12-03-2023, 08:30 AM
(This post was last modified: 10-06-2023, 04:11 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•20•
లాయర్ శృతి : అన్నా
చిరంజీవి తల ఎత్తాడు
లాయర్ శృతి : నేనన్నా శృతిని గుర్తుపట్టావా
లేదని తల ఊపాడు. చిరంజీవి వెళ్లిపోయాక శృతి అందరి దెగ్గరికి వెళ్లి పలకరించి కేసు గురించి మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది. అందరూ ఇంటికి వచ్చారు. అక్షిత తల పగిలిపోతుంటే కళ్ళు మూసుకుని పడుకుంది, తన కొడుకు వేణు వచ్చి పక్కన కూర్చున్నాడు.
వేణు : అమ్మా
అక్షిత : ఏంట్రా
వేణు : చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏడవటం నేను ఒక్కసారి కూడా చూడలేదు, నిన్నే కాదు లావణ్య పిన్నిని కూడా చూడలేదు కానీ..
అక్షిత లేచి కూర్చుని తన కొడుకుని దెగ్గరికి తీసుకుని గట్టిగా వాటేసుకుంది.
అక్షిత : నీకు ఏదైనా ఆపద వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఎవరితో అయినా పంచుకోవడానికి నేను నాన్నా నానమ్మ పిన్ని బాబాయి ఇంత మందిమి ఉన్నాం.. కానీ నాకు మీ పిన్నికి అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉన్నారంటే అది వాడోక్కడే అని తన కధ మొత్తం చెప్పింది. దానితో పాటే చిరంజీవిని ఇంకా ఎక్కువ గుర్తుతెచ్చుకుని ఏడ్చేసింది. అంతా విన్న వేణు తనతో పాటే వింటున్న లావణ్య కొడుకు చిరంజీవి కూడా కళ్ళు తుడుచుకున్నాడు.
వేణు : అమ్మా.. నువ్వెందుకు ఆయన్ని ప్రేమించలేదు.. సూటిగా అడిగాడు
అక్షిత ఏదో చెప్పబోతుంటే లావణ్య కదిలించి, అప్పుడున్న పరిస్థితులు మన ఆలోచనలు మన విధానాలు ఇవేవి ఎంత చెప్పినా ఎవ్వరికి అర్ధంకావు.. మేమే మా చేతులారా వాడిని పోగొట్టుకున్నాం అందులో మీ అమ్మ తప్పు ఎంత ఉందొ నాది అంతే ఉంది అలాగే మా తప్పు ఎంత లేదో చిన్నా తప్పు కూడా లేదు అని కళ్ళు తుడుచుకుంది. ఇంకెవ్వరు ఏమి మాట్లాడలేదు. అక్షిత కళ్ళు మూసుకుంది.
చిన్నా : అక్కి.. నీకు నేను ఐ లవ్ యు చెప్తే ఏం చేస్తావ్
అక్షిత : మగాడివి అయితే చెప్పరా చూద్దాం.. అని తొడ కొట్టింది
చిన్నా : నాకేమైనా భయమా ఏంటి
అక్షిత : అయినా నువ్వు నేను రాసుకుంటే వచ్చేది బూడిదే నాన్నా.. పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పెద్ద టీవీ, పెద్ద కారు, పెద్ద కుటుంబం
కుటుంబం అనగానే చిన్నా మొహం వాడిపోవడం అప్పుడు గమనించలేదు అక్షిత, కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుని అన్ని ఆలోచిస్తుంటే నోటి దూలతో తను సరదాకి మాట్లాడిన మాటలు తన జీవితంలో ఎంత పెద్ద మార్పుని తీసుకొచ్చాయో అర్ధమవుతుంది.. ఇలాంటివి అక్షితకి చిరంజీవికి మధ్యన బోలెడు ఉన్నాయి. అన్ని గుర్తొస్తున్నాయి.
ఆలోచిస్తూ అన్నం కూడా తినలేదు, అందరూ పడుకున్నారు నిద్ర పట్టడం లేదు.. దుఃఖం నిమిష నిమిషానికి పెరుగుతూనే ఉంది. కళ్ళు తుడుచుకుని లేచి బైటికి వచ్చింది. శృతి చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తుంటే వెళ్లి పక్కన కూర్చుంది.
శృతి : పడుకోలేదా
అక్షిత : బాధ.. ఎవరితో పంచుకోవాలో.. ఎవరికి అర్ధమవుద్దో అర్ధం కావట్లేదు శృతి.. నరకంలా ఉంది, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది అని శృతి భుజం మీద వాలిపోయింది.
శృతి : అక్షితా.. నిజంగానే వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలీదా లేక..?
అక్షిత ఇంకా ఎక్కువగా ఏడ్చేసింది, శృతి.. నిజంగానే నా కళ్ళెప్పుడు వాడి కష్టాన్ని మాత్రమే చూసేవి, ఒళ్ళు నెప్పులతో రాత్రి అటు ఇటు బొర్లుతుంటే చూస్తూ ఉండేదాన్ని.. వాడు మాకేవి తెలియనిచ్చేవాడు కాదు. నా ఆలోచనలన్నీ వాడి కష్టం మీదె ఉండేవి.. వాడిని ఇబ్బంది పెట్టకుండా కష్టపెట్టకుండా బతికితే చాలని మాత్రమే అనుకున్నాను.. ఇవేవి నాకు కనిపించలేదు.. అస్సలు నాకు ఆ ఆలోచనే లేదు.
శృతి : ఇప్పుడేమైందని.. వాడు బానే ఉన్నాడుగా.. ఇలాంటి కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి..
అక్షిత : వాడు నా వంక కన్నెత్తి కూడా చూడలేదు శృతి
శృతి : నిన్నెలా ఓదార్చాలో నాకు అర్ధం కావట్లేదు అక్షితా
అక్షిత : నేను వాడితో ఒక్కసారి మాట్లాడాలి
శృతి : ముందు వాడిని ఇందులోనుంచి బైటికి రానీ.. తెల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.. అని గతంలోకి వెళ్ళింది