12-03-2023, 08:28 AM
(This post was last modified: 12-04-2023, 10:35 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•14•
చిన్నా : శృతీ..
శృతి : హ్మ్మ్..
చిన్నా : మీ అమ్మగారు నీతో మాట్లాడారా
శృతి : కనుక్కున్నావే
చిన్నా : చెప్పు
శృతి : గట్టిగా అడిగింది, నువ్వంటే ఇష్టమని చెప్పా.. ఏమనలేదు.. నా ప్రేమని గౌరవిస్తానంది కానీ ఒప్పుకోనని చెప్పింది.. మా స్టేటస్ పడిపోద్ధట.. ఈ రెండు రోజులు నీతో గడుపుతానని అడిగాను.. దానికి ఒప్పుకుంది
చిన్నా : అలా ఎలా ఒప్పుకుంది.. ఆంటీ...
శృతి : నువ్వంటే మా అమ్మకి చాలా గౌరవం రా.. ఇంట్లో మా వాళ్ళు ఒప్పుకోరని తనకి తెలుసు.. అందుకే కుదరదని ముందుగా తనే చెప్పింది. నేనూ ఓకే అన్నాను.. నువ్వెలాగో నన్ను కాదన్నావ్ కదా అని నా కళ్ళలోకి చూసింది మొహం పక్కకి తిప్పాను.
నేనేమి మాట్లాడలేదు, రాత్రంతా నా మీద పడుకుని గడ్డంతో గుచ్చుతూ ఎన్నో మాటలు చెప్పింది, రెండు కధలు కూడా చెప్పింది. పడుకోబెట్టాను. తెల్లారి మళ్ళీ నన్ను షెడ్డుకి కూడా వెళ్లనివ్వలేదు రోజంతా కలిసి తిప్పింది, నాతో అన్నం తినిపించుకుంది, ఆటలు ఆడింది పాటలు పాడింది అలానే సమయం గడిచి చీకటి పడింది. అక్షిత వాళ్ళు ఇంకో గంటలో వచ్చేస్తాం అని ఫోన్ చేశారు.
శృతి : చిన్నా.. నా మీద ఇంత ప్రేమ కూడా కలగలేదా
చిన్నా : నేనిప్పుడు ఎవ్వరిని ప్రేమించే స్థితిలో లేనే.. అర్ధం చేసుకో.. నీ లాంటి అమ్మాయి చెయ్యి పట్టుకోవాలంటే పెట్టి పుట్టాలి.. నాకు ఆ అదృష్టం కూడా లేదు.. నీకు చాలా మంచివాడు దొరుకుతాడు.
శృతి : లేదు దొరకడు.. నీకు నా గురించి తెలీదు.. నువ్వు కాకపోతే నా పక్కన ఇంకెవ్వరు ఉండరు.. నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకో.. ఎక్కడికైనా పో.. నాకు అనవసరం.. కానీ నీ కోసం చచ్చేదాకా ఎదురుచూస్తాను. ప్రేమలో నువ్వు పడ్డంత బాధ నన్ను పెట్టవనే అనుకుంటున్నాను అని లేచి ఇంటికి పరిగెత్తింది..
రోజులు చాలా వేగంగా చాలా సంతోషంగా గడుస్తున్నాయి అందరికీ.. ఒక రోజు పూజ చేస్తుంటే అక్షిత మరియు లావణ్య అమ్మ ఫోటోకి గణేష్ కి దణ్ణం పెట్టుకుంటుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది.. అస్సలు నేను గణేష్ ని అమ్మని తలుచుకునే చాలా రోజులు అయిపోయింది.. ఎందుకో నా జీవితంలో మొదటిసారి గణేష్ వంక చూడలేదు, ఆయన కోసం నేను చేతులు ఎత్తలేదు.. చివరిగా మాత్రం ఒకసారి ఆయన వంక చూసి కనీసం వాళ్ళని సంతోషంగా ఉండేలా అన్నా దీవించు అని ఒక వార్నింగ్ ఇచ్చి బైటికి వచ్చేసాను.
చూస్తుండగానే పెళ్లి రోజు వచ్చేసింది, రెండు రోజుల నుంచి పనుల వల్ల అస్సలు తీరిక లేకుండా పోయింది.. ఆంటీ తనకి తెలిసిన స్నేహితులు చుట్టాలని తీసుకొచ్చి ఎంతో సాయం చేసింది.. తనకి కృతజ్ఞత చూపించడానికి నా దెగ్గర ఏమి లేవు.. నేను తనకి ఇచ్చిన మాట తప్ప.
