Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నేను నా వయసు కోరికలు
#67
నేను రోజూ ఫోన్స్ ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాడిని. మా పిన్ని తిట్టేది చదువుకో అని. మా బాబాయ్ 2రోజుల తరువాత ఇంటికి వచ్చాడు. నేను మా ఊరికి వెళ్తాను అంటే వద్దు ఎగ్జామ్ కి చదువుకో అని పంపలేదు. సరయూ బాగా బాధ పడింది. తను పెళ్లికి వెళ్ళింది. నా మీద చాలా కోపంతో ఉండేది. నేను టైమ్ దొరిినప్పుడల్లా జాహ్నవి తో మాట్లాడుతూ ఉండేవాడిని. ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అయ్యాక కాలేజ్ స్టార్ట్ అయ్యింది. జాహ్నవి హాస్టల్ కి పోను నువ్వు కూడా పోకు మనం విజయవాడ లో జాయిన్ అవుదాం డే స్కాలర్ గా అంది. నేను మా నాన్న ని ఒప్పించాను డబ్బులు మిగులుతాయి అని. మా బాబాయ్ కూడా సరే అన్నాడు. కానీ లాస్ట్ లో జాహ్నవి హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు అని. మళ్ళీ హాస్టల్ అంటే మా నాన్న చంపేస్తాడు అని మా కాలేజ్ బ్రాంచ్ విజయవాడ లో జాయిన్ అయ్యాను. ఇంప్రూవ్మెంట్ లో 10 మార్కులు పెరిగాయి. అందుకే నన్ను A+ సెక్షన్ లో వేశారు. మా క్లాస్ లో 12 మంది అబ్బాయిలు 28 మంది అమ్మాయిలు ఉన్నారు. మనం ఏమో ఎర్ర బస్ బ్యాచ్. వాళ్ళు అంతా సిటీ బ్యాచ్. అందుకే నాకు పెద్దగా ఎవరూ ఫ్రెండ్స్ కాలేదు. చాలా మందికి బైక్ ఉండేది. నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. వాళ్ళు అంతా బాగా రిచ్ ఫ్యామిలీ వాళ్ళు. నేను ఏమో మిడిల్ క్లాస్. ఎవరూ ఎక్కువ సమయం నాతో మాట్లాడేవారు కాదు. నేను కాలేజ్ కి వెళ్ళడం ఇంటికి రావడం అంతే. పొద్దున్నే 8 కి కాలేజ్ అందుకే 7 కి టిఫిన్ తిని అదే బాక్స్ లో పెట్టుకుని కాలేజ్ కి వెళ్ళేవాడిని. సాయంత్రం 6కి కాలేజ్ అవ్వగానే 7 కి అంతా ఇంటికి వచ్చి హోం వర్క్స్ చేసేసి చదువుకుని పడుకునేవాడిని. పిన్ని కూడా బాబు చదివే కాలేజ్ లో టీచర్ గా జాయిన్ అయింది.  మా కాలేజ్ లో కో- ఎడ్యుకేషన్ మా క్లాస్ ఒక్కటే. అన్ని సెపరేట్ గా ఉండేవి అమ్మాయిలకి అబ్బాయిలకి. A సెక్షన్ లో గుంటూరు లో వేరే సెక్షన్ లో చదివిన ఒకడు నన్ను గుర్తు పట్టి నాతో మాట్లాడేవాడు. బ్రేక్ టైం లో లంచ్ టైం లో వాడి దగ్గరికి వెళ్లి మాట్లాడేవాడిని. సరయూ కూడా కోపం లో మాట్లాడేది స్టాప్ చేసింది. జాహ్నవి హాస్టల్. పిన్ని కాలేజ్. క్లాస్ లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు. సో ఇక బాగా చదివేవాడిని. ఆగస్ట్ లో రాఖీ పండుగ రోజు వచ్చింది. బ్రేక్ టైమ్ లో క్లాస్ లో ఎవరూ లేరు. నేను వర్క్ ఉంటే చేసుకుంటున్న. అపుడు భవ్య అనే అమ్మాయి వచ్చి రాఖీ కట్టింది నాకు. నేను ఏమి అనకుండా కట్టించుకున్న. అపుడు అర్ధం అయ్యింది నాకు రాఖీ కడతారు అని అంతా బయటకి వెళ్ళారు. బ్రేక్ టైం అయ్యాక క్లాస్ లోకి వచ్చారు అంతా. నా బెంచ్ లో ఉండే 3 మెంబెర్స్ నీకు రాఖీ కడతారని భయం లేదా అన్నారు. ఎందుకు భయం అన్నాను. నా బెంచ్ లో ఉండే 3 మెంబెర్స్ లో ఇద్దరు మా క్లాస్ లో ఇద్దరినీ లవ్ చేసేవాళ్ళు అని నాకు చెప్పారు. వాళ్ళని మా వెనక బెంచ్ లో ఉండే ఇద్దరు కూడా లవ్ చేసేవాళ్ళు అని ఆ రోజే తెలిసింది నాకు. 3rd పర్సన్ నాకు ఒక చాక్లెట్ ఇచ్చి రాఖీ కట్టారు కదా గిఫ్ట్ ఇవ్వవా అని భవ్య అనే అమ్మాయికి ఇవ్వు అన్నాడు. నేను కూడా సరే అని ఆ అమ్మాయి కి ఇచ్చాను. మా బెంచ్ లో ఉండే ఇద్దరు రెండు రాఖీలు ఇచ్చి వాళ్ళు చూపించిన అమ్మాయిల కి ఇవ్వమన్నారు. నేను మీరే ఇవ్వండి అన్నాను. ప్లీజ్ ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చాను. వాళ్ళు రాఖీలు తీసుకుని మా వెనక బెంచ్ లో ఉండే వాళ్ళని లవ్ చేస్తున్న అబ్బాయిలకి కట్టేశారు. 

ఆ రోజు సాయంత్రం కాలేజ్ అయిపోయాక మా వెనక బెంచ్ లో ఉండే వాళ్ళు నేను నడుచుకుంటూ వెళ్తుంటే నా దగ్గరకి వచ్చి నువ్వు ఎందుకు వాళ్ళకి రాఖీలు ఇచ్చావు అని అడిగారు. నేను మా బెంచ్ లో వాళ్ళు ఇవ్వమంటే ఇచ్చాను అని చెప్పాను. వాళ్ళు నాతో మన కాలేజ్ లో అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోవడం ప్రిన్సిపాల్ చూస్తే బెల్ట్ తో కొడతాడు. నువ్వు అయిపోయావు రేపు పొద్దున్నే అని నన్ను భయపెట్టారు. నాకు భయం వేసినా కూల్ గా ఉన్నట్టు ఇంటికి వెళ్ళాను.  పొద్దున్న కాలేజ్ కి వెళ్ళాలి అంటే భయం వేసింది. మా బాబాయ్ కి కడుపు నొప్పి అని వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను. మరుసటి రోజు వెళ్ళాను కాలేజ్ కి. నా బెంచ్ వాళ్ళు అడిగారు మొన్న నిన్ను వాళ్ళు బెదిరించారు కదా అని. అవును అన్నాను. నువ్వు భయపడకు మేము నీకు ఫ్రెండ్స్ ఇక అని చెప్పి నాతో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళు రిచ్ అవ్వడం తో మధ్యాహ్నం వాచ్మెన్ తో బయటి నుంచి ఫుడ్ తెప్పించుకుని తినేవాళ్ళు. నాకు చెప్పారు నువ్వు తెచ్చుకో మేము ముగ్గురం ఉన్నాము కదా నువ్వు ఒకడివి నీతో కలిపి నలుగురికి తెప్పిస్తం అని. నేను వద్దు అన్నా కూడా వినలేదు. ఇక