12-03-2023, 08:27 AM
(This post was last modified: 12-04-2023, 01:02 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•12•
చిన్నా : అనుకుంటూనే ఉన్నా నేను.. నీ యవ్వారం చూస్తేనే అర్ధమైపోయింది.. ఎవరు..? ఏం చేస్తాడు..? అస్సలు అదేది.. ?
లావణ్య : అదిగో అక్కడ మూలన దాక్కుంది.. అది కూడా లవ్ చేసింది.. ముందు నన్ను చెప్పమని తోసింది
చిన్నా : ఓహ్.. మీ కాలేజీ ఫ్రెండ్స్ ఆ..?
అక్షిత నవ్వుతూ తలుపు చాటు నుంచి లోపలికి వచ్చింది.
అక్షిత : అవును.. కానీ ఇద్దరు సొంత అన్నదమ్ములే.. ఒకే ఇంటి వారు.. నేను అన్నయ్యని లవ్ చేస్తే అది తమ్ముణ్ణి లవ్ చేసింది.. వాళ్ళ ఇంట్లో చెప్పారట వాళ్ళు ఒప్పుకున్నారు.. ఇప్పటి వరకు అందుకే నీకు చెప్పలేదు.. వాళ్ళు ఇంటికి వస్తాం అంటున్నారు.
చిన్నా : రమ్మను
లావణ్య : నువ్వేమంటావ్
చిన్నా : నేనేమంటా.. ముందు చూడడానికే కదా రమ్మంది.. ఎప్పుడు వస్తారట
అక్షిత : కబురు చెయ్యనా
చిన్నా : చెయ్యి.. అక్షిత సంతోషంగా ఫోన్ అందుకుని పరిగెత్తింది.
లావణ్య : చిన్నా.. నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేసావా
చిన్నా : నాకంత టైం ఉందా
లావణ్య : శృతితో..
చిన్నా : లేదు
అక్షిత నవ్వుతూ వచ్చింది..
అక్షిత : ఇవ్వాళ వస్తారట.. చిన్నా..
చిన్నా : హా..
అక్షిత : నువ్వు శృతి కూడా మాట్లాడేసుకుంటే ఒక పని అయిపోద్ది.. ముగ్గురం ఒకేసారి పెళ్లి చేసుకోవచ్చు
చిన్నా : నేను శృతి పెళ్లి చేసుకుంటామని నీకు ఎవరు చెప్పారు
అక్షిత : అదేంటి మీరిద్దరూ చేతుల్లో చెయ్యేసుకుని తిరగడం ఎన్ని సార్లు చూడలేదు
చిన్నా : అయితే.. తను నన్ను పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నావ్
లావణ్య : ఏ.. నీకేం తక్కువ
చిన్నా : మొన్న మీరిద్దరూ మీ స్నేహితులకి నన్ను మెకానిక్ గా పరిచయం చెయ్యడానికే చాలా ఇబ్బంది పడ్డారు.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మీకే అలా అనిపించినప్పుడు.. మీ ఇద్దరి కంటే తను ఎక్కువ సంపాదిస్తుంది, పెద్ద ఉద్యోగం.. ఆస్తిలో కులంలో మనకంటే చాలా.. చాలా రెట్లు ఎక్కువ స్థాయిలో ఉంది. తను నన్ను పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నారు మీరు..?
ఇద్దరు తలలు కిందకి వేసుకున్నారు, లావణ్య తల ఎత్తి ఏదో మాట్లాడబోయింది.
చిన్నా : ముందు ఆంటీ వాళ్ళకి చెపుదాం రండి అని బైటికి నడిచి శృతి వాళ్ళ ఇంటికి వెళ్లాను.. ఆంటీ ఉన్నారా
ఆంటీ : ఏం బాబు శృతి కోసమా.. రెడీ అవుతుంది కూర్చో
చిన్నా : లేదాంటీ.. అక్షితనీ లావణ్యని చూసుకోవడానికి వస్తున్నారు.. పెళ్లి ఖాయమే.. ప్రేమించుకున్నారట.. ఇద్దరు అన్నదమ్ములేనట.. ఇవ్వాళ చూసుకోవడానికి వస్తామన్నారు.. మీకోసం వచ్చాను
ఆంటీ : అలాగా.. వస్తాను.. ఒక అరగంట అయితే ఈ పని అయిపోతుంది.. అంకుల్ ని కూడా ఉండమని చెపుతాను.. చిన్న పిల్లాడివి నువ్వు అన్ని మాట్లాడలేవు.
చిన్నా : చాలా థాంక్స్ ఆంటీ.. నేను అదే అడుగుదామని వచ్చాను.. మీరే వస్తామన్నారు
ఆంటీ : మరేం పరవాలేదు
శృతి లోపల నుంచి హాల్లోకి వచ్చింది.
ఆంటీ : ఏమే.. అక్షిత లావణ్యని చూసు...
శృతి : వినపడింది.. ఇంకోసారి రిపీట్ చెయ్యకు అంటూనే నా వంక కోపంగా చూస్తూ కిచెన్ లోకి వెళ్లి మళ్ళి బైటికి వచ్చింది.
