04-06-2023, 12:28 PM
"కురుక్షేత్రం"
15-03-2023
కృతయుగారంభంలో "ఋక్షుడు" అనే చంద్రవంశానికి చెందిన రాజు ఉండేవాడు. అతని కుమారుడు "సంవరణుడు". చిన్నప్పటినుండి సంవరుణుడికి ధర్మకార్యాలు అంటే మక్కువ. గురువు వద్ద వేద విద్యలు నేర్చుకుని తిరిగి పెద్దవాడయ్యాక రాజ్య భారం స్వీకరించి ప్రజానురంజకంగా పాలించేవాడు. సంవరుణుడు రాజ్యభారాన్ని కొంతకాలం వశిష్టుడికి అప్పగించి వనానికి వెళ్ళాడు. అద్భుతంగా ఉన్న ఆ వనం చూసి రాజు పరవశుడై వనమంతా తిరిగి ఒక కొలను వద్దకు చేరాడు. ఆ కొలనులో చాలా రంగుల తామర పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వుల్లో పువ్వుల్లా కలిసిపోయిన "తపతి" అనే సౌందర్యవతి ఆ సమయంలో ఆ కొలనులో తన చెలికత్తెలతో జలక్రీడలాడుతోంది. తపతి సూర్య భగవానుని కుమార్తె. తపతి-సంవరుణులకు ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలిగింది. రాజ్యానికి తిరిగి వచ్చినా అన్యమనస్కంగా ఉన్న రాజును చూసి వశిష్ఠుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు. వశిష్ఠుడు తన యోగ విద్యతో సూర్య మండలానికి చేరాడు. వశిష్ఠుడు సూర్యుణ్ణి కలిశాడు. "సూర్యదేవా! చంద్రవంశానికి చెందిన సంవరుణుడి కులగురువు వశిష్టుడను నేను. మీ పుత్రిక తపతి వివాహాన్ని మారాజుతో జరిపించండి"అన్నాడు.అప్పుడు సూర్యుడు"దుర్నరీక్షమైన నా తేజస్సును తట్టుకుని నా దగ్గరకు రాగలిగావు.నీవే ఇంత గొప్పవాడవైతే,మీరాజు ఇంకా గొప్పవాడై ఉండాలి! అతడు నా అల్లుడు కాదగినవాడు.నా కుమార్తెను నీతో పంపిస్తాను.వివాహం జరిపించు"అని చెప్పాడు. వశిష్ఠుడు అప్పుడు తపతిని తీసుకుని భూలోకానికి వచ్చి సంవరుణుడితో వివాహం జరిపించాడు. వారికి "కురు" అనే కుమారుడు కలిగాడు.కురు ఆ పైన సౌధమిని అనే సౌందర్యవతిని పరిణయమాడి తండ్రి తర్వాత రాజయ్యాడు.కురురాజుకు తన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలనీ, తన వల్ల మానవజాతికి మేలు జరగాలని కోరిక. అందుకు అతడు భూలోకమంతా తిరిగి తిరిగి ద్వైత వనానికి చేరాడు. అక్కడ సరస్వతీ నదిలో స్నానం చేసి శమంతకమనే క్షేత్రం చేరి ఇలా అనుకున్నాడు. "అష్టాంగధర్మాలు- తపస్సు, సత్యం, క్షమ,దయ, శౌచం,దానం,యోగం, బ్రహ్మచర్యం వీటిని మొలిపిస్తాను. దానివల్ల మానవునికి స్వర్గ ప్రాప్తి సులభం అవుతుంది". కురు బంగారు నాగలి చేయించి,ఈశ్వరుణ్ణీ,యముణ్ణీ ప్రార్థించి వారి వాహనాలైన ఎద్దునీ, దున్నపోతునీ రప్పించి ఆ నాగలికి కట్టి తానే స్వయంగా భూమి దున్నసాగాడు. అది చూసి ఇంద్రుడు పరిహాసంగా "ఇది అర్థం లేని పని. అష్టాంగ యోగాలను మొలకెత్తించడం నీవల్ల కాదు"అన్నాడు. తరువాత విష్ణుమూర్తి అక్కడకు వచ్చాడు. "రాజా!బీజాలు లేకుండా అష్టాంగధర్మాలను ఎలా మొలికిచ్చిస్తావు". నా శరీరంలో అష్టాంగ ధర్మాలు ఉన్నాయి. ఈ భూమిని దున్నుతూ, నా శరీరం క్రమంగా క్షీణించి భూమిలో కలిసిపోతుంది. అప్పుడు ఆ ధర్మాలు మొలకెత్తుతాయి"అన్నాడు సంవరుణుడు. "దానికి చాలా సమయం పడుతుంది. నీ శరీర భాగాలను నరికి నాకివ్వు. ఈ భూమిని నేను దున్నుతాను" అన్నాడు విష్ణుమూర్తి. వెంటనే కురు తన కాళ్ళను, ఒక చేతిని నరికి "స్వామీ! పొలాన్ని దున్ని నా ఆశయాన్ని నెరవేరేలా ఆశీర్వదించండి" అన్నాడు సంవరుణుడు.కురురాజు అఖండ దీక్షకు మెచ్చి విష్ణుమూర్తి ఆయన ఆశీర్వదించాడు. అప్పుడు కురురాజు కోల్పోయిన కాళ్లు, చేతులు తిరిగివచ్చాయి. "ఓ రాజా! ఈ క్షేత్రం నీ పేరు మీద కురుక్షేత్రంగా ప్రసిద్ధి కెక్కుతుంది. ఇక నుంచి నేను, చంద్రుడు, వాసుకి, శంకుకర్ణుడు, సుకేశి, అజావనుడు ఈ క్షేత్రాన్ని రక్షిస్తాం. నువ్వు దివ్య శరీరంతో స్వర్గంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటావు. ఇక్కడ యుద్ధంలో మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది"అన్నాడు విష్ణుమూర్తి.కురురాజు మరణించిన తరువాత స్వర్గానికి చేరాడు.కురుక్షేత్రంలో మరణిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది.కనుకనే కౌరవ, పాండవులు ఇక్కడ యుద్ధం చేశారు. చరిత్రలో కురుక్షేత్రం పేరు "ధర్మక్షేత్రం"గా నిలిచిపోయింది.
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు