Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic చిన్న కథలు
#17
శ్రీ రామాయణ మహా కావ్యంలో ఒక మహోత్తరమైన సన్నివేశం
అది ఒక వసంత ఋతువు.
సెలయేటి గట్టు పైనా తల్లి సీతమ్మ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి   లక్ష్మణ స్వామి వారు కూర్చొని ఉన్నారు.
సాయం సంధ్యా సమయం  చంద్రుడు దాగి దాగిన ముఖంతో దాగుడుమూతలు ఆడుతున్నాడు.
వీచి వీయని చల్లని గాలి తేమర్లు.
కమ్మని హాయిని ఇచ్చే వసంత ఋతువు.
సెలయేరు నుంచి ప్రభు శ్రీ రాముల వారిని చూడటానికి అన్నట్టు రాళ్ళు,రప్పలును సైతం దాటుకుంటూ మెల్ల మెల్లగా నీరు ప్రవహిస్తుంది.
ఊహాకు అందనంత, కవితలకు సైతం అందనంత వర్ణన తో కూడి ఉన్నట్టువంటి ఆ సెలయేరు నుంచి ప్రవహించే నీటి తుంపర్లు శిశిరాన్ని మరిపించే వసంత రాగం.కోకిల లా కుకూరాగం, పక్షుల కిలకిల రావాలు.
సెలయేరు కీ ఆనుకోని చిన్న అడవి పచ్చని ఆకులతో చెట్లు. అబ్బబ్బా ఏమీ ఆ దృశ్యం.   
ఇంతలో ఆ చిరు గాలిలో ఒక ఆకు సీతమ్మవారిని గిచ్చుకొని పోతుంది.
అప్పుడు సీతమ్మ తల్లీ చిన్నగా విలవిలలాడినట్టు చిత్కారిస్తుంది.
ప్రక్కన ఉన్న ప్రభువు శ్రీ రాములు వారు చిన్న చిరుకోపం నటిస్తూ"సీతా మీరు సుకుమారమైనటువంటివారు. కోమలమైనటువంటివారు.
మీరు ఈ అడవికి రావద్దని చెప్పాను కదా, అడవిలో రాళ్ళు,రప్పలు,ముళ్ళు అన్నీ ఉంటాయి.ఇవన్నీ మీరు తట్టుకోలేరని చెప్పాను.అయిన మీరు వెంటపడి వచ్చారు"అంటారు
ఇదీ విని లక్ష్మణస్వామి "ఎప్పుడు లేనిది అన్నగారు ఇలా కోప్పడ్డం నేను  చూడలేదు. ఒక వేళ అన్నగారికి ఆకలి అయిన వేస్తుండాలి లేదా దాహం అయిన వేస్తుండాలి అనీ అనుకొని అన్నగారి ఆజ్ఞతో తినడానికి ఏమైనా ఫలాలు తీసుకురావడానికి వెళ్తారు.
అడవిలో తిరిగి తిరిగి కొన్ని మామిడి ఫలాలు మరియు కొన్ని చెరకు ముక్కలు పట్టుకొని అన్నగారి దగ్గరకు వస్తారు.
వచ్చిన తర్వాత ఆ మామిడి ఫలాలు,
చెరకు ముక్కలు అందిస్తారు.
అది చూసి సంతోషించి తల్లీ సీతమ్మకీ ఒకటి,తానొకటి తీసుకొని లక్ష్మణస్వామికి ఒకటి ఇస్తారు.
అవి తిన్న తర్వాత శ్రీ రాములువారూ   ఇలా.పలుకుతారు
*"బలం బలం భాతృ బలం*
*ఫలం ఫలం చూత ఫలం*
*రసం రసం యిక్యు రసం*
*దీపం దీపం చంద్ర దీపం"* "
దీని అర్థం *బలం బలం భాతృ బలం* అంటే శ్రీ రాములువారు ఎంత హృదియంగా చెప్పారండి.
ఆకలి అయిన దాహం అయిన తల్లీదండ్రులకు తెలుస్తుంది అంటారు అలగే  అన్నదమ్ములకు తెలుస్తుంది  .
అలా తమ్ముడు   లక్ష్మణుడు నా ఆకలి ఎరిగి నా కోసం తినడానికి తెచ్చాడు.
అందుకే లక్ష్మణ స్వామీ అంతా ఆదర్శ తమ్ముడు అయ్యాడు. *ఫలం ఫలం చూత ఫలం* అంటే ఫలాలన్నింటీలో మామిడి ఫలం రారాజు.
*రసం రసం యిక్యూ రసం* అంటే చెరకు రసం మనందరికీ తెలిసిందే.ఒక్కసారిగా చెరకు ముక్కలు నమిలి తినేసరికి నా ఆకలి,దాహం పోయాయి.
*దీపం దీపం చంద్ర దీపం* అంటే చీకట్లో కూడా మనకి వెలుగుని చూపిస్తుంది.
చంద్రుడిలో వెలుగు ఉండబట్టే   తమ్ముడు లక్ష్మణుడు వెళ్ళి తినడానికి తీసుకువచ్చాడు.
అన్న మాట విని లక్ష్మణస్వామి చిన్నగా నవ్వుతారు.
అప్పుడు శ్రీ రాములువారు "ఏమీ లక్ష్మణ నవ్వుతావు..?" అనీ అంటారు.
లక్ష్మణుడు   అంటారు "అన్నగారు మీకు నేను చెప్పినంతవాడినికాదు. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం.."అంటూ

