06-06-2023, 05:54 PM
(06-06-2023, 11:56 AM)Uday Wrote: కేక earthman గారు. సరదాగా ఉంది చదవడానికి. వాడికున్న కోరికనంతా బయట పెట్టాడు బాగా తాగేసి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే తాగుబోతు తండ్రవ్వడం, తోడ్కొని వచ్చినవాడు కొడుకవ్వడం. ఇలాగే నాకొకసారి జరిగింది, కాని మా నాన్న ఏం మాట్లాడకుండా సైలెంటుగా నడిచాడు నేను సైకిల్ తోసుకొస్తుంటే. ఇంటికి వచ్చాక ఏం మాట్లడకుండా వేసిన పరుపు పై పడుకుని నిద్రపోయాడు. పొద్దున నేను లేచేటప్పటికి గాయబ్, మా అమ్మ ఏం క్లాసు తీసుకుందో ఆ విధంగా ప్రవర్తించడం అదే ఆఖరు. థ్యాంక్యు మా నాన్నను గుర్తు చేసినందుకు.
ఏదో సరదా ప్రయత్నం.
వంట లాగే రకరకాలు రాస్తుంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది, క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. అన్నీ బాగుంటాయని కాదు, కానీ రాయడం వల్ల మేలైతే ఉంది.
గుర్తొచ్చేది సంతోషాన్ని ఇచ్చేది అయితే, ఎవరు గుర్తుచేస్తే ఏంటి, దేని వల్ల గుర్తొస్తే ఏంటి. All happy.