17-03-2023, 10:36 PM
స్వప్న : మౌనికా..
రాజీ : ఇది కూడా మారిపోయింది, ఆస్తి డబ్బులు వచ్చాక ఆ మాధవ్.. వాడిలాగే తయారయ్యింది.. దీని పని అయిపోయింది ఇంక చందు గాడి అవసరం ఏముంది అందుకే గెంటేసింది.
మౌనిక : నేనేమి వాడిని గెంటెయ్యలేదు.. అరిచింది గట్టిగా
స్వప్న : మరి ఎందుకు వెళ్ళిపోయాడు వాడు
రాజీ : నన్ను అడుగు నేను చెప్తా.. ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా వాడితో సరిగ్గా ఉండలేదు, ఎప్పుడైనా వాడితో మాట్లాడటం చూసావా.. వాడు మాట్లాడినా మౌనంగా ఉంటుంది తప్ప నోరెత్తిన పాపాన పోలేదు.. మనిషి అనేవాడు ఎవడైనా ఎందుకు ఉంటాడు అందులో చందు గాడు.. ఇంకెందుకు ఉంటాడు.. వెళ్ళిపోయాడు అని కోపంగా ప్లేట్ పక్కకి నెట్టేసి లేచి వెళ్ళిపోయింది.
స్వప్న : నువ్వు చేసింది ఏం బాగోలేదు మౌనికా అని తను కూడా వెళ్ళిపోయింది.
మౌనిక మాత్రం మౌనంగానే తన అన్నం తను తినేసి ఒక్కటే చందు రూంలోకి వెళ్లి డోర్ గడి పెట్టేసి మంచం మీద పడుకుంది. ఏదేదో ఆలోచిస్తుంటే చందు వాడేసిన టవల్ గోడకి వేలాడుతూ గాలికి ఎగురుతుంటే లేచి టవల్ అందుకుని మొహం తుడుచుకుంటూ కళ్ళు మూసుకుని టవల్ వాసన పీలుస్తూ తన ఒంటి మీద కప్పుకుని చందుని ఊహించుకుంటూ టవల్ తన కళ్ళు మీద కప్పుకుని పడుకుంది. తన ఏడుపు, ఆ కన్నీళ్లు టవల్ పీల్చుతుంది.
పక్క రూంలో రాజీ కోపంగా వెళ్లి వెంటనే చందుకి ఫోన్ చేసింది.
చందు : వదినా చెప్పు
రాజీ : నీకు అది లేకపోతే అనాధ లాగా వెళ్లి ఎక్కడో ఉంటావా, నేను నీకేం కానా.. నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపు నువ్వు ఇంటికి రావాలి, ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే నేను కూడా నీతో వస్తాను మనం ఇద్దరం వేరే ఉందాం.
చందు : వదినా వదినా.. అన్నిటికి ఆవేశమే నీకు.. ముందు నేను చెప్పేది విను
రాజి : చెప్పు.. ఏం చెప్తావ్
చందు : మీరు ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసే ఉంటున్నారు, ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎక్సట్రా లగ్గేజ్
రాజి : అంటే..
చందు : ముందు విను.. వదిన నేను ఒక రూంలో పడుకుంటున్నాం, పాపం తనకి ఎందుకు ఇబ్బంది చెప్పు.. ఇప్పుడు నేను లేకపోయినా మీరు ఉన్నారు కదా, నాకిక్కడ ఏ ఇబ్బంది లేదు సతీష్ గాడు కూడా నా కుటుంబమే.. గుణ అని నా ఫ్రెండ్.. తన రూంలోనే ఉంటున్నాను.. నాకు ఏ ఇబ్బంది వచ్చినా ముందు నీకే ఫోన్ చేస్తాను సరేనా
రాజీ : నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను
చందు : ప్లీజ్.. నన్ను కన్విన్స్ చెయ్యకు.. ప్లీజ్ రాజీ
రాజీ : నాకు రోజూ ఫోన్ చెయ్యాలి, రోజూ చాట్ చెయ్యాలి.. రెండు రోజులకి ఒకసారి కలుస్తానని మాటివ్వు.. ఏడ్చేసింది
చందు : రోజూ రాత్రి కాల్ చేస్తాను, చాట్ చేస్తాను.. సరేనా అప్పుడప్పుడు కలుద్దాం
రాజీ : అకౌంట్లో మనీ వేస్తున్నా
చందు : వద్దు.. ప్లీజ్.. నాకు అలాంటివి నచ్చవు.. నీకు తెలుసు
రాజీ : ఎహె పో.. అని ఫోన్ పక్కన పెట్టేసి ఏడుస్తూ పడుకుంది.