*"బలం బలం బాహు బలం*
*ఫలం ఫలం ధాన్య ఫలం*
*రసం రసం గో రసం*
*దీపం దీపం చఖ్యు దీపం"*

దీని అర్థం ఏంటంటే *బలం బలం బాహు బలం* అంటే అన్నదమ్ములు ఎంత దగ్గరగా ఉన్న బాహు(భుజం)లో బలం లేకపోతే ఎంత అన్నదమ్ములు అయిన ఏమీ చేయగలరు.
*ఫలం ఫలం ధాన్య ఫలం* అంటే సంవత్సరం మొత్తం అందరి ఆకలి, దప్పికలు తీరుస్తాయి.
కానీ మామిడి ఫలాలు మూడు నెలలే ఉంటాయి ఫలాలన్నింటిలో ధాన్యం ఉండాలి.
*రసం రసం గో రసం* అంటే ఆవు యొక్క పాలు అవి తాగితే ఒంటికి ఆరోగ్యం కానీ చెరకు రసంలో ఏమీ వస్తాది.
అందుకే రసం రసం గో రసం అన్నారు.
*దీపం దీపం చఖ్యు దీపం* అంటే కళ్ళు ఉంటేనే కదా అన్నీ చూడగల్గుతున్నాం కళ్ళు లేకపోతే చంద్రుడిని,చంద్ర కాంతిని గానీ చూడలేం కదా

ఇంతటిలోగా సీతమ్మ తల్లీ చిన్నగా నవ్వుతారు
 శ్రీ రాములువారు అడుగుతారు "ఏమైంది జానకి అలా నవ్వవలసిన విషయం ఏముందీ  ఇక్కడ.
సీతమ్మ తల్లీ ఇట్లా అంటారు
మీరిద్దరూ అన్నదమ్ములు సంభాషణ విని నవ్వొచ్చింది స్వామి క్షమించండి.
 శ్రీ రాములువారు అంటారు అలా కాదు మీరు కూడా ఏదో ఆలోచిస్తున్నారు అందుకే నవ్వుతున్నారు.
 సీతమ్మతల్లీ అవును స్వామి మీరిరువురు చెప్పినటువంటి విషయం నాకెందుకో నచ్చలేదు.అందుకే నవ్వాను.
 శ్రీ రాములువారు అడుగుతారు.
అయితే మీ ఉద్దేశం ఏంటి జానకీ.  సీతమ్మతల్లీ ఇట్లా పలుకుతారు

