12-03-2023, 08:31 AM
(This post was last modified: 11-06-2023, 11:19 AM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•24•
అందరూ మాట్లాడుతుంటే చిన్నా లేచి లోపలికి వెళ్ళాడు, అక్షిత గమనిస్తూనే ఉంది. ఇంతవరకు ఇద్దరు ఎదురు పడలేదు. శృతి లేచి చిన్నా వెనక వెళుతుంటే ఎందుకో అక్షిత కాలు ముందుకు పడలేదు.. అలానే నిల్చుని ఉండిపోయింది. రూంలోకి వెళ్లిన చిన్నా శృతి రూం అంతా చుట్టూ తిరుగుతూ చూస్తున్నాడు. రూంలో మంచం లేదు చుట్టూ చిత్రాలే.. అన్ని తనవి శృతివి.. ఒకటి ఇద్దరికీ పెళ్లి అయిపోయినట్టుగా ఇంకోటి ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టుగా.. పార్క్ లో కూర్చున్నట్టు.. చిన్నా బండి రిపేర్ చేస్తుంటే శృతి బల్ల మీద కూర్చుని ముచ్చట్లు పెడుతున్నట్టు.. అన్నీ.. గతం మొత్తం ఉంది అందులో.. శృతి మరియు చిన్నాల స్నేహగీతం అంతా రాసుంది ఆ చిత్రపటాల్లో
శృతి : పడుకుంటావా.. పక్క రూంలో మంచం ఉంది
చిన్నా : లేదు ఇక్కడే..
శృతి పక్కనే అరమరలో ఉన్న పక్కలు తీసి వేసింది, చిన్నా నేల మీద ఒరిగి నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకున్నాడు, అర్ధం చేసుకున్న శృతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
మధు : అది వెళ్ళిపోయింది.. నటించింది చాల్లే
చిన్నా : ఏంటి నీ గొడవా
మధు : ఎందుకురా అంత కోపం.. నేను వెళ్లిపోతున్నా.. చెప్పి పోదాం అని పలకరించా
చిన్నా : ఏంటి.. ఎక్కడికి..?
మధు : నీ బుర్రలో నీ మనసులో ఏదో స్వాంతన గమనించాను.. చూడు ఆ పిచ్చిది నిన్ను ఎంత ప్రేమించిందో.. ఎంతగా నిన్ను దాని గుండెలో దాచుకుందో.. అమ్మంత ప్రేమ మళ్ళీ దీని దెగ్గరే దొరుకుతుందని అనిపించడంలేదా నీకు
చిన్నా కళ్ళు మూసుకున్నాడు.
మధు : ఇక నీకు నా తోడు అవసరం లేదు చిన్నయ్యా.. అందుకే వెళుతున్నాను.. అదే నీ పిచ్చి తగ్గిపోయిందిలే అని నవ్వింది.. చివరిగా నన్ను చూసుకో అనగానే చిన్నా కళ్ళు తెరిచి కూర్చున్నాడు.
చిన్నా : నాకు పిచ్చో ఎర్రో తెలీదు, కానీ ఇన్నేళ్లుగా నా పక్కనే ఉన్నావ్.. నన్ను వదిలి వెళ్లకమ్మా.. ఎంత తలనెప్పి వచ్చినా భరిస్తాను అన్నాడు జీరబోయిన గొంతుతో
మధు : చిన్నా.. అదిగో ఆ బొమ్మలో ఉందే శృతి అదే ఇప్పుడు నీకు తోడైనా నీడైనా.. దాని ఒళ్ళో పడుకున్నప్పుడు నీకు అక్షిత కూడా గుర్తొచ్చేదికాదు.. నువ్వే బలవంతంగా అక్షితా అని జపం చేస్తూ కుర్చున్నావ్.. అందుకే తప్పంతా నీదేనని అంటూ ఉండేదాన్ని.. నీ పిచ్చిలో నిజమైన ప్రేమని గుర్తించలేకపోయావు.. ఇప్పటికైనా నేను చెప్పిందే నిజమని ఒప్పుకుంటావా
చిన్నా ఊ కొట్టాడు అంతే..
మధు : ఇప్పుడు ఆ పిచ్చి వదిలి ప్రేమతో శృతిని చూస్తున్నావ్ కాబట్టే నేను నిన్ను అరిపించడంలేదు.. చూసుకో ఎంత ప్రశాంతంగా ఉందొ ఇప్పుడు నీ గుండె చప్పుడు
చిన్నా : అయినా కానీ
మధు : మళ్ళీ దాని ఒళ్ళో పడుకో.. ఇన్నేళ్ల నీ భారం అంతా వదిలేయి.. దాన్ని బాధ పెట్టింది చాలు, ఇంకా ఏడిపించకు.. నేను వెళుతున్నా.. నీ వల్ల శృతి పెదాల మీద వచ్చే నవ్వులో నేను బతికే ఉంటాను.. నిన్ను చూస్తూనే ఉంటాను.. అస్సలు నేను నీకు గుర్తే రాను.. ఇక వెళుతున్నా అని చిన్నా నుదిటి మీద ముద్దు పెట్టుకుంటూనే మాయం అయిపోయింది.. చిన్నా కళ్ళు తిరిగిపడిపోయాడు.