Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
డ్రాయింగ్స్ బ్యూటిఫుల్ - కలర్ఫుల్ గా పూర్తవ్వడంతో పెదాలపై చిరునవ్వులు విరిసాయి .
అమ్మ గమనిస్తూనే ఉన్నట్లు నా బుగ్గపై ముద్దు ......
థాంక్యూ అమ్మా ......
సమయం 7 గంటలు అవుతుండగా ...... తల్లులూ అన్నీ రెడీ క్యారెజీ కూడా కట్టేసాము , ఆటోలను పిలిస్తే బుజ్జిజానకి దగ్గరకు వెళదాము , మీ కాలేజ్ బ్యాగ్స్ తీసుకోండి .
అక్కయ్యలు : తమ్ముడు ఏర్పాటుచేసిన రేంజ్ రోవర్ ఉండగా ఆటోలు ఎందుకమ్మలూ .......
అంటీలు : ఆ అల్లరి పిల్లాడు ఎక్కితే మేము ఎక్కము .
అసలు ఆ అల్లరి పిల్లాడు ఆర్రేంజ్ చేసిన కారులోనే ఎక్కలేదు అన్నందుకు చాలా ఆనందమే వేస్తోంది , అంటీలూ ..... నేను ఆటోలో వస్తాను .
అంటీలు : నువ్వెలా వస్తే మాకెందుకు ......
అక్కయ్యలు : ఓనర్ కారులోనుండి ఓనర్ నే తోసేసినట్లు ఉంది , తప్పే ..... తమ్ముడిపై కోపంతో మీరు తప్పు చేయకండి - దేవతలు తప్పు చెయ్యకూడదు , ఏమి మాట్లాడాము ..... ఏదైతే ఏమిలే అమ్ములు ఆలోచనలో పడ్డారు అదిచాలు .......
అంటీలు : బుద్ధిగా కూర్చోవాలి - మనవైపుకు తిరగనేకూడదు ......
అక్కయ్యలు : మీరెలా అంటే అలా అంటూ పెద్ద పెద్ద క్యారెజీలు అందుకుని కిందకువస్తుంటే మెయిన్ గేట్ దగ్గర అందుకుని కారులో వెనుక జాగ్రత్తగా ఉంచి , దేవతలకోసం డోర్స్ తెరిచాను , ఆటో ......

అంటీలు : అహహహ ..... ఏమి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ , చెవులన్నీ మావైపే ఉంటాయి విన్నావుకదా బుద్ధిగా కూర్చో ......
అక్కయ్యలు : నవ్వుకుని , తమ్ముడూ తమ్ముడూ కూర్చో అంటూ ముందు డోర్ తెరిచి వెనుక దేవతలపై కూర్చున్నారు .
లోలోపలే నవ్వుకుని , బుద్ధిగా కూర్చున్నాను , పట్టుచీరలలో దేవతల సౌందర్యాలను చూడాలని ఉన్నా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నావల్ల కావడం లేదు .
అంతలో వాసంతి అక్కయ్య ..... we know we know అంటూ ముగ్గురు దేవతలు కనిపించేలా మిర్రర్ ను సెట్ చేసి , ఎంజాయ్ అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టింది .
దేవతలు చూసారేమోనని తెగ కంగారుపడిపోయాను .
దేవతలు ..... నావైపే గమనించకపోవడం చూసి హమ్మయ్యా అనుకున్నాను - నో మాటలు నో కిస్సెస్ అంటూ అక్కయ్యల వైపు సైగచేసాను మిర్రర్ లో ......
అక్కయ్యలు : నువ్వు మాట్లాడకూడదు అని ప్రామిస్ చేశావుకానీ , మేము మాట్లాడకూడదు అనికానీ - ముద్దులు పెట్టకూడదు అనికానీ లేదుకదా , పైగా నాన్నలకు ప్రాణంలా చూసుకుంటామని మాటిచ్చేసాము మాఇష్టం మేమేమైనా చేస్తాము , మాకు ..... అమ్మలూ - చెల్లీ - తమ్ముడు అందరి సంతోషం కావాలి అంటూ మెసేజ్ చేసి నవ్వుకుంటున్నారు .
చదివి వెంటనే డిలీట్ చేసేశాను ......
అక్కయ్యలు : డిలీట్ చేస్తే మాత్రం మేము ఆగుతామా ఏంటి అంటూ మిర్రర్ ద్వారా ముద్దులుపెడుతున్నారు .

