11-05-2023, 10:22 PM
(This post was last modified: 11-05-2023, 10:23 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
8
సుభద్ర : అర్జున్.. నవ్యా.. ఏమైంది నాన్న.. అంటూ వెళ్లి ఇద్దరి తలలు పట్టుకుని తన నడుముకి అటుఇటు ఆనించి భయపడుతూ అడిగింది.
అర్జున్ : ఏం లేదు మా.. ఎందుకంత కంగారు
సుభద్ర : మరి.. ఎప్పుడు చిర్రుబుర్రులాడే మీరిద్దరూ అలా ముద్దులు పెట్టుకుంటుంటే ఏమైందోనని కంగారుపడ్డాను. ఇంతకీ ఏం జరిగింది.
నవ్య : అన్నయ్యకి నా మీద ప్రేమోచ్చిందే.. ఇద్దరం కలిసిపోయాం.. ఇక నువ్వు చీటికిమాటికీ మా మీద అరవనవసరం లేదు.
సుభద్ర : నా కొడుకు బంగారం అని నాకు తెలీదా ఏంటి.. అని కొడుకుని వాటేసుకుని ముద్దు పెట్టుకుంది.
అర్జున్ : నువ్వు మా అసలైన బంగారానివి.. అని తిరిగి ముద్దు పెడితే నవ్య కూడా తన అమ్మకి ఇటువైపున వచ్చి అవునంటూ అమ్మని వాటేసుకుని ముద్దు పెట్టింది.
సుభద్ర : నవ్యా.. అర్జున్.. ఏమైనా జరిగిందా
అర్జున్ : ఏంటి మా.. ఎందుకు అలా అడుగుతున్నావ్
సుభద్ర : మీరు కొత్తగా ఉన్నారు.. పెద్దైపోయినట్టు అనిపిస్తుంది.. ఎందుకో కొత్తగా కనిపిస్తున్నారు. ఎప్పుడు ఇలానే ఒకరికి ఒకరు తోడుగా ఉండండి.. ప్రేమగా ఉండండి.. అదొక్కటే నేను కోరుకునేది.
నవ్య : అలానే.. ముందు తిందువు దా అని లేచి కింద పడేసిన ప్లేట్ తీసుకుని లోపలికి వెళ్ళగా.. సుభద్ర కొడుకుని చూసి నవ్వింది.
రాత్రికి అన్నా చెల్లెళ్ళు ఇద్దరు మంచం ఎక్కారు.
నవ్య : అన్నయ్యా.. నాకు అర్ధం కానిది ఏంటంటే టైంలో వెనక్కి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను కాపాడుకున్నావ్, మరి అప్పుడు ఎవరు కాపాడారు నన్ను
అర్జున్ : ఏమోనే.. ఆ డౌట్ నాకు కూడా ఉంది.. ఆలోచిస్తుంటే బుర్ర హీట్ ఎక్కిపోతుంది.. పడుకో తరవాత ఆలోచిద్దాం.. ఎల్లుండి ఇంటికి వెళుతున్నాం అని అమ్మ చెప్పింది.
నవ్య : అవును అప్పుడే హాలిడేస్ అయిపోయాయి, కాలేజీ మొదలు
అర్జున్ : కాలేజీ అంటే గుర్తొచ్చింది.. నాకొక అమ్మాయి నచ్చింది.
నవ్య : ఓహ్.. కాలేజీలో ఇవి కూడా వెలగబెడుతున్నావా
అర్జున్ : మంచిది, బాగుంటుంది
నవ్య : ప్రొపోజ్ చేసావా
అర్జున్ : లేదు.. చేస్తాను
నవ్య : ఎవరు
అర్జున్ : పూజ
నవ్య : ఎవరా బక్కదా.. అదేం బాగుంటది రా
అర్జున్ : అవును అంత అందంగా ఉండదు, కానీ తన ఆలోచనలు, పనులు ఎవ్వరిని నొప్పించకుండా ఎవ్వరిని బాధ పెట్టకుండా నడుచుకుంటుంది.. చాలా మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి
నవ్య : నేనెప్పుడూ దానితో అంతసేపు మాట్లాడలేదు.. ఇంతకీ నువ్వు చెపితే ఒప్పుకుంటుందా
అర్జున్ : ఏమో తెలీదు
నవ్య : ప్రేమంటే ఏంటి.. ఎలా పుట్టింది నీకు తన మీదా..?
