12-03-2023, 08:32 AM
(This post was last modified: 11-06-2023, 10:45 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•26•
లావణ్య ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చింది, చిన్నా లేచి చెయ్యి కడుక్కుని అన్నం ప్లేట్ అందుకుని కింద కూర్చుని అక్షితని లావణ్యని ఇరు పక్కలా కూర్చోబెట్టుకున్నాడు. అన్నం ముద్ద కలిపి లావణ్యకి తినిపించి ఇంకో ముద్ద అక్షిత నోటి దెగ్గరికి తీసుకురాగానే ఏడుస్తూనే నోరు తెరిచింది.
చిన్నా : అక్కి.. తప్పులు నువ్వు మాత్రమే కాదే నేను కూడా చేసాను.. ఇక మన ప్రేమ విషయానికి వస్తే జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని మనం మార్చలేం కదా
అక్షిత : అ..
చిన్నా : నేను చెప్పేది పూర్తిగా విను.. అని తీపిస్తూనే మళ్ళీ మాట్లాడాడు.. నేను నిన్ను ప్రేమించింది నిజం అలానే నువ్వు నన్ను ప్రేమించింది నిజం.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కలవడం సాధ్యం కాదురా తల్లీ.. ఇంకో రెండేళ్లు పోతే నీ కొడుక్కి పెళ్లి వయసు వస్తుంది..
అక్షిత : నాకు అవన్నీ..
చిన్నా : చెప్పేది వినమన్నాను ముందు.. అని లావణ్య నోట్లో అన్నం పెడుతూ.. నువ్వు ఇరవైయేళ్ళ క్రితం ఏదైతే చేసావో ఇప్పుడు అదే చేస్తున్నావ్.. అప్పుడూ తొందరపడ్డావ్ ఇప్పుడూ తొందరపడుతున్నావ్.
అక్షిత : నిన్ను ప్రేమించింది మాత్రం నిజంరా
చిన్నా : నేను కాదనలేదే.. ఇంకో పదేళ్ళు పోతే మంచాన పడే వయసే మనది, ఒకడిని కన్నావ్.. మీ ఆయనతో ఇన్నేళ్లు గడిపావ్.. అలా అని ఆయనేమి చెడ్డవాడు కాదుగా, మన స్నేహం గురించి అన్నదమ్ములు ఇద్దరు అర్ధం చేసుకున్నారు.. ఏరోజైనా మిమ్మల్ని అవమానించేలా అనుమానించేలా మాట్లాడారా..?
ఇద్దరు లేదని తల ఊపారు
చిన్నా : కదా.. ఎంత సంస్కారం.. మీరంటే ఎంత నమ్మకం.. నేను కూడా తప్పు చేసాను.. నువ్వు నా దానివి కావాలని రోజూ గణపతిని మొక్కుకునే వాడిని, అదొక్కటి తప్ప ఆయన్ని నేనేమి అడగలేదు.. అలాంటిది నువ్వు నాకు దక్కలేదని ఆయన మీద అందరి మీద, ఆఖరికి నా మీద కూడా కోపం పెంచుకున్నాను.. మీరు సంతోషంగా ఉండాలని నా ప్రేమని చంపుకుని మరీ మీకు పెళ్లిళ్లు చేసాను కానీ చివర్లో నేను చేసిందేంటి.. మీకు నేను తప్ప ఎవరున్నారు.. మీకు అమ్మాయినా నాన్నైనా నేనే కదా.. అలాంటిది మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్లిపోయాను.. ఒక పిచ్చిలో దేవుడంటే నా శత్రువు అన్న భ్రమలో బ్రతికాను.. దానికి తోడు కొంచెం పిచ్చి ఎక్కింది కదా, అమ్మ కనిపించేది.. అలా నన్ను నేనే మోసం చేసుకుంటూ కాలం గడిపేసాను.
ఒక్కటి మాత్రం నిజం.. మీరంటే నాకు ప్రాణం.. ఎంత ప్రాణం అంటే మీరు ఏడిస్తే నేను ఏడ్చేంత.. అందుకే మీకు ఏ కష్టం రాకూడదని ఇష్టం లేకపోయినా దేశం కానీ దేశంలో ప్రాణం అరిచేతిలో పట్టుకుని పని చేసాను. అలాంటిది మీరు ఇలా ఏడిస్తే నాకెలా ఉంటుంది చెప్పండి.. ఇంతా చేసింది మీ ఇద్దరు సంతోషంగా ఉండాలనే కదా.. అవునా కాదా
అక్షిత : అవును.. ముక్కు చీదరించింది
చిన్నా : ఇప్పుడు మీరేం చెయ్యాలి
లావణ్య : బుద్ధిగా కాపురం చేసుకోవాలి
చిన్నా : అక్షితా..
