Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మరుక్షణంలో నా గుండెలపైకి చేరేది .......
అంతలో మహీ మహీ ......
బుజ్జిజానకి : నాన్న అంటూ అంతవరకూ ఉన్న సంతోషంలో మార్పు .
అమ్మమ్మ : అల్లుడుగారూ ..... ఇప్పుడేనా రావడం , తనకు బుజ్జిజానకి అని పిలిపించుకోవడం ఇష్టం అలానే పిలవమని చెప్పాము కదా .....
బుజ్జిజానకి నాన్న : మా మానాన మమ్మల్ని వదిలివెళ్లిపోయింది కదా అయినా చనిపోయినవారి పేరుతో పిలవడం మంచిదికాదు మీరూ పిలవకండి , అసలే అతి ముఖ్యమైన ప్రయాణాన్ని పోస్ట్ ఫోన్ చేసుకునిమరీ వచ్చాను వెంటనే వెళ్లిపోవాలి .
బుజ్జిజానకి కళ్ళల్లో కన్నీళ్ళతో అంటీల గుండెలపైకి చేరింది .
అమ్మమ్మ : మన బుజ్జిజానకి సంతోషమైన విషయం కంటే ముఖ్యమైన ప్రయాణం ఏమిటి ? .
బుజ్జిజానకి నాన్న : రెండూ ముఖ్యమైనవే , అయినా ఇంత చిన్న సందర్భానికి ఇంత ఖర్చు చేసి అలంకరించడం అవసరమా ...... ? .
అమ్మమ్మ : ఒక అమ్మాయికి తన జీవితంలో తొలి సంతోషమైన విషయం ఇది ..... , అంతలోనే వెళ్ళాలి అంటున్నావేమిటి ఐదురోజుల తరువాత ఫంక్షన్ చెయ్యాలి తెలుసుకదా ......
బుజ్జిజానకి నాన్న : ఇప్పుడే ఇంతలా జరిపించారు ఐదురోజుల తరువాత కూడా ఇలానే సిద్ధం చెయ్యండి ఫంక్షన్ సమయానికి వస్తాను .
అమ్మమ్మ : తల్లి ప్రేమకు ఎలాగో దూరం అయ్యింది ఇక తండ్రి ప్రేమకూ దూరం చేస్తున్నావు ......
బుజ్జిజానకి నాన్న : నామాట వినకుండా మీదగ్గరికే వచ్చేసింది కదా - అదే మంచిది అయ్యిందిలే నా పనులు నాకూ ఉన్నాయి నేనొక్కడినే చూసుకోవడం నావల్ల అయ్యేదికాదని తెలుసుకున్నాను , తప్పంతా దానిదే వెళ్ళిపోయింది కదా ......
అమ్మమ్మ : అది దైవేచ్చ ..... మానవులం మనమేమి చేయగలం .
బుజ్జిజానకి నాన్న : అందుకేకదా నా గురించే ఆలోచిస్తున్నాను , ఫంక్షన్ సమయానికి వస్తాను మీరే గుర్తుచేయాలి .
అమ్మమ్మ : అయితే ఆరోజే రావాల్సింది , వచ్చి బిడ్డను బాధపెడుతున్నావు .
బుజ్జిజానకి నాన్న : ప్రయాణాన్ని పోస్ట్ ఫోన్ చేసి వచ్చినందుకు సంతోషించకుండా నన్నే అంటున్నారు - కోపాన్ని ఎవరిమీద చూయించాలో తెలియక , ఇంతకూ వీరంతా ఎవరు ఎందుకు వచ్చారు ? .
అమ్మమ్మ : ఎందుకు వచ్చారా ..... ? , దేవతల్లా వీరు రాకపోయుంటే నీ ...... నా మనమరాలు అనాథలాగా ఉండిపోయేది , ఈ ఐదురోజులూ ..... అతిముఖ్యమైన వారు వీరంతా , వీరిని ఏమైనా అన్నారో ఊరుకోను ......
