15-04-2023, 03:01 PM
కథ లోకి వెళ్తే శ్రీలీల ఒక అందమైన అమ్మాయి బాగా చదువుతుంది. MBBS చేసి డాక్టర్ అవ్వాలి అనేది తన కల. అందుకోసం చాలా కస్టపడి చదివి MBBS కాలేజీ లో సీట్ సాధించింది.
శ్రీలీల గురించి తెలుసుకుంటే తను చదవు బాగా చదివినప్పటికి తింగరిది. ఎవరు ఎం చెప్పిన నమ్మేస్తుంది. అలాగే అల్లరి కూడా ఎక్కువే.
ఇక కాలేజీ హాస్టల్ లో ఉందే అమ్మాయి లు అంటే చెప్పనవసరం లేదు.ఎలా ఉంటారో
ఇక తను కాలేజీ కి వెళ్లి చదవడం మొదలుపెట్టింది.
DAY 1
కాలేజీ లో రాగ్గింగ్ కూడా ఉంది. ఆలా ఒక రోజు సీనియర్స్ శ్రీలీల ఫ్రెండ్స్ ని అల్లరి చేస్తూ తన దగ్గరికి వస్తుంటే ఆ రాగ్గింగ్ చేసే వాడి వెనకాల ఒకడు వచ్చి వాడి చెవిలో ఎదో చెప్పాడు. ఇక అంతే వాళ్ళని వదిలేసి అందరు అక్కడ నుండి వెళ్లిపోయారు. ఎదో టైం బాగుంది తప్పించుకున్నాం అనుకుంటూ క్లాస్ కి వెళ్లిపోయారు అందరు.
సాయంత్రం కాలేజీ అయిపోయాక క్లాస్ నుండి బయటకి వచ్చి కాంటీన్ కి వెళ్తూ ఉంటే ఇంకో గ్యాంగ్ వాళ్ళని ఆపింది.ఆ గ్యాంగ్ వాళ్ళని పిలిచి రమ్మన్నారు . అప్పుడు ఉదయం రాగ్గింగ్ చేసే వాడి చెవిలో ఎదో చెప్పిన వాళ్ళని చూసాడు. వెంటనే ఆ గ్యాంగ్ ని పిలిచి "అరేయ్ వాళ్ళు సిద్దూ తాలూకా " అని అన్నాడు.అప్పుడే శ్రీలీల ఇంకా తన ఫ్రెండ్స్ ఆ పేరు ని మొదటిసారిగా విన్నారు. ఆ పేరు వినగానే పిలిచినవాళ్ళు సారీ చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు. శ్రీలీల కి ఏమి అర్థం కాలేదు. "ఎవరు ఈ సిద్దూ మిలో ఎవరికీ తెలుసు అతను " అని తన ఫ్రెండ్స్ ని అడిగింది.
తన ఫ్రెండ్స్ అందరు తెలీదు అని చెప్పారు. మరి అప్పుడు ఎవరు ఈ సిద్దూ అతని పేరు చెప్తే వీళ్ళు ఎందుకు వెళ్లిపోయారు. అసలు మనం ఎలా అతని తాలూకా అయ్యాం. అంటూ ఆలోచనలో పడింది. ఇక ఆలా కాలేజీ మొదటి రోజు గడిచింది
DAY 2
రెండొవ రోజు కాలేజీ కి వెళ్ళాకా ఎంట్రీ లోనే మరో గ్యాంగ్ వాళ్ళని పట్టుకుంది. వీళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు కావడం తో సీనియర్స్ కి తెలీకుండా ఫస్ట్ ఇయర్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు.ఇక అలాగే వీళ్ళని కూడా రాగ్గింగ్ లో భాగంగా అందరిని హాగ్ చేసుకుంటాం అని చెప్పారు. కానీ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకు వాళ్ళు సీరియస్ అయి "ఏంటే సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా ఎవరిని చూసుకొనే మీకు ఇంత పొగరు " అని అన్నాడు.
ఆలా మొఖం మీదకి వచ్చి అరిచే సరికి శ్రీలీల "సిద్దూ " అని అంది .
వాడికి పేరు వినగానే జల్లుమంది. " ఏంటి ఎం అన్నావ్ " అని తడబడుతూ మెల్లిగా అన్నాడు.
లీల " నాకు సిద్దూ తెలుసు " అంది.
సీనియర్స్ లో ఒకడు " అది ముందు చెప్పాలి కదా మేడం ఎందుకు ఊరికే గొడవలు తెస్తారు. " అంటూ మాట్లాడుతూ ఉంటే ఇంకొకడు కలగాచేసుకొని " క్లాస్ కి టైం అవుతుంది. వెళ్ళండి " అని వాళ్ళని పంపించారు.
