Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
7

ఇంటికెళ్లి ఏం మాట్లాడకుండా పడుకున్నాను, నా చెల్లి నవ్య నన్ను గమనిస్తూనే ఉంది చూస్తున్నాను, రాత్రి పడుకోబోయేముందు ఏదో అడగబోయింది మళ్ళీ ఏమనుకుందో ఏమో మెలకుండా అటు తిరిగి పడుకుంది, నేనూ కళ్ళు మూసుకుని పడుకున్నాను.

పొద్దున లేచేసరికి చెల్లి నన్నే చూస్తుంటే లేచి మొహం కడుక్కుని కిచెన్ లోకి వెళ్లి అమ్మని వాటేసుకున్నాను. అమ్మతో మాట్లాడుతుంటే వచ్చి మా ఇద్దరికీ ఎదురుగా నిలుచుని మా మాటలు వింటుంది. ఒకసారి దాన్ని చూసి అమ్మ చేతిలో ఉన్న దోశ ప్లేట్ తీసుకుని హాల్లో సోఫా మీద కూర్చుని టీవీ పెట్టాను. నవ్య కూడా ప్లేట్ తో వచ్చి నా పక్కన కూర్చుంది, నన్నే చూస్తుంది.

అర్జున్ : ఏంటే నీ బాధా.. రాత్రి నుంచి భయపెడుతున్నావ్

నవ్య : కదా.. నీకు తెలుస్తుంది కదా.. మరి ఏం చెప్పట్లేదు నువ్వు

అర్జున్ : ఏం చెప్పాలి

నవ్య : చెప్పడానికి ఏం లేదా.. సరే అయితే అని లేచింది

అర్జున్ : నవ్యా..

నవ్య : నాకు భయంగా ఉంది, ఆ వాచ్ నీ చేతికి ఉండటం నాకు నచ్చలేదు. నీకెదైనా జరిగితే మేము భరించలేము.. నీకెందుకు అర్ధంకావట్లేదు నా బాధ.

అర్జున్ : నేను ట్రై చేసాను.. అది రావట్లేదు. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు.. నిన్న నువ్వు కూడా లాగి చూసావ్.. వచ్చిందా

నవ్య : ఏమోరా.. ఏం జరిగినా నాకు చెప్పు, నాకు తెలుసు నువ్వు హ్యాండిల్ చేసుకోగలవని కానీ..

అర్జున్ : ఏం జరిగినా చెప్తాను, సరేనా.. ముందు తిను నీకొకటి చూపించాలి అనగానే నవ్య వేగంగా తింటుంటే నేనూ తినేసాను. ప్లేట్స్ సింక్ లో పడేసి వచ్చి కూర్చుంది.

వాచ్ తిప్పుతుంటే వంగి చూస్తుంది, తన చెయ్యి పట్టుకుని వాచ్ గురించి చెపుతూ మొదటి దాని మీద నొక్కాను.

నవ్య : ఏమైంది.. ఏం కాలేదుగా

అర్జున్ : ఎస్ ఎస్.. అనుకున్నాను

నవ్య : ఏమనుకున్నావ్

అర్జున్ : వాచ్ మీద నొక్కెటప్పుడు నీ చెయ్యి పట్టుకున్నాను, అనుకున్నట్టే ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటు టైం స్టాప్ లో ఉన్నావ్.

నవ్య : అంటే..

అర్జున్ : చూపిస్తా పదా అని చెల్లి చెయ్యి పట్టుకుని వంటింట్లోకి తీసుకెళ్ళాను. అమ్మ చెపాతీ తిప్పుతూ అలానే అయిపోయింది.. నవ్యా.. అటు చూడు

నవ్య : ఆ.. అమ్మ.. అందులో ఏముంది

అర్జున్ : అమ్మ కదలట్లేదు చూడు..

నవ్య తన అమ్మను చూస్తూ దెగ్గరికి వెళ్లి కదిలించి చూసింది ఆశ్చర్యంగా, చపాతీ ఎంత సేపు పెనం మీద ఉన్నా మాడట్లేదు.. వెంటనే లోపలికి వెళ్లి నాన్నని నానమ్మ వాళ్ళని చూసి నా దెగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది.

అర్జున్ : ఇప్పుడు నమ్ముతావా

నవ్య : ఏం వాచ్ రా అదీ..

అర్జున్ : ఇది వాచ్ కాదు, టైం స్టాప్పర్.. ఉండు మాములుగా చేస్తాను అని వాచ్ బటన్ మీద నొక్కాను.. టైం స్టాప్ ఆగిపోయింది. లోపల నుంచి అమ్మ అరుపు విని నవ్య నా వైపు నవ్వి లోపలికి వెళ్ళిపోయి కొంచెంసేపు ఆగి వచ్చింది.

నవ్య : ఇంకా ఏమేమి ఉన్నాయి దాంట్లో

అర్జున్ : రెండో ఆప్షన్ గురించి చెప్పాను, వాచ్ లో ఏమేమి చూసానో ఏమేమి తెలుసో అన్ని తనకి నేర్పించాను.

నవ్య : ఆ మూడోది ఏంటి మరి

అర్జున్ : ఏమోనే.. అదే అర్ధం కావట్లేదు, దాని మీద నొక్కితే అందులో మళ్ళీ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి.. అది ఏ లాంగ్వేజో కూడా అర్ధం కావట్లేదు. ఇదే మూడో ఆప్షన్

నవ్య నా చెయ్యి తీసుకుని మూడో ఆప్షన్ కి వెళ్లి రింగుని ఎడమ వైపుకి తిప్పి తిప్పి అటు ఇటు చూసి విసుగెత్తిపోయి చూసుకోకుండా ఒక్కసారిగా రింగు మీద నొక్కేసింది.. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. మేము ఎక్కడున్నామో కూడా మాకు తెలీదు.. మా ఎదురుగా ఆపరేషన్ జరుగుతుంది. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. చుట్టూ చూస్తే అర్ధమయ్యింది ఇది హాస్పిటల్ అని.