రోజూ వాళ్ళతో తినడం, బ్రేక్ టైమ్ లో వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేసేవాడిని. దసరా సెలవులు వచ్చాయి. నేను వాళ్ళతో కాలేజ్ టైం లోనే మాట్లాడేవాడిని. కాలేజ్ అయిపోయాక నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేవాళ్ళు. సెలువుల కి నేను మా ఊరికి వెళ్ళాను. కొత్త కాలేజ్ అనుభవం వల్ల నేను చాలా మారిపోయాను. చాలా సైలెంట్ అయ్యాను. నా పని నేను చేసుకోవడం చదువుకోవడం అంతే చేసేవాడిని. మా అమ్మ నాన్న మా వాడు చాలా మారిపోయాడు అనుకుని ఆనంద పడ్డారు. సెలవులు అయ్యాక మళ్ళీ కాలేజ్ కి వెళ్ళాను. మా నాన్న ఫస్ట్ రోజే వెళ్ళాలి అని పంపాడు. 6 అబ్బాయిలు 15 అమ్మాయిలు వచ్చారు.ఎక్కువ రాకపోవడంతో క్లాసెస్ ఏమి చెప్పలేదు. వచ్చిన 6 అబ్బాయిలు నాకు క్లోజ్ కాదు. నేను సైలెంట్ గా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. లంచ్ టైం కి నాకు బాక్స్ అలవాటు పోయింది. మా బెంచ్ వాళ్ళు ఎవరూ రాలేదు. మధ్యాహ్నం బయటకి పంపరు. కావలి అంటే వాచ్మెన్ కి చెప్పాలి బ్రేక్ లో. నేను మరిచి పోయాను. నేను సైలెంట్ గా ఉంటే భవ్య వచ్చి బాక్స్ తెచ్చుకోలేదా అంది. లేదు కొంచెం హెల్త్ బాగోలేదు అందుకే తినాలని లేదు అని చెప్పను. తను అరే అయితే మజ్జిగ అయినా తాగు అని ఇచ్చింది. నేను వద్దు అన్నాను. సాయంత్రం 6 వరకు ఉండాలి కదా తాగు అంది. వద్దు అన్నాను. అప్పుడే మౌనిక అనే అమ్మాయి వచ్చి మ్యాగీ ఉంది తిను అంది. వద్దు అన్నాను. నేను ఇచ్చినా తినవా అని బాక్స్ ఓపెన్ చేసి స్పూన్ ఇచ్చి తిను అంది. నాకు ఇస్తే నీకు ఎలా అన్నాను. నేను 2 బాక్స్ తెచ్చాను ఈ రోజు నువ్వు తిను ఫస్ట్ అని తన బాక్స్ చూపింది. సరే అని మ్యాగీ తిని మజ్జిగ తాగేసాను. సాయంత్రం ఇంటికి వెళ్తుంటే భవ్య మధ్య లో వచ్చి నువ్వు ఎందుకు అలా డల్ గా ఉంటావు అంది. ఏమి లేదు అన్నాను. నేను చాలా రోజుల నుంచి చూస్తున్న ఎవరితో మాట్లాడవు అసలు అంది. ఏం లేదు అన్నాను. అరే నేను నీకు రాఖీ కట్టాను సిస్టర్ కదా నేను. నేను అయితే నిన్ను బ్రదర్ లా అనుకుంటున్న నువ్వు సిస్టర్ అనుకుంటే చెప్పు అంది. ఏమి లేదు మీరు అంతా ఓల్డ్ ఫ్రెండ్స్ నేను కొత్త కదా అందుకే అన్నాను. తను నాతో అలా ఏమి అనుకోకు నేను ఉన్నా కదా అంది. థాంక్స్ అన్నాను. తను నాతో స్కూటీ ఎక్కు డ్రాప్ చెస్తా అంది. వద్దులే అన్నాను. ఇపుడే కదా సిస్టర్ అన్నావు మళ్ళీ ఎంటి ఇది అంది. సరే అని వెళ్ళాను. తను డ్రాప్ చేసి వెళ్ళింది. 
