Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic చిన్న కథలు
#10
❤? మనసు కథలు ?❤

??? బంధం ???

" సరితా, ఆ ముదనష్టపుది మన ఊరికే వచ్చి తగలడిందిట, నన్ను ఇలా కూడా బతకనీయదనుకుంటా ఆ పాపిష్టిది.. కొందరు ఎందుకిలా పుట్టి సాధించుకు తింటారో " అని,..

' ప్రేమపెళ్ళి చేసుకుందని , కుటుంబం నుంచీ వెలివేసిన కూతురు స్వప్న గురించి తిడుతున్నాడు నారాయణ, తన భార్య సరిత దగ్గర ...

" ఇక చాలు తిట్టింది, పక్కింటి వాణికి ఏం జరిగిందో మర్చిపోయారా, పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధమే, మూటల్లో కట్నం ఇచ్చి పెళ్ళి చేసి పంపించినా, డబ్బూ డబ్బూ అని పిల్లకి నరకం చూపిస్తున్నాడు దాని మొగుడు,

మన అల్లుడు శరత్ ఒక్క రూపాయి అయినా ఆశించాడా మన నుంచీ, పైగా స్వప్నని అపురూపంగా చూసుకుంటున్నాడు,

' మన పిల్ల మన మాట వినటం మాత్రమే ముఖ్యమా, మన అమ్మాయి సంతోషంగా బతకటం ముఖ్యమా, ' అది ఆలోచించుకోండి ముందు " అంది సరిత...

" ఊ కూతుర్ని బాగానే వెనకేసుకొస్తున్నావే " అన్నాడు నారాయణ కోపంగా...

" చివరి రోజుల్లో ఉన్న నాకు, మన ఒక్కగానొక్క కూతుర్ని చూసుకోవాలని, నా తల్లి ప్రాణానికి పీకదా " అంది చాలా అనారోగ్యంతో ఉన్న సరిత దిగులుగా....

" ఏవిటోనే, నీ గురించే నాకూ బాధగా ఉంది. నీకు ఏదయినా అయితే నేనూ బతకనే, నీ వెనకాలే నేనూనూ.. " అన్నాడు నారాయణ దిగులుగా...

" నా కళ్ళు మూతపడేలోపు, స్వప్న ని ఒకసారి చూడాలనిపిస్తోందండీ మరి.. " అంది సరిత అభ్యర్ధనగా...

నారాయణ బాధగానూ, కోపంగానూ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళల్లోంచీ ఓ రెండు కన్నీటిచుక్కలు జారాయి..
భార్య కోసం బాధ్యత తోనూ, కూతురి దగ్గర తగ్గాల్సి వస్తుందన్న ఆవేదనతోనూ...

భార్య కోసం తగ్గాలి అని అనుకున్నాడు.

బ్యాంక్ ఉద్యోగం వచ్చినా కూడా, తన తండ్రి నారాయణ లాగా ఒక మంచి టీచర్ గా మిగలాలని స్వప్న కాలేజ్ టీచర్ ఉద్యోగాన్నే ఎంచుకుంది..

కాలేజ్ కి ఎప్పుడు నారాయణ వెళ్ళినా తగు మర్యాదలు జరుగుతాయి నారాయణకు. నారాయణ నెమ్మదిగా ఒక్కొక్క క్లాసు ముందునుంచీ చేతికర్ర సాయంతో నడుస్తూ వెళుతున్నాడు..

ఒక క్లాసు దగ్గరకు వెళుతుండగా, పాఠం చెబుతున్న గొంతు స్వప్నది అని అర్థం అయింది నారాయణకి.. అడుగులు ముందుకు పడమూ అని మొరాయిస్తున్నాయి, కానీ కూతురిని చూడాలని కళ్ళు తొందరపెడుతున్నాయి...

ఈ అయోమయంలో అడుగులు ముందుకు పడ్డాయి... ఆ క్లాసు ముందు అడుగు ఆగింది.. గుమ్మం దగ్గర ఎవరో ఉన్నారనిపించి తల తిప్పి చూసింది టీచర్ స్వప్న...

