Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
కానిస్టేబుల్స్ 10 నిమిషాలలో లాక్కొచ్చారు .
కానిస్టేబుల్స్ చెప్పినది నిజమే అన్నమాట బాత్ సూట్ లో ఉన్నారంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు , అంకుల్ వాళ్ళను మోసం చేశారుకదా ఇకనుండీ చిప్పకూడు తిందురుగానీ ...... , అవును పార్ట్నర్స్ మోసం చేస్తే మా అంకుల్ వాళ్ళ కష్ట ఫలితాన్ని పొందుతారు కానీ నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు సేట్ ..... , చెప్పవా ...... ఏంటి CI గారూ సైలెంట్ గా నిలబడిపోయారు .
CI ..... కానిస్టేబుల్స్ వైపు సైగచేశారు .
నో నో నో మీరే స్వయంగా శిక్షించాలి .
CI లాఠీ అందుకుని రెండు దెబ్బలు వేశాడో లేదో తట్టుకోలేక చెబుతాను చెబుతాను అన్నాడు .
సేట్ : వారి ఇంటి ఆస్తి విలువ ఒక్కసారిగా పదింతలు అయ్యింది , ఆ ఇళ్లను కూల్చి మాల్ నిర్మించడానికి అడ్వాన్స్ కూడా తీసుకున్నాను .
ఏమిటీ నాదేవతలు - అక్కయ్యలు ఉంటున్న ఇల్లు దేవాలయంతో సమానం - ఆ దేవాలయాన్నే కూల్చాలనుకున్నారా అంటూ CI చేతిలోని లాఠీ అందుకుని కోపం తగ్గేవరకూ కొట్టాను , మరి నగలు ......
సేట్ : దెబ్బలకు కేకలతో చిందులువేస్తూనే నేను తాకట్టు పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ మూడింతలు పెరిగింది .
ఆ నగలు జాగ్రత్తగా ఉన్నాయికదా ...... , అమ్మేసాను అన్నావో నువ్వు చచ్చావే .
సేట్ : లేదు లేదు నా లాకార్లో జాగ్రత్తగా ఉన్నాయి .
హమ్మయ్యా ...... అంటూ సంతోషంగా గుండెలపై చేతినివేసుకున్నాను .
సేట్ : లాభాల్లో 50% CI గారే తీసుకున్నారు , మమ్మల్ని మాత్రమే శిక్షించడం అదికూడా CI తోనే , సగం తప్పు అతడితే బాబూ ......
CI గారూ తప్పుకదా , విశ్వ సర్ ఏమిచేద్దాము .
విశ్వ సర్ : నిన్ను చూస్తుంటే నాకే షాకింగ్ గా ఉంది , నీ ఇష్టం బాబూ .....
విశ్వ సర్ ...... నా పేరు మహేష్ .
విశ్వ సర్ : రియల్ హీరో అన్నమాట .....

సేట్ - పార్టనర్స్ ...... మీ మాటల్లో న్యాయం ఉంది అదిగో అక్కడ లాఠీలు ఉన్నాయి మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు .
దెబ్బల నొప్పి రుచిచూసినట్లు తిక్కరేగి లాఠీలు అందుకుని CI తోపాటు సహాయం చేసిన కానిస్టేబుళ్లకు లాఠీ దెబ్బల రుచి చూయించారు .
అంకుల్ వాళ్ళ పెదాలపై నవ్వులు ......