నవ్య : అన్నయ్యా అది అమ్మ అని ముందుకు వెళ్ళబోయింది.. వాళ్ళు చూస్తారేమో అని చెల్లిని ఆపేసాను. ఇద్దరం చూస్తున్నాం వాళ్ల మాటలు బట్టి తెలుస్తుంది కవలలు అని, అమ్మ స్పృహలో లేదు. ముందు ఆడ పిల్లని బైటికి తీశారు తను ఏడవట్లేదు ఇవన్నీ చూస్తుండగానే మాకు అర్ధమయ్యింది మేము ఏ కాలంలో ఉన్నామో వార్డ్ చివర గోడకున్న క్యాలెండర్ చూసాను తేదీ కనిపిస్తుంది అది మా పుట్టినరోజు.

నేను నా చెల్లి ఇద్దరం ఒకరి చేతిని ఒకరం పట్టుకుని నవ్వుకుంటూ చూస్తున్నాం. మా పుట్టుక మేమే చూస్తున్నాం. కొంచెంసేపటికి ఆడపిల్లని బైటికి తీశారు.. చెల్లి నా వంక చెప్పానా నేనే పెద్దదాన్ని అని నవ్వుతూ చూసింది. ఇంతలో అక్కడున్న డాక్టర్స్ కంగారుపడుతుంటే అటు చూసాం. పుట్టిన పిల్లలో చలనం లేదు డాక్టర్ నోట్లో నోరు పెట్టి ఊదుతూ గుండె మీద వేలితో నొక్కుతూ ప్రయత్నిస్తుంటే చెల్లి చెయ్యి గట్టిగా పట్టుకున్నాను.

నవ్య : నేను బతక్కపోతే ఇప్పుడు ఇలా నీతో ఎందుకు ఉంటానురా.. భయపడకు

ఎంతసేపు చూస్తున్నా ఆ పసిబిడ్డలో చలనం లేదు, ఇంతలో మానిటర్ వేగంగా మొగుతుంటే డాక్టర్ ఆ బిడ్డని వేరే నర్స్ కి ఇచ్చేసి ఇంకో బిడ్డని బైటికి తీసింది అది మగ బిడ్డ అంటే నేను.. డాక్టర్ పక్కనే ఉన్న ఆడబిడ్డని బాధగా చూస్తూ మగ బిడ్డను నర్స్ కి ఇచ్చి ఇంకో బిడ్డ చనిపోయిందని కన్ఫర్మ్ చేస్తుంటే నా వల్ల కాలేదు, చెల్లి వంక చూసాను అయోమయంగా చూస్తుంది.. వెంటనే చెల్లి చెయ్యి వదిలేసి ఒక్క ఉదుటున వెళ్లి నర్స్ చేతిలోనుంచి రక్తపు ముద్దలా ఉన్న నా చెల్లిని తీసుకుని తన గుండె మీద చెయ్యి వేశాను.

ఓ వైపు మగబిడ్డ ఏడుపు వినిపిస్తుంది.. అందరూ నన్ను చూసి అరుస్తున్నారు.. సెక్యూరిటీ సెక్యూరిటీ అని అరుస్తున్నా నాకవేమి వినిపించడంలేదు.. నా గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది, నా గుండె కొట్టుకుంటుంటే దానికి తగ్గట్టే బిడ్డ గుండె మీద బొటన వేలితో నొక్కుతూ నా గాలిని బిడ్డ నోట్లో వదిలాను ప్రశాంతంగా.. ప్రేమగా.. ఒక్కసారి చిన్న దగ్గు వినిపించింది.. తల ఎత్తి చూసాను ఆపకుండా ఏడుస్తుంది నా చెల్లి..

బిడ్డ ఏడుపు వినగానే అక్కడున్నవాళ్ళు అరవడం ఆపేసారు.. డాక్టర్ నా చేతుల్లోనుంచి బిడ్డని తీసుకుంది. ఇవ్వటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు.. వెంటనే పక్కనే నా ఎత్తు ఉన్న చెల్లిని చూడగానే అంతా గుర్తొచ్చి వెంటనే బిడ్డని డాక్టర్ కి ఇచ్చేసి చెల్లి దెగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టుకుని వాచ్ చూసాను. బటన్ నొక్కగానే ఒక్క క్షణంలో మళ్ళీ మా ఇంట్లో సోఫాలో ఉన్నాం.

చెల్లి వంక చూసాను, వెంటనే నన్ను వాటేసుకుని ఆపకుండా ముద్దులు పెడుతుంటే ఆపి తన మొహాన్ని చూసాను, ఇందాక నా చేతుల్లో ఉన్న పసిబిడ్డే కనిపించింది. నుదిటి మీద ముద్దు పెట్టి గట్టిగా వాటేసుకున్నాను. చెల్లి కూడా..

ఇంతలో ఏవో కింద పడ్డ శబ్దాలు, ఇద్దరం తల తిప్పి చూసాం.. అమ్మ మమ్మల్నే ఆశ్చర్యంగా చూస్తుంది. తన చేతిలో ఉన్న చపాతీల ప్లేట్ కింద పడింది.
Like Reply


Messages In This Thread
RE: కధా స్రవంతి ❤️ - by Takulsajal - 08-05-2023, 10:29 AM



Users browsing this thread: 26 Guest(s)