Thread Rating:
  • 19 Vote(s) - 2.74 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Office Romance - లేడీ బాస్ తో, ప్రేమాయణం - Part - 7
#55
ప్రస్తుతం:


చాలా ధైర్యం కూడ బెట్టుకోవాల్సి వచ్చింది భవ్యకి కాల్ చేయాలి అంటే. మొత్తానికి డైల్ కొట్టగానే గుండె వేగం పెరిగి పోయింది ఎం అంటుందో అని.

"ఆ చెప్పు రాహుల్"

"భ.. భవ్య, స్వేత కాల్ చేసింది అంట కదా నీకు" నా స్వరంలో వణుకు నాకే అర్ధం అవుతుంది.

"హ చేసింది. తనకి రావటానికి కుదరదు అంది. ఇంకెప్పుడు అయినా ప్లాన్ చేద్దాం అన్నాను"

"ఓకే"

"సరే ఉంటాను" అంటూ కాల్ కట్ చేయబోయేలోగా నేను అందుకుని.

"భవ్య త్రీ డేస్ వీకెండ్ కదా, నీకు ఓకే అయితే మన ఇద్దరం వెళ్దామా" అని అనేశానే కానీ ఆ సెంటెన్స్ కంప్లీట్ చేసేలోపు నాకు చెమటలు పట్టేసాయి.

"ఏంటీ" అంది గద్దిస్తూ. నా కాళ్లలో చిన్న పాటి వణుకు పుట్టింది, గొంతు తడి ఆరిపోయింది. నేను ఇంకా మాట్లాడక ముందు తానే "నాకు కుదరదు ఇంకో సారి ఎప్పుడైనా చూద్దాం" అని కాల్ కట్ చేసేసింది.

నా మనసుకి ఎక్కడో తగిలింది అంతలా హార్ష్ గా కాల్ కట్ చేసే సరికి. ఇంక నేను ఆలా ఉండిపోయా చేతిలో ఫోన్ పట్టుకుని ఇంస్టాలో ఎదో స్క్రోల్ చేయాలి అని స్క్రోల్ చేస్తున్నానే కానీ ఎం చూడట్లేదు. నా ఆలోచనలంతా ఒకప్పుడు ఎంతో క్లోజ్ గా ఉండే నేను భవ్య ఇప్పుడు కనీసం కాల్ కూడా సరిగ్గా మాట్లాడ లేని సిట్యువేషన్ కి కారణం పూర్తిగా కారణం నేనే నా అని ఆలోచిస్తూ.

------

ఈలోగా స్వేత కాల్. అబ్బా ఇది చంపేస్తుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసా.

"అరేయ్ నాకు చాలా కంగారుగా ఉంది రా" అంది. నాకు ఒక్క క్షణం దేని గురించో అర్ధం కాలేదు. నేను భవ్య ని ఒపించావా అని సతాయించటానికి కాల్ చేసింది అనుకున్నాను.

"ఏయ్ దేని గురించి, ఎందుకు కంగారు"

"ఇంట్లో నాకు చాలా ప్రెషర్ ఉంది, రేపు నాకు పెళ్లి చూపుల్లో వాడు నచ్చిన నచ్చక పోయిన సంబంధం లేకుండా ఫిక్స్ చేసేసేలా ఉన్నారు రా ఈ మ్యాచ్. వాళ్లే ఫిక్స్ అయిపోయారు సూపర్ మ్యాచ్ అది ఇది అని. నాకేం అర్ధం కావట్లేదు"

"ఎందుకు అప్పుడే కంగారు, నువ్వు కలిసి మాట్లాడతావ్ కదా రేపు. ఏమో మీ పేరెంట్స్ ఏ కరెక్ట్ అయితే మంచిదే కదా"

"ఏమోరా ఎదో చాలా చాలా కంగారుగా ప్రెషర్ గా ఉంది. ఏదోకటి చెప్పి రేపు పెళ్లి చూపులు పోస్టుపోన్ చేసేయనా"