ఇక డైలీ కాలేజ్ కి వెళ్తూ బాగా చదివేవాడిని. కొంచెం క్లోజ్ అయ్యారు క్లాస్ లో అంతా. ఇక న్యూ ఇయర్ వచ్చింది. అక్కడ ప్రతి క్లాస్ లో కేక్ కట్ చేస్తారు అంట. క్లాస్ లోని వాళ్ళు అంతా మనీ కలెక్ట్ చేసి సెలబ్రేషన్ చేస్తారు అని చెప్పారు. మా క్లాస్ లో ఒకడు బాగా రిచ్ వాడు అమ్మాయిల ముందు ఓవర్ యాక్షన్ చేసి నేనే తెస్తాను అని వాడే తెచ్చాడు అన్ని. 31st సాయంత్రం క్లాసెస్ అయిపోయాక ఒక్కో క్లాస్ కి ఒక్కో సార్ వెళ్లి కట్ చేస్తారు. మాది కో - ఎడ్యుకేషన్ అందుకే ప్రిన్సిపాల్ వచ్చాడు. కేక్ కట్ చేసి మీరు తినండి అని వెళ్ళిపోయాడు. అందరూ గ్రీటింగ్ కార్డ్స్ చాక్లెట్స్ ఎక్సేంజ్ చేసుకుంటున్నారు. నాకు తెలియదు. మా బెంచ్ లో ఉండే వాళ్ళు కొన్ని చాక్ లెట్స్ అండ్ కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారు. నేను నాకు ఇచినవి వేరే వాళ్ళకి ఇచ్చి మేనేజ్ చేశాను. భవ్య కేక్ అందరికీ ఇచ్చింది. మౌనిక తన కేక్ నాకు ఇచ్చింది అపుడు అంతా బిజీగా ఉన్న టైమ్ లో. నేను వద్దు అన్నాను. తను తీసుకో అని ఇచ్చింది. గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఇది ఎవరికీ ఇవ్వకు అంది. సరే అన్నాను. నేను ఇంటికి వెళ్లి పడుకున్న. రాత్రి జాహ్నవి ఫోన్ చేసింది ఎగ్జాక్ట్ 12 కి. విష్ చేసింది. నేను పొద్దున వరకు మాట్లాడాను. మాట్లాడుతూ ఉండగా నాకు మౌనిక ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ కనిపించింది. తీసి చూసాను. అందులో నంబర్ రాసి కాల్ మీ అని ఉంది. జాహ్నవి కి బై చెప్పి అందులో ఉన్న నంబర్ కి కాల్ చేశాను. వాళ్ల అమ్మ ఫోన్ ఎత్తింది. ఎవరు అంది. మాట్లాడకుండా ఉంటే డౌట్ వస్తుంది అని మౌనిక ఫ్రెండ్ ని విష్ చేద్దాం అని చేశాను అని చెప్పాను. ఆమె సరే ఫోన్ ఇస్తా అని మౌనిక కి ఫోన్ ఇచ్చింది. విష్ చేశాను తను థాంక్స్ చెప్పి విష్ యూ ద సేమ్ అంది. కట్ చేసింది. 20 నిమిషాలకి మెసేజ్ వచ్చింది. ఇప్పుడా విష్ చేసేది అంది. పడుకున్న సారీ అన్నాను. రాత్రి నుంచి ఎదురు చూస్తున్న అంది. సారీ సారీ అని చెప్పాను. తను సరే పొద్దున్న 10కి దుర్గమ్మ టెంపుల్ కి వెళ్దాము వస్తావా అంది. ఎవరెవరు వస్తారు అన్నాను. క్లాస్ అంతా అంది. అవునా నాకు ఎవరూ చెప్పలేదు అన్నాను. ఇపుడు చెప్తున్న కదా అంది. సరే వస్తా అని చెప్పను. మరిచిపోకూడదు 10కి అంది. సరే అన్నాను.

