12-03-2023, 08:30 AM
(This post was last modified: 10-06-2023, 09:26 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•21•
పెళ్ళికింకా రెండు గంటలు ఉందనగా చిన్నా ఒక్కడే ఇంట్లో కూర్చుని ఉన్నాడు, అందరూ పెళ్లి దెగ్గరికి వెళ్ళిపోగా శృతి కూడా రెడీ అయ్యి అందంగా చీర కట్టుకుని, చిన్నా కోసమని ఇంట్లోకి వచ్చి చిన్నాని చూసి బాధగా వెళ్లి పక్కన కూర్చుంది.
శృతి : ఏడుస్తున్నావా
చిన్నా : లేదు.. ఊరికే.. ఏం తోచకా.. అయిపోయిందా వెళదామా
శృతి చిన్నా తల మీద చెయ్యి వేసి ఒళ్ళోకి తీసుకుని పడుకోబెట్టుకుంది బలవంతంగా, చిన్నా కూడా ఏం మాట్లాడకుండా అలానే నడుముని గట్టిగా వాటేసుకున్నాడు.
శృతి : ఎవరున్నా లేకపోయినా నేనుంటా నీతో
చిన్నా : నాకెవ్వరు వద్దు, నేనెప్పుడూ ఒంటరే
శృతి : ఇలా చూడు అని చిన్నా తలని దెగ్గరికి తీసుకుని ముందు కళ్ళు తుడుచుకో అని కళ్ళు తుడస్తుంటే చిన్నా లేచి కళ్ళు తుడుచుకుని కూర్చున్నాడు.
చిన్నా : నేనేమి ఏడవట్లేదు, వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు ఏడుపు వస్తుందా.. లే.. లే.. పద పోదాం
శృతి : మాట్లాడాలి
చిన్నా : ఏంటి
శృతి : మరి నా సంగతేంటి..?
చిన్నా : ఉమ్మ్..
శృతి : నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఆగుతాను, ఎంత కాలమైనా ఒంటరిగా నీకోసం వేచి చూస్తాను.. నా దెగ్గరికి వస్తావుగా
చిన్నా ఏం మాట్లాడకపోవడంతో శృతి కళ్ళలో నీళ్లు తిరిగాయి
శృతి : నన్ను ప్రేమించకపోయినా పరవాలేదు, నాతో సెక్స్ చెయ్యకపోయినా పరవాలేదు నన్ను పెళ్లి కూడా చేసుకోకు కానీ నీకు నిద్ర వచ్చినప్పుడు నీ ఒళ్ళు అలిసిపోయినప్పుడు ఇలా నా ఒళ్ళోకి వచ్చి పడుకో.. నేను అంతే.. ఇలాగే నీతో బతికేస్తా అని చిన్నా గుండె మీద తల పెట్టుకుని ఏడ్చేసింది.
చిన్నా : నన్ను క్షమించు, కానీ నీకు మాటిస్తున్నాను ఏదో ఒకరోజు నీ కోసం కచ్చితంగా వస్తాను, నీ కోరిక తీరుస్తాను.. ఒట్టు అని జుట్టు మీదె ముద్దు పెట్టుకుని ఓదార్చాడు..
శృతి ఆనందంగా కళ్ళు తుడుచుకుని నిజంగా.. అయితే నేను చచ్చేవరకు ఎదురుచూస్తాను అని మొహం అంతా ముద్దులు పెడుతుంటే చిన్నా తట్టుకోలేక వెనక్కి పడిపోయాడు. శృతి కూడా చిన్నా మీద పడిపోయింది.. చిన్నా సిగ్గు పడటం చూసి శృతికి ఆనందం వేసింది.. చిన్నా తనవాడు అయిపోతాడని సంబరపడింది.. అక్షిత కదిలించగానే గతం నుంచి బైటికి వచ్చి కోపంగా కళ్ళు తెరిచింది శృతి.. ఏదేదో అనుకుంది కానీ అదంతా నటన, చిన్నా అప్పటికప్పుడు శృతిని ఏమర్చడానికి చెప్పాడని తెలుసు, గుర్తుకురాగానే కోపంతో పాటు దుఃఖం కూడా తన్నుకొచ్చింది.. వెళ్ళిపోయి అందరినీ బాధ పెట్టాడు, కనీసం సుఖంగా ఉన్నాడా అంటే అదీ లేదు వాడూ బాధపడుతున్నాడు. అక్షిత మళ్ళీ కదిలించేసరికి లేచి ఇద్దరు లోపలికి వెళ్లారు, అక్షిత శృతి ఇద్దరు పడుకోలేదు..
కోర్టులో :
లాయర్ శృతి : మై లార్డ్, మన ముఖ్యమంత్రి శ్రీ ఉసితన్ గారు చిరంజీవి అను నా క్లయింట్ కి వెన్ను దన్ను అందించారు, ఆదరించారు. అంతకముందు ఒప్పొసిషన్ పార్టీ అధ్యక్షుడు, మన మాజీ ముఖ్యమంత్రి కాతిర్ సెల్వన్ గారు చిరంజీవి అను నా క్లయింట్ ని సపోర్ట్ చెయ్యమని ఎలక్షన్ కాంపెయిన్ చెయ్యమని కోరారు దానికి నా క్లయింట్ సున్నితంగా తిరస్కరించారు. అతను వచ్చినప్పుడల్లా రికార్డు అయినా ఫుటేజ్ సబ్మిట్ చేసాను. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లే ప్రయత్నంలో ఏమి తెలియని అమాయకుడైన నా క్లయింట్ చిరంజీవి ఇరుక్కున్నారు. కాదు కావాలని పన్నిన కుట్రలో ఇరికించారు.
అదీ కాక నా క్లయింట్ మీద కంప్లైంట్ చేసి దాన్ని వైరల్ గా మార్చిన తరువాత, కంప్లైంట్ చేసిన అమ్మాయిని ఎక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చెయ్యాల్సి వస్తుందోనని రాత్రికి రాత్రే చంపేశారు. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ముందే సబ్మిట్ చేయడం జరిగింది, ఒకసారి పరిశీలించగలరు.
అమ్మాయిని ఆక్సిడెంట్ చేసి చంపారు మొదటగా కారు గుద్దిన ఫుటేజ్.. ఆ కారు నెంబర్ గురించి ఎంక్వయిరీ చేయగా తెలిసిందేంటంటే ఆ కారు ఒప్పొసిషన్ పార్టీ మెంబర్ ఏకాంబరం బావమరిదిది, అతను కేవలం చుట్టరికం మాత్రమే కాదు బినామి కూడా ఆ ఎవిడెన్స్ కూడా మీకు సబ్మిట్ చేసాను.. అని ఆగింది.. జడ్జి మొత్తం పరిశీలించారు.
శృతి : మై లార్డ్ ఇది కేవలం మధుమతి బాలికా గృహం పేరు నాశనం చేసి తద్వారా వెన్నుదన్నుగా నిలబడ్డ ముఖ్యమంత్రి గారి మీద నింద మొపే నీచమైన కుట్ర ఇది. కానీ ఇందులో బలయ్యింది మాత్రం నా క్లయింట్.
ఆబ్జెక్షన్ మై లార్డ్ అని లేచాడు అవతల పక్క లాయర్