"ప్చ్.. పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఎన్నాళ్ళు అని పోస్టుపోన్ చేస్తావ్. అసలు చూడకుండా కలిసి మాట్లాకుండా నీకు ఎలా అర్ధం అవుతది అతను ఎలాంటి వాడో"

"నాకు నా మ్యారేజ్ ఇలా వద్దు రా బాబు అంటుంటే. నువ్వు కూడా మా అమ్మబాబుల మాట్లాడతావ్ ఏంటీ. ఇలా ఎదో ప్రొఫైల్ చూసి మ్యాచ్ ఫిక్స్ చేస్తే సరిపోద్దా. పెళ్ళికి ముందు బేసిక్ అండర్స్టాండింగ్ కూడా లేకుండా ఎలా ఒక్కడితో లైఫ్ షేర్ చేసుకోవాలి"

"అరేంజ్డ్ మ్యారేజ్మ ఇష్టం లేకపోతే మరి లవ్ చేయొచ్చు కదా నీకు నచ్చినవాడు తగిలినప్పుడు"

"నాకు ప్రొపొసె చేసిన ప్రతి ఎదవ నా ఫిగర్ ని చూసి, నా వెనకాల ఉన్న కాష్ ని చూసి ప్రొపొసె చేసిన వాళ్లే తప్పా నన్ను నన్నుగా చూసి ఎవడు ప్రొపొసె చేయలేదు. నన్నునన్నుగా యాక్సప్ట్ చేసే వాడు కావాలి నాకు.. నా ఫీలింగ్స్ నా క్యారెక్టర్ తెలిసి ఉండాలి."

ఆ ఒక్క క్షణం నాకు తెలీని ఎదో చిరాకు వచ్చింది, నాలో ఫ్రస్ట్రేషన్ కట్టలు తెంచుకుంది.
 
"నీ యమ్మ, మీ డబ్బులు ఉన్నోళ్ల గోల ఏందో నాకు ఎప్పటికీ అర్ధం కాదే. నీకు వచ్చిన సంబంధాల్లో కొంతమంది బాలీవుడ్ హీరోస్ లెక్క ఉన్నారు తెలుసా, అయినా నీ బాధ ఏంటో నాకు అర్ధం కాదు. నువ్వు ఏంటో నీకేం కావాలో కనీసం నీకు అయినా క్లారిటీ వుందా అసలు. నువ్వు నీ పేరెంట్స్ ని ఎంత టార్చర్ చేస్తున్నావో అర్ధం అవుతుందా. వాళ్ళు ఇంక మంచోళ్ళు కాబట్టి నువ్వు ఎం చెప్పిన ఇంకో మ్యాచ్ ఇంకో మ్యాచ్ అంటూ తెస్తూనే ఉన్నారు. 

నువ్వు నా పోసిషన్ లో ఉండాల్సింది తెలిసేది, చాలి చాలని జీతం ఇంటి నిండా అప్పులు అసలు పెళ్లే అవ్వుద్దో లేదో తెలీదు. రేపు ఏ అప్పలమ్మ వస్తే దాన్నే చేసుకోవాలి, ఎం చేస్తాం చేసుకున్నాక దాన్నే లవ్ చేయాలి. ఫీలింగ్స్, క్యారెక్టర్ తొక్క అంట. అర్రే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే కదా తెలిసేది" అని చాలా సీరియస్ అయిపోయాను. 

"స్వేత లైఫ్ లో అన్ని మనకు నచ్చినవే కావాలి మనకి నచ్చినట్లే కావాలి అంటే దొబ్బదు. అలా అని నిన్ను ఏమి నీకు ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకుని ఏడుస్తూ బతకమనట్లేదు. ముందు నీకేం కావాలో క్లారిటీ తెచ్చుకో, కావాలి అంటే కొద్దిగా టైం ఇవ్వమని ఇంట్లో చెప్పు. నువ్వు రెడీగా ఉన్నప్పుడు నీకు నచ్చిన వాడినే పెళ్లి చేస్కో. అంతే కానీ ఇలా పోస్టుపోన్ చేస్తూ వంకలు చెప్తూ నిన్ను నువ్వు మోసం చేసుకోవటమే కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా మోసం చేయకు" అన్నాను ఎదో కొద్దిగా బుజ్జగిస్తూ అర్ధం అయ్యేలా చెప్పటానికి ట్రై చేస్తూ.