అలసిపోయి ఆగిపోయారు .
CI సర్ ..... మీడియాను .....
CI : బాబూ బాబూ వద్దు వద్దు అంటూ వేడుకుంటున్నారు .
మీవలన మీ భార్యాబిడ్డలు అవమానం చెందడం నాకిష్టం లేదు - మరొక్కసారి ఇలా జరిగితే ఊరుకోను - ఇప్పటివరకూ మీరు మోసం చేసిన వారందరికీ క్షమాపణ చెప్పి న్యాయం చెయ్యాలి , నిజాయితీగా ఉండే విశ్వ సర్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి .
CI : తప్పకుండా బాబూ ...... 
పార్ట్నర్స్ ....... అంకుల్ వాళ్ళు ఈరోజు బెంగళూరులో ఏదైతే వారి కష్టానికి ప్రతిఫలాన్ని పొందేవారో అది రేపు ఉదయానికల్లా వారి చెంతకే చేరాలి , మీరు చేసిన మోసాన్ని అక్కడ తెలియజేసి వారి స్థాయిని వారికి ఇవ్వాలి , లేదంటే తెలుసుగా ....... మీ హిస్టరీ అంతా మాదగ్గర ఉంది .
పార్ట్నర్స్ : నువ్వు చెప్పినట్లుగానే చేస్తాము బాబూ ..... అబ్బా అయ్యా నొప్పి .
ఇక సేట్ నువ్వు ...... నీకు రావాల్సిన డబ్బు వడ్డీతోసహా నీ అకౌంట్ లోకి పడిపోయింది , ఏమిచెయ్యాలో తెలుసుకదా ......
సేట్ : రేపటి లోపు ఆస్తిపత్రాలు - నగలు ......
రేపటి లోపు కాదు నిమిషాలలో ఇంటికి తీసుకెళ్లి క్షమాపణ చెప్పి అందివ్వాలి .
సేట్ : నిమిషాలలో అంటే కుదరదు బాబూ ...... బ్యాంకు లాకార్లో ఉన్నాయి అందుకే ....
సరే వీలైనంత తొందరగా ఈరోజే , నీ చేతులు తాకి మలినం అయి ఉంటాయి కాబట్టి కొత్త నగలలా క్లీన్ చేసి జ్యూవెలరీ బాక్సస్ లో ఉంచి తీసుకురావాలి .
సేట్ : తప్పకుండా తప్పకుండా బాబూ .....
ఇంకా ఇక్కడే ఉన్నారే , మరొక కోటింగ్ ఏమైనా కావాలా ...... ? .
PT ఉషలా బయటకు పరుగులుతీశారు దెబ్బలను రుద్దుకుంటూ .......

