Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance రామ్ weds సీత
#8
ప్రస్తుతం
 
రామ్ కి తెలిసినంతవరకు గుర్తుకు తెచ్చుకొని సీత ని చూస్తూ "ఎంత క్యూట్ గా నిద్ర పోతున్నావే!!! నీకోసం పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది... మా అమ్మ ముందు కూడా నటించాల్సి వచ్చింది... రాక్షసి అయినా నీ కోసం ఏదైనా చెయ్యొచ్చులే"అని నవ్వుతూ అనుకుంటూ తనని ఇంకా దగ్గరికి తీసుకుని నిద్ర పోతాడు
 
ఉదయాన్నే నిద్రలేచిన సీత రామ్ కౌగిట్లో ఉండటం చూసి నవ్వుకుంటూ "నన్ను దూరంగా ఉండమని నువ్వు దగ్గరికి వస్తావా బావ???" అనుకుంటూ తన నుదిటి మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవడానికి వెళుతుంది
 
రామ్ సీత లేచినప్పుడే నిద్ర లేచిన ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నాడు తన మాట్లాడుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకునే సరికి మనసులో సంతోషంగా ఉన్న బయటికి చూపించకుండా నిద్ర నటిస్తాడు... తను వెళ్ళగానే నవ్వుకుంటూ కళ్ళు మూసుకొని అలా కొంచెం సేపటికి నిజంగానే నిద్రపోతాడు
 
సీత కొంచెం సేపటికి ఫ్రెష్ అయి వచ్చి రామ్ ని నిద్ర లేపుతుంటే రామ్ విసుగ్గా కళ్ళు తెరిచి సీతను చూసి ఫ్రిజ్ అయిపోయాడు
 
సీత చీర కట్టుకోకుండా ఓన్లీ లంగా జాకెట్ మీద వచ్చి రామ్ ముందు నిలబడి నిద్ర లేపుతుంది...
 
వెంటనే కళ్ళు మూసుకొని "ఏంటే ఈ ఫ్రీ షో నాకు!!!" అని కంగారుగా అడుగుతుంటే
 
"బావ" అని గారంగా పిలుస్తుంది...
 
తనాల పిలవగానే పెదవుల మీద చిరునవ్వు వచ్చి "ఏంటి??" అని అడుగుతాడు
 
"నీకు తెలుసు కదా నాకు చీర కట్టుకోవడం రాదని!!! నువ్వే నాకు చీర కట్టు" అని తన చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటే
 
"ఏయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు??? నేను నీకు చీర కట్టడం ఏంటి???" అని కంగారుగా అడుగుతాడు
 
"తప్పేముంది బావ నేను నీ పెళ్ళాన్ని కదా!!! నన్ను నువ్వు ఎలా అయినా చూడొచ్చు అందుకే సైలెంట్ గా చీర కట్టు... లేకపోతే ఇలానే బయటికి వెళ్లిపోతాను" అని బెదిరిస్తుంది
 
"అమ్మో ఇది ఇలా బుక్ చేస్తుందంటి దీన్ని ఇలా చూసి నేను కంట్రోల్లో ఉండగలనా అస్సలు ఉండలేను..." అనుకుంటూ "నేను కట్టను... నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోవే" అంటే
 
"సరే నేను ఇలాగే బయటికి వెళ్తున్న" అంటూ అడుగుల చప్పుడు చేస్తుంటే
 
రామ్ ఖంగారుగా కళ్ళు తెరిచి సీత ని చూస్తే తన మొహాన్ని రామ్ మొహానికి దగ్గరగా ఉంటుంది... సీతను అంత దగ్గరగా ఉండేసరికి తన కళ్ళలోకి చూస్తూ అలాగే ఉండిపోతాడు
 
సీత నవ్వుతూ "బావా చీర" అని గారంగా అడుగుతుంది
 
"ఇది కట్టకపోతే ఇలాగే వెళ్లేటట్టు ఉంది" అనుకుంటూ "సరే ఇవ్వు కడతాను" అని చెప్పి చీర తీసుకొని కళ్ళు మూసుకుని కడుతుంటే రామ్ చేతి వేళ్ళు సీత ఒంటిమీద ఎక్కడెక్కడో తగులుతుంటే
 
"అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ కాదు అక్కడ హహహ అంటూ నవ్వుతూ "బావ నువ్వు కితకితలు పెడుతున్నావు కళ్ళు తెరిచి కట్టొచ్చు కదా!!! ఇలా ఎక్కడపడితే అక్కడ ముట్టుకోపోతే" అని అంటుంటే
 
"ఏమ్ ఇలా కడితే కట్టించుకోవా???" అని చిరుకోపంగా అడుగుతాడు
 
"ఎందుకు కట్టించుకొను... నువ్వు ఎలా కట్టిన నాకు ఓకే కాకపోతే కళ్ళు మూసుకొని కడితే ఎక్కడెక్కడో పట్టుకుంటున్నవు... నీకు ఇష్టమైతే అలానే కట్టు" అని నవ్వుతూ అంటుంది
 