చందు ఫోన్ పక్కన పడేసి మంచం ఎక్కి పడుకున్నాడు, గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్న గుణ చందుని చూసి ఫోన్ పక్కన పెట్టాడు.
గుణ : ఏంట్రా ఎలా ఉంది అంతా ఓకే నా
చందు : సూపర్ మామా
గుణ : ఓనర్ టూర్ కి వెళ్ళాడు రావడానికి ఒక పది పదిహేను రోజులు పట్టొచ్చు, అప్పటివరకు నీ ఇష్టం.. వాడు వచ్చాక మాత్రం ఎప్పుడొచ్చావ్ అని అడిగినా ఇవ్వాళే వచ్చానని గట్టిగా మాట్లాడు మిగతాది నేను చూసుకుంటాను. కొంచెం అడ్వాన్స్ వాడి మోహన కొడితే చాలు వాడే ఊరుకుంటాడు. చందు ఓకే.. అని ఒళ్ళు విరిచి ఆవులిస్తూ పడుకున్నాడు. పొద్దునే లేవకముందే స్వప్న నుంచి ఫోన్
చందు : హలో
స్వప్న : నేను నీతో మాట్లాడను.. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నేనంటే లెక్క లేదు, నేనంటే ప్రే...
చందు : అలా మాట్లాడకు.. నేను బాధపడతా
స్వప్న : మరి నువ్వు చేసిందేంటి
చందు : ఊరుకో వదినా.. ఏమి కాలేదు కానీ ఆమ్మో మర్చిపోయా నేను వెళ్ళాలి మళ్ళీ చేస్తా మళ్ళీ మాట్లాడుకుందాం అని పెట్టేసి లేచాడు. స్వప్న కూడా అలక మొహం వేసుకుని ఆఫీస్ కి వెళ్ళిపోయింది. ముగ్గురి స్నేహితురాళ్ళ మధ్య కొన్ని రోజుల దూరం ఏర్పడింది.
మూడు నెలలు గడిచాయి చందు అన్ని మాటలు చెప్పినా ఎందుకో మళ్ళీ మౌనిక ఇంటికి వెళ్లలేకపోయాడు, తన జీవితం తను చూసుకోగలదు వేరే పెళ్లి చేసుకుని తను హ్యాపీగా ఉంటే అదే చాలు, తన వల్ల ఇబ్బంది కలగకుండా తన వల్ల గతం గుర్తుకురాకుండా ఉండటానికి సాధ్యమైనంతవరకు దూరంగానే ఉండేవాడు. రాజీ మరియు స్వప్న అప్పుడప్పుడు చందుని బైట కలుస్తున్నా మౌనిక మాత్రం కలవలేదు, మౌనిక మళ్ళీ బాగైపోయింది. ముగ్గురు లైఫ్ ని ఎంజాయి చేస్తున్నారు, ఒక్క చందు విషయంలోనే ఇద్దరు మౌనిక మీద కోపం తెచ్చుకునేవారు కానీ తనని బాధ పెట్టడం ఇష్టంలేక వదిలేసేవారు. చందు వద్దన్నా రాజీ మరియు స్వప్న డబ్బు పంపుతునే ఉండేవారు. మౌనిక మాత్రం రోజూ రాత్రి బైటికి వెళ్ళేది.