అంకుల్ వాళ్లకు వారి లగేజీ - మొబైల్ - పర్సులను ఇచ్చారు సెక్యూరిటీ ఆఫీసర్లు , మీపై ఎటువంటి కేసులూ లేవు మీరు వెళ్ళవచ్చు అనిచెప్పారు .
అంకుల్ కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు ...... , ముగ్గురూ నాదగ్గరకు చేరుకుని బాబూ ...... నువ్వు ఎవరోకూడా తెలియదు కానీ సమయానికి దేవుడిలా వచ్చి పెద్ద గండం నుండి కాపాడావు - మా కుటుంబాల గురించి ఆలోచిస్తేనే చెమటలు పట్టేస్తున్నాయి - మాకోసం వారు అన్నీ వదులుకున్నారు - మాతప్పు కూడా ఉంది కుటుంబం గురించి పట్టించుకోకుండా బిజినెస్ బిజినెస్ అంటూ సంవత్సరం మొత్తం ఇలా తిరుగుతూనే వాళ్ళనూ బాధపెట్టాము - మా బిజినెస్ ఆశల వలన వాళ్లకు చిన్న చిన్న సంతోషాలను కూడా దూరం చేసాము - ఇక జైలు పాలయ్యాము అని తెలిస్తే ....... , ఇదిగో ఉదయం నుండీ చాలాసార్లు కాల్స్ చేశారు .
నో నో నో అంకుల్స్ ఈ విషయం ఎప్పటికీ అంటీ వాళ్లకు తెలియకూడదు - వాళ్ళు బాధపడితే అక్కయ్యలు ( నేను ) తట్టుకోలేను , అనాధగా ఉన్న నాకు అంటీ వాళ్లే కదా కుటుంబం ఉందనేలా చేశారు .
అంకుల్స్ : మా బిడ్డలు కూడా తెలుసా ..... ? .
తెలుసా అంటారు ఏంటి అంకుల్స్ ...... అక్కయ్యలే కదా రోజూ కాలేజ్ వరకూ వదిలేది , ( నాకు ...... అంటీలు అంటే ఎంతప్రాణమో - అక్కయ్యలకు ..... నేనంటే అంత ఇష్టం అంటూ నవ్వుకున్నాను ) .
అంకుల్స్ : సంతోషించి , నీ ఎలా రుణం తీర్చుకోవాలో కూడా తెలియదు బాబూ .......
అదిగో మళ్లీ ...... , నేనే ..... అంటీవాళ్లకు ఋణపడిపోయాను , మీరు మాత్రం ఈ విషయం అంటీ వాళ్లకు తెలియనివ్వకూడదు , ఎవరికి కాల్ చేస్తున్నారు ? అంటీ వాళ్లకేనా ....... నో నో నో సరే సరే చెయ్యండి కానీ బెంగళూరు నుండి మాట్లాడుతున్నట్లు మాట్లాడండి , ఈ బాధపెట్టే విషయం అంటీ వాళ్లకు ఎప్పటికీ తెలియకూడదు అంటే - నారుణం తీర్చుకోవాలి అంటే మీరు వెంటనే బెంగళూరుకువెళ్లి మీ బిజినెస్ స్టార్టప్ ప్రయత్నాలు మొదలుపెట్టండి - బయట కారు రెడీగా ఉంది కారులో ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫ్లైట్ కు బెంగళూరు వెళ్లిపోండి .
అంకుల్స్ : మళ్లీ మాగురించే ఆలోచిస్తున్నావు నిజంగా మాకోసం వచ్చిన దేవుడివి బాబూ ..... , దాదాపు కోటికిపైగా అప్పు చేసాము .....
తీర్చేసాము అంకుల్స్ ......
అంకుల్స్ : ఇప్పట్లో తిరిగి ఇవ్వగలమో లేదో మళ్లీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ అమౌంట్ .......
బిజినెస్ స్టార్టప్ సక్సస్ అయ్యింది కదా అంకుల్స్ తీర్చడం ఎంతసేపు .....
అంకుల్స్ : ఖచ్చితంగా ఖచ్చితంగా బాబూ ..... ప్రతీ రూపాయీ తీర్చేస్తాము .
మళ్లీ ఆ టెన్షన్ పెట్టుకోకండి - మీ ఆరోగ్యాలు జాగ్రత్త ......
అంకుల్స్ : బాబూ బాబూ బాబూ ...... అంటూ రెండుచేతులూ జోడించారు .
అంకుల్స్ ఆపండి ఆపండి , మిమ్మల్ని వైజాగ్ లో ఎవరైనా గమనించకముందే వెళ్లిపోవాలి , అంటీ వాళ్ళ గురించి ఏమీ కంగారుపడకండి , ఎదురింటిలోనే నేనుంటాను .
అంకుల్స్ : దేవుడే తోడు ఉన్నాడు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసి లగేజీ అందుకున్నారు .
అంకుల్స్ ...... వస్తున్నప్పుడు చూసాను దగ్గరలోనే క్లినిక్ ఉంది ట్రీట్మెంట్ తీసుకుని బయలుదేరండి , అంటీ వాళ్లకు విషయం తెలియకూడదు మరొక ముఖ్య విషయం దెబ్బలు మానిపోయేంతవరకూ వీడియో కాల్ మాత్రం చేయకండి .
అంకుల్స్ : మా కుటుంబాలు అంటే అంత ఇష్టమా మహేష్ .....
ఇష్టం అన్నది చాలా చాలా చాలా చిన్నది అంకుల్స్ ...... అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను , వారి సంతోషం కోసం ఏమైనా చేస్తాను ఎంతదూరం అయినా వెళతాను , హ్యాపీ జర్నీ అంకుల్స్ ......
అంకుల్స్ : థాంక్యూ మహేష్ అనిచెప్పి సంతోషంగా బయలుదేరారు .

విశ్వ సర్ వైపుకు తిరిగి సెల్యూట్ చేసాను .
విశ్వ సర్ : నో నో నో ..... నేనే నీకు సెల్యూట్ చెయ్యాలి మహేష్ , CI గారినే గడగడలాడించావు , ఇంతవరకూ షాక్ లో ఉన్నానంటే నమ్ము , ఇంతచిన్న వయసులో ..... నీ ధైర్యం నీ కాన్ఫిడెన్స్ ...... సెల్యూట్ మహేష్ .
సర్ సర్ ..... నన్ను నమ్మి నాప్రక్కన నిలబడ్డారు , మీలాంటి సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నంతకాలం న్యాయం ధర్మం బ్రతికే ఉంటాయి .
విశ్వ సర్ : నా డ్యూటీ నేను చేసాను , నువ్వు ఉన్నావుకాబట్టి చెయ్యగలిగాను లేకపోతే తప్పుడు కేసులు పెట్టారని తెలిసినా ఏమీచెయ్యలేకపోయేవాడిని ......
సంతోషించాను , సర్ ..... అతి ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను got to go .......
విశ్వ సర్ : మహేష్ ..... ఎలాగైనా మళ్లీ కలుస్తాను , వెళ్లు వెళ్లు ......
సర్ కు బై చెప్పేసి పరుగునవెళ్లి కారులో కూర్చుని , సిస్టర్ 2:30 త్వరగా పోనివ్వండి పోనివ్వండి .

