23-03-2023, 05:20 PM
తన ఎదురుగా కూర్చుని తన వైపే దిగులుగా చూస్తున్న మొగుడి దగ్గరికి వెళ్ళి పట్టుకుని అడిగింది.
"ఏమైంది చెప్పండి"
"మోసపోయాం సుజాతా"
"మోసమేంటి. అసలు విషయం చెప్పండి నాకు"
"మనం కొన్న యూనిట్ మీద అప్పు ఉందిట. ఆ అప్పు తీర్చకుండా అది మన సొంతం కాదుట"
"అప్పుందా. అప్పుంటే మనకి ఎలా అమ్మారు"
"అప్పుందని మనకి తెలీదు, పక్క యూనిట్ల వాళ్ళకి తెలీదుట"
"అప్పుందని ఎవరికీ తెలీదా"
"బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పు కాదుట. ఇది ప్రైవేట్ బాకీట"
"అంటే"
"అప్పు తీర్చకుండా మనం సొంతం చేసుకుంటే మనల్ని ఏమైనా చేసేలాంటి వాళ్ళు"
"ఇంకా ఎంత ఇస్తే మనదౌతుంది"
"ఇంకో ఇరవై లక్షలు"
"ఇరవై లక్షలా, మన దగ్గర లేవు కదా. బిజినెస్ వద్దూ ఎమీ వద్దూ, చేసుకున్న అగ్రిమెంట్ చింపేసి, మనం ఇచ్చిన అడ్వాన్స్ తీసేసుకుందాం"
"ఆ డబ్బులు యూనిట్ ఓనర్ వేరే అప్పులుంటే తీర్చేసాడట. ఇరవై లక్షలిస్తే యూనిట్ మన పేర రాసి డాక్యుమెంట్స్ ఇస్తానన్నాడు"
"మన డబ్బులతో తన అప్పులు ఎలా తీర్చుకున్నాడు. మనం వెనక్కి డబ్బులు అడిగితే అప్పుడి వెనక్కి ఇవ్వాలి కదా"
"మనం తీసుకుంటాం అని అంత గట్టిగా అన్నాం కదా"
"అయితే మనం ఇప్పుడేం చెయ్యాలి"
"మిగిలిన డబ్బులు ఇస్తే యూనిట్ మనదౌతుంది, లేదా డబ్బులు వదులుకోవాలి"
"మిగిలిన డబ్బులు అప్పుడే వద్దు, జరిగే బిజినెస్ నించి ఇవ్వమని చెప్పాడు అన్నారు కదా మీరు"
"మనతో ఈ మాట అన్నాడు, కానీ అప్పటికే హక్కులు వేరే వాళ్ల దగ్గర ఉన్నాయిట. వాళ్ళు మొత్తం ఇచ్చేదాకా పని మొదలుపెట్టేది లేదు అన్నారు"
"అలా ఎలా. పని మొదలుపెట్టి, ఆర్డర్స్ వస్తూ ఉంటే, సప్లై చేస్తూ ఉండి, ఆ డబ్బుల నించి అప్పు తీర్చేస్తాం, రెండేళ్ళలో తీరుస్తాం కదా"
"ఓనర్ అలానే అన్నాడు. కానీ హక్కులు ఉన్న వాళ్ళు అలా అనట్లేదు, దానికి ఒప్పుకోలేదు. ఇరవై లక్షలు ఒకేసారి ఇమ్మంటున్నారు. మొత్తం ఇస్తేనే తెరిచేది అన్నారు"
"యూనిట్ మూసేస్తే వాళ్లకీ నష్టమే కదా"
"వాళ్ళు వేరేవాళ్లకి అమ్ముకుంటారు, వాళ్లకి నష్టం లేదు"
"వేరేవాళ్లకి ఎలా అమ్ముతారు, మనం అడ్వాన్స్ ఇచ్చి, అగ్రిమెంట్ చేసుకున్నాం కదా"
"మనం అగ్రిమెంట్ చేసుకున్నది యూనిట్ ఓనర్తో, కానీ హక్కులు వీళ్ళ దగ్గరే ఉన్నాయి"
"అలా ఎలా చేస్తారు"
"మనం ముప్పై లక్షలు ఒకేసారి ఇచ్చుంటే మనకే ఇచ్చుండేవాడుట. మనం పదిహేను లక్షలు ఇచ్చే లోపు ఓనర్ తను అప్పున్న వాళ్ళకి హక్కులు ఇచ్చేసాడట. వాళ్ళు ఓనర్ లాగా రెండేళ్ళ గడువు ఇవ్వకుండా డబ్బులు ఒకేసారి ఇవ్వమంటున్నారు"
"మన దగ్గర లేవు, మనం ఇవ్వలేము, ఇప్పుడేంటి"
"వాళ్ళు వేరే బేరం వస్తే అమ్ముకుంటారు"
"మరి మన డబ్బులు"
"ఆ ఓనర్ ఎప్పుడిస్తాడో తెలీదు, అసలు ఇస్తాడో లేదో కూడా తెలీదు"
"అయితే ఎవరైనా లాయర్ని కలుద్దాం"
"నిన్న కలిసాం"
"ఏమన్నారు"
"ఇవన్నీ మామూలని, ఇలాంటివి కోర్టు దాకా వెళ్లకుండా చూసుకోవాలని, ముందే విచారించుకుని అడ్వాన్స్ ఇవ్వాల్సిందని, డబ్బులుంటే మిగతావి ఇచ్చేసి యూనిట్ సొంతం చేసుకోమని, లేదా బతిమిలాడి ఎంతో కొంత వెనక్కి తీసుకోమని అన్నారు"
"అయితే బతిమిలాడి వెనక్కి తీసుకుందాం, కొంత పోతే పోయింది"
"అతనికి చాలా అప్పులు ఉన్నాయిట. వడ్దీలు కట్టలేకే, అప్పులన్నీ తీర్చడానికి నలభై లక్షల యూనిట్ ముప్పై లక్షలకి అమ్ముతున్నాడుట"
"శీనూ ఎక్కడ"
"లాయర్ మనల్నే తేల్చుకోమన్న తర్వాత వాడు ఎటో వెళ్ళాడు. వాడికి కూడా ఏం చెయ్యాలో తెలియలేదు"
మొగుడు చెప్తున్న ఒక్కొక్క మాటా వింటున్న సుజాతకి తల పగిలిపోతుందన్నట్టుగా అనిపించసాగింది.
"మనం మోసపోయాం సుజాతా, ఇరుక్కుపోయాం"
ఆ మాటతో ఒక్కసారిగా "ఇవన్నీ తెలీదా మీకు, ఏమీ కనుక్కోకుండా ఇంత పెద్ద పని చేస్తారా. అయినా మనకెందుకు ఇంత పెద్దవి, మన స్థాయికి తగ్గవి చూసుకోవాలి. నేను వచ్చుంటే ఇలా జరిగేది కాదు, అగ్రిమెంట్ మొత్తం చదివి డబ్బులు ఇచ్చుండేదాన్ని" అంటూ మొదటిసారిగా పట్టలేని కోపంతో అరిచింది సుజాత.
సుజాత ఏ మాట అనకుండా ఉంటే చాలు అనుకుంటూ ఉండేవాడో, ఆ మాట అనేసరికి, ఎన్నో ఏళ్ళుగా తనని చేసుకున్నందుకు సుజాతకి బాధగా ఉండి ఉంటుంది అన్న ఆలోచన నిజమైనట్టుగా, తన స్ధాయి ఇది అని సుజాత అన్నట్టు అనిపించి, ఒక్కసారిగా ఏడ్చేసాడు మురళి.
విషయం అర్ధమైంది సుజాతకి.
వెంటనే మురళిని హత్తుకుని... "ఏదో పరిష్కారం ఉంటుంది దీనికి, అదేంటో ఆలోచిద్దాం. ఈ జన్మకి ఒకరికొకరం మనం. ఏదున్నా, లేకపోయినా ఇద్దరికీ. సుఖమైనా, కష్టమైనా, ఇద్దరిదీ" అని చెప్పింది.
అలానే కాసేపు ఉండిపోయారు ఇద్దరూ.