Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
వందన ఫోన్ తీసుకుని రాము దగ్గరకు వచ్చి, “సార్….ప్రసాద్ ఫోన్ చేస్తున్నాడు,” అంటూ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి, “చెప్పుప్రసాద్,” అన్నది.

ప్రసాద్ : వందనచెప్పేది వినుబాలా కుమార్ని హత్య చేసిన వాడిని పట్టుకున్నారువాడు సీరియల్ కిల్లర్ కాదుఒకవేళ రాము సార్ చెప్పినది కరెక్ట్ అయితే….ఆయనే తరువాత టార్గెట్…. విషయం ఆయనకు చెప్పకు
రాము : వందన స్పీకర్ ఆన్ చేసింది ప్రసాద్….(అంటూ నవ్వాడు.)
వందన : సీరియల్ కిల్లర్ ఇమాన్యుయేల్ ఫ్యామిలీకి చెందిన వాడు….వాడి నాలుగో టార్గెట్ రాము సార్….ఇవ్వాళే….
అలా మాట్లాడుతూ హాస్పిటల్ వైపు వస్తున్న ప్రసాద్కి హాస్పిటల్ వైపు ఒక బ్లాక్ స్కార్పియో వెళ్ళడం చూసి, “వందనవందనఒక్క నిముషం….” అంటూ స్కార్పియో వైపు చూస్తూ, “వందనఇంకో బ్యాడ్ న్యూస్హాస్పిటల్ రోడ్లో ఒక బ్లాక్ స్కార్పియో వస్తున్నదినేను దాన్ని ఫాలో చేసి నీకు చెబుతుంటానునువ్వు రాము సార్ పక్కనే ఉండుఓకె…” అంటూ కారుని స్కార్పియో వెనకాలే పోనిచ్చాడు.
హాస్పిటల్లో రాము బెడ్ మీద కూర్చుని, “వందనఇప్పుడు నువ్వే కేసు ఇన్చార్జ్వి….కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చెయ్యి….నాకు వాడు ప్రాణాలతో కావాలి….
వందన : అలాగే సార్….(అంటూ రూమ్ నుండి బయటకు వచ్చి తిన్నగా రిసెప్షన్లోకి వచ్చింది.)
వందన అలాగే కంగారుగా పరిగెత్తుకుంటూ చేతిలో గన్ పట్టుకుని రిసెప్షన్ దగ్గరకు వచ్చి గన్ పెట్టి, “ఇక్కడ మేనేజర్ ఎవరు,” అనడిగింది.
వందన చేతిలో గన్ చూసిన మేనేజర్ తన చైర్లో నుండి లేస్తూ, “ఏమయింది మేడమ్,” అంటూ భయపడ్డాడు.
దాంతో వందన తన గన్ తీసి పౌచ్లో పెట్టుకుంటూ, “రిలాక్స్సెక్యూరిటీ అధికారి ఎమర్జెన్సీ….రూమ్ నెంబర్ 716 పేషెంట్ని కిడ్నాప్ చేయడానికి ఎటెంప్ట్ జరగొచ్చు….ఎవరూ భయపడకండి….డాక్టర్స్, నర్స్లు ఎవరన్నా పేషెంట్ని అటెండ్ చేయాలంటే నేను చెప్పాకే చేయండి….అర్ధమయిందా…” అనడిగింది.
మేనేజర్ : అలాగే మేడమ్అర్ధమయింది….
వందన : సరెమెయిన్ గేట్, ఎగ్జిట్లో సెక్యూరిటీ ఎంత మంది ఉన్నారు….
మేనేజర్ : ఆరుగురు ఉన్నారు మేడమ్….
వందన : అందరినీ ఫ్లోర్కి రమ్మనండిఇద్దరు మెట్ల దగ్గరఇద్దరు లిఫ్ట్ లాబీ….ఇద్దరు 716 రూమ్ బయట ఉండమని చెప్పండిమా బ్యాకప్ టీమ్ వచ్చేదాకా జాగ్రత్తగా ఉండమని చెప్పండి
మేనేజర్ : అలాగే మేడమ్….