అక్షితా : హా..
చిన్నా : మా రాక్షసే ఇవన్నీ మాకు చెప్పి మమ్మల్ని దారిలో పెడుతుంది.. అలాంటిది ఇవన్నీ నీకు చెప్పాలా.. రాచ్చసి
అక్షిత : నువ్వెన్ని చెప్పినా..
చిన్నా : అలా కాదు నాన్నా.. నువ్వు ఇలా వచ్చేసి నేను తీసుకెళ్లిపోతే మొన్నటి దాకా ప్రపంచం అంతా నా గురించిన అబద్దాన్ని నమ్మింది ఇప్పుడు అదంతా నిజమైపోదూ.. అస్సలు ఒకరు అనుకుంటారని కాదు, నిన్నే నమ్ముకున్న నీ కొడుకు, మొగుడు, లావణ్య పిల్లల ముందు తప్పుడు దానివిగా మిగిలిపోవా చెప్పు.. మరి వాళ్ళేమై పోవాలి.. స్నేహితులుగా ఉందామే.. అయినా ఈ వయసులో నేనేమి చేస్తా చెప్పు.. మీ ఆయన అయితే ఫుల్ ఫిట్ గా ఉంటాడు నన్ను చూడు, నీ కున్న కోరికలకి నేనెక్కడ సరిపోతానే
అక్షిత : పోరా.. ఏదేదో చెప్పి నన్ను..
చిన్నా : నా బంగారు బొమ్మవి రా నువ్వు.. నువ్వు బాధ పడితే ఆ బాధ నీ ఒక్కదానిదే కాదు, మా ఇద్దరిది కూడా
అక్షిత : మరి నువ్వు ఒంటరిగా మిగిలిపోయావుగా..?
చిన్నా : ఎవరు చెప్పారు నీకు.. నేను చెప్పానా.. నాకొక చెల్లెలు ఉంది.. లవర్ కూడా ఉంది అని నవ్వాడు
లావణ్య : ఎవరు..?
చిన్నా : శృతి.. ఆ ముసలిదే..
అక్షిత : హహ..
చిన్నా : నా మీద చాలా ఆశలు పెట్టుకుంది, చూసారుగా అని లేచి చెయ్యి కడుక్కుని ఇద్దరి మూతి తుడిచాడు.
అక్షిత : అవును..
లావణ్య : నువ్వు తినలేదు..
చిన్నా : పాపం అది తినలేదుగా..
అక్షిత : కోపంగా వెళ్ళిపోయింది.
చిన్నా : ఎక్కడికి వెళ్లిందో నాకు తెలుసులే
లావణ్య : ఎక్కడికి..?
చిన్నా : తిన్నారు కదా.. ఇక దొబ్బెయ్యండి.. నేను ప్రేమించుకోవాలి.. ఈ వయసులో ఒక కుర్రాడు పడాల్సిన పాట్లు అన్నీ పడాలి నేను
అక్షిత : అబ్బో.. అని లేచింది..
లావణ్య, అక్షిత చిన్నా బోలెడన్ని ముచ్చట్లు.. తమ జీవితం కష్టాలు సంతోషాలు, ఘనతలు అన్నీ చెప్పుకుని లేచారు.. అక్షిత లావణ్య వెళ్లిపోతుంటే ఇద్దరినీ పిలిచాడు.. ఇద్దరినీ దెగ్గరికి తీసుకుని చెరొక బుగ్గ మీద ముద్దు పెట్టి వాటేసుకున్నాడు.
చిన్నా : ఇద్దరి మనస్సులో భారం అంతా దిగినట్టేగా..?
ఇద్దరు ఊ కొట్టారు
చిన్నా : ఏమైనా ఉంటే ఈ మెకానిక్ గాడికి చెప్పండి, రిపేర్ చేసి పెడతాడు.. సరేనా
ఇద్దరు నవ్వుతూ అలాగే అన్నారు.. ఇద్దరి బాధ తీర్చి వాళ్లని శాంతింపచేసి నవ్వించి ఇంటికి పంపించి, శృతి కోసం రోడ్డు మీదకి వచ్చాడు.