అటు నుండి నిశబ్దం. నాకే చాలా జాలి వేసింది. భవ్య మీద కోపం అనవసరంగా ఇక్కడ చుపించానా అని బాధేసింది  "ఉన్నావా, ఓయ్ స్వేత, నేను నీకోసమే చెప్తున్నా. నువ్వు చేసేది కరెక్ట్ కాదు. I am sorry ఎదో కొద్దిగా.. " అని కంప్లీట్ చేయక ముందే.

"అవును అందరు నా మంచి కోసమే చెప్తారు, కానీ నన్ను ఎవరు అర్ధం చేసుకోరు" తన కంఠంలో ఏడుపు స్పష్టంగా వినిపిస్తుంది. ఎం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉన్నాను. తాను అలాగే ఏడుస్తుంది.

"ఏయ్ I  am sorry నిన్ను ఏడ్పించాలి హర్ట్ చేయాలి అని కాదు. నీకు ఉన్నది ఉన్నట్లు చెప్పాను. కొంచం కూల్ గా తీస్కో ఏదైనా ప్రెషర్ తిస్కోకు. కానీ నీ పేరెంట్స్ తో చాలా జెన్యూన్ గా ఉన్నది ఉన్నట్లుగా చెప్పు"

అటు వైపు నుండి సైలెన్స్, తన స్వరంలో ఏడుపు కూడా తగ్గింది. "ఇంక కాల్ చేయనులే  నీకు, సారీ సర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఈ టైములో " అంది ఉక్రోషంతో.

నాకు నవ్వు వచ్చింది తన చిన్న పిల్ల లాంటి మాటలు వింటే, తెలీకుండానే నవ్వేసాను.
"నీకు నవ్వు వస్తుంది కదురా నన్ను చూస్తుంటే.. నీకు నిజంగానే ఆ అప్పలమ్మే రావాలి అప్పుడు నిన్ను చూసి నేను కూడా నవ్వుతా బాగా"

"ఏయ్.. ఊరుకోవే బాబు శాపాలు పెడతావేంటే. సరే అవన్నీ తర్వాత నువ్వు కూల్ గా వుండు నాకు ఎప్పుడైనా కాల్ చేయి పరలేదు. పోనీ నేను ఏమైనా చెప్పగలను అంటే చెప్పమంటే నీ పేరెంట్స్ తో మాట్లాడటానికి కూడా ట్రై చేస్తా. Ofcourse మీ బాబుకి కాలి నువ్వు ఎవడ్రా నాకు చెప్పటానికి అని నన్ను తంతే మటుకు నీ మీదే కేసు పెడతా"

"సిగ్గు లేదు రా నీకు" అంటూ నవ్వేసింది, నాకు కూడా కొంచం రిలీఫ్ గా అనిపించింది తాను నవ్వేసరికి. "కొంచం సేపు ఏదోకటి మాట్లాడురా " అంది చాలా గోముగా. 

"ఎం మాట్లాడాలి"

"ఏదోకటి చెప్పు నీ కుళ్ళు జోకులు"

"ఓయ్.. నవ్వుకునేంత సేపు నవ్వుకుని ఇప్పుడు కుళ్ళు జోకులు అంటావా"

"హహ.. హ్మ్.. ఎలా రా అన్ని ప్రోబ్లెంస్ పెట్టుకుని ఎప్పుడు కూల్ గా ఉండటానికి ట్రై చేస్తావ్"

"ఏమో అలా కుదిరేస్తది నాకు" అలా ఎంత సేపు మాట్లాడుకున్నామో ఎం సొల్లు మాట్లాడుకున్నామో తెలీలేదు. అలా మాటల్లో ఉండగానే భవ్య నుండి కాల్ వస్తుంది. 

