12-03-2023, 08:24 AM
(This post was last modified: 17-04-2023, 07:00 PM by Pallaki. Edited 2 times in total. Edited 2 times in total.)
•3•
చెన్నై
కొవిలంబక్కం నడి రోడ్డులో చెప్పులు సైతం కరిగిపోయేంత ఎండలో ఒకడు చెప్పులు లేకుండా నడుస్తుంటే వాడి కాళ్లు కాలి తట్టుకోలేక అడుగులు తడబడుతు వేస్తున్నాడు. వెనక అందరూ జనాలు కోపంగా వాడి వైపు నడుచుకుంటూ వస్తుంటే ఒక్కో అడుగు తూలుతూ ముందడుగు వేస్తున్నాడు.
గుంపులోని కుర్రవాడెవడో రాయి తీసుకుని కొట్టాడు, ఇదంతా పక్కనే నిలబడి ఏడుపు బిగపట్టుకుని చూస్తూ ఇక తన వల్ల కాక ముందుకు రాబోతే అది గమనించి వద్దని వారించాడు. ఇంకో రాయి పడింది.. ఆ నలభై ఐదేళ్ళ శరీర ఓపిక అప్పటికే అయిపోయిందేమో వాడు చలనం లేకుండా అలా పట్టించుకోకుండా వెనక్కి చూడకుండా ముందుకు ఒక్కో అడుగు వేస్తూనే ఉన్నాడు.
ఎవరు కాలర్ పట్టుకులాగారో జేబు చినిగింది, మొహం మీద టమాటాలు గుడ్లతో కొట్టారేమో నీసు వాసన వస్తుంది. షర్ట్ కొంచెం చినిగింది, మొహం మీద కొన్ని దెబ్బలు కూడా ఉన్నాయి అవి జనాలు కొట్టినివిలా లేవు, ఎవరో జనాల్లో కలిసిపోయి కావాలని కొట్టినట్టున్నాయి. మీడియా మాత్రం ఒక్క సెకండు ఒక్క బిట్టు పోకుండా మొత్తం కవర్ చేస్తుంది. టీవీలో లైవ్ కవరేజ్ ఇవ్వాలిగా మరి..
రోడ్డు దాటి వెళుతుంటే వీపు మీద వెనక నుంచి గట్టిగా తన్నాడు ఒకడు.. దెబ్బకి ఎదురుగా పందులు దొల్లాడుతున్న నల్లటి మురికి కుప్పలో పడ్డాడు. ఇప్పటికి చాలా సార్లు అలా తన్నారు అయినా లేచాడు.. కానీ ఈ సారి లేవలేదు.
పదండ్రా అని అరిచాడెవడో అంతే అందరూ మరమనుషుల్లా వెనక్కి తిరిగారు. గుంపులో మాట్లాడుకంటున్నారు.
ఇలాంటి వాడికి ఇలానే జరగాలిరా
ఆల్రెడీ పుల్లీసులకి ఫోన్ చేశారు వాళ్ళు ఈ పాటికి వస్తూనే ఉంటారు
ఇంతకీ వాడి మీద ఏమేమి కేసులు పెడతారంటావ్
అబ్బో చాలా ఉన్నాయి మానవ హక్కుల ఉల్లంఘన, నిర్భయ, సెక్సువల్ అస్సాల్ట్, సెక్షన్ 377 ఇంకా ఉన్నాయేమో.. వీడిని ఎన్కౌంటర్ చేస్తే బాగున్ను
ఎంత బాగా మోసం చేశాడు రా, బైటికేమో బాలికా వసతి గృహం లోపలేమో అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం
పోనీలేరా వాడి పాపాన వాడే పోతాడు
ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు
ఇందాకటి నుంచి ఏడుస్తూ వాడిని చూస్తున్న ఆవిడ మాత్రం అక్కడే ఉంది, జనాలు వెళ్లిపోయాక ఏడుస్తూ అతని కోసం పరిగెత్తింది అన్నయ్యా అని కేక వేస్తూ.
ఒక్కటే లేపుకుని వాడిని మొయ్యలేక ఈడ్చుకెళ్లి పక్కనే ఉన్న బోరింగ్ పంపు కింద వాడిని పడుకోబెట్టి, బోరు కొడుతూ వాడిని లేపుతూ ఒళ్ళు కడుగుతూ ఏడుస్తుంటే పుల్లీసుల జీప్ వచ్చి ఆగింది.
వీడే ఆ చిరంజీవి, ఈ నా కొడుకుని లోపలికి ఎక్కించండి.. దీన్ని కూడా అని ఆవిడని చూసి గట్టిగా నవ్వాడు si
భయంతో లేచి నిలబడింది ఆవిడ.. పేరు సంజన అలియాస్ సంజు