12-03-2023, 08:26 AM
(This post was last modified: 09-04-2023, 08:24 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•8•
దుబాయి వెళ్లే రోజున అక్షిత మరియు లావణ్య ఇద్దరు కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకుంటే చూడలేక ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాను. మమ్మల్ని గంపుగా ఫ్లైట్ ఎక్కించారు నా సీట్లో కూర్చున్నాను.. గణేష్ ని తీసుకెళ్లలేదు.. భయంగా ఉంది.. నా చేతుల్లో ఉందల్లా అమ్మ ఫోటో మాత్రమే.. ఫ్లైట్ ముందుకు వెళుతుంటే ఎంతగా ఏడ్చానో నాకే తెలుసు అన్నిటికి ఆ గణేషుడే ఉన్నాడు ఆయనే చూసుకుంటాడని ఆయన్ని అమ్మని తలుచుకుని కళ్ళు మూసుకున్నాను.
మూడు నెలల వరకు అస్సలు నాకు తీరికే లేదు, నేను సర్దుకుని అలవాటు పడడానికి ఇంత సమయం పట్టింది. నాతో మాట్లాడడానికి అటు వాళ్ళ దెగ్గర ఫోన్ లేదు ఇటు నా దెగ్గర కూడా లేదు.. నాతో మాట్లాడాలంటే వాళ్ళు నన్ను పంపించిన ఆ ఆఫీస్ కి వెళ్లాల్సిందే.. ఈ మూడు నెలల్లో అక్షితతో మూడు సార్లు మాత్రమే నేను మాట్లాడింది. రోజులు చాల భారంగా గడుస్తున్నాయి కానీ ఇందులో సంతోషకరమైన విషయం ఏంటంటే రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి.. ఇక్కడ పనిచేయడం, పడుకోవడం తప్పితే వేరే వ్యాపకం లేదు.. పని.. నిద్ర.. పని.. నిద్ర.. రోజులు చాలా త్వరగా వెళ్లిపోతున్నాయి.
డబ్బు మొత్తం అక్షితకే పంపిస్తున్నాను, తన స్నేహితురాలి బావ ఇల్లు కట్టి అమ్ముతాడట కొత్తగా కట్టిన ఇల్లు ఒకటి ఉంది అక్షిత కోసం తక్కువలోనే ఇస్తాడు లోన్ పెడతాను అని చెపితే తనకి తోచింది చెయ్యమన్నాను.. ఇల్లు ఇద్దరి పేరు మీదా తీసుకోమన్నాను దానికి సరే అంది.
అక్షిత, లావణ్య ఇద్దరు పార్ట్ టైం చేస్తూ డిగ్రీ జాయిన్ అయ్యారట, సర్టిఫికెట్స్ మానేజ్ చేశారట.. ఇద్దరం బాగా చదువుతున్నాం అని లావణ్య చెప్పింది.
చిన్నా : హలో
అక్షిత : ఎలా ఉన్నావ్ రా.. మేము గుర్తొస్తున్నామా
చిన్నా : రోజూనే.. అయినా ఇంకొక్క పది నెలలు అంతేగా వచ్చేస్తా.. ఎంతలో అయిపోయాయి చూడు
అక్షిత : ఎలా ఉన్నావో ఏంటో.. ఇది నీ మీద బెంగ పెట్టుకుంటుంది
చిన్నా : నీకు లేదా బెంగ
అక్షిత : ఏం మారలేదు.. కామేష్.. హహ.. చెప్పరా ఇంకా
చిన్నా : ఎక్కడిదాకా వచ్చింది మీ డిగ్రీ
అక్షిత : దెగ్గర పడింది, ఇంకో సంవత్సరం అంతే..
చిన్నా : ఇంకా
అక్షిత : ఇద్దరం ఫోన్లు కొనుక్కున్నాం.. ఇంటి లోను నెల నెలా కడుతున్నాం.. సాగుతున్నాయి.. నీ సంగతి ?