"ఏయ్ స్వేత కాల్ వస్తుందే" అనేలోగ భవ్య కాల్ కట్ అయిపొయింది. 

"ఎవర్రా"

"భవ్య"

"ఆంటీ ఆ" అప్పుడు అప్పుడు అలా మేము ఇద్దరమే ఉన్నప్పుడు భవ్యనీ ఆంటీ అంటూ ఉంటది సరదాగా. "ఇంతకీ ఎం అంది రేపు ఫార్మ్ కి వెళ్దాం అంటే"

"ఎం అనలేదు, కుదరక పోవచ్చు అంది. మరి ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తుందో మరి" 

"అది అలాగే అంటది ఫస్ట్. ఏదోకటి చెప్పు, మనది ఒక గోల దానిది ఒక గోల. మనకి బాగా దిష్టి కొట్టేసిందిరా" అంది నవ్వుతు "సరే నువ్వు మాట్లాడు నాకు నిద్రవస్తుంది.. బాయ్" అని కాల్ కట్ చేయబోయింది.

"ఏయ్ స్వేత" అన్నాను కాల్ కట్ చేసేలోపే, కానీ ఒక్క క్షణం నిశబ్దం.
 
"చెప్పు"

"ఎం లేదులే.. బాయ్"

"ఓయ్ ఏంటీ.. చెప్పు సరిగ్గా"

"నువ్వు ఓకే కదా. ఇందాక ఎదో కోపంలో అలా అనేసాను. మనసులో ఎం పెట్టుకోకు. ఎప్పుడు మనసు బాగోక పోయిన, ఏమైనా మాట్లాడాలి అన్నాకూడా కాల్ చేయి పరలేదు."

"హ్మ్.. అలా ఎం లేదు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎందుకో నీకే కాల్ చేయాలి అనిపిస్తది. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అనే ఫీలింగ్ కూడా రాదు నాకు. But it is not like I am taking you for granted కానీ ఏంటో తెలీదు"

"పరలేదు నాకు తెలుసు.  జాగ్రత్త" కొన్ని సెకన్ల పాటు నిశబ్దం. "ఓకే స్వేత.. బాయ్.. టేక్ కేర్"

"బాయ్ రా.. లవ్ యూ" అంది కాల్ కట్ చేస్తూ.

ఆ లవ్ యూ అనే మాట ఇంకొక అమ్మాయి అని ఉంటే నైట్ అంత నిద్ర కూడా ఉండేది కాదు. కానీ స్వేత అందరిలా కాదు బూతులు తిట్టేస్తది, అలాంటి మాటలు కూడా అనేస్తది ఎం ఆలోచించకుండా. అవన్నీ పటిచుకుంటే ఎప్పుడో పిచ్చోడిని అయిపోయే వాడిని, నేను కూడా ఒక నవ్వు నవ్వుకుని మంచి అమ్మాయి మంచి వాడు దొరికితే బాగుండు అనుకున్నాను. ఈలోగా భవ్య కాల్ గురించి గుర్తుకు వచ్చి రిటర్న్ కాల్ చేసా.
---
"రాహుల్"

"చెప్పు భవ్య" అన్నాను కొంచం అసహనంగా.

"ఎందుకు అంత చిరాకు. ఏమన్నాను అని"

"భవ్య నీకు నువ్వు ఎం చేసావో అన్నీ అర్ధం అవుతాయి, కానీ అది పక్కన వాళ్ళ తప్పులా చూపించాలి అని చూస్తావ్"

"సరే నువ్వు నేను చెప్పేది వినే మూడ్ లో లేవు లే.. బాయ్"

"మరి ఎందుకు కాల్ చేసావే.. నేను అడిగానా కాల్ చేయమని"

"ఎక్కువ మాట్లాడొద్దు చెప్తున్నా, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు"