ఒకరోజు ముగ్గురు స్నేహితురాళ్లు హోటల్ కి వెళ్లారు, పాపం చందు టైం అస్సలు బాగ లేదు, వడ్డించడానికి వెయిటర్ గా వాడే వచ్చాడు. ముందు రాజీ మరియు స్వప్న చూడలేదు. చందు కూడా వాళ్ళు చూడట్లేదులే అని సైలెంట్ గా వడ్డిస్తున్నాడు.. రాజీ అన్నం కలుపుతూ నాకు లెగ్ పీస్ వెయ్యి అని తల ఎత్తి చందుని చూసింది అంతే తన కోపం నషాలానికి అంటినట్టుంది.. కోపంగా లేచి అన్నం తినే చేత్తో చందు చెంప వాచీపోయేలా కొట్టింది.
చందు : ఇస్.. అబ్బా.. వో..
రాజీ టిష్యూ తీసుకుని చెయ్యి తుడుచుకుంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయింది.. స్వప్న కూడా కోపంగా చందు కాలర్ పట్టుకుని దెగ్గరికి లాక్కుని ఛీ అంటూ వెనక్కి నెట్టేసి అక్కడినుంచి వెళ్ళిపోయింది. మౌనిక లేచి బిల్ కట్టి తను కూడా వెళ్ళిపోయింది.
ఇంటికి వచ్చాక రాజీ గొడవ గొడవ చేసింది, స్వప్న ఏం మాట్లాడలేదు. మౌనిక మాత్రం స్కూటీ కీస్ అందుకుని బైటికి వెళ్ళిపోయింది. స్వప్న రాజీ ఇద్దరు అది చూసారు.
రాజీ : ఏయి స్వప్న బండి తీవే.. ఇవ్వాళ దీని సంగతేంటో తెల్చుదాం అని బైటికి వచ్చింది, స్వప్న కూడా బండి తీసి రాజినీ ఎక్కించుకుని మౌనికని ఫాలో అయ్యింది. దారిలో చందు ఫోన్ చేశాడు. ఎత్తింది
రాజీ : ఏంటి
చందు : పని చెయ్యడం కూడా తప్పేనా
రాజీ : పని చెయ్యడం తప్పు కాదు, మేము డబ్బు పంపిస్తున్నా నువ్వు పని చేస్తున్నావ్ అంటే ఏంటి అర్ధం మేము పంపించేవి నువ్వు వాడట్లేదనే కదా.. అదే మీ అమ్మా నాన్న ఉంటే ఇలా ఎందుకు చేస్తావ్.. మేము పరాయివాళ్ళం అదేగా నీ ఉద్దేశం..
చందు ఏం మాట్లాడలేదు
రాజీ : అంటే నేను అన్నవన్నీ నిజమే అన్నమాట
చందు : ఎందుకు నా మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నారు మీరు
రాజీ : ఎందుకంటే..
మౌనిక స్కూటీ హోటల్ వరకు వచ్చి ఆగిపోయింది. రాజీ చందుతో నేను మళ్ళీ చేస్తా అని పెట్టేసింది. స్వప్న వాళ్ళు మౌనికకి కనిపించకుండా బండి ఆపి తన వెనుకే వెళ్లారు. రాత్రి పదకొండు దాటింది. హోటల్ కట్టేసారు, చందు చిన్న కవర్ తో బైటికి వచ్చాడు వాడు ముందుకు నడుస్తుంటే మౌనిక వాడి వెనకాల నడుస్తుంది తన వెనకాల రాజీ స్వప్నలు వస్తున్నారు.
చందు చీకటిలో ఎవ్వరు లేరని పాట పాడుతూ చేతిలో ఉన్న కవర్ ఊపుతూ నడుచుకుంటూ వెళుతుంటే మౌనిక అది చూసి తనలో తానే నవ్వుకుంటూ పక్కనే ఉన్న స్తంభం పట్టుకుని వాటేసుకుని చందుని చూస్తుంది. ఇదంతా చూసిన రాజీ ఆశ్చర్యపోయింది స్వప్నకి అయితే కళ్ళు తిరిగినంత పని అయ్యింది.
రాజీ : చూసావే.. వాడిని చూసి ఎలా మురిసిపోతుందో.. ఇది కూడా వాడి మీద మనసుపడింది.. మరి ఎందుకు అలా చేసింది.
