Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అంతలో మహీ మహీ ...... అంటూ ఇరుగుపొరుగు ఆడవారు లోపలికివచ్చారు , హమ్మయ్యా ..... ఇప్పటికైనా కళ్ళు తెరిచావు సంతోషం , నువ్వు చెప్పిన దేవతలు వచ్చారా ...... ? .
బుజ్జిజానకి : నాతోపాటు లేచి కూర్చుని , వచ్చారు అంటీలూ - బామ్మలూ .....లోపల ఉన్నారు .
నీకోసం టిఫిన్స్ తీసుకొచ్చాము - ఆఫీసస్ టైం వెళ్ళాలి సాయంత్రం కలుస్తాము అంటూ ప్రక్కన క్యారెజస్ ఉంచి చాలా సంతోషం అనిచెప్పి వెళ్లారు .
ఇక బామ్మలు ఊరికే ఉంటారా ..... , మహీ ..... ఎవరీ అబ్బాయి ? .
బుజ్జిజానికికి అర్థమైపోయి నవ్వుకుంది , నా బెస్ట్ ఫ్రెండ్ బామ్మలూ .....
బామ్మలు : ఈ సమయంలో ఫ్రెండ్స్ అయినా అబ్బాయిలతో కలవనేకూడదు .
బుజ్జిజానకి : బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు బామ్మలూ ...... , ప్రాణ స్నేహితుడు - well wisher - మై స్వీట్ హార్ట్ - మై everything ..... మొత్తంగా చెప్పాలంటే నా దేవుడు అంటూ నాచేతిని చుట్టేసింది గట్టిగా ......
బామ్మలు : అవాక్కయ్యారు ...... 
వచ్చారా ఇంకా రాలేదే అనుకున్నాను అంటూ అమ్మమ్మ బయటకువచ్చారు .
బామ్మలు : అధికాదే మహి చూడు ఎలా హత్తుకుందో ......
అమ్మమ్మ : దేవుడని చెప్పింది కదా ..... నాకెలాంటి తప్పూ అనిపించడం లేదు రండి కాఫీ తాగి వెలుదురుగానీ ......
బామ్మలు : మనవళ్ళను కాలేజ్ కు రెడీ చెయ్యాలి , ఎవరో దారిన వెళుతూ ఈ విషయం చెబితేనూ జాగ్రత్తపడమని చెప్పేందుకు వచ్చాము .
అమ్మమ్మ : దేవుడి ప్రక్కన ఎంత సేఫ్ గా - ధైర్యంగా - సంతోషంగా ఉందో చూడండి అంటూ మాఇద్దరి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
బామ్మలు : అంతేనా ..... ? .
అమ్మమ్మ : అంతే అంటూ కాస్త కటువుగానే బదులిచ్చారు .
బామ్మలు : ఇంతదానికి కోపం దేనికి , ఏదో జాగ్రత్త అని చెబుతున్నాము , పిల్లలను కాలేజ్ కు పంపాలి తరువాత వస్తాము అనిచెప్పి గుసగుసలాడుకుంటూ వెళ్లిపోయారు .
అమ్మమ్మ : వీళ్ళు మారరు పట్టించుకోకండి నా బంగారు కొండలు అంటూ ముద్దులుపెట్టారు , బాబును ఎత్తుకుని బుజ్జిజానకీ ...... మహేష్ కు ఆకలివేస్తోందేమో లోపల అంతా మీకోసమే ఎదురుచూస్తున్నారు టిఫిన్స్ వేడిచేస్తున్నారు , ఆత్రమేమీ లేదు రండి పైగా దారినపోయేవాళ్ళ దిష్టి కూడా తగులుతోంది లోపల మీఇష్టం ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు అనిచెప్పి క్యారీజీలు తీసుకుని లోపలికివెళ్లారు .
బుజ్జిజానకి : విన్నావుకదా లోపలికి వెళదాము పదా అంటూ నా చేతిని పట్టుకునే లేచింది .