ఆంటీ : అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి మనకి తప్ప
శృతి : ఆపు.. నేను ఆఫీస్ కి వెళుతున్నా అని కేక వేస్తూ నన్ను చూసింది.
ఆంటీ : అదేంటే ఉండు ఇవ్వాళ ఒక్కరోజు..
చిన్నా : ఉండు ప్లీజ్.. అన్నాను ఆంటీకి వినపడకుండా
శృతి : ఉంటాలే అని తన అమ్మకి చెప్పి లోపలి వెళ్ళిపోయింది.
నేను అక్కడ నుంచి బైటికి వచ్చేసి ఇంట్లోకి వెళ్లాను. అక్షిత పిలిచింది.
అక్షిత : ఏమన్నారు ఆంటీ వాళ్ళు
చిన్నా : వస్తామన్నారు.. వాళ్ళు ఎప్పుడు వస్తారట
అక్షిత : మధ్యాహ్నం వస్తామన్నారు.. వాళ్ళకి కూడా తొందరగానే ఉంది పెళ్లి చేసెయ్యాలని.. వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకుని చాలా ఏళ్ళు అయిపోయిందట.. అందుకే ఇందాక ఫోన్ చెయ్యగానే వస్తామన్నారు.
లావణ్య : చిన్నా.. నువ్వు వాళ్ళని చూడలేదుగా ఇదిగో అని ఫోన్ ఇచ్చింది.
చూసాను, ఇద్దరు హీరోల్లా ఉన్నారు.. వాళ్ళని చూడగానే నా పొట్టని కొంచెం లోపలికి అనుకువాలనిపించింది. బాగున్నారని తిరిగి ఫోన్ తన చేతికిచ్చేసాను.
అక్షిత : చిన్నా.. నువ్వు దుబాయి నుంచి పంపించిన డబ్బులన్నీ నా దెగ్గరే ఉన్నాయి.. నీకు పంపించెయ్యనా..
శృతి : ఏంటప్పుడే పంపకాలు కూడా చేసుకుంటున్నారా.. మీ స్పీడ్ చూస్తుంటే పెళ్లయ్యాక మళ్ళీ మా మొహాలు కూడా చూసేలా లేరే..
అక్షిత : అదీ.. ఖర్చులు ఉంటాయిగా.. ఊరికే నన్నేం అడుగుతాడని.. కూర్చో శృతి..
శృతి : కంగ్రాట్స్ అని ఇద్దరికీ చెయ్యిచ్చింది.. రేయి అమ్మ నిన్ను రమ్మంటుంది.. ఏవో తేవాలట వెళ్ళు
చిన్నా : వెళుతున్నా అని లేచాను..
శృతి : రోజు మెట్లెక్కి తెగ ముచ్చట్లు ఫోన్లో.. అప్పుడే అనుకున్నాం.. నేను చిన్నా
లావణ్య : చిన్నాకి ముందే తెలుసా
శృతి : ఎవరికైనా తెలుస్తుంది.. అందులో ఆశ్చర్యం ఏముంది.. ఒక్క అక్షిత విషయంలోనే అస్సలు ఎక్సపెక్ట్ చెయ్యలేదు.. చాలా సైలెంట్ గా ఉండేది.
అక్షిత : ముందు లవ్ చేసింది నేనే.. రోజు కలుస్తుంటే వాళ్ళ తమ్ముడు ఇది కూడా కనెక్ట్ అయ్యారు.
శృతి : పోనీలే.. మంచిదేగా.. మీ స్నేహం విడిపోకుండా ఒకే ఇంటికి చేరుతున్నారు.
లావణ్య : అవును.. చిన్నా గాడొక్కడే బాలన్స్.. వాడి పెళ్లి కూడా అయిపోతే..
శృతి : చూడండి మీరే మంచి లో క్లాస్ అమ్మాయిని.. అందంగా లేకపోయినా పరవాలేదు కానీ కొంచెం కృతజ్ఞత ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది.. అంటే వాడు ఎప్పుడు ఇంట్లో ఉండడు కదా.. ఇంటి పట్టున ఉంటూ వాడిని చూసుకునే అమ్మాయి కావాలి.
అక్షిత ఫోన్ రింగ్ అయ్యింది, స్క్రీన్ మీద లవ్ అని చూడగానే శృతికి కోపం వచ్చేసింది.. అక్షిత తన మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే కనిపించకుండా పిడికిలి బిగించి మళ్ళీ నాకెందుకు అన్నట్టుగా కూర్చుంది.
లావణ్య : శృతీ.. నీ మనసులో ఏమైనా ఉందా.. నీకు నచ్చకుండా ఏమైనా జరుగుతుందా.. ఎందుకు అలా మాట్లాడావ్
శృతి : నిన్న నాకు చిన్నాకి చిన్న గొడవ అయ్యిందిలే.. ఇందాక మళ్ళీ గెలికాడు.. పొద్దున్నే నాకు నచ్చని వార్త ఒకటి చెప్పి ఆటపట్టించేసరికి కొంచెం కోపం వచ్చింది.. మీ సంగతి చెప్పు.. పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు.
