12-03-2023, 08:28 AM
(This post was last modified: 13-04-2023, 10:57 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•15•
చిన్నా : పోనీలే.. ఒంటరిగా మిగిలిపోయానేమో అనుకున్నాను
మధు : అస్సలు భయం లేదురా నీకు
చిన్నా : అవన్నీ నీతో పాటే తీసుకుపోయావ్.. కానీ అమ్మా నిన్ను చూస్తుంటే ఏడుపు తన్నుకోస్తుంది.. కానీ నువ్వు నా అమ్మవి కాదు.. కానీ అచ్చు అలానే ఉన్నావ్
మధు : నువ్వు ఎలా ఊహించుకుంటే అలా ఉంటాను.. అక్షిత గురించి ఏమైనా చెప్తావా
చిన్నా : నా బుర్ర బద్దలు కొట్టుకుని వచ్చానన్నావ్.. నీకన్నీ తెలుసు కదా
మధు : తప్పు నీదే
చిన్నా : నాకు తెలుసు.. ఇంక ఆపేయి
మధు : ఇప్పుడేం చేద్దామని
చిన్నా : ఆకలేస్తుంది అని లేచాను.. నా వెనకాలే నడుస్తుంది
మధు : నన్నేమి అడగవా
చిన్నా : నేను రోజూ మా అమ్మతో మాట్లాడతాను, నువ్వు నా ఆలోచనవే కదా.. అంతగా ఆశ్చర్యపొనవసరం లేదు. ఇలాంటి షాకులు నా జీవితంలో చాలా ఎదురుకున్నాను ఇది కొత్తది అంతే..
మధు : అయితే నేను నీ అమ్మని కాదంటావా, నా గొంతు తనది కాదంటావా.. నువ్వు చూస్తున్నది నిజం కాదంటావా
చిన్నా : ఇప్పటికే తల పగిలిపోతుంది.. అవునన్నా కాదన్నా నువ్వు నా అమ్మవే.. సరేనా.. కొంచెం మెలకుండా ఉండు.
మధు : అయితే సరే.. ఇంకొకటి..
చిన్నా : మళ్ళీ ఏంటి.. అసహనంగా వెనక్కి తిరిగాను
మధు : అక్కడ భోజనాలు పెడుతున్నారు.. ఇవ్వాళ హనుమాన్ జయంతి
చిన్నా : ఆకలేస్తుంది
మధు : ఇంకోటి
చిన్నా : వినపడుతుంది..
మధు : వినాయకుడికి ఆంజనేయుడికి చుట్టరికం ఉందనుకుంటా
చిన్నా : చాలా దూరపు చుట్టంలే.. అయినా ఆ గణేష్ మీద నాకేం కోపం లేదు.. అలా అని ప్రేమ భక్తి కూడా లేవు అంటూనే నడుచుకుంటూ వెళ్లి అన్నం పెట్టించుకుని తినేసి పక్కనే మూసి ఉన్న బడ్డీ కొట్టులో బండ మీద పడుకున్నాను.
మధు : ఇక్కడ పడుకుంటావా
చిన్నా : ఇంతకంటే మురికి స్థలాల్లో పడుకున్నాను..
మధు : జోక్ చెప్పనా
చిన్నా : నాకు తెలియనివి చెప్పు
మధు : పోరా..
చిన్నా : సరే చెప్పు మా
మధు : భార్య అందట ఏవండీ నేను పాట పాడతాను మీరు తాళం వేయరూ అని.. దానికి ఆ భర్త తన భార్య పాడుతుంటే ఆ రూం గొళ్ళెం పెట్టి తాళం వేసి బయటకి వెళ్లిపోయాడట.. అని నవ్వుతూ తన వంక నిషితంగా చూస్తున్న కొడుకుని చూసి ఏరా అంది..
చిన్నా : ఒకప్పుడు మనం ఇద్దరం నవ్వుకున్న క్షణాలు గుర్తొచ్చాయి.. నువ్వు నిజమైతే ఎంత బాగుండేది అమ్మా.. చాలా నరకం అనుభవించాను నువ్వు లేక..
మధు : పడుకో అని పక్కన కూర్చుని.. కొడుకు మీద చెయ్యి వేసి..
జొ అచ్యుతానంద జోజొ ముకుందా..
రావె పరమానంద రామ గోవిందా జో జో.. అంటూ పాట అందుకుంది..
సరిగ్గా చిన్నా నిద్రపోయేసమయానికి చిన్నా మెదడు నుంచు పుట్టుకొచ్చిన తన అమ్మ మధు.. ఒక బ్రేక్ తీసుకో చిన్నోడా అంటూ.. చిన్నా నిద్రలోకి జారుకోగానే మాయం అయిపోయింది. మళ్ళీ చిన్నా మెలుకుంటే కానీ తన అమ్మ మధుమతి ప్రత్యక్షమవదు.