బయట ఉంటేనే అలా మాట్లాడుకుంటున్నారు ఇక లోపలికివస్తే ......
బుజ్జిజానకి : ఏమైనా అనుకోనివ్వు , అమ్మమ్మే బాధపడదు , దేవతలూ - అక్కయ్యలకైతే సంతోషం ...... , నువ్వే కదా స్నానం తరువాత వస్తానని ప్రామిస్ చేసావు ......
ప్రామిస్ ? , ప్రామిస్ అయితే చెయ్యలేదు .
చేసాడు చేసాడు నేను చూసాను అంటూ గుమ్మం దగ్గర పెద్దమ్మ కొంటెగా నవ్వుతున్నారు .
బుజ్జిజానకి : లవ్ యు దేవతమ్మా ..... , దేవతమ్మ చెప్పారంటే కరెక్ట్ ......
వద్దు అమ్మకూచీ ...... 
పెద్దమ్మ : వదలకు మహేష్ కూచీ ..... , ఇప్పుడు లోపలికి రాలేదంటే ఇక ఐదు రోజులూ రాడు .
బుజ్జిజానకి : అమ్మో అలా జరగనివ్వను .
పెద్దమ్మ : దేవతలందరికీ ఆకలేస్తోంది - మా బుజ్జిజానకికి ప్రేమతో తినిపించి తినాలని ఆశపడుతున్నారు పైగా తల్లులకు exam సమయం అవుతోంది .
బుజ్జిజానకి : దొరికావు , నువ్వు లోపలికి వస్తేనేకానీ నేను తినను , నాకు తినిపించి తింటేనేకానీ అక్కయ్యలు exam కు వెళ్ళరు ఆలోచించుకో అంటూ నాచేతిని చుట్టేసి ప్రక్కనే కూర్చుంది బుంగమూతితో ......
ఇక వస్తాడులే వంటలన్నీ డైనింగ్ టేబుల్ పై ఉంచుతాము అంటూ లోపలికివెళ్లారు పెద్దమ్మ .
ఇక మార్గం లేనట్లు పదా అమ్మకూచీ అన్నాను .
బుజ్జిజానకి : యాహూ ..... లవ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టింది , లవ్ యు అక్కయ్యలూ ..... మీవల్లనే అంటూ లేచి నన్నూ లేపి నాచేతిని చుట్టేసి మరొక చేతిలో ఫైల్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ లోపలికి పిలుచుకునివెళ్లారు .

లోపలికి రావడానికి కూడా ఇంతలా బ్రతిమాలించుకోవాలా ..... , తల్లి బుజ్జిజానకి పిలిచింది రాలేదు - అమ్మ పిలిచింది రాలేదు - దేవతమ్మ పిలిచింది రాలేదు ...... , ఈ అల్లరి పిల్లాడిని కంట్రోల్ లో పెట్టాలి .
లవ్ టు అంటీలూ ......
బుజ్జిజానకి : రాకపోతే దేవతలు టిఫిన్ చెయ్యరు - అక్కయ్యలు exam కు వెళ్ళరు అని చెబితేనేకానీ రాలేదు అత్తయ్యలూ ..... , మీకోసం వచ్చాడు .
అంటీలు : మొదట మురిసిపోయారు ఆ వెంటనే అన్నీ నాటకాలు ......
అక్కయ్యలు : మాకోసం వచ్చావా తమ్ముడూ ...... 
ఊహూ ..... దేవతలకోసం అంటూ తలదించుకునే కళ్ళతో సైగచేసాను .
అక్కయ్యలు : ఒక చిన్న చిన్న అపద్దo ...... పొంగిపోయేవాళ్ళం అంటూ నా బుగ్గలపై గిల్లేసి చూసారా దేవతమ్మా ..... ఎప్పుడూ అమ్మలూ అమ్మలూ ...... , అవునమ్మలూ ...... తమ్ముడిని లోపలికే రానివ్వరు అనుకున్నామే పైగా రాత్రి చెంపలు చెళ్లుమనిపించారు కదా .......