తలదించుకున్నాను మధ్యమధ్యలో దేవతలవైపు చూస్తూ సిస్టర్ పోనివ్వండి అన్నాను .
అంటీలు : సిస్టర్ ..... మా బుజ్జిజానకి కోసం షాపింగ్ చెయ్యాలి దారిలో ఎక్కడైనా జ్యూవెలరీ షాప్ దగ్గర ఆపండి .
అక్కయ్యలు : చెల్లికి గిఫ్ట్స్ .... యాహూ లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మలూ అంటూ నావైపు చూస్తూనే దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టారు నీముద్దులు అంటూ సైగలుచేసి .....
సంతోషంతో జిళ్ళుమంది ......
అక్కయ్యలు నవ్వుకున్నారు , అమ్మలూ 7:15 అవుతోంది ఈసమయానికి ఏ షాప్ అయినా ఓపెన్ చేస్తారా ? .
అంటీలు : అవునుకదా ఇప్పుడెలా ? .

తలదించుకునే నేను మాట్లాడొచ్చా అంటీలూ ..... ? .
అంటీలు : అవసరమేలేదు , మా బుజ్జిజానకికి మధ్యాహ్నం వచ్చేటప్పుడు గిఫ్ట్స్ తీసుకెళతాములే .......
అక్కయ్యలు : తమ్ముడి వల్ల అవుతుందేమో అమ్మలూ ......
అంటీలు : ఇప్పుడు హెల్ప్ తీసుకుంటే అడ్వాంటేజ్ తీసుకుంటాడు .
అక్కయ్యలు : అవునవును అదిమాత్రం నిజం ఎందుకంటే మా అమ్మలూ రెడీ మూవీలో జెనీలియా కంటే అందంగా ఉంటారు ......
అంటీలు : పోండి తల్లులూ సిగ్గేస్తోంది .
నిజమే నిజమే అంటూ మిర్రర్ లో మెలికలుతిరుగుతున్న దేవతలను చూసి ఎంజాయ్ చేస్తున్నాను .
అంటీలు : ఆ అల్లరి పిల్లాడు .... మన మాటలన్నీ వినేస్తున్నాడు .
ఊహూ ఊహూ అంటూ రెండు చెవులనూ మూసుకున్నాను .
అక్కయ్యలు : హ్యాపీనా అమ్మలూ ...... , చెల్లికి గిఫ్ట్స్ తీసుకుని వేళదామే ......
అంటీలు : మా బంగారు బుజ్జిజానకి అర్థం చేసుకుంటుంది , ఈ అల్లరి పిల్లాడి సహాయం మాత్రం తీసుకోము అంతే ......
Sorry లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ మిర్రర్ లో తెలియజేసారు .
ఉదయమే కావడం - ట్రాఫిక్ లేకపోవడంతో 15 నిమిషాలలో చేరుకున్నాము .

