12-03-2023, 08:27 AM
(This post was last modified: 10-04-2023, 10:06 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•11•
ఒకరోజు సాయంత్రం షెడ్లో ఉండగా శృతి వచ్చి కూర్చుంది.
చిన్నా : ఏంటి మేడం గారు, వెళ్లలేదా ఆఫీస్ కి ఇవ్వాళా
శృతి : లేదురా.. మధ్యలోనే వచ్చేసా.. తల నొప్పిగా ఉంటేనూ..
చిన్నా : ఎందుకట నీ తలకి నొప్పి
శృతి : దాని బాధ దానిది.. ఇంకా.. అక్షితకి నీ లవ్ మ్యాటర్ ఎప్పుడు చెపుతున్నావ్
చిన్నా : నేను చెప్పదలుచుకోలేదే.. రోజూ చూస్తున్నా.. రోజూ గణేష్ ని అడుగుతున్నా.. ప్రతీ వినాయకచవితికి మొక్కి నా చేత్తోనే ఆయనకి సేవలు చేసి నిమజ్జనం చేస్తున్నా.. ఆయనకి మమ్మల్ని కలపాలని ఉంటే కలుపుతాడు లేదంటే లేదు
శృతి : అలా అంటే ఎలా రా.. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా.. అంతా ఆయన మీదకి తోస్తే ఎలా
చిన్నా : ఎందుకో నాకు అక్షితకి కుదరదు అనిపిస్తుంది శృతి
శృతి : ఎందుకు అలా అంటున్నవ్.. నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం
చిన్నా : ఇప్పుడు అలా లేదేమో.. మొన్న అక్షిత వాళ్ళ స్నేహితులు ఇంటికి వచ్చారు.. వాళ్ళకి నేను మెకానిక్ పని చేస్తానని చెప్పడానికి కొంత ఇబ్బంది పడింది.. తన మొహంలో గమనించాను.
శృతి : వాళ్ళని నిలబెట్టింది ఈ మెకానిక్ చేతులే అన్న సంగతి మర్చిపోయారా.. పోగరు బాగా నెత్తికెక్కినట్టుందే
చిన్నా : ఓయి..
శృతి : వాళ్ళని ఏం అనకూడదు అంతేనా
చిన్నా : అంతే
శృతి : పోనీ నన్ను అడగమంటావా.. నీ గురించి.. ఏ విషయం తెల్చేస్తా.. ఒక్క మాటలో అయిపోద్ది.. ఏమంటావ్
చిన్నా : నువ్వు మధ్యలో దూరి చెడకొట్టకు.. వాళ్ళు బాధపడితే నేను చూడలేను.. ఒక వేళ నా మీద అక్షితకి ప్రేమ లేకపోతే ఇది ఇలాగే ఉండనీ.. నాతోనే ఉండిపోద్ది.. తనకి తెలిసి తను బాధపడి అది చూసి నేనూ బాధపడి ఎందుకు చెప్పు
శృతి : ఏంటో.. నీ మీద కోపం రావట్లేదు..
చిన్నా : మాటివ్వు.. అని చెయ్యి చాపి.. బలవంతంగా ఒట్టు వేపించుకున్నాను.
శృతి : ఇంక పోదాం పద.. ఫలుదా తిందాం.. చాలా రోజులు అవుతుంది.
చిన్నా : పదా అని అన్ని సర్ది, బండ్లు లోపల పెట్టి షటర్ కట్టేసి ఇంటి దారి పట్టాము.. శృతి నా చెయ్యి పట్టుకుని నడుస్తుంది.
శృతి : జీవితం ఎటు పోతుందో అర్ధం కావట్లేదు చిన్నా.. ముందుకు వెళుతుంది కానీ నా జీవితంలో అర్ధం లేదు.. ఏటూ ఏది తెల్చుకోలేకపోతున్నాను.
చిన్నా : నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెయ్యి
శృతి : అదే చేస్తాను.. నీ లావణ్యకి లవర్ ఉన్నాడని అనుమానం నాకు
చిన్నా : నాకూ ఉంది.. ఫోన్ రాగానే పరిగెత్తిద్ది
శృతి : అక్షిత..?
చిన్నా : తెలీదు.. అది తెలివికల్లది అంత ఈజీగా దొరకదు..
శృతి : ఒకవేళ ఉంటే
చిన్నా : ఉంటే ఏం చేస్తా.. వాళ్ళకి పెళ్లి చేస్తా
శృతి : చెప్పినంత ఈజీ కాదు
చిన్నా : అప్పుడు చూద్దాం
శృతి : మరి అప్పుడు నీ సంగతేంటి..?
చిన్నా : నేనా.. ఇంకా ఏమి ఆలోచించలేదు
శృతి : నన్ను చేసుకుంటావా
తన చెయ్యి వదిలేసాను, వెంటనే నా చెయ్యి పట్టుకుని నన్ను దెగ్గరికి లాక్కుంది.. నా కళ్ళలోకి చూస్తూంటే నా నోటా మాట రాలేదు.
శృతి : చిన్నా.. ఒకవేళ అలా జరిగితే నన్ను చేసుకుంటావా
చిన్నా : ఆకలేస్తుంది.. వెళ్ళాలి..
నా చెయ్యి వదిలేసింది.. వెనక్కి చూడకుండా పారిపోయాను.. తెల్లారి వాకింగ్ కి వెళ్ళలేదు. శృతితో నా మాటలు తగ్గాయి.. కొన్ని రోజులు మౌనంగా గడిచిపోతున్నాయి. ఒక రోజు లావణ్య నేను షెడ్ కి వెళుతుంటే ఆపింది.
లావణ్య : చిన్నా.. నీతో కొంచెం మాట్లాడాలి.
చిన్నా : చెప్పవే..
లావణ్య : ఇలా కాదు.. రా అని చెయ్యి పట్టుకు లాగి నన్ను మంచం మీద కూర్చోపెట్టింది.
చిన్నా : ఏంటే.. చెప్పు
లావణ్య : నేనొక అబ్బాయిని ఇష్టపడ్డాను.. అని నన్ను చూసింది..