Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
S04E03

ముని వేగంగా నడుచుకుంటూ విక్రమాదిత్య ముందుకు వచ్చి ఆగాడు.. విక్రమాదిత్య చేతిలో ఉన్న గొడ్డలిని చూసి ఆయన కోపం కట్టలు తెంచుకుంది సంస్కృతం మరియు పురాతన తెలుగు మరియు ఇంకేదో భాష కలిసిన వచనాలు చాలా కోపంగా పలుకుతుంటే అంతా అర్ధమైనట్టు ఉన్నా ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు, అయోమయంగా చూసాడు.


సంస్కృతంలో : ఈ భార్గవ రాముడి పరుశుని తాకడానికి నీకెంత ధైర్యం, నీవంత వీరునివా, అయితే రా తలపడు అంటూ రెండు అడుగులు ముందుకు వేసాడు.

విక్రమాదిత్యకి ఒక్క ముక్క అర్ధం కాలేదు కానీ ఆయన ఎవరో కోపంగా ఉన్నాడని మాత్రం అర్ధం అయ్యింది, మధ్యలో పరుశు అన్నాడు అంటే సంస్కృతంలో గొడ్డలి అని అర్ధమయ్యి ఆయన ఈ గొడ్డలి గురించి మాట్లాడుతున్నాడేమో అని గొడ్డలిని చూసాడు, రెప్పపాటులో గొడ్డలి విక్రమాదిత్య చేతిలో నుంచి ఎగిరి ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ వెంటనే ఆయన మాటల్లో భార్గవ్ రామ్ అన్న పేరు గుర్తుకు వచ్చి ఆ వెంటనే ఆగిపోయి భక్తిగా కొంత భయంగా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసాడు.

పరుశురాముడు మాత్రం కోపంగా గొడ్డలి తిప్పగానే విక్రమాదిత్య కూంగా పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ అందుకున్నాడు, అది చూసి ఆయన చులకనగా నవ్వుతూ పక్కనే ఉన్న నాలుగు అడుగుల వెడల్పు గల చెట్టుని ఒక్క వేటుతో నిలుచున్న చోటు నుంచి కదలకుండా అవలీలగా నరికేసాడు. విక్రమాదిత్య చేతిలో నుంచి చెట్టు కొమ్మ కింద పడిపోయింది. కింద పడ్డ కత్తి అందుకుని నిలబడ్డాడు.

పరుశురాముడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఎగిరి విక్రమాదిత్య మీద గొడ్డలితో వేటు వెయ్యబోతుంటే విక్రమాదిత్య కత్తి అడ్డం పెట్టాడు.ఇవ్వాల్టితో తన చావు మూడిందని ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు, అర రెప్ప పాటులో పరుశురాముడి గొడ్డలి వేటుకి అడ్డంగా సుదర్శన చక్రం వచ్చి ఒక్క క్షణంలో మాయం అయ్యింది, సుదర్శన చక్రం మరియు శివుడి పరుశు రెండు కలబడగానే ఒక మెరుపు మెరిసింది.. ఆ తాకిడికి పరుశురాముడు ఎగిరి అవతల పడ్డాడు. విక్రమాదిత్య కళ్ళు తిరిగి పడిపోయాడు.

లేచి నిలబడ్డ పరుశురాముడు తను చూసింది నిజామా కాదా అన్నట్టు గుర్తు తెచ్చుకుని పాహిమాం పాహిమాం అంటూ మోకాళ్ళ మీద కూర్చుని వేడుకుని లేచి విక్రమాదిత్య దెగ్గరికి వెళ్లి తన నుదిటిన అరచేయితో పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు.

పరుశురాముడు కళ్ళు తెరిచి ఏదో అర్ధం అయ్యిన వాడిలా ఒక చేత్తో విక్రమాదిత్యని ఎత్తుకుని తన భుజాన వేసుకుని ఇంకో చేత్తో గొడ్డలి పట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమాదిత్య - by Pallaki - 08-03-2023, 12:37 AM



Users browsing this thread: 27 Guest(s)