పొద్దున్న రెడీ అయ్యి భవ్య వస్తుంది కదా అని ఫోన్ చేశాను. విష్ చేశాను. ఇప్పుడా చేసేది అంది. పడుకున్న అన్నాను. ఆహా మరి రాత్రి అంతా ఫోన్ ఫుల్ బిజీ వచ్చింది అంది. సిగ్నల్ వచ్చి ఉండక అలా వచ్చి ఉంటది లే అన్నాను. నాకు తెలుసు లే మౌనిక తో మాట్లాడవు అంది. లేదు అన్నాను. నాకు తెలుసు తను నీకు కేక్ ఇవ్వడం గ్రీటింగ్ కార్డ్ లో నంబర్ రాసి ఇవ్వడం చూసాను అంది. నీకు చెప్పిందా అన్నాను. లేదు అంది. మరి నీకు ఎలా తెలుసు అన్నాను. దసరా సెలవులు అయ్యాక తను నీకు బాక్స్ ఇచ్చి తను ఏమి తినకుండా ఉన్నప్పుడే డౌట్ వచ్చింది నాకు అంది. అవునా అన్నాను. అవును అంది. అది వదిలేయ్ గుడికి వస్తున్నవా అన్నాను. ఏం గుడి అంది. నీకు తెలీదా మన క్లాస్ వాళ్ళు అంతా కలుస్తున్నాము గుడిలో అన్నాను. ఎవరు చెప్పారు నీకు అంది. మౌనిక అన్నాను. తను నువ్వు రావేమో అని అలా చెప్పి ఉంటది లే, వెళ్లి ఎంజాయ్ చేసి రా అంది. అయితే ఎవరికి చెప్పకు అన్నాను. నేను ఎందుకు చెప్తాను నువ్వు నా బ్రదర్ అంది. థాంక్స్ సిస్టర్ అన్నాను. తను నాతో మంచి వైట్ కలర్ డ్రెస్ ఉంటే వేసుకో నువ్వు బాగుంటావు వైట్ డ్రెస్ లో. బ్లూ లేదా బ్లాక్ జీన్స్ వేసుకో . బైక్ తీసుకెళ్ళు ఓక గిఫ్ట్ ఇవ్వు అండ్ చాక్లెట్ మరిచిపోకు అంది. డబ్బులు లెవెమో కదా నేను వస్తా 5 నిమిషాల లో నువ్వు బయటకి రా అంది. సరే అని డ్రెస్ మార్చుకుని బయటకి వచ్చాను. అపుడే జాహ్నవి ఫోన్ చేసింది. మధ్యాహ్నం లంచ్ కి కలుద్దమా లేక సాయంత్రం కలుద్దమా అంది. మధ్యాహ్నం లెట్ అయితే కష్టం అనుకుని సాయంత్రం కలుద్దాం అని చెప్పాను. 5 నిముషాల కి భవ్య వచ్చి, ఒక వాచ్ నా చేతికి పెట్టింది. 1000rs డబ్బులు ఇచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది. విత్ లవ్ అని నా పేరు రాయించింది. ఎందుకు ఇవన్నీ అన్నాను. భవ్య బ్రదర్ అంటే తగ్గకూడదు అని చెప్పింది. బైక్ కావాలా అంది. మా బాబాయ్ ది ఉంది అన్నాను. తను సూపర్ గా ఉన్నావు అసలు అంది. థాంక్స్ అన్నాను. సరే ఆల్ ది బెస్ట్ చెప్పి వేళ్ళు అంది. నేను గుడికి వెళ్ళాను.
నేను వెళ్ళిన 1 నిమిషానికి నాకు ఫోన్ చేసింది. ఎక్కడ ఉన్నావు అంది. పార్కింగ్ దగ్గర అన్నాను. వస్తున్న అక్కడే ఉండు అంది. సరే అన్నాను. తను వచ్చి లుకింగ్ హండ్సం అంది. థాంక్స్ నువ్వు కూడా చాలా అందం గా ఉన్నావు అన్నాను. తను మంచి డిజైన్ ఉన్న చుడీదార్ వేసుకుని వచ్చింది. చాలా ట్రెడిషనల్ గా ఉంది డ్రెస్. క్యూట్ గా ఉంది తను ఆ డ్రెస్ లో. నేను చాలా క్యూట్ ఉన్నావు అన్నాను. అసలు మాట్లాడవు అనుకున్న బాగా మాట్లాడుతావు అంది. అదేమీ లేదు జస్ట్ చెప్పాను అన్నాను. చాక్లెట్ తీసి తనకి ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అన్నాను. తను థాంక్స్ చెప్పింది. పద వెళ్దాము అంది. మన క్లాస్ వాళ్ళు అంతా రానివ్వు అన్నాను. నువ్వు ఒక ట్యూబ్ లైట్ అంది. నువ్వే కదా చెప్పావు పొద్దున్న అన్నాను. ఇపుడు వాళ్ళు రాకుంటే రావా అంది. అలా ఏమి లేదు లే అని వెళ్ళాను. కింద నుంచి కొండ పైకి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇద్దరం సైలెంట్ గా ఉన్నాము. ఎప్పుడూ అంత క్లోజ్ గా మాట్లాడలేదు తనతో. కొద్ది సేపటికి సైలెన్స్ బ్రేక్ చేయాలి అని తిన్నావా అని అడిగాను. తను ఏమి అడిగావు అసలు నువ్వు సూపర్ అంది. నువ్వు ఏది మాట్లాడటం లేదు అని ఏదో ఒకటి అడిగాను అన్నాను. తను నవ్వుతూ ఇంత అమాయకంగా ఎలా ఉన్నావు అంది. ఏదో అలా అన్నాను. అలా తను నా గురించి అడుగుతూ ఉంది. నేను చెప్తూ ఉన్నాను. తను క్లాస్ విషయాలు అండ్ క్లాస్ లో ఉన్న లవ్ స్టోరీస్ చెప్పింది. న్యూ ఇయర్ అవ్వడం తో ఫుల్ రష్ గా ఉంది గుడి. మా దర్శనం అయ్యే సరికి మధ్యాహ్నం అయింది. తను బొట్టు పెట్టుకుని నాకు పెట్టింది. తను నన్ను అద్దం లో చూపిస్తూ చూడు బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావో అంది. తను ఆ రెండు గంటలలో చాలా క్లోజ్ అయింది. నేను టెంకాయలు పట్టుకుని ఉంటే ప్రసాదం తినిపించింది. నాకు సడెన్ గా సరయూ గుర్తు వచ్చింది. ఇక కిందకి వస్తుంటే తను నా భుజం ని తన చేతులతో పట్టుకుని నడుస్తూ వస్తుంది. నీకు ఒకటి చెప్పాలి అంది. చెప్పు అన్నాను. మన క్లాస్ లో బయట నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు కానీ నాకు ఎందుకో నువ్వు నచ్చావు అంది. ఎందుకు అన్నాను. నీలో ఉండే ఇన్నోసెన్స్, నీ నవ్వు, నీతో మొదట్లో ఎవరూ మాట్లాడకపోయినా నువ్వు నీ పని చూసుకుంటూ ఉండడం. నీ ధైర్యం అండ్ నువ్వు బాగా చదువుతావు, ఓవర్ యాక్షన్ చేయవు, అన్నిటి కంటే ఎక్కువగా నీ మొహం ఎంత ప్రశాంతం గా ఉంటది అలా చూస్తూ ఉండచ్చు అంది. అసలు మనకు మధ్య ఎలాంటి కన్వర్జేషన్ లేదు అలా ఎలా అనుకుంటావు అన్నాను. కన్వర్జేషన్ అవసరం ఏమీ ఉంది. ఒక డే లో ఎక్కువ టైమ్ college లోనే ఉంటాము తెలీదా నాకు అంది. నన్ను ఎవరూ ఎపుడూ ఇంతగా పొగడలేదు. నాకు కూడా కాలేజ్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపించింది. తను నీ ఆన్సర్ ఏంటి అంది. అపుడే నేను గిఫ్ట్ తీసి తనకి ఇచ్చాను. గిఫ్ట్ మీద విత్ లవ్ అని ఉండటం తో తను ఫిక్స్ అయింది నాకు కూడా తాను అంటే ఇష్టమే అని.
Like Reply


Messages In This Thread
RE: నేను నా వయసు కోరికలు - by Phanihhoney555 - 20-06-2023, 02:52 AM



Users browsing this thread: 6 Guest(s)