*"బలం బలం దైవ బలం*
*ఫలం ఫలం కర్మ ఫలం*
*రసం రసం రామ రసం*
*దీపం దీపం జ్ఞాన దీపం"*

దీని అర్థం ఏంటంటే *బలం బలం దైవ బలం* అంటే దైవ బలం కంటే పెద్ద బలం ఇంకొకటి లేదు.
కారణం ఇప్పుడు మీ వద్ద భాతృ బలం ఉంది,బాహు బలం కూడా ఉంది.
కానీ దైవ బలం యొక్క విధి వల్ల సూర్యవంశస్తుడు అయినటువంటి చక్రవర్తి దశరథమహారాజుకి తనయలై ఉండి ఈ అడవిలో మునులు ఋషులు వలే వేశధారణతో ఇక్కడ తిరుగుతున్నారు ఇదీ దైవ బలం.
*ఫలం ఫలం కర్మ ఫలం* అంటే ఫలాలన్నింటిలో కర్మ ఫలం శ్రేష్ఠమైనది తెల్లవారితే అయోధ్య సింహాసనం అధిరోహించవలసినటువంటివారు
కానీ   జరిగింది ఏమిటి ఇదే కర్మ ఫలం.
కర్మలో లేకపోతే మామిడి ఫలం కానివ్వండి ధాన్య ఫలం కానివ్వండి ఏ ఫలం కూడా దొరకదు.
*రసం రసం రామ రసం* అంటే రామ నామానికి మించిన నామం(రసం) ఇంకొకటి లేదు లోకాలన్నింటిలో అందరూ కూడ ఈ రామ నామ రసాన్ని తాగుతూ( పలుకుతూ) తరిస్తున్నారు.
*దీపం దీపం జ్ఞాన దీపం* అంటే జ్ఞానం అన్నది లేకపోతే పిచ్చివాడు వలె మూర్ఖుడి వలె ఉందురు అదే ఈ జ్ఞానం లేకపోతే అజ్ఞాని వలె తిరుగుచుందూరు.
ఇదీ దీని యొక్క సారాంశం అందుకే నవ్వాను స్వామి. నేను ఏమైనా తప్పుగా చెప్పివుంటే మన్నించండి.
అందుకే నాకు నవ్వు వచ్చింది స్వామీ. అనీ సీతమ్మ పలుకుతారు.

ఈ కథ నేను ఏ రామాయణ మహాకావ్యంలో కూడా చూడలేదు.

కానీ ఈ సన్నివేశం మా నాన్నగారు ఇరవైరెండు సంవత్సరాల క్రితం చెప్పారు
అప్పుడే మా నాన్నగారిని నేను అడగడం జరిగింది ఇదీ ఏ రామాయణం లో అనీ. ఆయన చెప్పారు కానీ నాకు ఏ రామాయణమో జ్ఞాపకం రావడం లేదు.
గత సంవత్సరకాలంగా ఈ కధ రాద్దాం అనుకుంటున్నాను.కానీ రామనుగ్రహం లేకపోవడం వలన రాయలేకపోయాను.

 *ప్రభు శ్రీరామచంద్రునిగా అవతరించావు. భరత లక్ష్మణ శతృఘ్నులకు అన్నగా జన్మించావు. భూలోకంలో పరమ పవిత్రుడుగా, పాపాలనే కలుపు లతలను కోసివేసే కొడవలి వంటి వాడుగా ప్రసిద్ధికెక్కావు. హే సీత సమేత శ్రీరామచంద్ర మూర్తి మరియు లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమా స్వామీ వారి పాద పద్మలాకు అనంత కోటి ప్రణామలాతో...*
[+] 3 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: చిన్న కథలు - by k3vv3 - 04-06-2023, 10:03 AM
RE: చిన్న కథలు - by Pallaki - 04-06-2023, 06:04 PM
RE: చిన్న కథలు - by అన్నెపు - 04-06-2023, 09:09 PM
RE: చిన్న కథలు - by sri7869 - 10-06-2023, 08:38 PM
RE: చిన్న కథలు - by K.R.kishore - 16-11-2023, 10:00 AM
RE: చిన్న కథలు - by Rajeraju - 16-11-2023, 10:25 AM
RE: చిన్న కథలు - by km3006199 - 19-11-2023, 06:31 AM



Users browsing this thread: 1 Guest(s)