అదేసమయానికి కారులో పెద్దమ్మ - క్యాబ్ లోనుండి బాబుతో మేడమ్ దిగారు .
అక్కయ్యలు : బాబు బాబు బాబు అంటూ దేవతల బుగ్గలపై మరియు దేవతలు చూడకుండా నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి పరుగునవెళ్లి ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు .
పెద్దమ్మ - దేవతలు ..... వెళ్లి బాబును ముద్దుచేసి ఎత్తుకుని చివరికి అక్కయ్యలకు ఇచ్చి , ఒకరినొకరు కౌగిలించుకొన్నారు , అందరం ఒకేసారి చేరుకున్నాము అంటూ ఆనందిస్తున్నారు .
అక్కయ్యలు : బాబు ఎంత ముద్దొస్తున్నాడో అచ్చు తమ్ముడిలానే అంటూ బుగ్గలపై సున్నితంగా కొరికేస్తున్నారు .
మేడమ్ : బుజ్జి వయసులో ఇలానే ఉండేవాడేమో మహేష్ ......
అంటీలు : ష్ ష్ ష్ చెల్లీ ..... ఇంత చనువిస్తే నెత్తిన ఎక్కి కూర్చుంటాడు , ఆ అల్లరి పిల్లాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి .
అక్కయ్యలు : అమ్మలూ ..... మీరు దూరం ఉంచారుకదా అంటీకి ఎందుకు చెబుతున్నారు , తమ్ముడూ ...... ఎత్తుకోవాలని ఎంత ఆశపడుతున్నావో తెలుసు నీ చేతులు - కళ్ళు చూస్తే అర్థమైపోతోంది అంటూ అందించారు ......
నా బుగ్గపై ముద్దుపెట్టాడు .
అక్కయ్యలు : అమ్మో ..... ఇంతమందిమి ఎత్తుకున్నాము , మేమందరమూ ముద్దులుపెట్టాము తప్పితే ఎవ్వరికీ ముద్దుపెట్టలేదు , తమ్ముడు ఎత్తుకోగానే ముద్దుపెట్టాడు .
నవ్వుకుని పెద్దమ్మా అంటూ జేబులో చేతినిపెట్టి చాక్లెట్ తీసి బాబుకు అందించాను .
బుజ్జిబుజ్జినవ్వులతో ముద్దు ......
అక్కయ్యలు : అదిగో ముద్దు .......
అంటీలు : చాక్లెట్ ఇస్తే మనకూ ముద్దుపెట్టేవాడు అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు .
అక్కయ్యలు : లేదులేదమ్మా ..... చాక్లెట్ ఇవ్వకముందే ముద్దుపెట్టాడు , అంటీ - దేవతమ్మా ..... మీరు చూశారుకదా ......
మేడమ్ : అవునవును ......
పెద్దమ్మ : లేదు లేదు మీ అమ్ములు చెప్పినదే నిజం అంటూ నావైపు కన్నుకొట్టారు .
అక్కయ్యలు : నిన్నటి నుండీ మీరు అమ్మలకే సపోర్ట్ చేస్తున్నారు దేవతమ్మా ..... , చాక్లెట్ ఇవ్వకముందే ముద్దుపెట్టాడన్నది వాస్తవం ...... , కావాలంటే మేము చాక్లెట్ ఇచ్చినా ముద్దులుపెట్టడు చూడండి , తమ్ముడూ ..... ఒక్కటైనా చాక్లెట్ ఉందా ? .
నాలుగు ఉన్నాయని చెప్పండి మేడమ్ ......
అక్కయ్యలు : యాహూ యాహూ యాహూ ...... , ఇవ్వుమరి ......
మూడు ఉన్నాయని చెప్పానుకానీ , మీచేతులతో ఇప్పిస్తానని చెప్పలేదని చెప్పండి మేడమ్ ......
అక్కయ్యలు : మరి ఎవరితో ...... , అర్థమైంది అర్థమైంది నీ దేవతల చేతులతోనే ఇప్పించు , దేవతలూ దేవతలూ ...... దేవతలే సర్వస్వం అంటూ బుంగమూతితో నాచేతులపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ......
అంటీలు : తల్లులూ ......
అక్కయ్యలు : మేము గిళ్లకూడదని ఎక్కడా ప్రామిస్ చేయించలేదు కావాలంటే గుర్తుచేసుకోండి .
అంటీలు : ఆలోచనలో పడ్డారు .
అక్కయ్యలు : ఎంత ఆలోచించినా అదే నిజం ...... , ఇదిగో చాక్లెట్ లు ఇవ్వండి అంటూ నాచేతుల్లోనుండి అందుకుని దేవతలు - పెద్దమ్మకు ఇచ్చారు .
అంటీలు - పెద్దమ్మ : ముద్దులతో అందించారు .
దేవతలు - పెద్దమ్మకు ముద్దులుపెట్టాడు .
అక్కయ్యలు : అవును అమ్ములు చెప్పినట్లు చాక్లెట్ ఇస్తే ముద్దులుపెడుతున్నాడు కానీ తమ్ముడికి మాత్రం ముందే ముద్దుపెట్టాడు అంటీ చెప్పండి .
మేడమ్ : నవ్వే సమాధానం అయ్యింది , మీ అమ్మలకు మరింత కోపం తెప్పించడం అవసరమా తల్లులూ అంటూ అక్కయ్య చెవులలో గుసగుసలాడారు .

అక్కయ్యలు : నవ్వుకుని , అంటీ బాబు పేరు అడగలేదు .
మేడమ్ : మీరే చెప్పేస్తారు , మీకు - మీ చెల్లికి ప్రాణమైన పేరు ......
అంటీలు : మహేష్ అనిమాత్రం చెప్ప ......
అక్కయ్యలు : మహేష్ మహేష్ మహేష్ ..... అందుకేనా అచ్చు ఒకేలా ఉన్నారు అంటూ అందుకుని నావైపు చూస్తూ సున్నితంగా బాబు బుగ్గలపై కొరికేస్తున్నారు .
అంటీ : అందుకేనేమో ఎత్తుకోగానే ముద్దుపెట్టేసాడు - నా బంగారం ......
అక్కయ్యలు : బంగారం ఎవరు అంటీ ? , బాబా ? లేక తమ్ముడా ? .
మేడమ్ : ఇద్దరూ ఒక్కటే కదా ..... , మహేష్ - మహేష్ బంగారం అంటూ నావైపు సంతోషంతో చూస్తున్నారు .
అంటీలు : ఆ అల్లరి పిల్లాడిని పొగిడింది చాలు , ముందైతే మన బంగారపు బొమ్మ దగ్గరికి వెళదాము .