క్లాస్ కి వచ్చాక తన ఫ్రెండ్స్ లీల ని " ఒసేయ్ నిన్న సిద్దూ ఎవరు అంటే తెలీదు అన్నావ్ ఇవ్వాళా ఏంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నావ్, నిజం చెప్పు ".
లీల " అబ్బా నాకు నిజంగానే తెలీదే నిన్న వాళ్ళు భయపడ్డారు కదా అని చెప్పను అంతే " అని సమాదానం ఇచ్చింది.
తన ఫ్రెండ్స్ లో ఒకరు " అసలు ఎవరే బాబు ఇంతలా ఫాలోయింగ్ ఉంది కాలేజీ లో "
ఇంకో ఫ్రెండ్ " ఫాలోయింగ్ ఏమో కానీ పేరు చెబితే భయపడుతున్నారు చూడు అబ్బా ఇలాంటి వాడు బాయ్ఫ్రెండ్ గా ఉంటేనా " అనుకుంటూ మాట్లాడుతున్నారు.
లీల కలగచేసుకొని " అబ్బా ఆపండే ".అంటూ కోపం గా క్లాస్ వింటుంది. ఆలా ఆ రోజు గడిచింది.
DAY 3
కాలేజీ కి వచ్చాక రాగ్గింగ్ ఇది లేకపోవడం వాళ్ళ క్లాస్ కి వెళ్లి కూర్చున్నారు . కానీ క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 20 నిముషాలు ఉంది. అందుకని తన ఫ్రెండ్స్ కాంటీన్ కి వెళ్లి ఏదైనా తిని వద్దాం అని అన్నారు. లీల వద్దు లే అంది. ఇక తన ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్లి తనకి ఏమైనా తీసుకువస్తాం అన్నారు. సరే అని లీల ఒక్కతే క్లాస్ లో కూర్చుంది.
తను క్లాస్ అంత చూస్తూ ఉండగా బయట నుండి ఎదో చప్పుడు వినపడింది. ఆ మాటల్లో సిద్దూ పేరు కూడా వినపడింది. వెంటనే పరుగేతుకెళ్లి కిటికీ లోంచి తొంగి చూస్తుంది. కానీ అక్కడ గుంపు ఉండడం వాళ్ళ సిద్దూ ఎవరో తెలీలేదు.
శ్రీలీల మైండ్ లో సిద్దూ అనే పేరు పాతూకుపోయింది. ఎవరయి ఉంటారా అని ఆలోచిస్తూనే ఉంది.ఇక తన ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా బయట సిద్దూ సిద్దూ అంటూ అరుపులు వినిపించాయి. తన ఫ్రెండ్స్ ఆ సిద్దూ ఏ నా అని చూసారు వాళ్ళకి కూడా గుంపులో కనపడలేదు. ఇక వాళ్ళకి సిద్దూ టాపిక్ ఎహ్ మొదలయింది. ఆలా వాళ్ళ మాటలు విని లీల ఆలోచనలో పడిపోయి సిద్దూ గురించే ఆలోచిస్తూ ఉంది.
ఆలా ఒక వారం గడిచింది.
ఆ తరువాత కాలేజీ లో వెల్కమ్ పార్టీ చేసారు. ఇక అందులో టీచర్స్ అందరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని. కాలేజీ కి సంబందించిన కొన్ని విషయాలను చెప్పి చివరగా కాలేజీ టాపర్ అయినా సిద్దార్థ్ ని స్టేజి మీదకి ఆహ్వానించాడు.ఆలా పిలవగానే అందరు సిద్దూ సిద్దూ అంటూ జై జై లు కొడుతూ కోరస్ ఇస్తున్నారు.
ఇక అప్పుడు శ్రీలీల ఇంకా తన ఫ్రెండ్స్ అందరు సిద్దార్థ్ ని చూసారు. అప్పటి వరకు సిద్దూ అంటే కాలేజీ ని కంట్రోల్ లో పెట్టుకున్న ఒక రౌడీ లాంటి వాడు అనుకున్న శ్రీలీల కాలేజీ టాపర్ అనగానే అహ్చర్య పోయింది. ఇక తన ఫ్రెండ్స్ అందరు " అబ్బా ఎం ఉన్నాడే..... నేను అయితే పక్క ప్రొపోజ్ చేస్తా " అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు.
ఆలా ఆ కష్ణం సిద్దూ ని చుసిన ఆనందం లో అందరు ఉన్నారు. స్టేజి మీద ఒక స్పీచ్ ఇచ్చి అందరికి వెల్కమ్ అని చెప్పి సిద్దూ వెళ్లి పోయాడు. ఆలా శ్రీలీల కి సిద్దూ దర్శనం అయింది.