Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రోబోట్ టైప్ రైటర్.
#1
మరో కొత్త కధతో వచ్చాను అనుకుంటున్నారా, కాదు.

ఇది కధ కాదు, నా వ్యధ.

వారానికి ఒక కధ రాయగలిగినన్ని కధావస్తువులు నా దగ్గర చాలా ఉన్నాయి. రాస్తుంటే, కాదేదీ కవితకనర్హం అన్నట్టు ఇంకా లైన్స్ తడుతుంటాయి. అన్నీ బాగుంటాయని కాదు, కానీ కధావస్తువుల కొరత మాత్రం లేదు.

The problem is typing in Telugu.

ఒత్తులు, పొల్లులు, దీర్ఘాలు, అచ్చుతప్పులు ఏవీ లేకుండా నేను అనుకున్నట్టు ఒక్కొక్క వాక్యం రాయాలంటే దుంప తెగుతోంది. రాసేవాళ్ళు ఎలా రాస్తున్నారో నాకు తెలీదు, నా పరిస్థితి అయితే ఇది.

చక్కని ఆదరణ చూపించారు నా కధల పట్ల, అయినా నా కధల మధ్య విరామం రావడానికి ఇది ఒక కారణం.

నేను చెప్తూ ఉంటే ఒక మనిషి టైప్ చేస్తాడు, టైపింగ్ అయ్యాక ఫైల్ ఇస్తాడు, నేను కాపీ పేస్ట్ చెయ్యడమే, టైప్ చేసినందుకు ఆ మనిషి చేతిలో ఒక పది రూపాయలు పెడితే చాలు అన్నా నాకు ఓకే. కానీ ఆ మనిషికి నేనేవరో తెలుస్తాను, నేను గుర్తుంటాను, అందుకే ఇది సొల్యూషన్ కాదు.

నేను చెప్తూ ఉంటే ఒక మనిషి టైప్ చేస్తాడు, టైపింగ్ అయ్యాక ఫైల్ ఇస్తాడు, నేను అతని మెమరీ నేను డిలీట్ చేస్తాను. అతనికి నేనేవరో తెలీదు, నన్ను చూసిన గుర్తు అతనికి ఉండదు. ఇది జరగదు కాబట్టి ఇది కూడా సొల్యూషన్ కాదు.

అందుకే నాకో రోబోట్ టైప్ రైటర్ కావాలి.

నేను చెప్తాను, అది రాస్తుంది, అది రాసిన టెక్స్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఇక రాయడానికి ఆలోచనలు రావట్లేదు అనే రోజు దాక ప్రాసెస్ రిపీట్.

ఎక్కడ దొరుకుతుంది నాకు అలాంటి రోబోట్ టైప్ రైటర్??? Sad
[+] 4 users Like earthman's post
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
రోబోట్ టైప్ రైటర్. - by earthman - 30-05-2023, 08:00 PM



Users browsing this thread: 1 Guest(s)