మేడమ్ : అవునా ..... ? .
అమ్మమ్మ : అవునా ...... ? .
అక్కయ్యలు : దేవతమ్మా ..... మీకుకూడా తెలియదు కదా మీరు అవునా ? అని అనలేదేంటి ? .
పెద్దమ్మ : నవ్వుకుని , ఇప్పుడు అంటాను అవునా .... ? .
అంటీలు : అంత కోపంతో దెబ్బతగిలేలా కొట్టినా ..... అల్లరి ఏమైనా ఆపాడా అడగండి , బాధపడకపోగా థాంక్యూ సో మచ్ ఫర్ టచ్ అంటూ మమ్మల్నే కవ్వించాడు .
అవునా అవునా అవునా ..... అంటూ నవ్వులు ఆగడం లేదు .
అంటీలు : అసలు రాత్రి ఏమిచేశాడో తెలుసా ? .
పెద్దమ్మ : పెద్ద తప్పే చేసి ఉంటాడు లేకపోతే దేవతలు ఊరికే శిక్షిస్తారా ఏమిటి ? , ఒక్క దెబ్బతో ఆగి ఉండాల్సినది కాదు అంటూ నావైపు కన్ను కొట్టారు .
లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
బుజ్జిజానకి - అక్కయ్యలు : దేవతమ్మా ..... ఇలానే మీరు ప్రతీసారీ అగ్నికి ఆజ్యం పోస్తూ మరింత రెచ్చగొడుతున్నారు అమ్మలను అంటూ చుట్టూ చేరారు .
పెద్దమ్మ : చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది మహేష్ కూచీ - తల్లులూ ..... , ఎంత దూరమైతే అంత దగ్గరవుతారు ......
బుజ్జిజానకి : దేవతమ్మ చెబితే జరిగి తీరుతుంది అక్కయ్యలూ అంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు , సమయం వచ్చినప్పుడు మీరూ ఆజ్యం పొయ్యాలి మరి ......
అక్కయ్యలు : ఇప్పుడు చూడండి , అమ్మలూ ..... రాత్రి జరిగినదానితో లోపలికే రానివ్వరు అనుకుంటే ఆలస్యమయ్యింది అంటూ కోప్పడుతున్నారు .
అంటీలు : మనందరినీ ...... డిస్టర్బ్ మరియు మనతో మాట్లాడనంతవరకూ ఎక్కడికైనా వెళ్ళవచ్చు రావచ్చు , తల్లి బుజ్జిజానకి కాదు కాదు చెల్లి జానకి సంతోషం కంటే ఇంకేమి కావాలి ...... , ఆ అల్లరి పిల్లాడు లోపలికి వచ్చినందుకు చెల్లి జానకి ఎంతలా ఆనందిస్తుందో చూడండి .
బుజ్జిజానకి : అమ్మ చెల్లినా .... ? అత్తయ్యలూ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ సోఫాలో కూర్చున్న ముగ్గురినీ వెనకనుండి హత్తుకుని బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు , నావైపు చూసి నీవికూడా ......
అఅహ్హ్ ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడబోయాను .
అంటీలు : తల్లులూ తల్లులూ తల్లులూ .......
అక్కయ్యలు : పట్టేసుకున్నాము అమ్మా తమ్ముడిని అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు నవ్వుకుంటూ ....
అంటీలు : తల్లులూ నో ముద్దులు ......
అక్కయ్యలు : తమ్ముడు పెట్టలేదు అమ్మలూ మేమే ముద్దులుపెట్టాము .....
అంటీలు : కండిషన్స్ క్లారిటీగా పెట్టి ఉంటే బాగుండేది .
అందరూ నవ్వుకున్నారు .