అర్జున్ : అవన్నీ నాకు తెలీదు, రికార్డు విషయంలో నాకు ఒకసారి హెల్ప్ చేసింది, అప్పుడు గమనించాను.. దారిన పోతూ ఎవరో కూరగాయలు అమ్మే ఒకామెకి అడక్కపోయినా సాయం చేసింది. అప్పుడు నాకు తను నచ్చింది అప్పటి నుంచి చూస్తున్నాను తను చేసే ప్రతి పని నాకు నచ్చేది, అవతలి వాళ్ళతో చాలా మర్యాదగా మాట్లాడుతుంది. నీకంటే నాకంటే మంచిది.
నవ్య : హ్మ్మ్.. చూద్దాం.. సరే గుడ్ నైట్.. ఆ వాచ్ తో జాగ్రత్త, కాల్క్యూలేషన్ మిస్ అయ్యిందంటే ఏమేమి ప్రాబ్లెమ్స్ వస్తాయో ఏమో
అర్జున్ : ఉమ్మ్.. ఉమ్.. గుర్తున్నాయి.. నీకు చెప్పకుండా వాడను సరేనా
నవ్య : గుడ్ నైట్
అర్జున్ : గుడ్ నైట్
మరుసటి రోజంతా నానమ్మ తాతయ్యలతో గడిపి ఆ తెల్లారి ఇంటికి వచ్చేసాం. సెలవలు అయిపోయాయి, ఇద్దరం కాలేజీకి రెడీ అయ్యి వెళ్ళాం. ఇద్దరం క్లాస్ లోకి వెళుతుంటే మా ముందే పూజ వెళుతుంది, నవ్య నన్ను చూసి నవ్వుతూ వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంది. రోజంతా తనతో మాట్లాడాలని ట్రై చేసాను కానీ కుదరలేదు.. బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాం.
నవ్య : నన్ను మాట్లాడమంటావా
అర్జున్ : వద్దే ప్లీజ్ అలాంటి ఆలోచనలు కూడా చెయ్యకు, నేనేదో ఒకటి చేస్తా అని ఇంటి గేట్ తీసాను.
నవ్య : సరే సరే.. నువ్వే చుస్కో.. అని తలుపు తీసి లోపలికి వెళ్ళిపోయింది
సుభద్ర : ఏంటి చూసుకునేది
నవ్య : నీ కొడుక్కి ఒక అమ్మాయి నచ్చిందే.. ప్రొపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు
అర్జున్ : నీయమ్మ
సుభద్ర : నేనిక్కడే ఉన్నారా
అర్జున్ : హీ.. అని నవ్వాను
సుభద్ర : ఎవరా అమ్మాయి
అర్జున్ : అది ఏది పడితే అది వాగిద్ది, అన్ని నమ్ముతావా.. అడ్డు తప్పుకో బైటికి వెళ్ళాలి
సుభద్ర : ఎక్కడికి..
అర్జున్ : పనుంది.. అని చెప్పి రెడీ అయ్యి డ్రెస్ మార్చుకుని ఇంటి నుంచి బైట పడ్డాను.. పెరట్లో గులాబి పువ్వు తెంపుతుంటే నవ్య చూసింది.
నవ్య : అల్ ద బెస్ట్
థాంక్ యు అని నవ్వుతూ పూజ వాళ్ల ఇంటికి బైలుదేరాను.