12-03-2023, 08:27 AM
(This post was last modified: 12-04-2023, 10:33 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•13•
నేను శృతి అక్షిత లావణ్య.. వాళ్ళు వచ్చేసరికి నలుగురం కలిసి ఇల్లు సర్ధేసాం. శృతి వాళ్ళ అమ్మ వచ్చి మాకు కొన్ని జాగ్రత్తలు చెప్పింది.. ఎలాగో ఖాయం అనుకున్నారు కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదంది. వాళ్ళు రావడం ఇల్లు చూసుకోవడం కూర్చోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. అక్షిత ఆ ఇద్దరు అన్నదమ్ములని పరిచయం చేసింది. కొంచెంసేపు మాట్లాడారు మంచివారని అర్ధమైంది. వాళ్ళ అమ్మా నాన్న నాతో చాలా సేపు మాట్లాడారు.
అక్షిత లావణ్య వాళ్ళ కాబోయే వాళ్ళతో కలిసి బైట ముచ్చట్లు పెడుతుంటే శృతి మాత్రం నా పక్కనే కూర్చుంది, నా చెయ్యి పట్టుకుని తను అందరితో మాట్లాడుతుంటే ఒక్క క్షణం నాకే అనిపించింది శృతి నా భార్య అయిపోయిందా అని.. అంత చనువు తీసుకుని మాట్లాడటం నాకు మాత్రమే కాదు మా ఇద్దరినీ చూస్తున్న శృతి అమ్మ నాన్నలకి కూడా నచ్చలేదు. మరుక్షణం శృతి నుంచి విడిపడి పక్కకి వచ్చేసాను.
ఇక వచ్చిన వాళ్ళ మాటలని బట్టి వాళ్ళకి ఈ ఇల్లు అక్షిత లావణ్యల పేరు మీద ఉందని తెలుసనిపించింది. వాళ్ళు ఆశపడుతున్నారు.. అడక్కముందే ఇల్లు వాళ్ళ పేరు మీదే ఉంటుందని అది వాళ్ళకేనని మాటిచ్చేసాను. ఆ మాట వల్ల శృతికి ఎంత కోపం వచ్చిందంటే అందరూ వెళ్లిపోయాక నా మీద చెయ్యి కూడా చేసుకోబోయి తన అమ్మా నాన్నని చూసి ఆగిపోయింది.
అక్షిత వాళ్ళు అందరినీ పంపించి లోపలికి వచ్చారు, నేనింకేం మాట్లాడొద్దని శృతికి సైగ చేసాను, కోపంగా వెళ్ళిపోయింది. శృతి వాళ్ళ అమ్మ నన్ను ఒకసారి కోపంగా చూసి వెళ్లిపోతుంటే వెనకే వెళ్లాను.
చిన్నా : ఆంటీ.. ప్రతినిమిషం నేను తలుచుకునే వినాయకుడిమీద ఒట్టు పెట్టి చెపుతున్నా.. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఏ రోజు దేని మీదా ఎవరి మీద ఆశపడలేదు ఒక్కరి కోసం తప్ప అని ఆంటీ చెయ్యి పట్టుకుని అక్షిత వంక చూపించాను.. ఆంటీ ఆశ్చర్యంగా చూసింది.. మీరు అనుకున్నట్టుగా ఏమి లేదాంటి.. శృతి నా స్నేహితురాలు అంతే అని తన చెయ్యి వదిలేసాను.
ఆంటీ : మరెందుకు దెగ్గరుండి పెళ్లి చేస్తున్నావ్
చిన్నా : నేను తప్ప వాళ్ళకి ఇంకెవ్వరున్నారాంటి.. పైగా వాళ్ల మనసుకి నచ్చిన వాళ్ళతో పెళ్లి అనుకుంటుంటే.. ఎలా.. అందరినీ బాధపెట్టేకంటే నేనొక్కడినే బాధపడితే మేలే కదా.. కొన్ని రోజులు ఆగితే నేను కూడా మాములు అయిపోతాను.
ఆంటీ : ఇదంతా శృతికి తెలుసా
చిన్నా : తెలుసు
ఆంటీ : అంటే అన్ని తెలిసి కూడా నిన్ను ఇష్టపడుతుందా
చిన్నా : ఆంటీ..