అంతలో ఇంటినుండి ఇరుగుపొరుగు ఆడవారు అనుకుంటాము ఇంట్లోనుండి బయటకువచ్చారు - మహిని పలకరిద్దామని వస్తే సోఫాలో కూర్చుంది కానీ కళ్ళే తెరవడం లేదు , తన ప్రాణమైన అంటీ - దేవతల్లాంటి అత్తయ్యలు - దేవతమ్మ - అక్కయ్యలు మరియు మరియు ఎవరో అబ్బాయి పేరు ఆ ఆ హీరో పేరు మహేష్ బాబు ..... వారు వస్తేనేకానీ కళ్ళుతెరిచి వాళ్లనే చూడాలని ఆశతో ఎదురుచూస్తోంది , 15 నిమిషాలు అయ్యింది వచ్చి వాళ్లెప్పుడు వస్తారో ఏమిటో తరువాత వద్దాము రండి అంటూ గుసగుసలాడుకుంటూ ఇరువైపులకూ వెళ్లిపోయారు .
అంటీ - దేవతలు - పెద్దమ్మ - అక్కయ్యలు ...... ఒక్కసారిగా నవ్వేశారు , sorry లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ - బుజ్జితల్లీ ...... అంటూ లోపలికి పరుగులుతీశారు , చివరన అక్కయ్యలు నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి చెల్లీ చెల్లీ చెల్లీ ..... అంటూ బాబును ఎత్తుకుని వెళ్లారు .

అంటీ - అత్తయ్యలూ - దేవతమ్మా - అక్కయ్యలూ ...... వచ్చేసారా అంటూ కళ్ళుమూసుకునే గుమ్మం వరకూ వచ్చి , కళ్ళుతెరుస్తున్నాను అంటూ తెరిచి చిరునవ్వులు చిందిస్తూ అందరినీ మనసారా చూసుకుని గుండెలపైకి చేరింది .
లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ - బుజ్జితల్లీ ...... ఆలస్యమయ్యింది అంటూ ప్రాణంలా కౌగిలించుకుని ముద్దుచేస్తున్నారు .
బుజ్జిజానకి : ఏమీ పర్లేదు , నా దేవతలకోసం ఎంతసేపైనా కళ్ళుమూసుకునే ఎదురుచూసేదానిని , ఎంత సంతోషంగా ఉందో తెలుసా దేవతలూ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ రండి రండి లోపలికి , అక్కయ్యలూ ..... గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ......
అమ్మమ్మ : దేవతలూ వచ్చేసారా ..... ? , రండి రండి లోపలికి అంటూ పిలుచుకునివెళ్లారు .
అక్కయ్యలు : గుడ్ మార్నింగ్ చెల్లీ ......
బుజ్జిజానకి : రేయ్ మహేష్ ..... వారం రోజులయ్యింది నిన్నుచూసి అంటూ మెయిన్ గేట్ దగ్గర ఉన్న నావైపుకు ప్రేమతో చూస్తోంది , నేనంటే ఇష్టమేలేదు నీకు రోజూ వస్తానని చెప్పి ఇలాచేస్తావా అంటూ ఆప్యాయంగా మొట్టికాయవేసి ఎత్తుకుని ముద్దుచేస్తోంది నావైపే చూస్తూ ....... , రేయ్ ..... ఐదు చాక్లెట్ లు ......
బుజ్జిజానకితోపాటు అక్కయ్యలకు ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చాడు .
బుజ్జిజానకి : మన ఐదుగురికి ఐదు చాక్లెట్ లు అన్నమాట లవ్ యు అంటూ ముద్దుపెట్టింది .
అక్కయ్యలు : అక్కయ్యలూ ..... బాబుకు ముద్దులుపెట్టి , రేయ్ అన్నది ఎవరినో - మొట్టికాయ వేసినది ఎవరినో - ముద్దులు ఎవరికో - లవ్ యు ఎవరికో అర్థంవుతోందిలే చెల్లీ ...... మేమెల్లి అమ్మమ్మను పలకరిస్తామమ్మా అంటూ మూసిముసినవ్వులతో లోపలికివెళ్లారు .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 04-01-2024, 03:58 PM



Users browsing this thread: 38 Guest(s)