లావణ్య : ఈ నెలలో పెళ్లి అయిపోవాలని, మేము నలుగురం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం శృతి.. అనుకున్నట్టే వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒప్పుకున్నారు. కానీ ఈ అక్షితే.. చిన్నాకి ఇప్పుడే చెప్పొద్దని నన్ను ఆపేసింది.. పొద్దున నేను సడన్ గా చెప్పేసరికి వాడి మొహం మాడిపోయింది.. బాధ పడ్డాడేమో.. చాలా డల్ అయిపోయాడు.. పైకి అలా లేడు కానీ నాకు తెలుస్తుంది.
శృతి : వాడికివన్ని మామూలేలే.. ఏదైనా పని ఉందా.. ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు.. మీ కోసం నన్ను వాడు ఇవ్వాళ ఆఫీస్ కి కూడా వెళ్ళనివ్వలేదు.
లావణ్య : మీరు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు
శృతి : అవును వాడు చాలా మంచి ఫ్రెండ్, దాని అర్ధం మనం అని కాదు..
లావణ్య : అంటే..
శృతి : నువ్వే చెప్పావు కదా.. మిమ్మల్ని కాపాడాడు.. మీ కోసం కష్టాలు పడ్డాడు.. మీ కోసం దేశం కానీ దేశం వెళ్లి అక్కడ ఎన్ని పాట్లు పడ్డాడో నాకు చెపుతుంటే ఏడుపు వచ్చింది.. కానీ మీరు కనీసం మీ ప్రేమ విషయం కూడా వాడికి ఏదో బైట వాళ్లకి చెప్పినట్టు అంతా అయిపోయి మీకు మీరు సెట్ చేసుకున్నాక చెప్పారు.. ఇందాక అందుకే అలా మాట్లాడాను.
లావణ్య : అవును.. నేను వాడికి సారీ చెప్పాలి
శృతి : ఏం కాదులే.. నేను కూడా అంతే కొంచెం సెల్ఫిష్ వాడికి అది నచ్చదు అయినా కూడా నాతో స్నేహం చెయ్యట్లేదు.. పదా రెడీ అవ్వండి.. నేనొక సారి ఇంటికెళ్లి వస్తా అని లేచింది.. వెనక చిన్నా అక్కడే నిలుచుని శృతి వంక కోపంగా చూసేసరికి అక్కడినుంచి జారుకుంది.
లావణ్య : చిన్నా.. సారీ రా
చిన్నా : ఎవరో ఏదో వాగారని నువ్వెందుకు బాధ పడుతున్నావ్.. ఇన్ని రోజులు నాకు ఒక టెన్షన్ ఉండేది, రేపు నీకు పెళ్లయ్యాక ఎలా ఉంటావో ఏంటో అని.. కానీ ఇప్పుడు ఆ గొడవే లేదు.. ఆ రాక్షసి ఉందిగా.. అంతా అది చూసుకుంటుంది..
అక్షిత : ఎవరినిరా.. రాక్షసి అని తిడుతున్నావ్
చిన్నా : ఒకటి ఉందిలే.. మాకు తెలిసిన దయ్యం.. కద లావణ్య
లావణ్య నవ్వుతూ అవును అంది
అక్షిత : నన్నే మీరు అనేది..
చిన్నా : అవును నిన్నే అనేది.. అన్ని చెప్పకుండా సెట్ చేసుకున్నావ్ గా.. మళ్ళీ మాతో ఏం పని నీకు అని తల మీద ఒక్కటి మొట్టాను.
అక్షిత మౌనంగా నా పక్కన కూర్చుని తల నా భుజం మీద పెట్టుకుంది..
చిన్నా : సరదాగా అన్నానే
అక్షిత : లేదురా.. నువ్వు మా కోసం ఎంతో చేసావ్.. నీకు మానుంచి భారం కాదలుచుకోలేదు.. మా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదని అని ఇంటి విషయం ఈ విషయం నేనే చూసుకోవాలనుకున్నాను.. అంతే కానీ నిన్ను తక్కువ చెయ్యాలని కాదు.. ఆ రోజు మా ఫ్రెండ్స్ ముందు కూడా నేను ఇబ్బంది పడింది వాళ్ళు నిన్నెక్కడ చులకనగా చూస్తారేమో అని.. అంతే కానీ నువ్వంటే కాదు.. నా చేతులు పట్టుకుని.. ఈ చేతుల వల్లే కదరా మేము ఇలా ఉంది.. లేకపోతే మా జీవితాలు తలుచుకుంటేనే నాకు నిద్ర పట్టదు.. కలలు కూడా వస్తాయి.. నాకు ఏ ఆపద వచ్చినా ఆ రోజు నువ్వు వచేస్తావ్.
చిన్నా : ఆమ్మో.. ఎమోషనల్ డామేజి.. ఇక్కడే ఉంటే సీరియల్ చూపించేలా ఉన్నారు. అని నవ్వుతూ లేచి బైటికి పరిగెత్తాను నా ఏడుపుని బిగపట్టుకుని..