స్వప్న : సైకో మొహంది, దాని బుర్రలో ఏముందో
చందు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే బ్రిడ్జి వచ్చింది, పక్కనే చిన్నగా బ్యానర్లతో కట్టిన గుడిసె, చందు వెళ్లి తాతా.. తాతా.. అని పిలిచాడు. లోపల నుంచి ఏడేళ్ల పాప పరిగెత్తుకుంటూ వచ్చింది అన్నయ్యా అంటూ, బైటికి రాగానే పాపని ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. పాప నవ్వుతుంటే చందు ఇంకా నవ్వుతున్నాడు అది చూసి మౌనిక తన గుండె మీద చెయ్యి వేసుకుని జరిగేదంతా చూస్తూ మురిసిపోయి నవ్వుతుంది.
అన్నయ్యా ఆకలేస్తుంది
చందు : తల్లి సారీ రా.. ఇవ్వాళ నీ కోసం షవర్మ తెచ్చాను తల్లీ
యే.. తాతయ్య తాతయ్య షవర్మా షవర్మా
లోపల నుంచి ఒక ముసలాయన కర్ర సాయంతో బైటికి వచ్చాడు, రాజీకి స్వప్న కి ఆయన్ని చూడగానే అర్ధం అయ్యింది ఆయన గుడ్డివాడని.. వస్తూనే బాబు అంటూ వచ్చాడు.
చందు : తాతా నీకోసం కూడా తెచ్చాను తిను తాతా
తాత : అమ్మాయి ఇప్పటి వరకు నీ కోసమే చూస్తుంది బాబు
చందు : జ్యోతీ.. అలా కాదు నాన్నా ఇలా తినాలి, ఇదిగో నీ కోసం సాస్ ప్యాకెట్ కూడా తెచ్చాను.
అన్నయ్య సాస్ సాస్
చందు : ఇవ్వాళ నాకు ముద్దు ఇచ్చావా
అయ్యో మర్చిపోయా
పాప దెగ్గరికి వచ్చి ముద్దు పెడుతుంటే చిరిగిన తన జుబ్బా చూసి బాధేసింది చందుకి. రేపు ఎట్టి పరిస్థితుల్లో పాపకి బట్టలు కొనాలి అనుకున్నాడు.
చందు : తల్లీ నేను వెళ్ళనా
పాప : ఓకే అన్నయ్యా, ఇవ్వాళ మేడం కూడా రాలేదు
చందు : ఈ మేడం ఎవరో కానీ నేను ఒకసారి చూడాలి, ఏ టైంకి వస్తుంది తను
పాప : అప్పుడప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలీదు.
మౌనిక ముసిముసిగా నవ్వుకుంది
చందు : సరేలే నేను వెళుతున్న.. గుడ్ నైట్
గుడ్ నైట్ అన్నయ్యా అని కౌగిలించుకోగానే మోకాళ్ళ మీద కూర్చుని తన మొహం అంతా ముద్దులు పెట్టి లోపలికి పంపించి తనూ వెళ్ళిపోయాడు.
చందు వెళ్ళిపోగానే మౌనిక గుడిసె దెగ్గరికి వెళ్ళింది, జ్యోతి అని పిలవగానే మేడం అని బైటికి వచ్చింది.
తాత : ఎవరు
మౌనిక : నేను తాత మేడంని
తాత : బాగున్నావా తల్లీ
మౌనిక : బాగున్నా తాత.. అని తన దెగ్గరికి వచ్చిన జ్యోతి మొహం మీద చందు ఎక్కడెక్కడ ముద్దులు పెట్టాడో అక్కడే ముద్దులు పెట్టింది. ఇదంతా రాజీ కొంచెం కోపంగా అసూయగా చూస్తూనే ఉంది. మౌనికకి పాప జుబ్బా భుజం దెగ్గర చినగగా వెంటనే గుర్తుకువచ్చి, జ్యోతి.. ఇప్పుడేవస్తా ఉండు అని పరిగెత్తింది.