"నీకేంటే రెస్పెక్ట్ ఇచ్చేది, ఇదేం ఆఫీస్ కాదు. ఎదో నీ మూడ్ బాగోట్లేదు సరదాగా బయటకి వెళ్తే అయినా మారతావు అని అది ఎదో ఆ పిచ్చిది ప్లాన్ చేసింది. నేను సరే అని కాల్ చేసా. ఎంత పొగరుగా కాల్ కట్ చేసావ్. నీకు ఇప్పుడు తెలీదులే మా వేల్యూ స్వేత పెళ్లి అయ్యి వెళ్లిపోయాక నేను కూడా రెసిగ్నషన్ చేసి పోతాను అప్పుడు తెలుస్తది"

"పో.. పోండి మిమ్మల్ని ఎవడు ఆపలేదుగా, ఎదో నీ కాళ్ళు పట్టుకుని ఆపినట్లు చెప్తున్నావ్. నువ్వు లేకుండా నాకు పని జరగదు అన్నట్లు చెప్తున్నావ్"

"ఇది నీ అసలు క్యారెక్టర్. జస్ట్ మా చేత పని చేయించుకోవడానికి, నువ్వు ఎంత percentage  అప్రైసల్ ఇచ్చిన మాట్లాకుండా చేయటానికి ఎదో మాతో ఫ్రెండ్లీగా ఆక్ట్ చేసావ్, అంతే తప్పా మమల్ని కనీసం తోటి కో వర్కర్స్ లాగా కూడా ఎప్పుడు చూడలేదు నువ్వు"

"పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నా క్యారెక్టర్ గురించి. ఎం తెలుసురా, నీకు ఎం తెలుసు. కోపంలో ఉన్నావు అని అర్ధం అవుతుంది, అలా అని ఏది పడితే అది వాగితే పళ్ళు రాలతాయి ఎం అనుకున్నావో" అని అరిచేస్తుంది కాల్లోనే. "సారీ చెప్దామ్ అని కాల్ చేసా కదా అది నా తప్పేలే. అరేయ్ నేను నా ప్రోబ్లెంస్ లో ఉన్నానే కానీ నేను ఎప్పుడు మీతో ఫ్రెండ్షిప్ ఆక్ట్ చేయలేదురా. అలా అనద్దు ప్లీజ్. సారీ ఇందాక చాలా రూడ్ గా కాల్ చేసాను. ఇది చెప్దామ్ అనే కాల్ చేసాను. నాకు బాగానే అయిందిలే.. ఉంటాను".

"ఏయ్ స్వేత.. అది కాదు" తెలీకుండానే స్వేత అని వచ్చేసింది. "అదే భవ్య.. అలా కాదు నేను ఎదో వేరే కోపంలో ఉండి పొరపాటున అలా అనేసాను" అన్నాను కొంచం శాంతించి.

"మనసులో ఉంటేనే వస్తాయి అలాంటివి పొరపాటున రావు, బాగానే పెంచుకున్నావ్ కదా నా పైన"

"ఏయ్ అలా అనద్దు స్వే.." స్వేత అనబోయి ఆగిపోయి సరిచేసుకుని "భవ్య" అన్నాను.

"ఏంట్రా స్వేత స్వేత అని కలవరిస్తున్నావు అంతలా గుర్తొస్తుందా, మరి దానికి పెళ్లి చూపులు అంట లేట్ అయ్యేలోపే ఏదోకటి చేయి" అంది ఆటపట్టిస్తూ నవ్వుతు. అలా భవ్య నన్ను ఆటపట్టిస్తూ మాట్లాడి చాలా నెలలు అయ్యింది. "ఓయ్ రేపు ఏ టైంకి స్టార్ట్ అవుదాం" అంది అంతలోనే.