బుజ్జిజానకి నాన్న : కూల్ కూల్ అత్తయ్యా ...... , వీరంతా సరే మరి ఒక అబ్బాయికి ఇక్కడేమి పని - కుటుంబంలోని వ్యక్తులు మరియు ఆడవాళ్లు తప్ప వేరొకరు ఉండనేకూడదు - ఇరుగుపొరుగు వారికి తెలిస్తే మన పరువు ఏమౌతుంది ఎంత చెడుగా మాట్లాడుకుంటారు .
అమ్మమ్మ : మాట్లాడుకుంటే మాట్లాడుకోనివ్వు , ఈ సంతోషాలకు ముఖ్యమైన .......
బుజ్జిజానకి నాన్న : పనివాడా ...... , పని పూర్తయ్యింది కదా డబ్బులిచ్చి పంపించేయ్యండి , రేయ్ ....... బయటకువెళ్లు అంటూ తోసేశాడు .
బుజ్జిజానకి : మహేష్ .....
అక్కయ్యలు : తమ్ముడూ ......
అమ్మమ్మ : మహేష్ ......
ఊహూ ...... అంటూ సైగచేసి బయటకువెళ్లిపోయాను .
బుజ్జిజానకి నాన్న : వచ్చాను మహిని చూసాను తెల్లవారుఘామునే వెళ్లిపోవాలి టైర్డ్ అయిపోయాను అంటూ లోపలికివెళ్లిపోయాడు .
అమ్మమ్మ : sorry sorry దేవతలూ ...... కూతురి శుభ విషయం తెలిసికూడా తాగి వచ్చిన తండ్రి .
దేవతలు : బుజ్జితల్లీ - బుజ్జిజానకీ ...... ఈరోజు నుండీ సంతోషంగా ఉండాలి , మీ నాన్న గురించి చూస్తేనే తెలిసిపోయింది బాధపడొచ్చా చెప్పు , స్మైల్ స్మైల్ ..... 
దేవతమ్మ : నీహీరోను అన్నాడని బాధపడుతున్నావా ? , ఈ సంతోషమైన సందర్భాన్ని చెడపడం ఇష్టం లేకే వెంటనే వెళ్ళిపోయాడు , నీ సంతోషమే తన సంతోషం ...... ఎక్కడికి వెళతాడు చెప్పు ...... నువ్వు నవ్వితేనే ఇక్కడ ఉంటాము లేకపోతే వెళ్లిపోతాము .
అమ్మమ్మ : అవును బుజ్జిజానకీ ..... మీ నాన్న గురించి తెలిసి బాధపడొచ్చా ? .
లేదు లేదు దేవతలూ అంటూ నవ్వుతూనే రోడ్డువైపుకు చూస్తోంది .
దేవతమ్మ : దగ్గరలోనే ఉన్నాడులే ......

అంతలో తాతయ్యగారు లోపలికివచ్చి విషయం తెలుసుకుని , తాగి వచ్చాడా ..... ? లోపలికి ఎందుకు పోనిచ్చావు ? ఉండు బయటకు పంపించేస్తాను .
అమ్మమ్మ : వెళ్లి పడుకున్నట్లున్నాడు లేపితే మళ్లీ రచ్చ చేస్తాడు అంటూ ఆపారు , కానీ ఇంటిని మలినం చేసాడు .
దేవతమ్మ : దేవతలే స్వయంగా ఇంటిలో అడుగుపెట్టి బుజ్జిజానకిని అలంకరించారు , ఎలాంటి వారివాళ్లనూ అలా జరగనే జరగదు , ఎలాగో సూర్యోదయానికిముందే వెళ్ళిపోతాడు గోమూత్రంతో శుద్ధిచేస్తే సరిపోతుంది , రేపు ఇంతకంటే అందంగా రెడీ చెయ్యడానికి మేమెలాగో వస్తాము కదా ......
అమ్మమ్మ : వస్తారా ...... ? .
అంటీలు : వస్తారా అని అడుగుతారే , ఈ ఐదురోజులూ బుజ్జిజానకికి స్నానం చేయించి తరించేది మేముమాత్రమే , వేరేవాళ్లను పిలిచే ఉద్దేశ్యం ఉంటే చెప్పండి మేమేంటో చూయిస్తాము అంటూ బుజ్జిజానకిని రెండువైపులా హత్తుకుని ముద్దులుపెట్టారు .