చిన్నా : ఇక్కడేముంది.. తినడం పనిచెయ్యడం నిద్రపోవడం ఈ మూడే
అక్షిత : ఉండేనా మరీ..
చిన్నా : ఉమ్మ్.. బై
ఫోన్ పెట్టేసి అక్షిత మొహం తలుచుకున్నాను.. కనీసం ఒక్క ఫోటో కూడా తెచ్చుకోలేదు.. ఇద్దరు ఎలా ఉన్నారో.. చూస్తుండగానే నా మూడేళ్ళ కాంట్రాక్టు అయిపోవచ్చింది కానీ ఏదో చిన్న సమస్య వచ్చిందన్నారు. మా వర్క్ పర్మిట్ అయిపోయింది కనిపిస్తే లోపల వేస్తారని భయపెట్టారు.. దేశం కానీ దేశంలో ఇరుక్కుపోయామా అనిపించింది. పని చేపించుకుంటున్నారు డబ్బులు వేస్తున్నారు కానీ మమ్మల్ని ఇండియా ఎప్పుడు పంపిస్తారని అడిగితే మాత్రం సమాధానం రావడంలేదు.. అందరం కలిసి ధర్నా చేద్దాం అని నిర్ణయించుకున్నాం కానీ ఆలా చేస్తే మా గురించి అందరికి తెలిసి మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో అని భయపడి ఆ ప్రయత్నం మానుకున్నాము.
ఇంకో రెండు సంవత్సరాలు పట్టింది, ఈ గొడవల్లో పడి నేను అక్షిత వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోయాను.. వాళ్ళు ఈ మధ్య నెలకి ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యడం లేదు.. ఏడుపొస్తుంది.. ఫోన్ చేసినా అరాకోరా మాట్లాడి పెట్టేస్తున్నారు.. మా ఓపిక అయిపోతుందనగా ఇంకో వారంలో ఇండియా వెళ్ళిపోతున్నామని ప్రకటించారు.. ఇంత సంతోషం నాకు ఎప్పుడు వెయ్యలేదు
ఐదున్నర ఏళ్ళు ఎలా గడిచిపోయాయో నాకు తెలీదు కానీ, ఈ ఒక్క వారం మాత్రం దుబాయిలో గడిపిన సమయం మా అందరికి నరకంలా తోచింది.. నా బాధ అయితే వర్ణాతీతం.. ఫ్లైట్ ఎక్కి కూర్చుంటే కానీ మమ్మల్ని మేము నమ్ముకోలేకపోయాం.. అందరూ ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఎంత ఆరాటపడుతున్నారో.. నా పక్కనే కూర్చున్న సలీంకి కొడుకు పుట్టి ఐదేళ్ళు అవుతుంది, ఇంతవరకు తన కొడుకుని చూసుకుంది లేదు.. తన కళ్ళలో ఆ మెరుపు, పట్టరాని సంతోషంతో నన్ను వాటేసుకున్నాడు.. నేనూ అంతే.. అక్షితనీ లావణ్యని చేస్తానన్న సంతోషంలో ఇంకా గట్టిగా వాటేసుకున్నాను.
ఎలాగోలా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బైటికి వచ్చి నిలుచున్నాను.. నాకోసం లావణ్య వచ్చింది.. దాన్ని చూడగానే ఏడుపు వచ్చేసింది.. పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాను, ఇద్దరం ఏడ్చుకున్నాం.. అక్షిత కోసం నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి.
చిన్నా : అదెక్కడా
లావణ్య : ఏదో పని ఉందని బైటికి వెళ్ళింది.. పదా వెళదాం.. చాలా మారిపోయావ్ రా.. అంకుల్లా తయారయ్యావ్.. ఆ పొట్ట ఏంటి
చిన్నా : మెకానిక్ నే.. నేను.. జింకి వెళ్ళానా సిక్స్ పాక్స్ తో రాడానికి..
ఇద్దరం బైటికి వచ్చాం.. నేను నడుస్తుంటే లావణ్య త్వరగా వెళ్లి స్కూటీ తీసుకొచ్చింది.
చిన్నా : ఎవరిదే ఇది..
లావణ్య : మనదే.. ఇద్దరం కలిసి తీసుకున్నాం
చిన్నా : బాగుంది
లావణ్య : నడుపుతావా
చిన్నా : వద్దులే.. నడుపు.. చూస్తాను ఎలా నడుపుతావో
లావణ్య నవ్వుతూ ముందుకు వెళుతుంటే తన భుజం మీద చెయ్యి వేసి ఊరు చూస్తున్నాను
చిన్నా : ఎలా ఉండే సిటీ ఎలా మారిపోయిందే
లావణ్య : అవును.. తెలంగాణ విడిపోయాక కెసిఆర్ సీయం అయ్యాక చాలా మార్పులు జరిగాయి.. రోజూ ఏదో ఒక అభివృద్ధి జరుగుతూనే ఉంది.
చిన్నా : కనిపిస్తుంది
చాలా సేపటి ప్రయాణం తరువాత సందులు గొందులు తిప్పి నన్ను ఒక ఇంటి ముందుకు తీసుకెళ్లింది.
లావణ్య : ఇదేరా మన ఇల్లు.. ఇవ్వాళ పక్కింట్లో గృహ ప్రవేశం.
చిన్నా : టెంటు కనిపిస్తుందిగా.. అని మాట్లాడుతూనే చుట్టు చూస్తూ ఎందుకో తల పైకి ఎత్తాను, ఎవరో ఒక అమ్మాయి పక్కింటి మేడ మీద నిలుచుని నన్నే చూస్తుంది.. అంత ఎండలో నిలుచుంది ఏంటా అనుకున్నాను.. ఒక్కసారి ఆ అమ్మాయిని చూసి లోపలికి వెళ్లాను.
సాయంత్రం వరకు తీరికగా ముచ్చట్లు పెట్టుకున్నాం. లావణ్య తన ఫోన్ చూపించింది.. అక్షితకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా అది తీయలేదు. చీకటి పడుతుండగా గేట్ చప్పుడు అయ్యేసరికి తల తిప్పి చూస్తే అక్షిత ఫోన్ మాట్లాడుతూ గడప పట్టుకుని ఒక కాలు ఎత్తి కాళ్ళకి సండల్స్ విప్పుతూ నన్ను చూసి నవ్వింది.
లేచి నిలుచున్నాను, అక్షిత జీన్స్ వేసుకుంది, చాలా పొడవు పెరిగింది, ఒళ్ళు వస్తుందేమో అనుకున్నా కానీ లేదు బక్కగానే ఉంది.. లోపలికి వస్తూనే ఫోన్ జోబులో పెట్టుకుని నవ్వుతూ వచ్చి వాటేసుకుంది.. గట్టిగా పట్టేసుకున్నాను.. ఏడుపు వచ్చేసింది.. లావణ్య కూడా వచ్చింది ముగ్గురం కరుచుకున్నాం.. తలుపు శబ్దం అయితే ముగ్గురం తలుపు వైపు చూసాం.. మధ్యాహ్నం నేను ఇంట్లోకి వస్తుంటే మేడ మీద నుంచి నన్ను చూసిన అదే అమ్మాయి.. చేతిలో బేషన్ ఉంది.
మీకు భోజనం ఇద్దమనీ..
లావణ్య : లోపలికి రా
ఆ అమ్మాయి లోపలికి వచ్చింది..
లావణ్య : నా పేరు లావణ్య.. తను అక్షిత.. తను చిరంజీవి.. మేము ముగ్గురమే ఉండేది
భోజనం అక్షిత చేతికి ఇస్తూ.. మధ్యనమే పలకరిద్దాం అనుకున్నాను కానీ చుట్టాల వల్ల కుదరలేదు.
అక్షిత : పేరు చెప్పలేదు...?
నా పేరు శృతి