ట్రాఫిక్ దాటుకుని ఇంటికి చేరుకునేసరికి అర గంట పట్టింది , అంటీ ఇంటిముందు రోడ్డుపై పెద్దమొత్తంలో జనాలు గుమికూడి ఉండటం - JCB లు కూడా ఉండటం చూసి , సిస్టర్ సిస్టర్ స్టాప్ స్టాప్ అంటూ ఆగకముందే డోర్ తీసుకుని దిగి పరుగునవెళ్ళాను .
జనాలను దాటుకునివెళ్ళిచూస్తే ఇంట్లోని సామానులన్నీ బయటపడేశారు - JCB ఏక్షణమైనా కాంపౌండ్ గోడను కూల్చడానికి రెడీగా ఉంది .
అంటీ అంటీలు అంటీలు ఎక్కడ అని చుట్టూ చూస్తే , మెయిన్ డోర్ దగ్గర లేడీ కానిస్టేబుళ్లు ...... మేడమ్ మేడమ్ డోర్ తెరిచి బయటకు రండి లేకపోతే మీరు ఉండగానే కూల్చేస్తారు .
సరిగ్గా చెప్పారు కానిస్టేబుల్స్ .... , ప్రజలారా ...... మాతప్పేమీ లేదు - ఈ ఇంటి యజమానులు అడ్వాన్స్ తీసుకుని మా పేరున రాశారు - కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఈ బిల్డింగ్ కూల్చివేసి మాల్ నిర్మించబోతున్నాము , మీరే చూశారుకదా ఇంతవరకూ ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాము , ఇక wait చేయలేము , కానిస్టేబుల్స్ ..... డోర్ బద్ధలుకొట్టి బయటకు లాగేయ్యండి రాకపోతే వాళ్ళుండగానే కూల్చేయడం తప్ప మరొక మార్గం లేదు అంటూ JCB వైపు సైగచేశాడు .

అంటీ వాళ్ళ గురించి అలా మాట్లాడగానే కోపం కట్టలు తెంచుకుంది - అంటీలు ఉండగానే కూల్చేస్తావా అంటూ వాడిని అక్కడికక్కడే పాతేయాలని అనిపించినా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను , JCB కు అడ్డంగా వెళ్లి ఆపమని సైగచేసాను .
ఆపకుండా నామీదకు దూసుకురావడంతో రాయి అందుకుని JCB అద్దం పగిలేలా విసిరాను - జేసీబీ ఆగింది .
ఇంతమంది ఊరికే నిలబడి చూస్తుంటే నువ్వేవాడివిరా బచ్చా అంటూ ఒకడు వచ్చి కాలర్ పట్టుకున్నాడు .
ఈ సామానులు బయటపారేసింది ......
మేమే ...... , మామూలుగా అయితే డ్యామేజ్ కాకుండా బయట ఉంచాలి కానీ కావాలనే సామానులన్నింటినీ పైనుండి విసిరేసాము అంటూ నవ్వుకుంటున్నారు .
ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాలేదు , జై పెద్దమ్మ అంటూ నా షర్ట్ పై ఉన్న చేతిని పట్టి తిప్పేసి నొప్పితో కేకలువేస్తున్న వాడి చేతిని విరిచేసాను - ఇవే చేతులతో కదా సామానులు పగిలిపోయేలా విసిరినది .
వాడి అరుపులకు అక్కడున్నవాళ్ళంతా బెదిరిపోయారు .

