Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Premakathalu
#2
దాంతో కీర్తి తిరిగి వెళ్లుతుంటే అప్పుడే తన ఎదురుగా ఒక అతని తరుముతు ఒక నాలుగు కార్ లు వస్తున్నాయి అది చూసి కీర్తి కీ అక్కడ ఏదో జరుగుతుంది అని అర్థం అయ్యింది వెంటనే తన ఫోన్ తీసి 911 కీ ఫోన్ చేసింది అప్పుడు ఆ కార్ నుంచి ఒక ఆరు అడుగుల యువకుడు దిగాడు మొహం లో చిరు నవ్వు ఉంది కానీ కళ్ల లో ఆవేశం కోపం తెలుస్తోంది వాడు వాడి సూట్ నీ సరి చేసుకొని ఆ కింద పడిన వాడి దగ్గరికి వచ్చి “ఏంటి జాన్ నా దెగ్గర 7 సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు నా గురించి తెలిసి కూడా ఇంత తప్పు ఎలా చేశావు నువ్వు డబ్బు కోసం సెక్యూరిటీ అధికారి లకి నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే పోనీలే అని వదిలే వాడిని కానీ నా శత్రువులతో కలిసి ననే చంపాలి అని చూశావు అది తప్పు ఈ
“వాలెంటినో” ఎవ్వరూ ఏమీ చేయలేరు వాడి పేరు వినగానే కీర్తి కీ వెన్ను లో వణుకు మొదలైంది కీర్తి సెక్యూరిటీ అధికారి లకి ఫోన్ చేయడం వల్ల అక్కడ జరిగేది కంట్రోల్ రూమ్ లో అందరూ వింటూ ఒక ఫోర్స్ నీ ఆ ఏరియా కీ పంపారు.

అప్పటికే వాలెంటినో జాన్ నీ ఒక పెద రాడ్ తో తల మీద కొట్టాడు ఆ తర్వాత వాలెంటినో గర్ల్ ఫ్రెండ్ మారియా కూడా కార్ నుంచి దిగుతు తన కత్తి తీసుకొని వచ్చి అది జాన్ గుండెల్లో గుచ్చి మెలిక తిప్పి చంపేసింది అది చూసి కీర్తి గట్టిగా అరిచింది దాంతో మారియా కీర్తి ఉన్న వైపుకు వెళుతూ ఉంది సెక్యూరిటీ అధికారి కార్ సౌండ్ వినీ వాలెంటినో తన గ్యాంగ్ తో వెళ్లిపోయాడు ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి లు కీర్తి నీ స్టేషన్ కీ తీసుకొని వెళ్లారు.
కీర్తి నీ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ తీసుకొని వెళ్లిన తర్వాత కూడా తను ఇంకా చాలా భయం తో ఉంది అప్పుడే అక్కడ ఒక ఇండియన్ ఆఫీసర్ వచ్చి కీర్తి పక్కన కూర్చుని ఓదారుస్తు ఉన్నాడు అప్పుడు కీర్తి కొంచెం రిలాక్స్ అయింది “హలో మిస్ నా పేరు రఘు ఇక్కడ చీఫ్ ఆఫీసర్ నీ ఇన్ని రోజులు మాకు వాలెంటినో కీ వ్యతిరేకంగా ఎన్నో ఇన్ఫర్మేషన్, ఆధారాలు ఉన్న మాకు అవి సరిపోలేదు ఇప్పుడు నువ్వు మాకు trump card లాగా దొరికావు నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే ఎంతో మంది అమాయకుల జీవితాలు అర్థంతరంగ ఆగిపోయాయి వాళ్ల చావుకు సమాదానం నీ ఒక సాక్ష్యం ఆలోచించు ” అని అన్నాడు, దానికి కీర్తి “చూడండి ఆఫీసర్ మీరు సాటి ఇండియన్ కాబట్టి కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయ్యా అంతే కానీ సాక్ష్యం చెప్పడానికి నేను రెడీ గా లేను నెలకు 500 మిలియన్ డాలర్ల షేర్ ఉన్న ఒక కంపెనీ కీ కాబోయే CEO నేను ఇప్పుడు ఇలాంటి విషయం లో నను లాగోదు ” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది, అప్పుడు కీర్తి లో ఉన్న పొగరు అనే లక్షణం కనిపించింది రఘు కీ ఈ పిల్ల కనుక మిస్ అయితే వాలెంటినో నీ ఎప్పటికీ పట్టుకోలేము అని రఘు ఒక తప్పు చేసి అయిన సరే ఈ పిల్లను దారి లోకి తెచ్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.
ఆ మరుసటి రోజు ఉదయం కీర్తి తన ఆఫీస్ కీ రెడీ అయ్యి బయలుదేరుతు ఉంటే సెక్యూరిటీ అధికారి లు ఇంటికి వచ్చి ఇళ్లు అంతా వెతికారు అప్పుడు కీర్తి బెడ్ రూమ్ లో, కిచెన్ లో డ్రగ్స్ దొరికాయి దాంతో తనని అరెస్ట్ చేసి బీచ్ కీ తీసుకొని వెళ్లి అక్కడ కార్ ఆపితే రఘు కార్ లోకి వచ్చి కూర్చున్నాడు “చూడు పాప నువ్వు కనుక వచ్చి సాక్ష్యం చెప్పలేదు అనుకో ఈ డ్రగ్స్ కేసులో నువ్వు జీవితాంతం జైలులో ఉంటావు నీ CEO పోస్ట్ కాదు కదా పాస్పోర్ట్ సీజ్ చేస్తారు అప్పుడు నువ్వు తిరిగి ఇండియా కీ పోలేవు” అని బెదిరించాడు దాంతో కీర్తి భయపడింది “నీ జాబ్ కీ ఎలాంటి రిస్క్ లేకుండా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిన్ను witness relocation program కింద కొన్ని రోజులు వేరే సిటీ కీ పంపించబోతున్నాం నువ్వు సాక్ష్యం చెప్పిన చెప్పక పోయిన వాలెంటినో నిన్ను వదలడు వాడు ఎంత పెద్ద సైకో అన్ని నువ్వు నీ కళ్ల తో చూశావు కాబట్టి మాతో ఉంటే నువ్వు కనీసం బ్రతికి ఉంటావు “అని చెప్పాడు.
[+] 3 users Like a60008515's post
Like Reply


Messages In This Thread
Premakathalu - by a60008515 - 21-04-2023, 07:49 PM
RE: Premakathalu - by a60008515 - 21-04-2023, 07:50 PM
RE: Premakathalu - by a60008515 - 21-04-2023, 07:51 PM
RE: Premakathalu - by a60008515 - 21-04-2023, 07:52 PM
RE: Premakathalu - by sri7869 - 21-04-2023, 08:50 PM
RE: Premakathalu - by unluckykrish - 22-04-2023, 04:32 AM
RE: Premakathalu - by ramd420 - 22-04-2023, 07:08 AM
RE: Premakathalu - by unluckykrish - 23-04-2023, 06:19 AM



Users browsing this thread: 1 Guest(s)