అమ్మమ్మ : చిరునవ్వులు చిందిస్తూనే ..... , తల్లులూ - బుజ్జితల్లులూ ..... ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాము తరువాత మీఇష్టం ...... , రండి రండి అంటూ డైనింగ్ టేబుల్లో కూర్చునేలా చేశారు , బాబును డైనింగ్ టేబుల్ మధ్యలో కూర్చోబెట్టారు .
అక్కయ్యలు : ఫీల్ అయ్యింది చాలు తమ్ముడూ అదిగో ఎదురుగా నీ దేవతలు - ప్రక్కనే నీకూచీ అంటూ చెవులలో గుసగుసలాడి కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చున్నారు - మేము వడ్డిస్తాము మేము వడ్డిస్తాము అంటూ లేచారు .
పెద్దమ్మ : exam ఉంది కాబట్టి నో అంటూ కూర్చోబెట్టి , అమ్మమ్మ - దేవతలు వడ్డించారు .
బుజ్జిజానకి : దేవతలూ - అమ్మమ్మా ..... మీరూ కూర్చోండి అందరమూ కలిసి తిందాము .
దేవతలు : లవ్ టు జానకీ ...... , ముందైతే నీకు తినిపించనివ్వు అంటూ ప్రేమతో గోరుముద్దలు తినిపించి చుట్టూ కూర్చున్నారు .
జానకీ అన్న ప్రతీసారీ అమ్మకూచీ కళ్ళల్లో అందమైన మెరుపు ...... , నీవల్లనే అంటూ నావైపు ఆరాధనతో చూస్తోంది .
ఎంజాయ్ అంటూ ఆనందించాను , న్యూ ఇయర్ రోజు నుండీ ఎదురుచూస్తున్నాను దేవ .... అంటీల చేతి వంటల రుచుకోసం ..... మ్మ్ మ్మ్ మ్మ్ అద్భుతం అంతే అమ్మమ్మా వడ్డించండి వడ్డించండి .
అక్కయ్యలు : పాపం అమ్మలు ...... తింటున్నారు తప్ప పొగడటం లేదని ఆశతో చూస్తున్నారు , తమ్ముడు పొగడ్తలకు ఆనందించాలో కోప్పడాలో తెలియక ఎలా లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారో చూడండి .
అంటీలు : అలాంటిదేమీ లేదులే ......
బుజ్జిజానకి : దేవతల దగ్గరకే వెళ్లి అమ్మ చేతివంట గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏమిటి అంటూ ముద్దులుపెట్టింది .
పెద్దమ్మ : అవునవును చెప్పాలా ఏమిటి ...... , మహేష్ కు అయితే ఈ ముగ్గురు దేవతల మెప్పుకోసం తప్పదు అందుకే తెగ పొగిడేస్తున్నాడు .
అమ్మకూచీ వచ్చి ఎంజాయ్ అంటూ నాబుగ్గపై చేతితో ముద్దుపెట్టి కూర్చుంది .
అలా ఒకరికొకరు వడ్డించుకుని చిరునవ్వులు చిందిస్తూ తృప్తిగా తిన్నాము .

అమ్మమ్మను ప్రక్కకులాగి పాత్రలన్నింటినీ శుభ్రం చేసేసారు దేవతలు .
అక్కయ్యలు : నావైపు చూస్తూనే అమ్మకూచీని చుట్టేసి మాకైతే వెళ్లడం ఇష్టమేలేదు సరిగ్గా ఇప్పుడే exams ఉండాలా ...... ? .
పెద్దమ్మ : పోస్ట్ ఫోన్ చేయించమంటారా తల్లులూ ...... ఆర్డర్ వెయ్యండి .
అక్కయ్యలు : నిజమైతే ఎంత బాగున్నో ప్చ్ ప్చ్ ప్చ్ ..... టైం అవుతోందే అంటూ మరింత గట్టిగా చుట్టేశారు .
బుజ్జిజానకి : అక్కయ్యలను విడిచి మూడు గంటలు నేనూ ఉండలేను , అక్కయ్యలూ ..... కారులో వెళ్లి exam అవ్వగానే వచ్చెయ్యండి .