వందన : కిడ్నాపర్ ఆరడుగులు….26 ఏళ్ళు ఉంటాడు…(అంటూ నాలుగడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కు వచ్చి) ….ఇంకో ముఖ్యమైన విషయండాక్టర్స్, నర్స్, హాస్పిటల్ స్టాఫ్ అందరూ నార్మల్గా ఉండండిఎవరూ భయపడొద్దుఅంతా మేము చూసుకుంటాం…(అంటూ అక్కడ ఉన్న వాకీటాకీ తీసుకుని) గేట్ సెక్యూరిటీ నెంబర్ ఎంత
మేనేజర్ : సెవన్ మేడమ్….
వందన : సరెజాగ్రత్తగా ఉండండి…(అంటూ అక్కడ నుండి రాము రూమ్కి వచ్చింది.)
ప్రసాద్ వస్తున్న రోడు ట్రాఫిక్ జామ్ అవడంతో ఫోన్లో, “వందనఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందినేను వాడిని బైవాక్ ఫాలో చేస్తున్నా,” అన్నాడు.
రాము బెడ్ మీద కూర్చుని, “విష్ణుని హత్య చేసిన రోజే సృహతప్పి పడిపోయిన నన్ను చంపి ఉండొచ్చు….కాని ఎందుకని నన్ను చంపలేదు రోజు రోడ్ మీద పడిపోయాను….అయినా ఎందుకు వదిలేసాడు…” అంటూ ఆలోచిస్తున్నాడు.
వందన ఫోన్లో ప్రసాద్తో మాట్లాడుతూ అక్కడ కిటికీలో నుండి అంతా observe చేస్తున్నది.
ప్రసాద్ : వందన….స్కార్పియో హాస్పిటల్ వైపే వస్తున్నదిజాగ్రత్త….
వందన : సరె….(అని వాకీటాకీ తీసుకుని సెక్యూరిటీకి డయల్ చేసి) సెక్యూరిటీ బ్లాక్ స్కార్పియో వస్తున్నదిజాగ్రత్తగా ఉండుస్కార్పియో వస్తే నాకు చెప్పు….
రాము : ఇంతకు క్రిస్టఫర్ జుడియాక్ సైన్ ఏంటి….
వందన ఫోన్లో మాట్లాడుదున్నదల్లా వెనక్కు తిరిగి, “స్కార్పియో(తేలు)….చాలా విల్ పవర్ ఉంటుంది….(అంటూ కిటికీ లోనుండి బయటకు చూస్తూ) ఎన్ని అడ్డంకులు వచ్చినా పని పూర్తి చేస్తారుచాలా లోతైన మనుషులు
ఇంతలో హాస్పిటల్ ముందు స్కార్పియో వచ్చి ఆగడంతో సెక్యూరిటీ వాళ్ళు దాన్ని గమనించారు.
సెక్యూరిటీ : మేడమ్మీరు చెప్పిన స్కార్పియో వచ్చి హాస్పిటల్ ముందు ఆగిందిగేటు దగ్గర ఆగింది మేడమ్….
రాము : (రూమ్లో) వాడుమనం ఊహించినట్టు ఏం చేయడువాడు చాలా తెలివైన వాడు
వందన : (వాకీటాకీలో) సెక్యూరిటీఒకవేళ లోపలికి వస్తే ఎవరున్నారో చూడండిమీరు మాత్రం నార్మల్గా ఉండండి
రాము : (బెడ్ మీద పడుకుంటూ) ఇది అంత సింపుల్గా పూర్తి అయ్యేది కాదుఅరేయ్ క్రిస్టఫర్నీ ప్లాన్ ఏంటిరా
కాని ఇక్కడ హాస్పిటల్ బయట స్కార్పియోలో కూర్చున్న అతను గేర్ మార్చి హాస్పిటల్లోకి వెళ్ళకుండా పక్క రోడ్ లోకి స్ర్ర్టైట్గా పోనిచ్చాడు.