పెద్దమ్మ : కరెక్ట్ గా చెప్పారు దేవతలూ ...... , ఇంత అదృష్టాన్ని వధులుకుంటామా ? .
అమ్మమ్మ : అంతకంటే అదృష్టమా తల్లులూ ..... అంటూ మురిసిపోతున్నారు , ఈ సంతోషం మొత్తం నీవల్లనే మహేష్ ..... నిన్నే బాధపెట్టాము అంటూ బాధపడుతున్నారు .
పెద్దమ్మ : మన బుజ్జిహీరో ఇలాంటివన్నీ పట్టించుకోడు బాధపడకండి రేపు తన దేవతలను తీసుకుని వస్తాడుగా ..... , అప్పుడు బయటే ఉంచుతారో మీ గుండెల్లో ఉంచుకుంటారో మీఇష్టం , బుజ్జిజానకీ ...... ముఖ్యన్గా నువ్వు .
బుజ్జిజానకి : అందమైన నవ్వులతో సిగ్గుపడుతోంది .
దేవతలు : ఇలా చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి అంటూ ముద్దులతో మరింత ఆటపట్టించారు .
అమ్మమ్మ : బుజ్జిజానకీ ..... మీ తాతయ్య వంట సామానులన్నీ తీసుకొచ్చారు వంట మొదలుపెడతాను దేవతలంతా భోజనం ఇక్కడే చెయ్యాలి .
బుజ్జిజానకి : అవునవును అక్కయ్యలూ - అంటీ - దేవతలూ - దేవతమ్మా ......
మా బుజ్జిజానకి కోరినవన్నీ తీర్చాలి కాబట్టి సంతోషంగా ఒప్పుకుంటాము , పదండి అందరమూ కలిసి వండుదాము .
పెద్దమ్మ : బుజ్జిజానకీ ..... కారులో ఉన్నాడులే నువ్వే తీసుకెళ్లి భోజనం ఇద్దువుగానీ అంటూ వెనక్కు తిరిగి తిరిగి చూస్తున్న బుజ్జిజానకితోపాటు లోపలికివెళ్లారు .

అక్కయ్యలు : అంతా సంతోషమే కానీ తమ్ముడు ఎందుకలా వింతగా ప్రవర్తిస్తున్నాడు , దేవతమ్మా ...... అమ్మావాళ్ళు పట్టించుకోకపోయినా అక్కయ్యలూ అక్కయ్యలూ అంటూ మాతో ఎంచక్కా మాట్లాడేవాడు , ప్రాణం కంటే ఎక్కువైన అమ్మల తరుపున కాకుండా తమ్ముడికే సపోర్ట్ ఇస్తున్నాము కూడానూ ..... ఏమైందంటారు ? అంటూ చెరొకవైపున బుజ్జిజానకిని చుట్టేసి చిరుబాధలోనూ ముద్దులుపెడుతున్నారు .
బుజ్జిజానకి : కాలేజ్లో కూడా అక్కయ్యలు అక్కయ్యలు అంటూ కలవరించాడు అక్కయ్యలూ ...... , ఫోనులోకూడా బానే మాట్లాడాడు కదా ......
అక్కయ్యలు : లంచ్ ముందువరకూ మాట్లాడాడు , లంచ్ తరువాత ఏమైందో ఏమో కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యకుండా కేవలం మెసేజస్ మాత్రమే పంపాడు , ఇక ఇక్కడికి వచ్చాక పూర్తిగా మౌనవ్రతం కేవలం చేతిసైగలు మాత్రమే ...... .
బుజ్జిజానకి : అంటే లంచ్ తరువాత ఏదోజరిగింది అంటారా అక్కయ్యలూ .....
