15-02-2023, 11:01 PM
(This post was last modified: 19-02-2023, 09:46 PM by Takulsajal. Edited 1 time in total. Edited 1 time in total.)
58
స్పృహ కోల్పోయిన అరణ్యకి లీలగా ఏదో కనపడుతుంది.. అది ఎవరో ఆకాశంలో కొట్టుకుంటున్నారు, ఉన్నట్టుండి భస్మం ప్లేన్ మీద పడడం శివ మరియు మీనాక్షిలు ప్రాణాలు కోల్పోవడం అంతా కనిపించింది అప్పటివరకు అన్ని మంటలు తరువాత మొత్తం చీకటి అలుముకుంది అప్పుడు కనిపించిన కొన్ని దృశ్యాలు.. మీనాక్షి మరియు శివ ప్రాణాలని అరణ్య గట్టిగా తన గుప్పిట్లో పట్టుకున్నాడు.. ప్రాణాలని హరించుకుపోవడానికి స్వయంగా యముడే వచ్చినా పసికందు అయిన అరణ్య గుప్పిటని మాత్రం తెరవలేకపోయాడు.
ఆ రెండు ప్రాణాలని అలానే పట్టుకుని కింద పడిపోయాక వదిలాడు, అవి అక్కడ పక్కనే ఆడుకుంటున్న సింహాల గుంపులోకి దూరిపోయాయి.. ఆ తరువాత గుర్రంలోకి శివ స్నేహితుడు సందీప్.. సందీప్ భార్య అయిన శ్రావణి సముద్రంలో తిమింగలంలా జన్మించింది.. గగన్ మరియు తన భార్య రజిత జింకల్లా జన్మించారు..
అరణ్య ఒక్కసారిగా లేచి కూర్చుంది, లేచి నిలబడింది.. అయినా అనుమానం వచ్చి కింద చూస్తే తన శరీరం ఇంకా స్పృహ లేకుండా పడి ఉండడం చూసి కంగారు పడిపోయింది. ఒక సున్నితమైన గొంతు నుంచి తనకి వినపడిన శబ్దం.. అమ్ములు...
అరణ్య(అమ్ములు) : బావా.. నువ్వేనా
అరణ్య : నేనే..
అమ్ములు : బావా ఎందుకు ఇన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడలేదు, ఎందుకు నువ్వు నా కోసం రాలేదు, నీకు శక్తులు ఉండి కూడా నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావ్
అరణ్య : నా శక్తులు నాలో కలిసిపోవడానికి ఇన్ని వర్షాలు పట్టింది.. నేనూ ఇంకా లేవలేదు ఇరవై ఏళ్ళకి ఇప్పుడే మెలుకువ వచ్చింది.. అయినా నీకు అవసరమైనప్పుడల్లా నేను సాయం చేస్తూనే ఉన్నాగా..
అమ్ములు : అవును..
అరణ్య : బాధ పడకు, సరిగ్గా నాకు మెలుకువ వచ్చే సమయానికి వాళ్ళు వచ్చేసారు అందుకే నిన్ను సందీప్ బాబాయిని కాపాడలేకపోయాను.. ఇక వచ్చేయి నా దెగ్గరికి..
అమ్ములు : అంటే.. సందీప్ మావయ్య..
అరణ్య : ఆయుష్షు తీరిపోయింది..
అమ్ములు : అందరినీ చూపించావ్ మరి అమ్మ.. అమ్మ ఎక్కడా...?
అరణ్య : వస్తుంది..
అరణ్య(అమ్ములు) ఒక్కసారిగా తన శరీరంలోకి ఎవరో నెట్టేసినట్టు వెళ్ళిపోయింది.. అమ్ములు దేనికి భయపడకు నేనున్నాను.. నీ కన్నీరు కారిన చోట, నీ చేత కన్నీరు కార్పించిన ఎవ్వరు బతికి ఉండరు.. ఇది విధి లిఖితం.. అరణ్య ఎమ్మటే లేచి గుర్రం దెగ్గరికి పరిగెత్తింది..
అరణ్య(అమ్ములు) : మావయ్య.. మావయ్య.. అని గుర్రం ముఖాన్ని పట్టుకుని నిమిరింది..
