Thread Rating:
  • 13 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు
నా ఫ్రెండ్స్ నన్ను గట్టిగా పట్టుకుని లాగడంతో నేను వాడిని వదిలిపెట్టాను. కానీ వాడు మల్లీ పరుగెత్తుకుంటూ వచ్చి నా మీద దూకాడు. దాంతో నా ఫ్రెండ్స్ తో సహా నేను అందరం కింద పడిపోయాము. వెంటనే ఇంకొంతమంది వచ్చి వాడిని లేపి పక్కకి తీసుకెళ్లారు. నేను కింద పడటంతో నా తలకి చిన్నగా దెబ్బ తగిలి రక్తం వస్తుంది.

[Image: bar-fight-fighting.gif]

నేను వెంటనే లేచి కోపంతో వాడిని కొట్టడానికి వెళ్లబోతుంటే, నాకు బాబాయ్ వరుస అయ్యే ఒకతను, (పేరు సత్యం) వచ్చి నన్ను ఆపాడు. సత్యం బాబాయ్ మా గల్లీలో పెద్దమనిషి, ఇంతకుముందు నగర్ పంచాయతీ చైర్మన్ గా పని చేసాడు. మా గల్లీలో అందరూ అతడి మాటకు విలువనిస్తారు.

[Image: panky-tripa.jpg]
సత్యం బాబాయ్
ఇంక నాకు తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుండటంతో, సత్యం బాబాయ్ నన్ను గద్దరించినట్టుగా, ఒరేయ్ హర్షా ఒళ్ళంతా ఈ రక్తం ఏంటిరా. మీరంతా ఫ్రెండ్సే కదా, ఇంతకుముందే కదరా అందరూ కలిసి తాగారు. అసలు గొడవ ఏలా వచ్చింది అని ఆరాతీయడంతో, జరిగిన విషయం బాబాయ్ కి వివరించాను.

(అపర్ణ, పావని గురించి మాత్రం కాదు. ఎందుకంటే నాకు మహేష్ కి మాతో తాగిన కొంత మంది ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు మేము ఇద్దరం అపర్ణ విషయంలోనే కొట్టుకున్నాము అని. కానీ నేను డిజె సాంగ్స్ విషయంలో గొడవ వచ్చినట్టు చెప్పాను).

దాంతో సత్యం బాబాయ్, రేపు పొద్దున్న ఒకరి మొకాలు ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళు, అలా కొట్టుకోకూడదురా అని సర్ది చెప్పి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోండి అన్నాడు.

[Image: desktop-wallpaper-prime-video-mirzapur-k...bhaiya.jpg]

కానీ మహేష్ మాత్రం రేయ్ హర్ష......నా ఒంటి మీద చెయ్యి వేశావు కదరా నీ అంతు చూస్తా అంటూ తిడుతున్నాడు. వాడు అలా వాగుతుంటే సత్యం బాబాయ్ కలుగజేసుకుని, రేయ్ హర్ష చూడు నా మాటకి గౌరవం ఇచ్చి ఏమి అనడంలేదు. నువ్వు అలాగే ఇంకా ఎక్కువగా వాగితే నేను మంచోన్ని కాదని నీకు తెలుసు, గుద్ద నోరు మూసుకుని ఇంటికి దొబ్బేయ్ అని కోపంగా అన్నాడు.

దాంతో ఎక్కడివాళ్లు అక్కడ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. పెళ్లికూతురు, వాళ్ళ కారు కూడా వేరే దారి నుండి వెళ్ళిపోయింది. ఇంక డిజె ఆపరేటర్ ఇదే సందు అనుకుని, ఇంకా ఇక్కడే ఉంటే డిజె పగిలిపోతుందేమోనని అతను కూడా జంప్ అయ్యాడు.

ఇంక నా ఫ్రెండ్ మణికంఠ కర్చీఫ్ తో రక్తపు మరకలు తుడుస్తున్నాడు. వాడు అలా రక్తాన్ని తుడుస్తుంటే పావని ఏడ్చుకుంటు వచ్చి బొటల్ లో మంచి నీళ్ళు ఇచ్చి తాగమంటుంది.