"ఏంటి వెళ్దామా ఫార్మ్ హౌస్ కి" అన్నాను ఆశ్చర్యంగా

"హ్మ్"

"అంత నీ ఇష్టమే.. నేను రేపు బిజీ నాకు నా గర్ల్ ఫ్రెండ్తో ప్లన్స్ ఉన్నాయి. నాకు కుదరదు"

"నీకు అంత సీన్ లేదులే కానీ వెదవ బెట్టు చేయకుండా సరిగ్గా చెప్పు" అని అంది నవ్వుతు

"హహ.. ఇలా ఉండొచ్చు కదా భవ్య, ఒకప్పుడులా ఉండలేం ఏమో నాకు తెలీదు. కనీసం ఇలా ఫ్రెండ్ లా అయినా ఉండొచ్చు కదా"

కొన్ని క్షణాల నిశబ్దం
"ఇంతక ముందు ఫ్రెండ్స్ కి అంటే ఎక్కువ వున్నాం మనం అంటున్నావా"

"నీకు తెలుసు భవ్య ఇంతక ముందు మనం ఎలా ఉన్నామో, అది నా తప్పే అది చెడగొట్టింది నేనే. కానీ i missed you as a friend "

"ప్రపంచంలో అర్ధం కానిది ఆడోళ్లు కాదు రా, మీ మగ వెదవలు.చనువు ఇస్తే మంచం మీద పడేసి మీద ఎక్కేదం అని చూస్తారు లేకపోతే ఇలా సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి కాళ్ళ బేరానికి వస్తారు"

"ఏయ్ మరీ అలా పచ్చిగా మాట్లాడకు"

"నేను అన్నదాన్లో ఎం తప్పు లేదు, మన మధ్య ఎం అయిందో మనకి తెలుసు దాని దాచి మాట్లాడాల్సిన అవసరం ఎం లేదు"

ఎం మాట్లాకుండా సైలెంట్ గా ఉండి పోయాను. 
"రేపు మార్నింగ్ 8ki పిక్ చేసుకుంటాను, స్టార్ట్ అయినాక అక్కడ ఫార్మ్ హౌస్ వాచ్ మాన్ కి కాల్ చేద్దాం" అంది

"బైక్ మీద వెళ్దాం కదా, నీ కార్ ఎందుకు"

"ఎందుకు బ్రేక్స్ వేసి ఎంజాయ్ చేయటానికా" 

"ఏయ్ ఎలా మాట్లాడ్తున్నావో తెలుస్తుందా నీకు"

"ఏడ్చవ్, నాకు బ్యాగ్ ఉంటుంది నీ బ్యాగ్ ఉంటుంది.. బైక్ మీద కుదరదు. 8ki రెడీగా వుండు.. బాయ్"

"సరే.. బాయ్"

"ఓయ్"

"చెప్పు"

"అక్కడకి పిచ్చి పిచ్చి ఆలోచనలతో రాకు, అక్కడ ఇద్దరమే వున్నాం కదా అని ఏమైనా పిచ్చి వేషాలు వేసావో.. కట్ చేసేస్తా"

నాకు భవ్య అలా కొంటెగా స్వీట్ వార్నింగ్ ఇస్తుంటే షార్ట్ లో గురుడు డాన్స్ స్టార్ట్ చేసాడు.
"ఎం కట్ చేస్తావ్"

"కచ్చితంగా నువ్వు అనుకున్నదే"

"అవ్వా.. వద్దే బాబు నాకు ముందు ముందు చాలా పని ఉంది దానితో"

"హహ.. అందుకే జాగ్రత్తగా వుండు" అని నవ్వుతు కాల్ కట్ చేసింది.

అలా రెండు పిచ్చ విచిత్రం అయినా కాల్స్ తరువాత నాకు తెలియకుండానే అలసట వచ్చేసింది. రేపు అనే దాని గురించి ఆలోచించే ఓపిక కూడా లేకుండా పడుకుండి పోయాను.

Like Reply


Messages In This Thread
Office Romance - లేడీ బాసతో ప్రయాణం, ప్రేమాయణం - Part - 3 - by timepass4fun - 24-05-2023, 02:45 AM



Users browsing this thread: 1 Guest(s)