గుర్రం అరణ్యని(అమ్ములు) ప్రేమగా చూస్తూ కళ్ళు మూసుకుంది అంతే మళ్ళీ లేవలేదు.. అరణ్య ఏడుస్తుంటే అక్కడున్న ఎవ్వరు పట్టించుకోలేదు.. కొంతసేపటికి ఎవరో వచ్చి అరణ్య చెయ్యి పట్టుకుని లాక్కెళ్లారు, అరణ్యని బలవంతంగా తీసుకెళుతుంటే.. ఉన్నపళంగా భూమి అదిరింది.. అందరూ తెరుకునే లోపే ఎక్కడినుంచి వచ్చాయో తెలీదు వందల కొద్ది బలమైన గోవులు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఫెన్సింగ్ ని గేట్లని అడ్డొచ్చిన మనుషులని అన్నిటిని గుద్దుకుంటూ వచ్చేసాయి.. అరణ్య చెయ్యి పట్టుకున్నవాడిని ఒక్క కుమ్ముతో వాడి పొట్టలోకి కొమ్ములని దూర్చి ఎగరేసింది.. వందల కొద్ది ఆవులు అరణ్య చుట్టూ కాపలాగా తిరుగుతుంటే మిగతావి సోల్జర్స్ పని పట్టాయి.. అరణ్య ఆకాశంలోకి చూస్తూ నన్ను కాపాడుతున్నావా కృష్ణయ్య అని ప్రేమగా ఒక్క పదంతో ఇన్నేళ్లు కొలిచిన కృష్ణుడి పదానికి అయ్యని చేర్చి కృష్ణయ్య అని పిలుస్తూ తండ్రి స్థానం ఇచ్చేసింది.. పక్కనే నిలబడ్డ ఆవుని ప్రేమగా నిమురుతూ కళ్ళు మూసుకుని తన మొహాన్ని ఆవుకి ఆనించింది.
కొంతసేపటికి ఆకాశంలో పక్షి శబ్దం వినిపించడంతో పైకి చూసింది, అది అరణ్య చిన్నప్పటి నుంచి తను పెంచుకుంటున్న మైత్రి.. చూడగానే దుఃఖం ఆగలేదు.. హంస కిందకి దిగగానే వెళ్లి కౌగిలించుకుని ఏడ్చేసింది గుర్రాన్ని చూస్తూ.. ఆ హంస చనిపోయిన గుర్రాన్ని చూసి అరవగానే గాల్లో నుండి వేల కొద్ది పక్షులు తమ నోటితో పూలని తెచ్చి గుర్రం మీద పోసి దాన్ని కప్పేసాయి.. పక్షులన్నీ హంసకి ప్రణామం చెప్పి ఎగిరి వెళ్ళిపోగానే హంస తిరిగి అరణ్య వంక చూసింది.. అరణ్య ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంది.
ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రెప్పలు టపటప కొట్టగానే వెంటనే దాని శరీరం బంగారపు రంగులోకి మారింది, దాని శరీరం కూడా ఐదు రెట్లు పెద్దగా అయ్యింది.. అది చూసి అరణ్య నెమ్మదిగా తన దెగ్గరికి వెళుతుంటే.. అరణ్యకి తన బావ మాటలు గుర్తొచ్చాయి..
అరణ్య(అమ్ములు) : అమ్మా.. అమ్మ.. అర్ధమైనట్టు అమ్మా అని పిలుస్తూ వెళ్లి తనని నిలబడే కౌగిలించుకుంది..
ఏదో చప్పుడు కాగానే హంస వెంటనే సైగ చెయ్యగానే అరణ్య కొంచెం భయంగానే బంగారు హంస మీద ఎక్కి కూర్చుంది.. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పరిగెడుతూ రెక్కా రెక్కా కొడుతూ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినట్టు గాల్లోకి ఎగిరింది.. అరణ్యకి కొంచెం భయం వేసినా తన అమ్మ మెడని సున్నితంగా పట్టుకుని ఇంకో చెయ్యి తను కూర్చున్న దెగ్గర వేసి పట్టుకుంది.. సముద్రం మీదగా ఎగురుతూ వెళుతుంటే వినిపిస్తున్న శబ్దానికి కిందకి చూసింది.. అప్పటికే పేద్ద అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి.. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అసలైన పెద్ద అల సుమారు ఒక ఇరవై అంతస్థుల పొడవు ఉంటుందేమో.. చూసి అరణ్య భయపడింది.. తుఫాను అని అర్ధం అయ్యి వెనక్కి చూసింది.. కానీ హంస ముందుకు చూడమని ఒక జెర్క్ ఇవ్వగానే అరణ్య పడిపోకుండా గట్టిగా పట్టుకుంది.. హంస అరణ్య తుఫాను వల్ల జరిగే పరిణామాలు చూడకముందే ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలని వేగం పెంచింది.. అరణ్య మాత్రం ఆ తుఫాను తీవ్రత చూసి ఎంతమంది చనిపోతారో అని భయపడి బాధపడింది.