కారులో కుదరదు బుజ్జిజానకీ ...... , అంటీ వాళ్ళు షాపింగ్ వెళ్లాలనుకుంటున్నారు కావాలి ......
అక్కయ్యలు : తియ్యనైనకోపంతో చూస్తున్నారు , అమ్ములు అమ్మలు అమ్ములు ...... 
పెద్దమ్మ : మన కారులో వెళదాము తల్లులూ ......
అక్కయ్యలు : exam అయిపోగానే అందుబాటులో ఉండాలి కాబట్టి స్కూటీలు ఇక్కడే ఉన్నాయికదా వెళతాములే దేవతమ్మా ...... , తమ్ముడూ ..... మాకూ ఒకరోజు వస్తుందిలే ......
ఆరోజుకూడా దేవ ..... అంటీల కోసమే .....
అంటీలు : నీ నాటకాలకు ఫ్లాట్ అయ్యేవారు ఎవ్వరూ లేరిక్కడ ......
పెద్దమ్మ : దేవతలూ ..... అదీ అలా మీరేమాత్రం తగ్గకండి .
అమ్మకూచీ - అక్కయ్యలు ...... నవ్వుకున్నారు , మహేష్ ..... అక్కయ్యలను కాలేజ్ వరకూ వదిలిరా ......
లవ్ టు బుజ్జిజానకీ ......
అంటీలు : కండిషన్స్ మరిచిపోయావా ..... ? , తల్లుల వెంట వెల్లనేకూడదు .
పెద్దమ్మవైపు ఆశతో చూసాను .
పెద్దమ్మ : అయితే నేను తోడుగా వెనుకే కాలేజ్ వరకూ వెళ్లి , లంచ్ ప్రిపేర్ చేసుకుని ఒకేసారి వచ్చేస్తాను .
బుజ్జిజానకి : లవ్ యు పెద్దమ్మా ......

మేడమ్ : బుజ్జిజానకీ ..... నేనూ ఒకసారి కాలేజ్ వరకూ వెళ్ళిరావాలి , నిన్న మధ్యాహ్నం నుండీ ఇక్కడే ఉన్నానుకదా బిల్లులన్నీ ఆగిపోయాయి నేను వెళ్లి సంతకాలు పెడితేనేకానీ ఫండ్స్ రిలీజ్ కావు .
పెద్దమ్మ : తల్లులను కాలేజ్ వరకూ అటునుండి మేడమ్ ను కాలేజ్ వరకూ వధులుతాను .
బుజ్జిజానకి : అక్కయ్యలు వెళ్ళాలి , దేవతమ్మ వెళుతోంది , మీరూ వెళ్లిపోతున్నారు .......
కాసేపట్లో మేమూ వెళ్ళాలి అంటూ అంటీలు ......
బుజ్జిజానకి : అత్తయ్యలూ ..... షాపింగ్ కు తరువాత 12 గంటలకు వెళ్ళొచ్చులే అలా వెళ్లి ఇలా వచ్చేయ్యొచ్చు ......
అంటీలు : అమ్మో ..... మా ప్రాణమైన బుజ్జిజానకికి సెలక్షన్ అంటే మినిమం రెండు గంటలైనా చాలవు ఇప్పుడే వెళ్ళాలి ...... మధ్యాహ్నం నుండి డిన్నర్ వరకూ ఇక్కడే ఉంటాము బుజ్జిజానకీ ......
బుజ్జిజానకి : అయితే ok అంటూ ఆనందిస్తోంది . 
మేడమ్ : అందరినీ చూస్తూ ఫుల్ గా తినేశాడేమో వెంటనే నిద్రపోయాడు .
మేడమ్ ..... మాకివ్వండి మేము చూసుకుంటాము , ఏడిస్తే కాలేజ్ దగ్గరకే తీసుకొస్తానులే ......
మేడమ్ : నువ్వూ - బుజ్జిజానకి - అమ్మ ఉండగా ఏడుస్తాడా చెప్పు అంటూ ముద్దుపెట్టి అందించారు .
