07-06-2023, 12:30 AM
ఆటో బార్ ముందు ఆగింది. పెద్ద బార్ అది. అంత పెద్ద బార్లోకి తనని రానిస్తారా అని అనుమానంగానే ఉంది శీనుకి.
లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే ఎదురయ్యాడు ఒక వెయిటర్.
"నా పేరు శీను, ప్రైవేట్ రూం పార్టీ" అన్నాడు నెమ్మదిగా.
"రండి, సార్ చెప్పారు, మీరొస్తారని"... అంటూ లోపలికి తీసుకెళ్ళాడు వెయిటర్.
లోపలంతా చల్లగా ఉంది. చాలా టేబుల్స్ ఉన్నాయి. ఇలాంటి చోట ఉన్నాడంటే మధు దగ్గర బాగా డబ్బులున్నట్టే, ఉన్న స్థితి గురించి చెప్పుకుని, చేతులు పట్టుకుంటే మధు ఆదుకుంటాడు అనుకున్నాడు శీను.
రూం తలుపు తీసి శీనుని లోపలికి పంపించి వెళ్ళిపోయాడు వెయిటర్.
లోపలికెళ్ళాడు శీను.
లోపలంతా లైట్లతో బ్రహ్మాండంగా ఉంది. ఎదురుగా పెద్ద సోఫా మీద ఉన్నాడు మధు.
శీనుని చూడాగానే నవ్వుతూ రమ్మన్నట్టు చెయ్యి ఊపాడు.
చిన్నప్పుడు తెలిసిన మనిషయినా, కలిసి ఏళ్ళు గడవడంతో కొత్తగానే ఉంది శీనుకి.
వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు శీను.
"ఎన్నేళ్లయింది శీను నిన్ను చూసి. ఎలా ఉన్నావు"
"అవును చాలా ఏళ్ళయింది మనం కలుసుకుని. అప్పట్లో ఎంత తిరిగామో కదా"
"అవును శీను, కలిసి చాలా చేసాం"
"నా పుట్టినరోజు నాడు మనం వాగుకి వెళ్ళడం, లోతుందని తెలీక నేను దిగడం, నువ్వు పైకి లేపడం. తరువాత మా ఇంటికి వెళ్ళడం, విషయం తెలిసి మా అమ్మ నన్ను తిట్టడం, నిన్ను మెచ్చుకుని పాయసం చేసిపెట్టడం. గుర్తున్నాయా ఇవ్వన్ని"
"పాయసం చెయ్యడం గుర్తుంది, మీ నాన్న నిన్ను కొట్టాడు కూడా కదా అప్పుడు"
నవ్వుతూ తలూపాడు మధు.
"మన సీనియర్ మమత గుర్తుందా, నాకింకా గుర్తే. ఆ అమ్మాయిని చూడటం కోసం వాళ్ళింటి దగ్గర చెట్టు ఎక్కాం గుర్తుందా"
"అవును ఆ అమ్మాయికి గ్రీటింగ్ కార్డ్ కూడా ఇచ్చాం. మనముందే చించేసింది. నాకు కోపం వచ్చి ఏదో అని పారిపోయాను అప్పుడు"
"అన్నీ గుర్తున్నాయి అయితే నీకు. నన్ను మాత్రం గుర్తుపట్తలేదు నిన్న"
నవ్వాడు శీను.
"సరే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, పెళ్ళి, పిల్లలు, వివరాలు చెప్పు"
"నీ లాగా తెలివిగలవాడిని కాదు కదా, అందుకే చదువు పెద్దగా అబ్బలేదు, ఇంటర్ వరకే చదివాను. ఆ పని, ఈ పని చేస్తూ, కొన్నేళ్ల క్రితమే ఒక చిన్న ఉద్యోగంలో కుదురుకున్నాను. పెళ్ళి చేసుకోవాలి"
"ఏదైనా సరే, నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది"... మందు గ్లాస్ శీనుకి ఇస్తూ అన్నాడు మధు.
"నీ సంగతేంటి. అమెరికా ఎప్పుడు వెళ్ళావు, అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటావా, ఉండంటం అక్కడేనా"... గ్లాస్ తీసుకుంటూ అడిగాడు శీను.
"అక్కడే ఉండేది. ఏదో ఒక కంపెనీలో ఏదో పని. దానిదేముందిలే కానీ ఇదిగో ఈ చికెన్ ముక్క తిను బాగుంది"
"ఈ మందు కూడా బాగుంది, ఏంటిది, ఎప్పుడూ తాగినట్టు లేదు"
"ఇది స్కాచ్. బాగుంటుంది"
"డబ్బున్నవాళ్ళు తాగేది ఇదేనా"
"ఇప్పుడు డబ్బుల గురించి ఎందుకు. పాత ఫ్రెండ్స్ ఇన్నేళ్ళకి కలిసాం. ఎంజాయ్"
"నీకు భార్యా, పిల్లలు"
"ఉన్నారు. అమెరికాలో మన తెలుగమ్మాయే పరిచయం అయింది, పెళ్ళి చేసుకున్నాను. పిల్లలు అమెరికాలోనే పుట్టారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి."
"చాలా గొప్ప జీవితం అయితే నీది"
"గొప్ప గిప్ప, ఏదైతే ఏంటి. నీ జీవితం నీకు బాగుంటే, నాది నాకు బాగుంటే చాలు కదా. అందరం హ్యాపి"
"నా జీవితం ప్రస్తుతం బాలేదు, నిన్న నిన్ను కలిసినప్పుడు నేను అక్కడ ఉన్నది కూడా లాయర్ పని మీద వచ్చి. ఉన్న మాట చెప్పాలంటే ఇప్పుడు నిన్ను కలుద్దాం అనుకోవడం నా సమస్య చెప్పుకోవడం కోసం కూడా"
"నువ్వు కూడా మిగతావాళ్ళ లానే ఉన్నావు అయితే. నన్ను నీ ఫ్రెండ్ లాగా కాకుండా డబ్బులున్నాయి, ఏదో ఒకటి చెప్తే, కొన్ని డబ్బులు రాల్తాయి అనుకుంటున్నావా ఏంటి. నాకు ఇండియా వచ్చాక ఇలాంటివాళ్ళే తగులుతున్నారు"
"అలా ఏం లేదు, నేను అలా అనుకోవట్లేదు"
"లేకపోతే, వచ్చీ పావుగంట కాలేదు, అప్పుడే సమస్య అన్నావు. అదీ ఇదీ అని ఏదో చెప్తావు. చివరికి కావల్సింది డబ్బులు. అంతేగా"
"నేను అబద్దాలు చెప్పే రకం కాదు. నాకు డబ్బులు కావాలి, కానీ జల్సాలకి కాదు, తెలీక ఒకచోట ఇరుక్కుపోయాం. సమస్యలో, ఊహించని పరిస్థితిలో ఉన్నా కాబట్టే, వారం ముందు కూడా ఇలా లేను కాబట్టే, నీకు చెప్పుకుని, నీ సాయం అడుగుదాం అనుకున్నాను. నువ్వు నమ్మకపోతే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను" గ్లాస్ కింద పెట్టి నుంచుని అన్నాడు శీను.
శీను వైపే చూస్తున్నాడు మధు.