12-03-2023, 08:24 AM
(This post was last modified: 29-03-2023, 10:13 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•2•
అక్షిత ఇంటి గోడ పక్కనే ఆనుకుని ఉన్న ఇల్లు లావణ్యది. అక్షిత కంటే రెండేళ్లు పెద్దదైనా అక్షితకి చెల్లెల్లా ఉంటుంది. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా ఒంట్లో బాగోలేకపోయినా కూతురు పుట్టింటికి పరిగెత్తినట్టు లావణ్య అక్షిత ఒడి చేరుతుంది.
శ్రవణ్.. లావణ్య భర్త.. ఎవరో కాదు అక్షిత మొగుడు శ్రీధర్ తమ్ముడే. దంపతులిద్దరికి ఒక్కడే కొడుకు పేరు చిరంజీవి అని ఎంతో ఇష్టంగా పెట్టుకుంది లావణ్య.
అక్షిత కుటుంబంలా హడావిడిగా కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లావణ్య కుటుంబం. ఎక్కువ గోల ఉండదు. ఇంట్లో ఉన్నారా లేరా అన్నట్టు ఉంటారు. అక్షిత లావణ్యలు ఎంత స్నేహంగా ఉంటారో అక్షిత కొడుకు వేణు మరియు లావణ్య కొడుకు చిరంజీవి ఇద్దరు అంత స్నేహంగా ఉంటారు మధ్యలో పుల్లలా మధుమతి ఇద్దరినీ అల్లరి చేసి ఇబ్బంది పెడుతుంది.
పేరుకే అక్షిత కంటే రెండేళ్లు పెద్దది కానీ ఇద్దరు కలిసి చదవడం వల్ల సమం అయ్యారు. చదువులో, ఉద్యోగంలో ఒకరిని ఒకరు బ్యాకప్ చేసుకుంటూ వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇద్దరు చక్కగా కాపురం చేసుకుంటున్నారు. డబ్బు మరేతర విషయాల్లో లావణ్య అక్షిత సలహాలు తీసుకుంటే కుటుంబపరంగా పెద్ద పెద్ద నిర్ణయాలు వరకు అక్షిత లావణ్య సలహాలు తీసుకుంటుంది. ఈ రెండిళ్ళకి అక్షిత సూత్రాధారి అయితే లావణ్య ముందుండి నడుపుతుంటుంది. పేరుకే రెండిళ్ళు కాని మనసులు కుటుంబాలు ఆలోచనలు ఒక్కటే
లావణ్యకి భక్తి చాలా ఎక్కువ, గణపయ్య నామస్మరణ లేనిదే తన రోజు మొదలవ్వదు. భయం వేసినా బాధ వేసినా అన్నిటికి గణపతిని తలుచుకుంటుంది. ఇక వినాయకచవితి వచ్చిందంటే చాలు ఇంట్లో కంటే వీధిలోనే ఎక్కువగా ఉంటుంది. నిమజ్జనానికి ఏడుస్తూ వినాయకుడిని సాగనాంపడం ఒక్క లావణ్య వల్లే సాధ్యం. ఒక్క లావణ్యకే కాదు అక్షితకి కూడా దేవుళ్ళలో వినాయకుడే ముఖ్యుడు, ఆ తరువాతే ఎవరైనా..
పొద్దున్నే లేచి రెండిళ్ళ ముందు ఊడ్చి, అక్షితలానే మొగుడిని కొడుకుని పంపించి ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్ళిపోతారు. వారానికి ఒకసారి బైటకి వెళ్లడం లేదా రెండిళ్ళు కలిసి వండుకుని తినడం ఇలా రెండు కుటుంబాలు వారి జీవనం సాగిస్తున్నారు. ఇది లావణ్య