ఊయలలో పడుకోబెట్టు మహేష్ అంటూ మూలన ఉంచిన ఊయలను శుభ్రం చేసి రెడీ చేశారు అమ్మమ్మ ......
Wow ఊయల .....
అమ్మమ్మ : నీ బుజ్జిజానకి ఇందులోనే ఊయల ఊగేది మహేష్ ......
డబల్ wow ......
బుజ్జిజానకి : పో మహేష్ సిగ్గేస్తోంది అంటూ అక్కయ్యలు - దేవతలను బయటవరకూ వదిలి తియ్యనైనబాధతో లోపలికివచ్చింది .

అక్కయ్యలను - మేడమ్ ను పెద్ద ..... దేవతమ్మ జాగ్రత్తగా చూసుకుంటారు , దేవతలను ..... సిస్టర్ చూసుకుంటారు , లంచ్ సమయానికి వచ్చేస్తారులే అమ్మకూచీ ...... , వాళ్ళను చూడకుండా నేనూ ఉండలేను .
బుజ్జిజానకి : సో స్వీట్ ...... , ప్చ్ ..... బయటకు వెళ్లకూడదు కాబట్టి ఆగిపోయాను లేకపోయుంటే అక్కయ్యలను కాలేజ్ కు వదిలి - అంటీని కాలేజ్ లో వదిలి - దేవతలతోపాటు షాపింగ్ కు వెళ్లిపోయేదానిని ......
ఐదురోజుల తరువాత నీఇష్టం అమ్మకూచీ ...... కాదు కాదు అమ్మా అమ్మా ...... , ఏమంటారు అమ్మమ్మా .....
అమ్మమ్మ : మీఇష్టమే నాఇష్టం అంటూ వంట గదిలోనుండి బదులిచ్చారు .
అమ్మమ్మా ..... పాత్రలన్నీ శుభ్రమైపోయాయికదా వంట గదిలో ఏమిచేస్తున్నారు ? .
ఇదిగో పాత్రలను చక్కగా సెల్ఫ్ లలో ఉంచి వచ్చేస్తాను ......
ఇంతకూ తాతయ్యగారు ఎక్కడ ? .
అమ్మమ్మ : దేవతలు రాగానే టిఫిన్ పెట్టి రోజూ వెళ్లే క్లబ్ కు తోసేసాను మన మధ్యన ఎందుకు అని - తోడుగా మీ తాతయ్య వయసువారు ముగ్గురు ఉన్నారు చుట్టుప్రక్కల .....
క్లబ్ కా ..... ? .
అమ్మమ్మ : త్రాగడానికి కాదులే ఒకేఒక్క వ్యసనం ఉంది జూదం ఆడతాడు అదికూడా కంట్రోల్ లోనే , ఇప్పటివరకూ గెలిచినదే లేదు .
అవునా ..... చూస్తూ ఉండండి ఈరోజు మాత్రం ఇంతవరకూ ఓడిన మొత్తం వడ్డీతోసహా గెలుచుకునివస్తారు ధీరుడిలా ...... , పెద్దమ్మా అంటూ తలుచుకున్నాను .
అమ్మమ్మ : వెళ్లినవారు జాగ్రత్తగా వస్తే చాలు ....
ఈరోజు మాత్రం లాభంతోనే వస్తారు - మళ్లీ క్లబ్ వైపు కన్నెత్తి చూడరు చూస్తూ ఉండండి .
అమ్మమ్మ : అలా జరిగితే మా మహేష్ కు బోలెడన్ని ముద్దులు ......
నేనుకూడా నేనుకూడా అంటూ అమ్మకూచీ నాప్రక్కనే కూర్చుంది , మహేష్ చెప్పాడంటే జరిగితీరుతుంది అంటూ చేతిని చుట్టేసింది .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 16-02-2024, 03:55 PM



Users browsing this thread: 33 Guest(s)