అక్షిత మెడలో తాళి పడింది, అక్షింతలు కూడా మనస్ఫూర్తిగా వేసాను.. లావణ్య అక్షిత ఈ ఇద్దరు నా నుంచి విడదీయలేని బంధం మా ముగ్గురిది అనుకునేవాడిని ఒకప్పుడు.. సాయంత్రానికి అప్పగింతలు అయిపోయాయి.. వెళ్లిపోయారు.. లావణ్య ఏడవబోతే అక్షిత పక్కనేనే ఏదో పక్క గ్రహానికి వెళ్లిపోయినట్టు ఏడుస్తున్నావ్ అనేసరికి అందరం నవ్వుకున్నాం.. మండపం నుంచి ఇంటికి వచ్చాను.. ఒక్కసారి ఇంట్లోకి వెళ్లాను.. ఇల్లంతా చిందరవందర.. లోపల అమ్మ ఫోటో లేదు.. అక్షిత తీసుకెళ్లిపోయి ఉంటుంది.. ఈ మధ్య దేవుడి కంటే అమ్మతోనే ఎక్కువ మాట్లాడుతుంది అది.. అమ్మ పాస్పోర్ట్ ఫోటో అక్కడే ఉంది గణేషుడి బొమ్మ కూడా ఉంది.. ఎందుకో ముట్టుకోవడానికి చెయ్యి రాలేదు.. ఇంటి నుంచి బైటికి వచ్చాను. శృతి వాళ్ళ అమ్మ కనిపించింది. తన దెగ్గరికి వెళ్లి చేతులెత్తి మొక్కాను..
ఆంటీ : ఇదంతా నీకోసం చేసాను.. నా కూతురి మనసు గెలిచిన వాడివి.. చాలా మంచివాడివి.. నీకంతా మంచే జరగాలి
చిన్నా : శృతి ఎక్కడ ఆంటీ
ఆంటీ : వాళ్ళ నాన్నతో వస్తుంది.. తరువాత అందరం కలిసి పెళ్లి ఇంటికి వెళదాం
చిన్నా : నేనలా బైటికి వెళ్ళొస్తాను అని నడుచుకుంటూ వచ్చేసాను..
ఏవేవో ఆలోచనలు.. ఒంటరిగా మిగిలిపోయానన్న బాధ.. ఎక్కడికి నడుచుకుంటూ వెళుతున్నానో కూడా తెలీకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను.. రైలు పట్టాలు వచ్చాయి.. ఎక్కి నడుస్తున్నా.. దాదాపు సాయంత్రం కావొస్తుంది.. నడిచి నడిచి కాళ్లు పీక్కుపోయాయి.. వెనక్కి తిరిగి చూస్తే హైదరాబాద్ దాటి చాలా దూరం వచ్చేసానేమో అనిపించింది.. ఇంకొక్క అడుగు వేసినా అరికాళ్ళు మంటకి కాలిపోతాయేమో అనిపించింది.. అక్కడే కూర్చున్నాను. ఎంతసేపు కూర్చున్నానో తెలీదు.. చెమట ఆగకుండా కారుతూనే ఉంది.. దూరం నుంచి ట్రైన్ కూత వినపడగానే లేచి నిలుచున్నాను కానీ ఏమైందో ఏమో నాకే తెలియట్లేదు మళ్ళీ కూర్చున్నాను.. ట్రైన్ చాలా వేగంగా వస్తుంది ఇంకో పది క్షణాల్లో మా అమ్మ దెగ్గరికి పోతాననగా వెనక నుంచి ఒక గొంతు చిన్నా అని గట్టిగా కేక వినిపించింది.. అవును అది మా అమ్మ గొంతు.. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాను
చిన్నా : అమ్మా
మధు : హా.. నేనే.. ముందు అక్కడ నుంచి లే.. సస్తావ్
ఒక్క క్షణంలో పక్కకి దూకేసాను.. లేచి చూసుకున్నాను.. దెబ్బలేమి తగల్లేదు.. ట్రైన్ వెళ్ళిపోయింది.. అటు వైపు అమ్మ అక్కడే నిలుచొని ఉంది.
చిన్నా : అమ్మా
మధు : అమ్మనే
చిన్నా : నా కోసం మళ్ళీ పుట్టావా.. నీకు గతం గుర్తుకొచ్చిందా.. నాకోసం వెతుక్కుంటూ వచ్చావా.. నేనిక్కడున్నానని ఎవరు చెప్పారు.
మధు : నువ్వేం మారలేదు రా.. నేనేమి మళ్ళీ పుట్టలేదు
చిన్నా : మరి ఆత్మవా.. ముందంతా కనిపించకుండా నాతోనే ఉన్నావా.. ఇప్పుడు నన్ను కాపాడుకోవడానికి నాకు కనిపించావా
మధు : హమ్మో అని నవ్వుతూ తల కొట్టుకుని... నేను ఆత్మని కూడా కాదు
చిన్నా : మరి.. నాకు పిచ్చి పట్టిందా.. ఏది నిన్ను ముట్టుకోనివ్వు.. అని చెయ్యి ముందుకు చాపాను.. ఏమి లేదు గాలి..
మధు : పిచ్చి కాదు రా.. నీలో ఉన్న బాధ నీ మనసు తట్టుకుంది కానీ నీ మెదడు తట్టుకోలేకపోయింది.. అందరికంటే నేనే నీకు ఎక్కువ ఇష్టం కదా, అందుకే నేను బైటికి వచ్చాను.. దీన్ని ఏమంటారంటే.. దీన్ని.. దీన్ని.. చిన్నా నీకు పిచ్చి పట్టింది.