ఆంటీ : శృతి నీ గురించి నిన్న రాత్రే మొత్తం చెప్పింది కానీ కేవలం తను నిన్ను ప్రేమిస్తుందని మాత్రమే చెప్పింది. అక్షిత విషయం నాకు చెప్పలేదు.
చిన్నా : వీళ్ళ పెళ్ళైయ్యేవరకు ఓపిక పట్టండి ఆంటీ.. ఈ ఒక్క సాయం చెయ్యండి.. మళ్ళీ నేను మీకు కనిపించను..
ఆంటీ : ఒప్పుకుంటున్నాను. అని వెళ్ళిపోయింది.
ఆ తరవాత రోజుల్లో కూడా శృతి నాతో చనువుగానే ఉండేది, శృతి వాళ్ళ అమ్మ తనతో మేము మాట్లాడుకున్న సంగతి చెప్పలేదని నాకు అర్ధమయ్యింది. నేను అలానే మౌనంగా ఉండిపోయాను.
పది రోజుల్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది. అక్షిత వేలుకి పట్టకపోయినా ఉంగరం బలవంతంగా ఎక్కిస్తుంటే దాని మొహంలో నొప్పి చూసి నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు.. నేనేమి ఏడవదలుచుకోలేదు.. నాకు అక్షిత దక్కలేదంతే.. నేను దాన్ని ఒప్పుకున్నాను.. కొంత బాధగా ఉంది అంతే.. నరకంలా ఉంది అంతే..
ఆ రోజు నుంచి అక్షిత లావణ్యల కోసం అన్నదమ్ములు తరచూ ఇంటికి వచ్చేవారు.. వాళ్ల సరదాలు సరసాలు నన్ను చాలా ఇబ్బందులకి గురిచేసేవి. కాబోయే వాళ్ళు కొంచెం అతి చెయ్యడం మామూలే.. ఎక్కువ కాలం షెడ్ లోనే గడపాలని నిర్ణయించుకున్నాను. ఒకరోజు నలుగురు నా షెడ్ కి వచ్చారు.
అక్షిత : అరేయి బైటికి వెళదాం పదా
చిన్నా : పనుంది అమ్మడూ.. కష్టం
లావణ్య : ఎప్పుడు ఉండేదేకదా పదరా వెళదాం
చిన్నా : లేదు లావణ్య.. ఎట్టి పరిస్థితులో రేపు హ్యాండ్ ఓవర్ చేస్తానని మాటిచ్చాను.. మీరు కానివ్వండి.. మళ్ళీ ఎప్పుడైనా వెళదాం
అక్షిత : రావా.. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నీ కోసం
చిన్నా : ఉహు.. కష్టం అని చెప్పి వాళ్ళని కూడా పలకరించి పంపించేసాను.. పావుగంటకి శృతి వచ్చి కూర్చుంది. చెప్పవే ఏంటి సంగతులు
శృతి : సినిమాకి వెళదాం, నువ్వు చూడబోయే మొదటి సినిమా నాతోటే
చిన్నా : కష్టం
శృతి : నేను నిన్ను వస్తావా అని అడగలేదే
చిన్నా : మరి
శృతి : వచ్చి తీరాలంతే.. పొద్దునే బుక్ చేసేసా టికెట్స్
చిన్నా : ఓవర్ చెయ్యకు
శృతి : నా ప్రేమని ఎలానో కాదన్నావ్.. కనీసం నా కోరికలైనా తీర్చు.. నీతో కొన్ని జ్ఞాపకాలు నాకు కావాలి
షటర్ మూసేసాను.. ఇద్దరం సినిమాకి వెళ్ళాము.. సోఫా బుక్ చేసింది. వెళ్లి కూర్చున్నాం. సినిమా మొదలయ్యింది.. మొదటిసారి అంత పెద్ద తెర.. అలా చూస్తూ ఉండిపోయాను.. ఈలలతో కేకలతో హడావిడిగా మొదలయ్యింది. సినిమా మొదలయిన పావుగంటలోనే శృతి నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది.
చిన్నా : ఏంటే..
శృతి : నువ్వు చూడు.. అని కళ్ళు మూసుకుంది.