అక్కయ్యలు : అవునవును ఏదోజరిగింది లేకపోతే అంతవరకూ ఆప్యాయంగా మాట్లాడే తమ్ముడు ఒక్కసారిగా ఇలా ఎలా మారిపోతాడు , మేము వచ్చినప్పటి నుండీ చూస్తున్నాము ముందు ముందు జరగబోయేవికూడా ఖచ్చితంగా చెపెస్తున్నారు దేవతమ్మ , జరిగినది ఈజీగా ......
పెద్దమ్మ : ఏదో అలా జరుగుతుందని గెస్ చెయ్యగలుగుతున్నాను అంతే తల్లులూ ....... , మీరు ఈ విషయం చెబుతున్నప్పటినుండీ గమనిస్తున్నది ఏమిటంటే మీ అమ్ములు ఎందుకో కంగారుపడుతున్నారు చూడండి కూరగాయలను ఎలా కట్ చేశారో ......
అక్కయ్యలు : అవునవును అమ్ములు ఇలాచెయ్యడం ఎప్పుడూ చూడలేదు .
దేవతమ్మ : ఇక మీకు అర్థమైందనుకుంటాను ......
అక్కయ్యలు : క్లియర్ గా దేవతమ్మా ...... , అమ్మలూ ......
అంటీలు : కంగారుపడుతూనే ...... , తల్లులూ ..... బుజ్జితల్లి వంట గదిలో ఏమిచేస్తోంది కొద్దిసేపు ఆగితే వంటలోకూడా సహాయం చేస్తాను అంటుంది .
బుజ్జిజానకి : అవునవును దేవతలకు సహాయం ......
అంటీలు : అదిగో విన్నారా ......
అక్కయ్యలు : నో నో నో చెల్లీ ..... 
అంటీలు : తల్లులూ ..... వెళ్ళండి వెళ్లి హాల్లోనో లేక కాంపౌండ్ లోనో కబుర్లు చెప్పుకోండి అంటూ ఒక్క క్షణం కూడా ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వకుండా వంట గది బయటకు వదిలి లవ్ యు బుజ్జిజానకి అంటూ బుగ్గపై ముద్దుపెట్టి లోపలికివచ్చి హమ్మయ్యా ..... ప్రస్తుతానికి సేఫ్ అంటూ పెద్దమ్మ చేతులపై గిల్లేసారు .
మేడమ్ - అమ్మమ్మ నవ్వులు ఆగడంలేదు .
పెద్దమ్మ : స్స్స్ స్స్స్ ..... మీరని చెప్పలేదు కద దేవతలూ ..... అంటూ రుద్దుకుంటున్నారు .
అంటీలు : హింట్ ఇచ్చారుకదా , ఆ అల్లరి పిల్లాడికి sorry చెబుదామనుకుంటే మీరే వద్దన్నారు కూడా ......
పెద్దమ్మ : నవ్వుకున్నారు , మీరేంటి ఆ అల్లరి పిల్లాడికి sorry చెప్పడం ఏమిటి ? , ఇదంతా మీకు దగ్గరవ్వడానికి ఆడుతున్న నాటకం , ఇప్పుడే ఇలా మిమ్మల్ని ఆటపట్టించి బాధపెడితే ఇక చనువిస్తే ఇక అంతే మీ నెత్తిన కూర్చుంటాడు , అప్పుడిక ఏమీ చేయలేము .......
అంటీలు : ఆటపట్టిస్తాడు - కోపం తెప్పిస్తాడు కానీ బాధ అయితే పెట్టలేదు పాపం మంచి అల్లరిపిల్లాడు ......
పెద్దమ్మ : మీరు చనువిస్తే జరిగేది అదే గుర్తుపెట్టుకోండి , ఏదో మీ అక్కయ్యగా మీ మంచి కోరి జాగ్రత్త అని గుర్తుచేస్తున్నాను  ఆ తరువాత దేవతల ఇష్టం ...... , అలా మాట్లాడుతున్నందుకు మేడమ్ - అమ్మమ్మ ...... బాధపడుతుంటే దగ్గరకువెళ్లి , అంతా ఆ అల్లరి పిల్లాడి మంచికోసమేలే ...... , మీకు తెలియదా చెల్లీ ఒక టీచర్ గా ఎంత దూరం అయితే ......