చాలా దూరం ప్రయాణించాక గాని తుఫాను తాలూకు ఆనవాలు మాయం కాలేదు, కొంత దూరం వెళ్ళాక హంస చిన్నగా నీళ్లలోకి ల్యాండ్ అయ్యి వెళుతుంటే అరణ్యకి ఆనందం వేసింది.. వెంటనే తన అమ్మని గుర్తు చేసుకుని ప్రేమగా మాటలు చెపుతుంటే హంస అవన్నీ వింటూ ముందుకు ఈదుతు వెళుతుంది.. తెల్లవారుతుండగా చుట్టూ అటు ఇటు డాల్ఫీన్లు అందంగా తన వెంట వస్తుంటే మనసు తేలికపడి ఇందాక చూసిన తుఫానుని మర్చిపోయింది.
కొంత దూరం వెళ్ళాక సూర్యుడి కిరణాలు అంతకంతకు పెరుగుతున్న సమయాన పెద్దగా సౌండ్ వినిపించి వెనక్కి చూసింది, వెంటనే తమ పక్కన ఈదుతున్న డాల్ఫిన్లు, చేపలు అన్ని వెళ్లిపోయాయి.. ఒక పెద్ద తిమింగళం వస్తుంటే అరణ్య భయపడింది కానీ తన అమ్మ హంస భయపడకపోవడంతో తను సందీప్ భార్య అయిన శ్రావణి అని తెలుసుకుని శాంతించింది.. తిమింగలం హంస పక్కకి వచ్చి శాంతించగా.. అప్పటివరకు తిమింగలం వల్ల అల్లకల్లోలం అయిన అలలు కూడా నెమ్మదించాయి.. చేపలు మరియు డాల్ఫిన్లు మళ్ళీ అరణ్య పక్కకి చేరాయి.. అరణ్య తిమింగలం మీద చెయ్యి వేసింది.. తన అమ్మ హంస సైగ చేయగానే నీళ్లలోకి దూకి కష్టపడి తిమింగలం మీదకి ఎక్కింది.. హంస మళ్ళీ మాములు ఆకారంలోకి మైత్రిలా మారి తిమింగలం మీద కూర్చోగా తిమింగలం వేగం పెంచింది.. అరణ్య కూడా అలిసిపోయి వెల్లికలా పడుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది.. ఏదో మెత్తని స్పర్శ తగలి కళ్ళు తెరిచి చూస్తే తన అమ్మ ప్రేమగా చూస్తుంది.. తన అమ్మని పక్కన పడుకోబెట్టుకుంది.. ప్రేమగా హత్తుకుంది.
*:* *:* *:* *:*
అమెజాన్ అడవిలో రోజులాగే ఎవరికి వాళ్ళు కాపలాకి ఉపక్రమించారు.. రాత్రి కాపలా కాసే మనుషులు చెట్ల మీద కూర్చోగా, జింకల జంట అరణ్య ఉన్న దట్టమైన అడవి ముందు కాపలాగా కూర్చుని ఉన్నాయి.. లోపల మగ సింహం రోజూ రాత్రి అరణ్య సరస్సు మధ్యలో తామర పువ్వు మీద పడుకున్న ఎదుట కూర్చుని తనని చూస్తూ కాపలా కాస్తుంది, ఆడ సింహం కూడా అలానే అరణ్యని చూస్తూ మగ సింహంని ఆనుకుని ఎప్పటికో నిద్రపోతుంది.. అలానే ఈరోజు కూడా ఆడసింహం నిద్రలోకి జారుకోగానే తనని వాటేసుకుని చిన్నగా కళ్ళు మూసుకుంటుంది మగ సింహం.. ఉన్నట్టుండి చిన్న వెలుగు ఒకటి కళ్ళలో పడగానే మగ సింహం ఉలిక్కిపడి లేచి కూర్చుంది.. ఆ కుదుపుకి ఆడసింహం కూడా లేచి అరణ్య వంక చూసింది.. అరణ్య కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు.. ఇరవై మూడేళ్ల తరువాత అరణ్య మొదటిసారి కళ్ళు తెరిచాడు, లేచి కూర్చున్నాడు..
ఆడసింహం ఒక్క క్షణం కూడా ఆగలేదు ఒక్క దూకులో అరణ్య మీదకి దూకి ప్రేమగా నాకుతుంటే మగసింహం అది చూస్తూ అరణ్య దెగ్గరికి వెళ్ళింది.. ఇద్దరినీ దెగ్గరికి తీసుకుని ప్రేమగా ముద్దాడుతున్నాడు ఆ ఇరవై మూడేళ్ల యువకుడు అందమైన యువకుడు.. కళ్ళు మూసుకుని తెరవగానే ఒంటిమీదకి బట్టలు, పొడుగాటి జుట్టు పిచ్చి గడ్డం అన్ని పోయి ఇంకా అందంగా తయారు అయ్యాడు.. ఆడ సింహాన్ని ఎత్తుకుని లేచి నిలబడ్డాడు..
అరణ్య : నన్ను క్షమించు అమ్మా...