ఇంక అపర్ణ కళ్ళ నుండి నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఇంతలో సత్యం బాబాయ్ వచ్చి ఒరేయ్ హర్ష డాక్టర్ దగ్గరికి వెళ్దాం బండి ఎక్కు అన్నాడు. ఇంక నేను అపర్ణ పావనిలను మీరు ఇంటికి వెళ్లిపోండి నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి వస్తాను అన్నాను.

దాంతో అపర్ణ తన కళ్ళలో నీళ్లతో, నా చిరిగిన చొక్కా ఇచ్చి ఇది వేసుకో అంది. ఇంక నేను ఆ చొక్కాని నా ఒంటి మీద కప్పుకుని  బాబాయ్ బైక్ ఎక్కాను.

తర్వాత నా వెనక నా ఫ్రెండ్ మణికంట కూడా ఎక్కాడు. తర్వాత సత్యం బాబాయ్ నన్ను  ఆర్.ఎం.పీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ నా తలకు చిన్న కట్టు కట్టి, వీపులో వాడి గొర్లతో రక్కిన చోట, క్లీన్ చేసి ఇంజక్షన్ చేసాడు.

డాక్టర్ కి డబ్బులు కూడా సత్యం బాబాయే ఇచ్చి, నన్ను మా ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చేసరికి మా ఇంటి ముందు చాలా మంది గుమిగూడి ఉన్నారు.

నేను వెళ్ళగానే మా నాన్న నన్ను తాగడం ఎందుకు, ఈ గొడవలు ఎందుకు అని తిట్టడం మొదలుపెట్టాడు. మా అమ్మ అయితే ఏడుస్తూ మహేష్ ని  శాపాలు పెడుతూ తిట్టడం మొదలుపెట్టింది.

మా నాన్న నన్ను అలా తిడుతుంటే అపర్ణ, పావని మధ్యలో కలుగజేసుకుని, ఆ మహేషే అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే పాటలు ఆపేసి, మా మధ్యకు వచ్చి పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తూ, మామయ్యతో గొడవ పెట్టుకున్నాడు అని చెప్పారు.

మధ్యలో పావని వాళ్ళ అమ్మ కలుగజేసుకుని, ఎమ్మా అప్పు...పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరెందుకు అని అంది.

[Image: f8c7cfcd-9e27-529e-98c7-ee858b1e7de3&ope...&webp=true]
పావనిని మాట్లాడొద్దు అంటున్న వాళ్ళ అమ్మ
దాంతో పావని అది కాదమ్మా వాడే ముందు మామయ్యతో గొడవకు దిగాడు అంది. దాంతో వాళ్ళమ్మ అయినా కూడా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరు కలుగజేసుకోకూడదు అంది.

ఇంకొకవైపు మా నాన్న నన్ను తిడుతుంటే, సత్యం బాబాయ్ మధ్యలో కలుగజేసుకుని.... అన్నయ్య పెళ్లిలో ఇవన్నీ జరుగుతుంటాయి...... పైగా కుర్రాడు ఉడుకు రక్తం అందుకే ఆపుకోలేకపోయాడు వదిలేయ్ అని, వదినా వాడిని లోపలికి తీసుకెళ్లి తినడానికి ఏదైనా పెట్టు అన్నాడు.

దాంతో మా నాన్న అధికాదు తమ్ముడు..... మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ మహేష్ వాళ్ళ అమ్మా నాన్న ఇంతకుముందే మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఇంకా సెక్యూరిటీ అధికారి స్టేషన్లో కేస్ పెడతామని బెదిరిస్తూ వెళ్లిపోయారు అని సత్యం బాబాయ్ కి చెప్పాడు.

దాంతో ఆ బాబాయ్, నా ఫ్రెండ్ మణికంఠకి చెప్పి నన్ను లోపలికి తీసుకెళ్లు అనడంతో వాడు నన్ను ఇంటి లోపలికి తీసుకొచ్చాడు. మా అమ్మ వచ్చి అన్నం పెట్టడంతో, అన్నం తింటూ మా నాన్న, సత్యం బాబాయిల మాటలు వింటున్నా.

ఇంక మా నాన్న నా మీద సెక్యూరిటీ అధికారి కేస్ పెడతారేమోనని బయపడుతుంటే, సత్యం బాబాయ్ మా నాన్నకు అసలు ఇలాంటి గొడవలకు సెక్యూరిటీ ఆఫీసర్లు ఎవ్వరూ కంప్లైంట్ తీసుకోరు అన్నయ్య.

