Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(27-09-2020, 07:31 AM)prasthanam Wrote:
ఉపసంహారం

ఈ కధను ఒక సరసమైన కధగా రాద్దామని మొదలు పెట్టాను. కానీ అసలు చదువుతారా లేదా అన్న అనుమానం వచ్చి శృంగారం జత కలపాలని నిర్ణయించాను. అలాగే ఆదరణ ఉన్నా లేకపోయినా పూర్తిగా రాయాలన్నది ఇంకొక నిర్ణయం. ఈ విషయం నేను రాసిన ఉపోద్ఘాతంలో (చదవకపొతే ఒక సారి చదవండి) చెప్పాను, . మొత్తం ఈ కధకు మహా అయితే నలభై నుంచి యాభై గంటలు పెడితే చాలనుకున్నాను. కధ నిడివి పెంచడం, పాఠకుల ఆదరణ, రాసిన డ్రాఫ్ట్ లను ఒకటికి రెండు సార్లు తిరిగి రాయడం, తప్పొప్పులు సరిచేయడం అలా మొత్తం 150 గంటల పైనే సమయం పెట్టాను. నిజానికి అంత సమయం పెట్టవలసి వస్తుందనుకుంటే రాయటానికి కొంచెం ఆలోచించే వాడినే. ఎందుకంటే అంత సమయంలో దాదాపు యాభై పుస్తకాల పైనే చదవచ్చు. డెబ్భై సినిమాలు లేక కొన్ని వెబ్ సిరీస్ లు చూడొచ్చు, ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవచ్చు లేక ఒక కొత్త స్కిల్ (మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోడం లాంటింది)/ హాబీ ఏర్పరచుకోవచ్చు. Covid వలన ఇంటికే పరిమితమై పోవడంతో గత నాలుగు నెలల్లో దొరికిన అదనపు తీరిక సమయాన్ని (అంతకు ముందు వారాంతాల్లో) అధిక భాగం ఈ కధకు కేటాయించిన మాట వాస్తవం. అందువల్లనే చెప్పినట్టుగా పూర్తిచేయకలిగాను. మొదట్లో అంత సమయం పెడుతున్నందుకు చదువుతారా అన్న అనుమానం ఉండేది. కధ మొదలయిన దగ్గరనుంచి నేను ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో ఇంక సమయం వృధా చేస్తున్నానన్న ఆలోచన రానివ్వలేదు. అలాగే ఇంత ఆదరణ వస్తుందని కూడా అనుకోలేదు.

575 కామెంట్స్ తో టాప్ 40 కధల్లో, పేజీ వ్యూస్ పరంగా టాప్ 100 లో నిలబెట్టారు. మొత్తం 93 (పేర్లు దిగువన ఇచ్చాను) పాఠకులు 465  కామెంట్స్ పెట్టారు. కామెంట్స్, లైక్స్ పెట్టిన అందరికి ధన్యవాదములు.

chandra228 (33), paamu_buss(32), Eswar P(28), K.R.Kishore (18), Morty (18), readersp (18), Venrao (17), Okyes? (16), bobby (15), stories1968 (13), utkrusta (12), appalapradeep (12), twinciteeguy (10), Gopi299 (8), rameshapu7 (8), AB-the Unicorn (8), nagu65595 (7), Mahesh61823 (7), Mohana69 (6), ravi (6), vaddadi2007 (6), Gsyguwgjj (6), N.s.vasu (6), MINSK (6), nandurk (5), srinivasulu (5), km3006199 (5), will (5), ravali.rrr (4), Chytu14575 (4), Naga raj(4), sri74us (4), Gogi57(4), Romatic Raja (4), TheWhitewolf89 (4), Rajesh Nookudu (4), The Prince (3), Loveguru69(3), nobody2u(3), sunil(3), SamartKutty234(3), maheshtheja143143(3), DJDJDJ(3), Sunny26(2), nar0606(2), maskachaska2000(2), ravikr69(2), saleem8026(2), superifnu(2), Vikatakavi02 (2), Fufufu (2), irondick(2), Saikarthik(2), krantikumar(2), lovelyraj(2), సింధూ(2), Jola, kumar.prem31, Milffucker, siva_reddy32, Siva Narayana Vedanta, az496511, Nandha1985ap, Edokati, abhimanyu, siripurapu, Sunny8488, Hotyyhard, Rohan-Hyd, msrkalyan, ramd420, Chanduking, cherry8g, abhinav, Mahesh12345, Venky248, svsramu, madavatirasa, sravan35, Lalpulsar, SVK007, Pleasureboy, rohannronn4u;, vsn1995, Sunny73, Suryaprabhu, Mahidar *****, Vaman01, ram, Damn101, అన్నెపు, Hapl1992, Kumar678 

మీ ప్రోత్సాహమే నేను పెట్టిన సమయం వృధా కాలేదు అనిపించింది. అంతేకాదు భవిష్యత్తులో ఇంకో కధ రాయాలని కూడా అనిపించింది. మీ అందరికి మరొక్కసారి నా హృదయ పూర్వక ధన్యవాదములు.

