి. నేను వచ్చి మీ దగ్గరున్న పేపర్స్ అన్నీ చూస్తాను. సుజాతని కూడా ఉండమను, మనం ఏం చెయ్యాలో తనకి తెలియాలి"
"మా కన్నా సుజాతే అన్నీ వింటుంది మధూ, తనే అన్నీ చూసుకుంటోంది ఇలా జరిగినప్పటి నించి. మురళి మన లోకంలో లేడు అసలు"
"భయపడద్దు అని చెప్పు, నేను ముందు మీ ముగ్గురితో మాట్లాడతాను, తరువాత నేను ఏం చెయ్యగలనో చెప్తాను"
"చాలా థ్యాంక్స్ మధూ. వెంటనే ఈ విషయం మావాళ్లకి చెప్తాను"... మధు చేతులు పట్టుకుంటూ అని, గబగబా వెళ్ళిపోయాడు శీను.
మనసులో మళ్ళీ సుజాత రూపం గుర్తొచ్చి... "థ్యాంక్స్ నేను చెప్పాలి. ఏం ఉన్నావు బ్యూటీ"... అనుకుంటూ నవ్వుతున్న సుజాత ఫొటోకి ముద్దిచ్చాడు మధు.