ఎందుకంటే చదువుకునే కుర్రాళ్ళ మీద కేస్ రాస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని సెక్యూరిటీ ఆఫీసర్లకి కూడా తెలుసు. అందుకే, స్టేషన్ కి పిలిపించి మాట్లాడుతారు అంతే అన్నాడు.

[Image: 4pcvwl.png]

అయినా కూడా మా నాన్న కంగారు పడుతుంటే, నేను ఆ మహేష్ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడుతాలే అని సత్యం బాబాయి మా నాన్నకు ధైర్యం చెప్పాడు.

ఇంక నాకు శరీరం మొత్తం అలసిపోవడంతో, తిన్న వెంబటే నిద్ర పట్టేసింది. అలా ఉదయం పదకొండు గంటల వరకు పడుకునే ఉన్నాను. ఇంతలో నా ఫ్రెండ్ మణికంఠ వచ్చి, సత్యం బాబాయ్ పిలుస్తున్నాడని నిద్ర లేపాడు.

నాకు ఒళ్ళంతా నొప్పులు ఉండటంతో నేను మెల్లి మెల్లిగా నడుచుకుంటూ బాబాయ్ దగ్గరికి వెళ్ళాను. వెంటనే సత్యం బాబాయ్, రేయ్ హర్ష స్నానం చేసి, ఏదైనా తిని రెడి అవ్వు మనం బయటకి వెళ్దాం అన్నాడు.

బాబాయ్ ఇలా బయటకి వెళ్దాం అని ఎందుకు అంటున్నాడు అని ఆలోచిస్తుంటే, మా నాన్న కలుగజేసుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు సత్యం అన్నాడు.

దానికి సత్యం బాబాయ్ ఎం లేదన్నా...... రాత్రి గొడవ పెట్టుకున్న మహేష్ వాళ్ళు నేను ఎంత చెప్పినా వినకుండా సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్లారు.

నేను ఇంతకుముందే ఎస్.ఐ సర్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాను. దాంతో ఎస్.ఐ సర్ ఒక్కసారి మన హర్షని తీసుకుని సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి రమ్మన్నాడు అన్నాడు.

దాంతో మా అమ్మా నాన్న కంగారు పడిపోతుంటే, సత్యం బాబాయి ఎం కాదు వదిన. ఎస్.ఐ సర్ మాట్లాడి పంపించేస్తాడు, ఇందులో కేస్ ఏమి ఉండదు నేను ఉన్నానుగా అన్నాడు.

ఇంక నేను స్నానానికి వెళ్తూ వెళ్తూ నా మొబైల్ స్విచ్చాఫ్ ఉంటే ఛార్జింగ్ పెట్టి వెళ్ళాను. స్నానం చేస్తుంటే వీపులో, చాతి మీద మహేష్ గొర్లతో రక్కిన చోట అంత మంట మంటగా ఉంది.

[Image: man-taking-shower-.jpg]

అయినా ఎలాగోలా స్నానం చేసి బట్టలు వేసుకుని తయారయ్యి వెల్దామా బాబాయ్ అన్నాను. ఇంక మా నాన్న కూడా వస్తాను అనడంతో, నాలుగురం కలిసి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి బయలుదేరాము.

ఇప్పుడు గనుక నా ఫోన్ స్విచ్ఆన్ చేస్తే గీత తప్పకుండా కాల్ చేస్తుంది. ఇంక తనకి ఈ గొడవ గిరించి ఇప్పుడే చెప్పి తనని కంగారుపెట్టడం ఎందుకని నేను మొబైల్ ని ఆన్ చెయ్యలేదు.

మేము సెక్యూరిటీ అధికారి స్టేషన్ వెళ్లేసరికి అక్కడ మహేష్ వాళ్ళు ఉన్నారు. మహేష్ గాడికి ముక్కు పగిలిపోయింది, ఇంకా డవడలు ఉబ్బి ఉన్నాయి. కొంతసేపటికి ఎస్.ఐ గారు మమ్మల్ని అందరిని లోపలికి రమ్మనడంతో వెళ్ళాము.