ఇంటర్వెల్లో లైట్లు వేశారు.. నా ఒళ్ళో గాఢంగా నిద్రపోతున్న శృతిని చూసి తల ఎత్తాను.. నా ఎదురుగా అక్షిత లావణ్య ఇద్దరు కాబోయే వాళ్ళు.. అక్షిత అయితే చేతులు కట్టుకుని కోపంగా చూస్తుంటే నవ్వొచ్చింది.
అక్షిత : హ్యాండ్ ఓవర్, మాటిచ్చా.. కష్టం.. అన్నావ్.. ఇదేనా తమరి కమిట్మెంట్.. మేమింకా నువ్వేదో తెగ కష్టపడిపోతున్నావ్ అనుకున్నాం.
లావణ్య : దొంగవి రా.. నువ్వు
ఏంటి బ్రో ఇలా దొరికేసావ్..
వదిలెయ్యండి ప్లీజ్ అని చేతులు ఎత్తాను దణ్ణం పెడుతూ.. అక్షిత నా పక్కన కూర్చుంది.. లావణ్య మిగతా వాళ్ళు వెళ్లి వాళ్ల సీట్లో కూర్చున్నారు.
అక్షిత : ఇక్కడిదాకొచ్చి కార్నర్ సీట్లో నిద్రపోతుంది.. ఏమైనా చెప్తావా లేదా
చిన్నా : ఏం లేదు.. కానీ చాలా మంచి అమ్మాయి ఈ అమ్మాయి
అక్షిత : అది తెలుసులే.. కానీ మరి ఇలా చిన్నపిల్లలా నీ చెయ్యి పట్టుకుని నీ ఒళ్ళో పడుకుంది.. ఒకప్పుడు నేను కూడా ఇలానే పడుకునేదాన్ని కదా
చిన్నా : నీ కోసం చూస్తున్నాడు వెళ్ళు
అక్షిత నా భుజం మీద కొడుతూ లేచి వెళ్ళిపోయింది. ఆ తరువాత శృతి నా ఒళ్ళో పడుకుందనే కానీ నా చూపు మొత్తం అక్షిత మీదె ఉంది, అది నాది కాదని తెలుసు కానీ జీర్ణించుకోవడానికి నా మనసు అంగీకరించట్లేదు. ఆ అబ్బాయి అక్షితని ముద్దు పెట్టుకుంటూ మీద చెయ్యి వేసినప్పుడల్లా నన్నెవరో ముందు నుంచే గుండెలో తూట్లు పొడుస్తున్నంత బాధ. సినిమా అయిపోయింది అక్షిత లేచి నాకోసం వెనక్కి చూసింది. వెంటనే తల కిందకి దించి శృతిని లేపాను.
శృతి : అయిపోయిందా.. అని కళ్ళు తుడుచుకుంటూ లేచింది
చిన్నా : అయిపోయింది.. ఇంక లెగు
శృతి : ఎందుకంత కోపం.. సినిమా చూడమని తీసుకొచ్చాను అక్షితని చూడమని కాదు
చిన్నా : లేచే ఉన్నావా
శృతి : మొత్తం చూసా.. అస్సలు ఏడవ్వేంట్రా నువ్వు
చిన్నా : అవన్నీ నా వల్ల కానీ పనుల్లే.. పద వెళదాం
ఆ రోజు నుంచి శృతి నాతో తెగ తిరిగేది, వాళ్ళ అమ్మగారు అన్ని గమనిస్తున్నా ఊరుకుంది. పెళ్లి పనులన్నిటికీ నేను శృతినే వెళ్ళేవాళ్ళం. ఇంకా పెళ్ళికి వారం ఉందనగా శృతి వాళ్ళ అమ్మ షాపింగ్ కోసమని వాళ్ళ సొంతూరు కంచికి వెళదాం అంది. ఆంటీ అంకుల్ అక్షితని లావణ్యని తీసుకుని వెళ్లారు. ఆంటీ శృతిని ఒంటరిగా ఎందుకు వదిలి వెళ్లిందో నాకు అర్ధం కాలేదు. ఆ రోజు రాత్రి నేనూ శృతి బైటే తిన్నాం.
ఇంటికి వచ్చాక నా పక్కన పడుకుని నా మీద కాలేసింది.. తల నా గుండె మీద పెట్టింది. నన్ను గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకుంది.