09-06-2023, 10:00 PM
శీను అలానే నుంచుని ఉన్నాడు.
శీనునే చూస్తున్నాడు మధు.
"నన్ను నమ్మకపోతే నేను వెళ్ళిపోతాను, నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది, నన్ను ఎవరు కాపాడితే వాళ్ళు కాపాడతారు. నిన్నటిదాకా నువ్వు నాకు గుర్తు కూడా లేవు, నిన్న నువ్వు కనిపిస్తావని, ఈ రోజు కలుద్దాం అని అంటావని, నేను వెంటనే ఒక అబద్దం రెడీ చేసుకుని వచ్చాను అనుకుంటున్నావా. నాకు అంత బుర్రే ఉంటే ఇలా ఎందుకు ఉంటాను. నిన్ను కలుస్తున్నవాళ్ళు అలాంటివాళేనేమో నేను మాత్రం కాదు. నువ్వు వద్దు, నీ స్కాచ్ వద్దు"... అంటూ గ్లాస్ కిందపెట్టేసి వెళ్ళిపోసాగాడు శీను.
ఇదంతా చెప్తున్నప్పుడు శీను మొహంలో కోపం, బాధ కనిపించాయి మధుకి. తన వృత్తిలో ఇలాంటివి చాలా చూసుండటంతో, శీను నిజమే చెప్తున్నాడని అర్థం అయింది మధుకి.
"శీనూ ఆగు. ఇలా రా"... పిలిచాడు మధు.
వెనక్కి తిరిగాడు శీను.
"నీ మాటలు నమ్ముతున్నా. కూర్చో. విషయం ఏంటో చెప్పు. నేను సాయం చేస్తానని మాత్రం మాటివ్వను. నువ్వు విషయం చెప్పు, నేను ఏం చెయ్యగలనో చూస్తాను"
కూర్చున్నాడు కానీ మధు తనని పూర్తిగా నమ్ముతున్నాడో లేదో అనిపించింది శీనుకి.
"నమ్ముతున్నాను అన్నాను అంటే నమ్ముతున్నాను అనే. ఇది తాగుతూ విషయం చెప్పు, వెయిటింగ్ నేను"... గ్లాస్ చేతికిస్తూ నవ్వుతూ అన్నాడు మధు.
మామూలయ్యాడు శీను.
విషయం మొత్తం చెప్పాడు. జాగ్రత్తగా విన్నాడు మధు.
అమెరికాలో ఇలాంటివి ఎన్నో పెద్దవే తెలిసిన మధుకి విషయం మొత్తం చెప్పగానే అర్థమయింది. కొంత సాయం చేద్దామనుకున్నాడు.
ఇంకా వివరాలు తెలుసుకుందామని... "అయితే వీళ్ళు నీకు చుట్టాలు" ఇంకో బాటిల్ ఓపెన్ చేసి గ్లాసుల్లో పోస్తూ అడిగాడు.
"ఔను ఆ అమ్మాయి మా బాబాయి వరస అయ్యే ఆయన కూతురు"
"ఔనా, మన కాలేజ్లో నీకు చెల్లెలు లేదు కదా"
"వాళ్ళు అపుడు వేరే ఊళ్ళో ఉండేవాళ్ళు. నువ్వు వెళ్ళాక మన ఊరు వచ్చారు, అందుకే నీకు తెలీదు. మన కాలేజ్లోనే చదువుకుంది. తెలివిగల అమ్మాయి, బియస్సి చేసింది, ఎమ్మెస్సి కూడా చేద్దాం అనుకుంది కాని ఇంకా చదివిస్తే పెద్ద సంబంధం తేవాలని, కట్నం ఇవ్వలేమని, తెలిసిన సంబంధం అని మురళికి ఇచ్చి చేసారు"
"మీ చెల్లెలి పేరు"
"సుజాత"
"మరి తెలివిగలది అయితే భర్త ఇలా ఇరుక్కోకుండా ముందే అన్నీ చూడాలి కదా"
"మేము ఎలాంటి పేపర్లు ఇంటికి తీసుకెళ్ళలేదు. మేము చెప్పిందే తనకి తెలుసు. మేమే మొత్తం తెలుసుకోలేదు. అలానే..."
"ఆ అలానే"
"మురళి కాస్త భయస్తుడు, చాలావాటికి భయపడుతూ ఉంటాడు. కాసేఫు చేద్దాం అని ఊగుతాడు, మళ్ళీ కాసేపాగి వామ్మో అని వదిలేస్తాడు. పిరికివాడు అని చెప్పుకోవచ్చు. అందుకే మొదటిసారి మురళి యూనిట్ కొనాలి అని అంత ఇదిగా అంటుంటే కాదనలేకపోయింది. మురళి ఆనందం కన్నా మా సుజాతకి ఇంకేదీ ఎక్కువ కాదు."
"నువ్వేమీ ఎక్కువ చెప్పట్లేదు కదా"
"లేదు మధు, నిజమే చెప్తున్నా. ఇంకా చెప్పాలంటే..."
"ఇంకేంటి"
"ఇప్పుడు పోగొట్టుకున్న డబ్బులు, అప్పుల గురించి కూడా కాదు నా భయం. మురళి గురించి"
"ఎందుకు భయం"
"అది అది"
"చెప్పు, నాకు విషయం మొత్తం తెలిస్తే బాగుంటుంది"
"నిన్న లాయర్ డబ్బులు రాకపోవచ్చు అన్నాడని బయటకి వచ్చాక ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు మురళి"... అని గ్లాసు మొత్తం గటగట తాగేసాడు శీను.
"ఔనా" ఆశ్చర్యపోతూ అన్నాడు మధు.
"ఔను మధు, అందుకే ఈ సమస్య నించి బయటపడకపోతే మాకు మురళి దక్కడేమో అని భయంగా ఉంది"
"ఏదీ మురళి ఫొటో చూపించు, నాకు చూడాలనుంది"
"ఫొటోస్ చాలా ఉన్నాయి మధు. నాలుగు రోజుల క్రితం యూనిట్ అడ్వాన్స్ ఇచ్చాక పండగొచ్చింది, అప్పుడు వాళ్ళింట్లోనే జరుపుకున్నాం. చూడు"... అంటూ ఫోన్ మధుకి ఇచ్చాడు శీను.
మురళి ఫొటో చూసాడు మధు. ఫోన్ తిరిగి శీనుకి ఇచ్చేయబోయాడు.
"ఇంకా చాలా ఫోటోస్ ఉన్నాయి, చూడు. నేను బాత్రూంకెళ్ళొస్తా"... అంటూ కాస్త తూలుతూ బయటకి అడుగులు వేసాడు శీను.
విషయం అర్ధమైంది మధుకి. ఈ మురళి చూడటానికి కూడా పిరికివాడిలానే ఉన్నాడు. కొంత సాయం చేద్దాం అనుకుంటూ తరువాతి ఫోటో చూసాడు.
అంతే తాగింది మొత్తం దిగినట్టుగా అనిపించింది మధుకి.