గబగబా క్లాసు బయటకి వచ్చేసింది స్వప్న " నాన్నా " అంది స్పష్టాస్పష్టామైన గొంతుతో...

కళ్ళు నీళ్ళతో నిండిపోయి తండ్రి రూపం మసకగా కనిపిస్తుంటే, చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని
" నాన్నా "అని అంటూ తండ్రిని మళ్ళీ పిలిచి,
తండ్రి కళ్ళల్లోకి చూస్తోంది...

నారాయణకు కళ్ళల్లో ఎంత కోపం తెచ్చుకుందామని ప్రయత్నిస్తున్నా, కన్నీరే కమ్ముకుంటోంది.. అపురూపంగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు మరి స్వప్న, ఇన్నేళ్ళకు మళ్ళీ చూస్తున్నాడు కన్నకూతురిని...

" బావున్నావా నాన్నా, అమ్మ ఎలా ఉంది " అడిగింది స్వప్న..

" అమ్మ చావుబతుకుల్లో ఉన్నట్లుగా తయారయ్యింది, నిన్నే కలవరిస్తోంది " అన్నాడు నారాయణ...

" ఏవయింది నాన్నా, అమ్మకీ.. " అంది కంగారుగా స్వప్న..

" మా గురించి పట్టించుకోకుండా పోయావుగా ఆ రోజున నువ్వు, నీ మీద దిగులుతోనే మనసు, తరువాత ఆరోగ్యం పాడుచేసుకుంది మీ అమ్మ " అన్నాడు నారాయణ, స్వప్నతో నిందాస్తుతిగా....

" అమ్మని నేను ఒకసారి చూడొచ్చా నాన్నా, ప్లీజ్.. " అంది స్వప్న బతిమలాడుతున్నట్లుగా....

సరే అన్నట్లుగా తల ఊపాడు నారాయణ, మనసులో అదే కదా నా సరితకు కావల్సినది అని అనుకుంటూ....

అంతే, పరుగు పరుగున ఒకటో తరగతి క్లాసుకి వెళ్ళింది స్వప్న, " కృష్ణప్రియా " అని పిలిచింది... ఆరేళ్ళ పాప బయటకు వచ్చింది...

" నాన్నా నీ మనవరాలు " అని పాపను చూపించింది స్వప్న, తండ్రికి...

నారాయణకు అచ్చం చిన్నప్పటి స్వప్ననే చూసినట్లుగా ఉంది..

గుండ్రని, నున్నని బుగ్గలు ఉన్నాయి కృష్ణప్రియకు, అచ్చు స్వప్నకు చిన్నప్పుడు ఉన్నట్టుగానే

" ... వెంటనే నారాయణ కిందకు వంగి కృష్ణప్రియ బుగ్గలను ప్రేమగా తాకాడు, తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరాడు...

స్వప్న చాలాసార్లు ఫొటోల్లో చూపించింది,
కృష్ణప్రియకు, నారాయణను సరితనూ,
తాత అమ్మమ్మ, అని తెలియచేస్తూ,

ఇప్పుడు కృష్ణప్రియ నారాయణ ను చూడగానే, గుర్తుపట్టేసింది....

" తాత కదా అమ్మా " అంది ఆ గడుగ్గాయి, తాత చేతికర్ర పట్టుకున్న చేయి మీద, తన చిట్టిచేతిని వేసి పట్టుకుని... ఆ లేతచేయి స్పర్శ , ఇన్నేళ్ళూ ఆవేదనతో, కోపంతో మండిన తాత మనసుకు చల్లని వానజల్లు లాంటి సాంత్వనని ( ఊరటను ) అందించింది..

నారాయణ కూతురిని, మనవరాలిని తీసుకుని భార్య దగ్గరకు బయలుదేరాడు..

