12-03-2023, 08:25 AM
(This post was last modified: 17-04-2023, 06:57 PM by Pallaki. Edited 3 times in total. Edited 3 times in total.)
•4•
చిన్నా : మమ్మీ.. మమ్మీ.. కాలేజీకి టైం అవుతుందే, త్వరగా కానీ..
అక్షిత : అయిపోయింది.. పొద్దున్నే లేచి తమరి పనులు తమరు చేసుకుంటే ఇంత బాధ పడనవసరంలేదు కదా
చిన్నా : నీకే నువ్వెన్నైనా చెప్తావ్, కష్టపడి చదివేది నేనూ
అక్షిత : అబ్బో.. అందుకేనా రెండు బ్యాక్లాగ్స్ ఉన్నాయి నీకు ?
చిన్నా : ఏ.. పోవే.. నేను వెళ్ళాలి.. ముందు టిఫిన్ పెట్టు
అక్షిత : కూర్చో పదినిముషాలు పడుతుంది.
చిన్నా : హబ్బా..
అక్షిత : ఏవండీ.. కొంచెం ఆ న్యూస్ ఛానల్ కట్టేసి ఇటు రండీ
అమూల్య : అమ్మా జడ
అక్షిత : ఉండవే వేస్తాను.. అని ఇడ్లీ మూతని తీస్తుంటే చెయ్యి కాలి కెవ్వుమంది
శ్రీధర్ : అబ్బబ్బబ్బా.. రోజూ పొద్దున్నే ఇల్లు సత్రంలా తయారవుతుందే.. దానికి జడెయ్యిపో.. ఈ ఇడ్లీ సంగతి నేను చూస్తాను.
అక్షిత వెళ్లి గబగబా తన కూతురికి జడ వేసి తిరిగి కిచెన్ లోకి వెళ్లి పని చేసుకుని ముందు మొగుడిని తన వెంట కూతురిని ఆ వెంటనే కొడుకుని పంపించేసి చకచకా తయారయ్యి తన పక్కింట్లో కాపురముంటున్న తన స్నేహితురాలు కం ఇంటి తోడికోడలు, అక్క అయిన లావణ్యని కేకేసింది.
లావణ్య : హా వస్తున్నా
అక్షిత : ఎంతసేపే టైం అవ్వట్లా
లావణ్య : అయిపోయింది బంగారం, నువ్వు ఇల్లు లాక్ చేసి వచ్చేసరికి నేను బైటుండక పోతే అడుగు
అక్షిత కానీ త్వరగా అని లోపలికి వెళ్ళిపోయింది. హ్యాండ్ బాగ్, కార్ తాళాలు, ఇంటి తాళాలు తీసుకుని హాల్లోకి వచ్చేసరికి టీవీ మోగుతూనే ఉంది. ఈ నా మొగుడున్నాడే పిల్లల కంటే అధ్వాన్నం, వచ్చాక చెపుతా నీ సంగతి అని నవ్వుతూ తిట్టుకుంటూ రిమోట్ తీసి ఆపడానికి టీవీ వంక తిరిగింది.
బైట నిలబడి అక్షిత కోసం ఎదురుచూస్తున్న లావణ్య, అక్షిత ఎంతకీ రాకపోవడంతో తనే లోపలికి వెళ్ళింది. ఏంటే నన్ను గోలగోల చేసి బైట ఎండలో నిలుచోబెట్టి ఇక్కడ నువ్వు టీవీ చూస్తున్నావా అని కసురుతూ చెప్పులు విప్పి తలుపు నెట్టి లోపలికి వెళ్ళింది.
అక్షిత కూర్చుని టీవీ చూస్తున్నట్టు లేదు ఆ వాలకం, అన్ని తలుపులు వేసి ఉండటం వల్ల చీకటికి కనిపించక హ్యాండ్ బాగ్ లోనుంచి కళ్ళజోడు తీసి పెట్టుకుని చూసింది. అక్షిత కళ్ళనుంచి ధార, కంగారుగా దెగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుని గడ్డం పట్టుకుని కదిలించింది. అయినా అక్షిత మొహం తిప్పకపోవడంతో వెనక్కి తిరిగి టీవీ చూసి ఒక్క నిమిషం ఏమి అర్ధంకాక లేచి నిలబడి టీవీలో కనిపిస్తున్న చిరంజీవి మొహం గుర్తుపట్టి అక్షిత భుజం మీద చెయ్యి వేసి అడుగు వెనక్కి వెయ్యబోయి సోఫా తగలడంతో పడిపోయింది.
టీవిలో వాడి మీద వస్తున్న వార్త, ఇన్నేళ్ల తరువాత వాడిని అలా చూడటం ఇటు అక్షితకి అటు లావణ్యకి ఇద్దరికీ కళ్ళు బైర్లు కమ్మినట్టు అయ్యింది. తెరుకునే సరికి కొంత సమయం పట్టింది. లావణ్య వెంటనే తన కొడుక్కి ఫోన్ చేసి ఉన్నపళంగా ఇంటికి రమ్మంది.
చిరంజీవి, వేణు లిద్దరు ఇంటికి వచ్చారు. అప్పటికప్పుడు కారు చెన్నై బైలుదేరింది, చిరంజీవికి తమ అమ్మ ఎందుకు ఏడుస్తుందో కూడా తెలీదు కానీ జరుగుతుంది వాళ్ల నాన్నలకి ఫోన్ చేసి చెప్పారు. వేణు మాత్రం తన అమ్మ ఇంతవరకు ఏడవటం చూడలేదు, ఎప్పుడు హైపర్ గా ఉండే తన అమ్మ చిన్నపిల్లలా బిక్కు బిక్కుమంటూ ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు.. ఇద్దరు మొగుళ్ళు పెళ్ళాలకి ఫోన్ చేసినా ఎవ్వరు ఎత్తలేదు మధ్యలో కొడుకులు పలకరించినా పలకలేదు, ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. అటు లావణ్య ఇటు అక్షిత ఇద్దరు గతంలోకి వెళ్లిపోయారు. కారు పరుగులు తీస్తుంది.
ఇటు జైల్లో కూర్చున్న చిరంజీవి పరిస్థితి కూడా అలానే ఉంది ఇంతలో కానీష్టేబుల్ వచ్చి నిన్ను చూడటానికి ఎవరో వచ్చారని చెపితే తల ఎత్తి ఎవరు అని మాత్రమే అనగలిగాడు. అవతల వాడి గొంతు నుంచి శృతి అని వినిపించగానే చిరంజీవి కళ్ళలో నీరు ఒక్కసారిగా చేరిపోయింది. కళ్ళు తిరిగిపడిపోయాడు. గతం గిర్రున తిరిగింది.