మేడమ్ : చివరికి అంత దగ్గర అవుతారు .
పెద్దమ్మ : Yes ......
మేడమ్ : లవ్ యు అక్కయ్యా ..... , మహేష్ మరియు అక్కయ్యలు సంతోషంగా ఉండాలి , అనాధగా పెరిగాడు అక్కయ్యల ప్రేమకోసం తపిస్తున్నాడు .
పెద్దమ్మ : తథాస్తు ...... , అతిత్వరలో జరగబోతోంది నువ్వే చూస్తావుగా చెల్లీ .......
మేడమ్ : సంతోషంతో నవ్వుకుని , ఇంకా ఆ అల్లరి పిల్లాడి గురించే ఆలోచిస్తున్నారా అక్కయ్యలూ , కాలేజ్లో కూడా అంతే కాస్త చనువిచ్చిన నాపై ఎక్కికూర్చున్నాడు అంటూ మరింత జ్వాల రగిలించారు .
అంటీలు : సరే సరే ఆ అల్లరి పిల్లాడి గురించి తరువాత మాట్లాడుకుందాము ముందైతే వంట చేద్దాము , బుజ్జితల్లికి ఆకలివేస్తోందేమో .......
పెద్దమ్మ : మీరుకూడా మధ్యాహ్నం ఏమీ తిన్నట్లు లేదు .
అంటీలు : లంచ్ అయితే చెయ్యలేదు కానీ మా ప్రియమైన బుజ్జితల్లి దగ్గరకు వచ్చేటప్పుడు పళ్ళు తిన్నాము , ఆ అల్లరి పిల్లాడు తినేంతవరకూ వదల్లేదు , మంచి ......
పెద్దమ్మ : నో నో నో ...... , అంటే ప్లాన్ అప్పుడే అమలుచేసారన్నమాట , మీకు బుజ్జితల్లి గురించి ముందే విషయం చెప్పాడా ? .
అంటీలు : లేదు ......
పెద్దమ్మ : చూసారా అదంతా ప్లాన్ ......
అంటీలు : అదీ అదీ చెప్పినా మేము నమ్మేవాళ్ళం కాదని అలా ......
పెద్దమ్మ : మీరు ఇలా అనుకోవాలనే అలా ప్లాన్ చేసాడు పర్ఫెక్ట్ గా ...... , ఈ విషయం ఆ అల్లరి పిల్లాడే చెప్పి ఉంటాడే .....
అంటీలు : చూసారా అంతా నాటకం ....... , మీ మంచితనం గురించి మొత్తం తెలుసు ఆ అల్లరి పిల్లాడికి ......అంటూ మేడమ్ వైపు కన్నుకొట్టారు .
మేడమ్ : అవును అక్కయ్యలూ ...... , నేను చేసిన తప్పును మీరు చేయకండి .
అంటీలు : అంతే అంటారా ......
పెద్దమ్మ - మేడమ్ : నూటికి నూరుపాళ్లు ...... 
అంటీలు : సరే అయితే వంటచేద్దాము ......
అమ్మమ్మ : ముగ్గురికీ ...... మహేష్ ది స్వచ్ఛమైన ప్రేమ అని తెలిసినప్పుడు వీరు పంచే అంతులేని ప్రేమ ...... ఊహించుకుంటేనే నాకే వొళ్ళంతా జలదరిస్తోంది తల్లులూ అంటూ మేడమ్ - పెద్దమ్మకు మాత్రమే వినిపించేలా గుసగుసలాడారు .
Wow బ్యూటిఫుల్ కదా అంటూ అమ్మమ్మ బుగ్గలపై చెరొకముద్దుపెట్టి ఆనందిస్తూ ముచ్చట్లతోనే మరింత జ్వాల రగిలిస్తూ వంట పూర్తిచేసి , రెడీ తల్లులూ అంటూ తీసుకెళ్లి హాల్లోనో డైనింగ్ టేబుల్ పై ఉంచారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 20-12-2023, 07:39 PM



Users browsing this thread: 34 Guest(s)