01-04-2023, 11:58 AM
![[Image: IMG-20230401-112544.jpg]](https://i.ibb.co/FBf8x5q/IMG-20230401-112544.jpg)
చాలా మంది తమ అసలు వయసు కన్నా తక్కువ వయసు గా చెబుతుంటారు తమ కింకా వయసు మీద పడ లేదని వృద్ధాప్యం రాలేదని అందరూ భావించాలని అలా తక్కువ వయస్సు చెబుతుంటారు. అయితే.. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి భావన శృంగారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శృంగారాన్ని ఆస్వాదించాలంటే.. యువకులు గానే ఉండాల్సిన పని లేదు. శృంగారంపై ఆసక్తి ఉంటే చాలు.. వయసు మళ్లింది ,ముసలివాళ్లం అయిపోయాం అనే భావన లేకుండా ఉంటే చాలట అలాంటి వాళ్లు శృంగారాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు అని నిపుణులు తెలియచేస్తున్నారు…. ఇంకా చెప్పాలంటే అసలు శృంగారానికి వయసుతో సంబంధం ఉందా.. అంటే.. ఉందని నిపుణులు అంటున్న మాట. వాటర్ లూ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ మధ్య 40-60 ఏళ్ల వయసు వారిలో శృంగార ధోరణులపై ఓ అధ్యయనం చేసి మరీ దీన్ని కనుగొన్నారు. అసలు వయసు తో పోలిస్తే.. తక్కువ వయసులో ఉన్నామని మానసికంగా భావించేవారు శృంగారాన్ని చాలా బాగా ఆస్వాదిస్తున్న ట్లు తెలియచేసారు ….అంటే ఇలాంటి వాళ్లు ఎక్కువ సార్లు శృంగారం చేస్తున్నారని కాదు.. శృంగారానుభూతి విషయంలో చాలా ఆనందాన్ని పొందుతున్నారని అర్ధం చేసుకోవాలి వయసుతోపాటు వచ్చే దీర్ఘకాల సమస్యలు ఉన్నవారిని పరిగణలోకి తీసుకొని చూసినా కూడా తక్కువ వయసులో ఉన్నామని అనుకునేవారు.. శృంగారాన్ని చాలా బాగా ఆస్వాదించడం విశేషం…. వయసు తక్కువని భావించేవారు సహజంగా చాలా చురుగ్గా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి కూడా వీరే ఎక్కువగా చేస్తుంటారు. ఇవన్నీ బలమైన లైంగిక వాంఛలు కలగడానికి, శృంగారాన్ని ఆనంద సాధనంగా భావించడానికి కారణం అవుతుందని నిపుణులు తెలియచేస్తున్నారు.