ప్రసాద్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరకు వచ్చి, “వందన…. స్కార్పియో హాస్పిటల్ లోకి వెళ్ళకుండా పక్క గొందిలో  నేరుగా వెళ్ళిపోతున్నది….” అన్నాడు.
వందన : ఏంటినువ్వు చెప్పేది….
ప్రసాద్ : నేను కిందనే ఉన్నాను….త్వరగా బయటకు రా….
దాంతో వందన పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కిందకు ప్రసాద్ ఉన్న చోటకు వచ్చింది.
అప్పటికే ప్రసాద్ బైక్ స్టార్ట్ చేసి వందన వైపు చూస్తూ, “తొందరగా రాఎక్కు,” అన్నాడు.
వందన బైక్ ఎక్కగానే ప్రసాద్ హాస్పిటల్ బయటకు వచ్చి స్కార్పియో వెళ్ళిన వైపు స్పీడ్గా పోనిచ్చాడు.
అలా కొద్దిదూరం వెళ్ళేసరికి వాళ్ళు ఫాలో చేయాల్సిన స్కార్పియో కనిపించింది.
దాంతో వాళ్ళీద్దరూ స్కార్పియోని ఫాలో చేస్తూ వెళ్ళారు.‍
ఇంతలో రేణుక ద్వారా రాము ప్రాణానికి థ్రెట్ ఉన్నదన్న విషయం తెలిసి అందరూ హాస్పిటల్కి వచ్చారు.
రాము వాళ్ళందరికీ ఏమీ కాదు అని నచ్చచెబుతున్నాడు.
శివరామ్ ఇలా కాదు అనుకుని హాస్పిటల్ నుండి బయటకు వచ్చి నేరుగా కమీషనర్ దగ్గరకు వెళ్ళి పరిస్థితి అడిగాడు.
శివరామ్ని తన ఆఫీస్లో చూడగానే హాస్పిటల్లో ఉండాల్సిన వాడు సూట్ వేసుకుని తన దగ్గరకు వచ్చాడేంది అని అనుకుంటూ కమీషనర్ అలాగే చూస్తున్నాడు.
కమీషనర్ చూపులో అర్ధం తెలుసుకున్న శివరామ్ ఆయనతో రాము, తను ఒకే పోలికలతో ఉంటామని చెప్పేసరికి అతనికి ఇంతకు ముందు చదివిన న్యూస్ గుర్తుకొచ్చింది.
దాంతో కమీషనర్ తను బ్యాక్అప్ టీమ్ని పంపించిన విషయంప్లాన్స్ మొత్తం శివరామ్కి చెప్పాడు.
దాంతో శివరామ్ హంతకుడు ఇవ్వాళ పట్టుబడే దాకా ఇక్కడే ఉంటాననే సరికి కమీషనర్ సరె అని చెప్పాడు.
ఇక్కడ స్కార్పియో కొద్దిదూరం వెళ్ళిన తరువాత నిర్మానుష్యమైన ప్లేస్ లోకి వెళ్ళి హెడ్లైట్లు ఆపేసి ప్రసాద్, వందన కోసం ఎదురుచూస్తున్నాడు.
స్కార్పియోను ఫాలో చేస్తూ వచ్చిన ప్రసాద్కి ఉన్నట్టుండి కనిపించకపోయే సరికి బైక్ ఆపి ఎటు వెళ్ళిందా అని చూస్తున్నాడు.
వాళ్ళు ఆగడం చూసిన స్కార్పియోలో కూర్చున్న అతను ఒక్కసారిగా హెడ్లైట్లు వేసి స్పీడుగా వాళ్ళ బైక్ని గుద్దేసాడు.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 15-05-2023, 10:52 PM



Users browsing this thread: 2 Guest(s)