Thread Rating:
  • 14 Vote(s) - 3.07 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
F*L*A*M*E*S 1.12 భాగము updated on 31st May 2023 [Index: 2nd Post]
#1
Heart 
22.03.2023 ఉగాది నాడు ప్రారంభం

పాఠక మిత్రులకి వందనాలు! Namaskar  Namaskar

పోయిన ఫిబ్రవరి నెలలో ఉద్యోగరీత్యా నేను దేశ రాజధానికి వెళ్ళడం జరిగింది! అక్కడో వారం నా పని చూసుకున్నాక తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో అనుకోకుండా ఓ రాక్షసిని కలిసాను! ఆ తర్వాత వారం పాటు అది నన్ను మ్యాన్ హేండిలింగ్ కాదు కాదు కిడ్నాప్ చేసి, మా ఇంటికో ఫోన్ కొట్టి నన్ను దానికి నచ్చిన చోటుకి ఎత్తుకెళ్లిపోయింది!

రాక్షసీ అంటున్నాడు! ఇంటికి ఫోన్ చేసిందీ అంటున్నాడు! ఎత్తుకెళ్లిపోయిందీ అంటున్నాడు ఏంటా? అని అనుకోకండి! అదే ఈ కథ! తనతో స్పెండ్ చేసిన వారం దెబ్బకి నాకో విపరీతమైన ఆలోచన వచ్చి, FLAMES మీద కథ వ్రాయాలీ అని అనిపించింది!

నాకు ఆ రాక్షసి ఎర్పోర్టులో తగలడమూ, నన్ను తనతోపాటు వారం రోజుల వెకేషన్ కి లాక్కెళ్ళడమూ, అక్కడ జరిగిందీ తప్పితే మిగిలినది మొత్తం కల్పితం!

ముందుగా FLAMES గేం ఏంటీ అన్నది కొంచెం మీకు చెప్పాలీ అనుకుంటున్నా!


F*L*A*M*E*S

F – Friendship

L – Love

A – Affection

M – Marriage

E – Enemy

S - Sibling

చిన్నప్పుడు మీరందరూ ఈ ఆట ఆడే ఉండి ఉంటారు! ఇదేమీ పెద్ద తోప్ గేం కాదులెండి! జరగాలీ అన్న రూల్ కూడా లేదు! కానీ నా విషయంలో కొంత వరకూ జరిగింది లెండి! ఇదేమీ పెద్ద గొప్ప ఆట కాదు! జస్ట్ టైం పాస్ కోసం అన్నమాట! ఎవరైనా శింబు-జ్యోతిక నటించిన మన్మథ సినిమా చూశారా? అందులో చక్కగా వివరించబడిందీ ఆట! ఆ యూట్యూబ్ లింకు మీకోసం ఇక్కడ వేస్తున్నా!




ఇంతకీ ఈ ఆటకీ ఈ కథకీ సంబంధమేంటా అనుకుంటున్నారా? ఉంది ఉంది! ఇందులో రెండు పేర్ల మధ్యన ఆరు రకాల కంపాటబిలిటీ ఇవ్వబడింది! ఒక మగవాడి పేరుతో ఒక్కో రకమైన కంపాటబిలిటీ ఉన్న ఆరుగురు స్త్రీలు వాడినెట్లా ఆడుకున్నారన్నదే ఈ సాహసయాత్రల సారాంశం!

అక్షరానికో సాహస యాత్ర చప్పున ఆరుగురు ఆడవాళ్లు వాడినెట్లా ఫుట్బాల్ ఆడుకున్నారో, వాళ్లనుంచి వాడు తననెట్లా బచాయించుకున్నాడో ఆరు కథలుగా మీకు చెప్పబోతున్నాను! ఇంతవరకూ ఎవరూ టచ్ చెయ్యని సబ్జెక్ట్ కదా అని మొదలెడుతున్నా!

అక్షరానికో భాగం చప్పున ఆరు కథలు ఉంటాయి ఈ FLAMESలో!

Chapter 1 : S – Sibling!  
Chapter 2 : M – Marriage!  
Chapter 3 : E – Enemy!  
Chapter 4 : A – Affection!  
Chapter 5 : F – Friendship!  
Chapter 6 : L – Love!  


మొదటి కథ Chapter 1 : S – Sibling!   పూర్తయ్యాక ఉగాది నాడు అనగా 22.03.2023న ప్రచురణ మొదలెట్టబోతున్నా! అంతవరకూ వేచి చూడగలరు!  తరువాయి ప్రతీ ఆదివారం నాడు అప్డేటు ఉంటుంది! Namaskar


సిబ్లింగ్/సిస్టర్ అంటే కొంపదీసి ఇన్సిస్ట్ వ్రాయబోతున్నాడేంట్రా బాబూ? అని అనుకునేరు! కానే కాదు! ఈ కథలో ఇన్సిస్ట్ ఎక్కడా లేదు! కనుక ఇన్సిస్ట్ హేటర్స్ భేషుగ్గా చదువుకోవచ్చు!
-మీ సోంబేరిసుబ్బన్న
జసుజల్లి - జమజచ్చ(Part 188 updated-26 Jun 2024)
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
F*L*A*M*E*S 1.12 భాగము updated on 31st May 2023 [Index: 2nd Post] - by సోంబేరిసుబ్బన్న - 05-03-2023, 06:54 AM



Users browsing this thread: 1 Guest(s)