04-06-2023, 09:40 PM
(This post was last modified: 16-11-2023, 02:01 PM by అన్నెపు. Edited 1 time in total. Edited 1 time in total.)
గోడకు కొట్టిన బంతి
నా పేరు భావన ,
నాకు తెలిసీ ఊహ వచ్చినప్పటి నుండి నేను గమనిస్తున్నాను . నానమ్మను ఏదో ఒక వంకతో ఏదో ఒకటి అంటూనే ఉండేది అమ్మ . పాపం నానమ్మ తప్పేమీ లేకపోయినా మౌనంగా తల దించుకుని అలాగే ఉండిపోయేది,. అమ్మ నాన్నమ్మని తిట్టడం విన్న నాన్న అమ్మని కోప్పడిథే అమ్మ ఆగకపోవడం సరికదా నాన్నని కూడా నోరు మూయించేసేది అలాగే ఎఫ్పుడూ జరుగుతుండడంతో రాను రాను నాన్న కూడా నాన్నమ్మ విషయంలో నోరెత్తడం మానేసారు . ఎందుకమ్మా నాన్నమ్మ తప్పేమి లేకపోయినా ఊరికనే అలా ఆడిపోసుకుంటావు అని నేనంటే బయలు దేరిందండీ పెద్ద ఆరిందా అంటూ నీకేమీ తెలియదు నువ్వు కూడా నోరు మూసుకుని కుర్చో మీ నాన్నే నన్ను అడగడానికీ సరిపోడు నువ్వెంత అంటూ నన్ను కూడా తిట్టిపోసేది. అది విన్న నానమ్మ నా కోసం నువ్వెందుకమ్మా మాటలు పడడం ఇదంతా నా ఖర్మ వదిలెయ్యమ్మా అంటూ బాధపడేది అలాగే రోజులు గడిచి పోయాయి అన్నయ్య నేను పెద్దవాళ్ళం అయిపోయాము . మా ఇద్దరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. కొన్ని రోజుల తరువాత పుట్టింటికి పచ్చిన నాతో అమ్మ ఏడుస్తూ అమ్మా భావన మీ వదిన ఈ ఇంటికి కోడలు కాదే కొరివి దెయ్యం ప్రతీ రోజూ నన్ను తిట్టడమే దానికి పని నన్ను తిట్టని రోజంటూ లేదు మీ అన్నయ్య ఒక చేతకాని చవట పెళ్ళం చేతిలో కీలుబొమ్మ అయ్యిపోయాడు ఇంక మీ నాన్న మూగవాడి నైజం నీకు తెలిసిందే కదా అంది అమ్మ కన్నీళ్ళు తుడుచుకుంటూ .చూడు అమ్మా గోడకు కొట్టిన బంతి మరలా వెనక్కే గా వస్తుంది నీ అత్తగారికి నువ్వేమి చేసావో నీ కోడలు నీకూ అదే చేస్తుంది ఇందులో ఆశ్చర్యం ఏముంది అన్నాన నేను. ఆ మాటకీ అమ్మ ఏమీ మాట్లాడలేక సిగ్గుతో తల దించేసుకుంది