అక్కడ ఎస్.ఐ గారు సత్యం బాబాయికి రెస్పెక్ట్ ఇచ్చి, ఏంటి సత్యం అన్నా ఇంత చిన్న గొడవలకు సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి రావడం అవసరమా. ఇలాంటివి ఇంటి దగ్గరే కూర్చుని మాట్లాడుకోవాలి. అనవసరంగా మా టైం, మీ టైం వృధా చేసినట్టు అవుతుంది అన్నాడు.

[Image: desktop-wallpaper-watch-mirzapur-kaleen-bhaiya.jpg]

తర్వాత నన్ను మహేష్ ని దగ్గరికి రమ్మని, మీరిద్దరు ఫ్రెండ్సే కదరా ఎందుకు కొట్టుకోవడం. మళ్ళీ ఇంకొకసారి ఎలాంటి గోడవల్లోనైనా తలదూర్చితే ఈసారి ఇద్దరి మీద కేస్ బుక్ చేస్తా.

 కేస్ బుక్ అయితే మీకు ఎవ్వడూ జాబ్ ఇవ్వడు. అందుకని ఈ గొడవలు అన్ని మానేసి, బాగా చదువుకొని ఏదైనా జాబ్ చేసుకోండి అని కౌన్సిలింగ్ ఇచ్చినట్టు మాట్లాడి బయటకి పంపించేశారు.


సత్యం బాబాయి ఉండటం వల్ల, నా మీద ఎలాంటి కేస్ ఫైల్ అవ్వకపోవడంతో, నేను చాలా చాలా థాంక్స్ బాబాయి. నువ్వు గనుక రాత్రి, అడ్డు రాకపోతే గొడవ ఇంకా పెద్దది అయ్యేది. మళ్ళీ ఇప్పుడు ఎస్.ఐ సర్ తో మాట్లాడినందుకు థాంక్స్ అన్నాను.

దానికి సత్యం బాబాయి, ఒరేయ్ హర్ష.... మనలో మనకు థాంక్స్ ఎందుకురా, అప్పుడప్పుడు నాకు కనబడుతూ ఉండు అన్నాడు.
 [Image: desktop-wallpaper-mirzapur-dialogues-mem...bhaiya.jpg]
ఇంక మా నాన్న, సత్యం బాబాయితో కొంతసేపు మాట్లాడి వస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి అనడంతో నేను నా ఫ్రెండ్ మణికంఠ మా ఇంటికి బయలుదేరాము.

ఆ గొడవలో నాకు కోపం వచ్చినప్పుడు మణికంఠ నన్ను కంట్రోల్ చేస్తూ సపోర్టివ్ గా నిలబడ్డాడు. మేము ఇంటికి వచ్చేసరికి మా ఇంటి బయట నా ఫ్రెండ్ రాజు బైక్ ఉంది. మా ఇంటి బయట వరండాలో ,  రాజుకు రాత్రి గొడవ ఎలా జరిగిందని మా అమ్మ, మరియు పావని వాళ్ళ అమ్మ వివరిస్తున్నారు.

ఇంక నేను రావడం చూసిన రాజు నా దగ్గరికి వచ్చి, కాలేజీలో మన ఫ్రెండ్ ఒకడు రాత్రి పెళ్లిలో గొడవ జరిగిందని, నీకు దెబ్బలు తాకాయని చెప్పడంతో, నీకు ఫోన్ చేసి మాట్లాడుదాము అంటే ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో డైరెక్టుగా ఇంటికి వచ్చాము అని చెప్పాడు.
Like Reply


Messages In This Thread
RE: ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు - by Harsha.B - 02-07-2023, 10:18 PM
1 - by Harsha.B - 06-08-2023, 09:32 PM
2 - by Harsha.B - 06-08-2023, 09:32 PM
3 - by Harsha.B - 06-08-2023, 09:33 PM
4 - by Harsha.B - 06-08-2023, 09:34 PM
5 - by Harsha.B - 06-08-2023, 09:34 PM
6 - by Harsha.B - 06-08-2023, 09:35 PM
7 - by Harsha.B - 06-08-2023, 09:36 PM
8 - by Harsha.B - 06-08-2023, 09:36 PM
RE: 8 - by రకీ1234 - 16-08-2023, 09:19 PM
9 - by Harsha.B - 06-08-2023, 09:37 PM
10 - by Harsha.B - 06-08-2023, 09:37 PM



Users browsing this thread: 4 Guest(s)