12-03-2023, 08:32 AM
(This post was last modified: 12-06-2023, 04:22 AM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•28•
అక్షిత మరియు లావణ్య జంటలు కలిసి తెలిసిన వాళ్ళతో తక్కువ మందితో చిరంజీవి మరియు శృతిల పెళ్లి చేశారు. చిన్నా పెళ్లి చూస్తూ ఎప్పుడు లేనంతగా ఆనందపడింది అక్షిత.
వేణు : అంకుల్ మీతో మాట్లాడొచ్చా
చిన్నా : వస్తున్నా
లావణ్య కొడుకు చిరంజీవి : హ్యాపీ మార్రీడ్ లైఫ్ అంకుల్.. మీరు హ్యాపీగా ఉండాలి.. అని ముగ్గురు కలిసి గిఫ్ట్ ఇచ్చారు. తెరిచి చూస్తే అక్షిత, లావణ్య చిన్నాల ఫోటో
వేణు : మిమ్మల్ని పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా అంకుల్
చిన్నా : అడుగు నాన్న
వేణు : అదీ.. మీరు ఎందుకు మా అమ్మని కాదన్నారు.. అదీ మా అమ్మ.. అని తడబడ్డాడు.. మిగతా ఇద్దరు పిలల్లు చిన్నా ఏం చెపుతాడా అని చూస్తున్నారు.
చిన్నా : వేణు.. నువ్వు అడిగాల్సిన ప్రశ్న అది కాదు, మా అమ్మలు అంటే నాకు ఎందుకు అంత ఇష్టం అని.. ఎందుకంటే వాళ్ళు నా స్నేహితులు నన్నే నమ్ముకుని నా చెయ్యి పట్టుకుని వచ్చారు.. మా ముగ్గురి బంధం చాలా గొప్పది.. ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి కలిసే ఉన్నాం చూసారా.. నాకు సంబంధించినంత వరకు.. ఆ ఇద్దరు నాకు అమ్మలు అంతే.. మా ముగ్గురి కధ నుంచి ఏదైనా మీరు ముగ్గురు నేర్చుకోవాలనుకుంటే అందులోని మంచిని తీసుకోండి, మా తప్పులని క్షమించండి అవి మీరు చెయ్యకుండా ఉండేందుకు జాగ్రత్త పడండి.
చిరంజీవి : థాంక్యూ అంకుల్
వేణు : అవును.. మా చెల్లిని కూడా మీరు మా అమ్మలని చూసుకున్నట్టే చూసుకుంటాం.. ఎప్పుడు కోప్పడం అని నవ్వుతూ ఇద్దరు కలిసి మధుమతిని ఎత్తుకుని ఆడిస్తూ వెళ్లిపోయారు.
ఆ వారం రోజులు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది, అన్ని పనులు అక్షితే దెగ్గరుండి చూసుకుంది.. ఇద్దరిని అక్షిత బలవంతంగా హనీమూన్ కి పంపించింది.
చిన్నా చెల్లెలు సంజన ఆరు నెలలు చిన్నా దెగ్గర ఉన్న తరువాత, ఎంత మంది చెప్పినా వినకుండా పెళ్లి మీద తన నిర్ణయం చెప్పి మధుమతి ఆశ్రమం నడిపించడమే తన లక్ష్యం అని సెలవు తీసుకుని మళ్ళీ చెన్నై చేరింది.
చిన్నా శృతి ఇద్దరు ఒక ప్రపంచంగా మారిపోయారు.. ఒక కొత్త జీవితం ఆరంభమైంది.
ఈ కధ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చితే LIKE RATE COMMENT చెయ్యండి.. అన్నట్టు చివరి మాట..
మనం ఏదైనా మంచి చేస్తే ఆ మంచి తిరిగి మనకే మంచి చేస్తుందంటారు, ఈ కధలో చిరంజీవికి అదే జరిగింది.. కానీ కలికాలం కదా.. ఆ మంచి ఎక్కువ కాలం నిలబడలేదు.
చిన్నా శృతిల పెళ్లి జరిగిన తొమ్మిదిన్నర సంవత్సరాల తరువాత, తమిళనాడులో ఒప్పొసిషన్ పార్టీ లీడర్ అయిన కాతిర్ సెల్వన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకి చిరంజీవి మరియు శృతి ఇద్దరు ఆక్సిడెంట్లో చనిపోయారు. మధుమతి ఆశ్రమం నడుపుతున్న సంజన మిస్ అయ్యింది.. ఆ తరువాత ఆశ్రమాన్ని వేరే సంస్థ తనలో కలిపేసుకుంది. మధుమతి బాలికా గృహం కాలంలో కలిసిపోయింది.
సమాప్తం
❤️❤️❤️
❤️