చూస్తారే ఆ బచ్చా గాడిని కొట్టి ఈడ్చి పడేయ్యండి .
చెరొకవైపునుండి ఇద్దరు వచ్చారు - ఆగండి ఆగండి మిమ్మల్ని కొట్టడం చాలా అంటే చాలా ఈజీ - బచ్చా గాడే అనుకున్నారో మీకంటే దున్నపోతులా ఉన్నవాడి ఒకచేతిని మాత్రమే విరిచేసాను మీరెండు చేతులూ విరిచేస్తాను మీఇష్టం ......
చెయ్యి విరిగినవాడు నొప్పితో విలవిలలాడిపోతూనే వచ్చి వద్దురా వద్దురా అంటూ ఇద్దరినీ ఆపాడు .
రేయ్ బచ్చాగాడికి భయపడుతారేంటి ......
ఎప్పుడూ పనివాళ్లే దెబ్బలు తినాలా ..... ఈసారికి నువ్వు వచ్చెయ్యి ......
అంత పోటుగాడివా ..... ? .
పోటుగాడే సర్ అంటూ చెయ్యి విరిగినవాడు చెప్పాడు .
మనగురించి మనం కాకుండా వేరేవాడు భయపడుతూ చెబితే కలిగే కిక్కే వేరబ్బా ....... నవ్వుకున్నాను .
ఏంటి బెదిరిస్తున్నావా ...... ? , ఈ ఇల్లు ....... నాది నాకు రాసిచ్చారు - కోర్ట్ కూడా కూల్చడానికి అనుమతి ఇచ్చింది - చూశావుకదా స్వయంగా సెక్యూరిటీ ఆఫీసర్లే వచ్చారు .
ఏదీ చూయించు ......
ఏమి చూయించాలి ? .
రాసిచ్చిన పత్రాలు మరియు కోర్ట్ ఆర్డర్ .......
అవీ అవీ అంటూ నసుగుతున్నాడు , నావెనుక రౌడీలే కాదు CI ఉన్నాడు , ఒక్క కాల్ చేశానంటే ......
చెయ్యి చూస్తాను ......
ఒక్క కాల్ తో పిల్లల జైల్లో పడతావు అంటూ మొబైల్ తీసి కాల్ చేసాడు .

అవసరం లేదు ఇక్కడే ఉన్నాను అంటూ ఏకంగా సేట్ తోపాటు వచ్చాడు CI .....
సర్ సర్ చూడండి మనకే అడ్డువస్తున్నాడు .
CI : మనకు ఏంటి మనకు అంటూ చెంప చెల్లుమనిపించాడు , మేము న్యాయం వైపు అంటూ నా వెనుకకు చేరారు , సేట్ ఈ విషయం కాల్ చేసి చెప్పగానే పరుగున విచ్చేసాము బాబూ ...... , నువ్వు అన్నట్లుగా నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తేనే నేనెంత పెద్ద తప్పుచేసానో తెలిసొచ్చింది , నావలన వారు ...... తలుచుకుంటేనే భయం వేసింది నన్ను మన్నించు బాబూ , కానిస్టేబుల్స్ వచ్చెయ్యండి అంటూ పిలిచాడు .
సేట్ ..... అడ్వాన్స్ తీసుకున్నావు కదా .....
సేట్ : వడ్డీతోసహా అడ్వాన్స్ అమౌంట్ ను కొద్దిసేపు ముందే నీ అకౌంట్ లోకి వేసేసాను , ఈ బిల్డింగ్ ఎప్పటికీ నీకు దక్కదు ఇక వెళ్లిపో , బాబూ ..... ఆస్తిపత్రాలు .
మరి నగలు ...... ? .
సేట్ : నా బెస్ట్ వర్కర్స్ చేత కొత్తగా మారిపోతున్నాయి బాబూ - క్లీనింగ్ పూర్తవగానే నేనే స్వయంగా తీసుకొస్తాను - ఈ విషయం గుర్తుకురాగానే సర్ ను వెంటబెట్టుకుని వచ్చేసాను .
మంచిది సేట్ జీ ......

CI సర్ జేసీబీ లతోపాటు అందరినీ పంపించేస్తున్నాడు .
CI సర్ ..... సామానులు ? .
CI : వీరిచేతనే లోపల పెట్టిస్తాను బాబూ ......
డ్యామేజీ అయ్యాయే ఎలా ..... ? .
CI : వాడికి పనిష్మెంట్ ఇద్దాము బాబూ ..... చీకటిపడేలోపు వీటి స్థానంలో కొత్తవి తెప్పించి నేనే దగ్గరుండి చక్కగా సర్ధిస్తాను .
థాంక్యూ సర్ ....... , ఇలాంటి ఒకటి జరిగింది అనే ఆనవాళ్లు కూడా ఉండకూడదు .
CI : నేను చూసుకుంటాను , ఇలా అయినా చేసిన పాపాల నుండి విముక్తి పొందుతానేమో , నీకే చాలా చాలా థాంక్స్ , నా పిల్లలు ..... నన్ను ఇలానే చూడాలన్న ఆశను బ్రతికించావు అంటూ సెల్యూట్ చేశారు .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 20-12-2023, 07:20 PM



Users browsing this thread: 47 Guest(s)