12-03-2023, 08:30 AM
(This post was last modified: 09-06-2023, 12:09 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•19•
అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, మా ఆశ్రమం చిన్నగా పెద్దది అవడం మొదలయ్యింది. అన్నయ్య కేవలం నిరుపేద, అనాధ అమ్మాయిలని మాత్రమే చేర్చుకొనేవాడు. వాళ్ళకి ఉద్యోగం దొరికేంత వరకే ఇక్కడ ఉండాలని ఆ తరవాత వెళ్లిపొమ్మనేవాడు.. చాలా మంది అమ్మాయిలు అన్నయ్యని వదిలి ఉండలేక ఇక్కడే ఉంటామని గొడవ చేసేవాళ్ళు కానీ బైటికి గెంటేసేవాడు. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళు కూడా తమ జీతంలో ఇంత పెర్సెంటు అని డొనేట్ చేసేవారు, అలా మా ఇద్దరి చేతుల మీదగా ఈ ఇరవై ఏళ్లలో సుమారు నూట యాభై మందికి పైగా అమ్మాయిల జీవితాలని వాళ్ళ తలరాతలని మార్చేసాం.
తమిళనాడు ప్రజల నోట అన్నయ్య హీరో అయిపోయాడు. ఎన్నో సేవా సంస్థల నుంచి విరాళాలు, అభినందనలు వచ్చాయి. ఒక రోజు రూలింగ్ పార్టీకి సంబంధించిన పెద్దాయన ఒకరు వచ్చి అన్నయ్యతో చాలా సేపు మాట్లాడి వెళ్లారు. ఆ రోజు నుంచే మాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో కూడా మాకు తెలీదు. అని తనకి తెలిసిన విషయాలు అన్ని చెప్పింది.
పది రోజుల తర్వాత అందరూ కోర్టుకి వచ్చారు, చిరంజీవిని కోర్టులో ప్రవేశపెట్టారు. చిరంజీవి తరపున వాదించడానికి పెట్టుకున్న లాయర్ రానేలేదు ఇదంతా ఎవరో చేస్తున్న కుట్రలా అనిపించింది. ఎవరికి ఏమి చెయ్యాలో అర్ధంకాక ఏడుపు దిగమింగుకుంటుంటే చిన్నా మాత్రం మౌనంగా నిలుచున్నాడు.
జడ్జి : మీ తరపున వాదించడానికి లాయర్ ఉన్నారా లేరా
ఉన్నారు అన్న గొంతు వినపడి అందరూ వెనక్కి తిరిగారు. సంజుకి కళ్లెమ్మటి నీళ్లు తిరిగిపోయాయి. ఒకప్పుడు తనతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చి తన దెగ్గర చదువుకున్న శృతిని లాయర్ కోటులో చూసి తన అన్నయ్య వంక గర్వంగా చూసింది. చిరంజీవి మాత్రం తల ఎత్తలేదు.
శృతి ఏదేదో మాట్లాడి మొత్తానికి వచ్చే వారానికి వాయిదా వేయించింది. చిరంజీవిని పూలేస్ తీసుకెళుతుంటే అటు వెళ్ళింది. శృతి కేసుని వాళ్ళకి తెలియకుండానే తమవైపుకి అనుగుణంగా తిప్పుతుంటే ఆశ్చర్యంగా ఆనందంగా నోరెళ్లబెట్టి చూస్తూ ఉన్నారు. జడ్జి వాయిదా వేస్తుంటే శృతి అందరి వైపు తిరిగి నేనున్నానంటూ సైగ చేసింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.