రంగి చేత, మర్రోజు రాబోయే జన్మాష్టమికి , ఈ సాయంత్రమే, ఇంటి ముందు కృష్ణ పాదాలు వేయించింది సరిత..

అరగంట తరువాత ఆ పాదాల గుర్తుల పక్కనే మురిపెంగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చేసింది కృష్ణ ప్రియ, అమ్మ స్వప్నతో సహా...

బక్కచిక్కిపోయి,మంచం మీద నీరసంగా, కలవరపాటుగా కనులు మూసుకుని నిద్రావస్ధలో ఉన్న సరిత తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది స్వప్న, " అమ్మా " అని ప్రేమగా, ఆర్తిగా పిలుస్తూ...

ఆ పిలుపుకి ఆశగా కళ్ళు తెరిచి స్వప్న ను చూసిన సరిత " స్వప్నా " అని నీరసమైన గొంతుతో పిలుస్తూ ,

ఓపిక లేకపోయినా లేచికూర్చుని, స్వప్న చెంపలను ఆప్యాయంగా నిమురుతూ, స్వప్న చెంపల మీద ముద్దులు పెడుతూ " అమ్మా స్వప్నా, నా బంగారుతల్లీ " అంటూ మధ్యమధ్యలో స్వప్నను దగ్గరకు హత్తుకుంటోంది...

స్వప్న ని , సరిత, చిన్నపిల్లని ముద్దు చేసినట్లు చేస్తూ ఉంటే , అది చూసి, కృష్ణ ప్రియకు కిలకిల మని నవ్వు వచ్చేసింది, గలగలమని నవ్వింది...

" ఎవరూ " అన్నట్లుగా చూసింది సరిత కృష్ణ ప్రియను,

వెంటనే కొట్టొచ్చినట్టుగా కనపడుతున్న స్వప్న పోలికలు తెలిసి, " అబ్బో నా మనవరాలా, నా వరాలమూటా , " అని అపురూపంగా అంటూ, తన బక్కచేతులతోనే లేని బలం తెచ్చుకుంటూ కృష్ణ ప్రియను ఎత్తుకుని గుండెలకు దగ్గరగా హత్తుకుని ముద్దులాడింది...

అదంతా చూస్తున్న నారాయణ,

" ఇన్నేళ్ళూ కోపంతో రగిలిపోయాను కానీ, ఈ రోజు, అమ్మమ్మా కూతురు మనవరాలిని ఇలా చూస్తుంటే, పొందుతున్న ఈ ప్రశాంతతను అనుభవిస్తుంటే తెలుస్తోంది, కోపాలు ఎంత పనికిమాలినవో అని, ఎంత అనవసరమైనవో అని... " అని అనుకుంటూ, అల్లుడిని కూడా పిలవాలి కదా అని బాధ్యతను గుర్తు చేసుకుంటున్నాడు,

ఇన్నాళ్ళూ తను నమ్ముకున్న కృష్ణుడే , సరితకు ఈ రోజున ఇంతటి ఆనందాన్ని అందించాడు అని అనిపించి, ఎదురుగా ఉన్న తెల్లని నిలువెత్తు కృష్ణుని ప్రతిమకు మనసారా నమస్కరించుకున్నాడు నారాయణ..

తులసిభాను
మంగళవారం
11 8 2020
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: చిన్న కథలు - by k3vv3 - 04-06-2023, 10:03 AM
RE: చిన్న కథలు - by అన్నెపు - 04-06-2023, 11:31 AM
RE: చిన్న కథలు - by Pallaki - 04-06-2023, 06:04 PM
RE: చిన్న కథలు - by sri7869 - 10-06-2023, 08:38 PM
RE: చిన్న కథలు - by K.R.kishore - 16-11-2023, 10:00 AM
RE: చిన్న కథలు - by Rajeraju - 16-11-2023, 10:25 AM
RE: చిన్న కథలు - by km3006199 - 19-11-2023, 06:31 AM



Users browsing this thread: 3 Guest(s)