జ్యోతి : ఇప్పుడే మా అన్నయ్య మీ గురించి అడిగాడు, నీ పేరేంటి మేడం
మౌనిక నవ్వుతూ మేడం అని పిలుస్తున్నావ్ గా అలానే పిలు అని స్కూటీ దెగ్గరికి వెళ్ళింది. రాజీ మరియు స్వప్న పాప దెగ్గరికి వెళ్లారు.
జ్యోతి : అక్కలు ఎవరు మీరు
స్వప్న : మేమా.. మీ మేడం స్నేహితులం
జ్యోతి : అలాగా రండి మేడాలు
రాజీ : హాహా.. మేడాలు.. అక్క అని పిలువు సరేనా
జ్యోతి : అక్కలు.. అని నవ్వింది
మౌనిక స్కూటీ సీట్ తెరిచి పాప కోసం తెచ్చిన గౌన్లు తీసుకుని వచ్చేసరికి అక్కడ రాజీ స్వప్న ఉండటంతో ఆగిపోయింది. ఇద్దరు లేచి కొంచెం కోపంగా మౌనిక వంక చూసారు. మనం తరవాత మాట్లాడుకుందాం అన్నట్టు సైగ చేసి, పాపని చూసి నవ్వుతూ తన చేతికి బట్టలు ఇచ్చింది.
జ్యోతి : థాంక్స్ మేడం అని కౌగిలించుకుంది గట్టిగా
మౌనిక పాప తల నిమురుతూ, కొంచెం సేపు అక్కడ ఉండి ఇక వెళదాం అని తన స్నేహితులని చూసింది.
మౌనిక : జ్యోతి ఇక పడుకో, నేను వెళతాను.. అని చెప్పి అక్కడినుంచి స్కూటీ వైపు నడిచింది.
రాజీ మరియు స్వప్న కూడా ఇద్దరు ఇంటికి వచ్చేసారు, ఆ తరువాత మౌనిక వచ్చింది. రాజీ హాల్లోనే సోఫాలో కూర్చుంది.
రాజీ : ఏమైనా చెప్తావా లేదా మూగదానిలా అలానే ఉంటావా
మౌనిక : అదీ.. నేనూ..
రాజి : ముందు పాప గురించి చెప్పు
మౌనిక : పాప గురించచా.. ఏం లేదు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అప్పులకి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు.
ఆ పాప, తాత రోడ్డున పడ్డారు. ఆయనకి కళ్ళు కూడా లేవు. వాళ్ళకి ఇంకెవ్వరు లేరు.
ఒకరోజు చందు మధ్యాహ్నం అటు వెళుతుంటే పాప ఆకలికి తట్టుకోలేక ఏడుస్తుండడం చూసి వాడు బాధ పడిపోయాడు, ఆ రోజు నుంచి వాళ్ళకి రోజూ భోజనం పెడతాడు. నేను కూడా వాళ్ళకి కావాల్సినవి అప్పుడప్పుడు వెళ్లి ఇస్తుంటాను. ఎదురుగా ఒక షాప్ ఉంది వాడికి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తున్నాను ఏమైనా జరిగినా వాళ్ళకి ఏమైనా కావాలన్నా నాకు ఫోన్ చెయ్యమని చెప్పాను.
రాజీ : ఇవన్నీ నీకెలా తెలుసు
స్వప్న : వాడికి తెలియకుండా వాడిని ఫాలో చేస్తున్నావ్ అంటే నువ్వు చందుని కలవలేదు. ఏంటి ఇదంతా
మౌనిక : అదేంటే చందు నా మరిది.. ఇంతక ముందు కూడా నేను ఇలానే..
రాజీ : నువ్వు చందుని లవ్ చేస్తున్నావా
మౌనిక కొంచెం భయంగా రెండు అడుగులు వెనక్కి వేసింది, స్వప్నకి, రాజీకి అర్ధం అయిపోయింది.
రాజీ : రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం వెళ్ళు.. అని స్వప్న ని తీసుకుని తమ రూంలోకి వెళ్ళిపోయింది.
రాత్రి ఇటు మౌనిక అటు రాజీ, స్వప్న ఎవ్వరు నిద్రపోలేదు.