కామెంట్స్, లైక్స్ ద్వారా వందమందికి పైనే అభిప్రాయం తెలిపారు. డెబ్బైఎనిమిది వేలకు పైగా వున్నపేజీ వ్యూస్ బట్టి అంతకు మించి చాలా మంది చదివారని స్పష్టం అవుతుంది. దాంతో కొంచెం పరిశీలన చేసాను. ఈ ఫోరమ్ లో 135140 (ఇప్పటి వరకు) సభ్యులు వున్నారు. దాదాపు 117500 సభ్యులు ఇంతవరకు ఒక్క కామెంట్ కూడా పెట్టలేదు. అంటే 87 శాతం. ఒక 12 శాతం ఇనాక్టివ్ అకౌంట్స్ అనుకున్నా 75 శాతం మంది పాఠకులు స్తబ్దుగా వున్నారు. నిశ్శబ్దంగా చదువుతున్న పాఠకులకు నాది ఒకే విన్నపం. మీరు చదవాలంటే రచయితలు రాయాలి. ఏమి  ఆశించకుండా రాస్తున్న రచయితలకు మీ కామెంట్స్ మాత్రమే ప్రతిఫలం. అన్నింటికీ కాకపోయినా మీకు నచ్చినవి ఒకటో రెండో ఉంటాయి. వాటికి పెట్టండి చాలు. అలాగే సద్విమర్శలు కూడా రచయితలకు ఉపయోగం. నా కధకు కూడా ఇద్దరూ మొదటి సారి కామెంట్ పెడుతున్నాము అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. దయచేసి ఒకసారి ఆలోచించండి.

ఇక కధకు వస్తే ముగింపు కొంత మందిని నిరాశపరచింది అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి నేను మొదట నుంచి అనుకొన్న ముగింపు అదే.  ఎవరు చేసే పనులు, నిర్ణయాల వల్ల వచ్చే పర్యవసానాలకు వారే భాద్యత వహించాలి అన్నదే కధ ముఖ్య ఉద్దేశ్యం. ఆ పరంగా కావ్య ఒకసారి తన ఆలోచన విధానాన్ని పునః పరిశీలన చేసుకున్నట్టు కూడా రాయడం జరిగింది. 

ఏమి జరగబోతుందో చూచాయగా చెప్పి, ఏమి జరిగింది అన్నది పాఠకులకు వదిలేయటం అన్నది పాత టెక్నిక్కే. అబద్దం చెప్పడం ద్వారా సమస్యకు గట్టెక్కడానికి కావ్యకు ఒక సులభ మార్గం ఉన్నా, ఆ దారిన వెళ్లే ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసాను. అలాగే రోజా అడిగిన దానిలో అసహజం లేనట్టు సౌమ్య పాత్ర ద్వారా చెప్పించడం ద్వారా కావ్య ఏమి చేయబోతుందో అన్నది పాఠకులకు చెప్పడం జరిగింది. అది ఏమిటో అన్నది పాఠకులకు ఊహకే వదిలేయడం ద్వారా వాళ్ళను ఒక పాజిటివ్ ఫీలింగ్ తో వదలవచ్చని అలా ముగించడం జరిగింది.

నా ఉద్దేశ్యంలో శృంగారం లేకుండా కేవలం ఒక రొమాంటిక్/సరసమైన కధలా రాసి ఉంటే ముగింపు అతికినట్టు ఉండేది. శృంగారం జత చేయడం వల్ల అది ఆశిస్తున్న కొంత మంది  పాఠకులకు నిరాశ కలిగించానేమో అన్నది నా అభిప్రాయం. నిరాశ కలిగించాలనన్నది నా ఉద్దేశ్యం కాదని పాఠకులకు తెలుసు. అయినా నిరాశ పరచిన వారందరికీ ఇంకొకసారి నా విచారాన్ని తెలియచేస్తున్నాను. వీలయితే శృంగారాన్ని తీసివేసి, అవసరమైన కొన్ని మార్పులు చేసి ఒక సరసమైన కధగా పూర్తి కథను ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఆఫీస్ పని వత్తిడి ఎక్కువగా వుంది, కాబట్టి కొంచెం సమయం పట్టవచ్చు.

ప్రతి ఎపిసోడ్ తర్వాత పాఠకుల అభిప్రాయం తెలుసుకోవడం, వాటికి స్పందించటం ఒక అలవాటుగా మారింది. నేను మిమ్మల్ని తప్పక మిస్ అవుతాను. చివరగా కొంతకాలం విరామం ఇద్దామనుకొంటున్నాను. ప్రస్తుతానికి శృంగారం లేకుండా థ్రిల్ మరియు రొమాన్స్ కూడిన ఇంకో కధకు ఆలోచన వుంది. కానీ పూర్తిగా విస్తరించాలి. మంచిగా ఉంటుంది అనిపించి, సగం వరకు రాయగలిగితే ఇంకో ఏడెనిమిది నెలల తరువాత మళ్ళా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రస్తుతానికి వీడ్కోలు చెబుతున్నా.
This is one of the best stories I've ever read. Writing style kani, soft romance, character values. Everything in this story is well written.
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by yvsbhavani - 10-04-2023, 02:01 AM



Users browsing this thread: 1 Guest(s)