05-06-2023, 11:24 PM
ఫోన్ తీసుకుని బయటకి వెళ్ళాడు శీను.
శీను వెనకే తలుపుదాకా వెళ్ళింది సుజాత.
"ఇది మీకు ఏమన్నా న్యాయంగా ఉందా, అన్ని లక్షలు మేము ఎక్కడ నించి తీసుకురాగలం. మా డబ్బులు ఇచ్చి మేము ఇరుక్కుపోయాము. మీకు మాకు ఏమన్నా సంబంధం ఉందా, మమ్మల్ని ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారు, మీ దగ్గర డబ్బులు తీసుకుంది మేము కాదు కదా"... శీను అంటూ పోతున్నాడు.
విషయం అర్ధమైంది సుజాతకి. బాధగా వెనక్కి తిరిగింది. ఎప్పుడొచ్చాడో తెలీదు శీను అంటున్న మాటలన్నీ సుజాత పక్కనే ఉండి విన్నాడు మురళి.
వెనక్కొచ్చి తలపట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. భుజం మీద చెయ్యేసి పక్కనే కూర్చుంది సుజాత.
లోపలికొచ్చాడు శీను.
"ఏమంటున్నారు"... అడిగింది సుజాత.
"డబ్బుల గురించే మనం ఏమని ఆలోచించుకున్నామో అడుగుతున్నారు, మనం తొందరగా చెప్పకపోతే వాళ్ళు యూనిట్ వేరేవాళ్ళకి అమ్మేస్తారుట"... ఉన్నమాట చెప్పేసాడు శీను.
"ఆ ఓనర్ని కలిసి నేను మాట్లాడతాను, మీరు డబ్బులిచ్చింది ఆయనకే కదా, నేను మాట్లాడతాను" లేస్తూ అంది సుజాత.
"వద్దు సుజాత" గట్టిగా అన్నాడు మురళి.
మురళి వైపు చూసింది సుజాత.
"ఇది నేను చేసిన వెధవపని, తప్పు చేసింది నేను, బ్రతిమిలాడినా, కాళ్లమీద పడ్డా నేనే చేస్తాను, నువ్వు వద్దు"
"ఇంట్లో ఆడవాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు అని తెలిస్తే ఆయన డబ్బులు తిరిగిస్తాడేమో అని"
"వద్దు, మగాడు చేసిన తప్పుకి ఆడది తప్పు చేసినట్టు మాట్లాడడం వద్దు, నువ్వు కలవద్దు" గట్టిగా అన్నాడు మురళి.
మళ్ళీ ఫోన్ మోగింది.
"ఆఫీస్ నించి" అంటూ మళ్ళీ బయటకి నడిచాడు శీను.
పది నిమిషాలు గడిచాయి.
లోపలికొచ్చాడు శీను.
"ఏంటి శీను" అంది సుజాత.
తల అడ్డంగా ఊపుతూ, చెప్పకుండా అలానే ఉన్నాడు శీను.
"చెప్పు శీనూ, ఏమన్నారు" అడిగాడు మురళి.
"మనం ఉద్యోగాలు చేస్తున్నామా, మానేస్తామా అని అడిగారు. మానేస్తున్నాం అంటే కొత్తవాళ్లని పెట్టుకుంటారుట" చెప్పాడు శీను.
మౌనంగా అయిపోయాడు మురళి. పరిస్థితి దిగజారుతూ జీవితం పైకి రాలేని లోతుల్లోకి వెళ్తున్నట్టు అనిపించసాగింది. ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు.
వెనకే వెళ్ళబోయింది సుజాత.
"నాకు అన్నం పెట్టు సుజాత, ఆఫీస్ వాళ్ళని కలిసి, మా ఉద్యోగాల గురించి మాట్లాడతాను. ఒకళ్ళు అప్పిచ్చే అవకాశం ఉంది. అన్నం పెట్టు, చాలా పనులున్నాయి" అన్నాడు శీను.
"ఏమీ వండలేదు, వెంటనే చేస్తాను"... అంటూ వంటింట్లోకి వెళ్ళి వంట మొదలుపెట్టింది సుజాత.
మురళి దగ్గరికెళ్ళాడు శీను.
"ఆఫీస్ సంగతి నేను వెళ్ళి మాట్లాడతాను. నిన్న మా చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు కనిపించాడు, డబ్బున్నవాడు, అతనిని అడిగి చూస్తాను. అన్నం తిని రెడీగా ఉంటాను, అతను ఫోన్ చేస్తే వెళ్ళి కలిసి విషయం చెప్పి డబ్బులు అడుగుతాను, నువ్వేం కంగారుపడకు, నువ్వు కూడా కాస్త తిను" మురళితో అని బయటకి వచ్చాడు శీను.
ఏం మాట్లాడకుండా ఆలోచనల్లో పడిపోయాడు మురళి.
ఆఫీస్ వాళ్లని కలిసి, డబ్బులు ఇరుక్కుపోయాయని, రెండు మూడు రోజులు టైం కావలని వాళ్ళని బ్రతిమిలాడుకుని ఇంటికొచ్చాడు శీను.
"ఏమన్నారు" అడిగింది సుజాత.
"నాలుగురోజులు టైం ఇచ్చారు, ఈ నాలుగురోజులు ఒక ఆలోచన తప్పింది" అని కుర్చీలో కూర్చున్నాడు శీను.
శీను చెప్పింది విన్నాడు మురళి. బుర్రంతా పిచ్చిగా అనిపించసాగింది మురళికి. తను చేసిన తప్పుకి అందరూ బాధపడుతూ ఉండటం, అందరినీ ఆనందానికి దూరం చేసినట్టుగా అనుకోసాగాడు.
అన్నం తిని మధు చేసే ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు శీను.
ఫోన్ మోగింది.