06-05-2023, 07:53 PM
TITLE
చెమటలతో తన వొళ్ళు తడిసిపోతుంది. గుటక వెయ్యడం కష్టమవుతుంది. ఎంతో టెన్షన్ గా ఉంది. ఇదివరకెప్పుడూ ఈ పనిని చెయ్యలేదు తను. చెమటలు తగ్గడానికి ఫ్యాన్ వేసుకుందామా అంటే, ఇప్పుడు ఆ ఫ్యాన్ కే ఉరి వేసుకోవాలి.
ఒక విధంగా తన జీవితం చేయి జారిపోయింది అనే చెప్పాలి. అందరూ తన మీద పెట్టుకున్న నమ్మకం కూలిపోయింది. చివరికి తను అనుకున్న జీవితం కూడా తనకి దూరం అవుతుంది. దేనికి దూరంగా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే నాన్న చూపించే జీవితానికి దూరంగా వెళ్ళాలి అని నిర్ణయించుకుంది.
ఇక ఉరి వేసుకోవడానికి సిద్దమైన తన ఫోన్ కి ఒక notification వచ్చింది. your application accepted for our university! kindly report within this month! ఈ మెసేజ్ చూడగానే అలా నించున్న తను మంచం మీద వాలింది. తన మైండ్ లో ఉన్న బరువు మొత్తం ఒక్కసారిగా మాయమయిపోయింది. నిజానికి ఇది జరగడం అసాధ్యం. ఊపిరి వదలాల్సిన సమయంలో వచ్చిన మెసేజ్ ఊపిరిని ఇచ్చింది.
4 months back:
అను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మంచి height లో, white గా, cute గా, half saree కట్టుకుంటే almost ఎవ్వడి గుండె అయినా ఆగిపోయేంత అందం తనది. తన అందం మొత్తం తన face లో ఉన్న ఇన్నోసెన్స్ లోనే దాగి ఉంది.
ఇలా తను అందంగా ఉంది అని తనకి కూడా తెలుసు. ఆ అందానికి respect ని తీసుకువచ్చింది తన చదువు. క్లాసుకి కాదు, మొత్తం కాలేజ్ లోనే బాగా చదివే పిల్ల అను. మొత్తం management కి కూడా ఈసారి స్టేట్ కొట్టేది అను నే అని గట్టి నమ్మకం. ఈ నమ్మకం అనుకి కూడా ఉంది. ప్రతి ఒక్కరికి తను చూస్తూ ఉండిపోవాలనిపించే డివైన్, హత్తుకుని ఉండిపోవాలనిపించే టెడ్డి బేర్.
అను వరకూ చాలా కాన్ఫిడెంట్. ఇంటర్మీడియట్ అయిన తరువాత గాల్లో ఎగిరే చదువు చదవాలని గోల్! aerospace engineering చదవాలనేది తన destination. 8 lakhs వరకూ అవుతుంది. నాన్నకి చదివించడం అసాధ్యం. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ గనుక వస్తే కాలేజ్ వాళ్ళే అనుకి ఫ్రీ గా సీట్ ఇప్పిస్తారు. అను చదువుకి అయ్యే ఖర్చు మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు. బాధ పడాల్సిన పనేం లేదు. అను ఎలాగో బాగానే చదువుతుంది. ఈ 3 నెలలు కొంచెం ఇంకా బాగా చదివితే ఆకాశం లోకి వెళ్ళడానికి టికెట్ దొరికేసినట్టే.
అను చదువు disturb అవ్వకుండా కాలేజ్ ఫాకల్టీ చాలా జాగ్రతలు తీసుకుంటారు. అబ్బాయిలు ఎవరూ ప్రేమ అని అను వెంట పడకుండా చూసుకుంటారు. అన్ని facilities కల్పిస్తారు. ఇంత comfort లో ఉంటే ఫస్ట్ ర్యాంక్ రావడం guarante!