"ఇది నన్ను కంట్రోల్లో ఉండనిచ్చేలా లేదు" అనుకుంటూ అలాగే కడుతుంటే సీత నడుము, తన ఎత్తుపల్లాలు టచ్ అవుతుంటే కంగారుగా కళ్ళు తెరిచి సీతను చూసి అలానే చూస్తూ ట్రాన్స్ లో చీర కట్టేస్తాడు
 
సీత రామ్ ని చూసి నవ్వుతుంటే రామ్ సీత నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టేస్తాడు... సీత కూడా అతనికి సహకరిస్తూ రామ్ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి తన వంతు సహకారం అందిస్తుంది..
 
ఐదు నిమిషాలకి రామ్ సీత ని వదిలి "ఎందుకే నన్ను ఇలా చేస్తున్నావు??? నన్ను కంట్రోల్లో ఉండనిచ్చేలా లేవు... ఇక్కడే ఉంటే ఏదేదో అయ్యేటట్టు ఉంది" అని వెంటనే వాష్ రూమ్ లోకి వెళ్లి షవర్ కింద నిలబడతాడు
 
సీతా గట్టిగా నువ్వుతూ "నీ ప్రేమ బయట పెట్టే వరకు నేను నిన్ను కంట్రోల్ తప్పేలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను బావ... గెట్ రెడీ ఫర్ దట్" అని నవ్వుతూ బయటికి వెళ్లి పోతుంది
 
"అమ్మో ఇది మామూలుది కాదు... రేయ్ రామ్ అది ఎంత ఇబ్బంది పెట్టిన నువ్వు మాత్రం కంట్రోల్ లోనే ఉండు... తను నీ ప్రేమ తెలుసుకునే వరకు ఇలాగే ఉండాలి..." అనుకొని ఒక గంట స్నానం చేసి వచ్చి రెడీ అయి బయటికి వస్తాడు
 
సీత హాల్లో కూర్చుని వస్తున్న రామ్ ని చూసి "బావ కాఫీ తెస్తా"అంటూ వయ్యారంగా నడుస్తూ కిచెన్ లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని ఈసారి నడుపు కనిపించేలా వయ్యారంగా నడుస్తూ రామ్ దగ్గరికి వస్తుంది
 
రామ్ వస్తున్న సీత ని చూసి తన నడుము కనిపిస్తుంటే సొల్లు కారుస్తూ అలానే చూస్తూ ఉంటాడు..‌
 
రామ్ ని అలా చూసి మాధురి సీత నవ్వుకుంటే
 
సీత "బావ కాఫీ" అంటూ కాఫీ ముందుకు పెడుతుంది
 
రామ చూపు తిప్పకుండా కాఫీ కప్ అందుకని అలాగే చూస్తూ వేడివేడి కాఫీ తాగే సరికి నాలుక కాలుతుంది... అప్పుడు స్పృహలోకి వచ్చి "ష్ కాలింది...దీనితో జాగ్రత్తగా ఉండాలి"అనుకొని కాఫీ తాగుతూ ఉంటాడు సైలెంట్ గా
 
కొంచెం సేపటికి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తూ "మమ్మీ నేను రేపు బెంగళూరు వెళ్ళిపోతున్న
నా లివ్స్ అయిపోయాయి... సీతని మీ దగ్గరే ఉంచుకోండి" అని సీతని ఓరగా చూస్తూ ఉంటాడు
 
సీత ఏడుపు మొహం పెట్టుకొని రామ్ ని చూస్తుంటే మాధురి కోపంగా "సీత ఇక్కడే ఉండటం ఏంటి??? ఇప్పుడు అది నీ పెళ్ళాం నీతో పాటు తీసుకోవెళ్లాలి... అయినా ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి వీలు లేదు 16 రోజుల పండుగ వరకు ఊరు దాటావంటే కాళ్ళు విరగకొడతాను... మూసుకొని పోయి లోపల పడుకో" అని చెబుతారు
 
ఇప్పుడు సీత నవ్వుతుంటే రామ్ ఏడుపు మొహం పెడతాడు...
 
"అదేంటమ్మా" అని దీనంగా అడిగితే
 
"అదంతే సాంప్రదాయం మూసుకొని టిఫిన్ చేసి పోయి పడుకో" అని కోపంగా అంటే
 
రామ్ వాళ్ళ నాన్న వైపు దీనంగా చూస్తాడు హెల్ప్ మీ అన్నట్టు... మహేశ్వర్ గారు నేనేం చేయలేను అని సైగ చేసి భుజాలేగరేస్తారు...
 
దాంతో రామ్ ఏం చేయలేక ఉసూరుమంటూ టిఫిన్ తిని లోపలికి వెళ్లి లాప్టాప్ తీసుకొని 16 రోజుల వరకు వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ పెట్టుకుంటాడు...
 
రామ్ వెళ్లగానే మాధురి సీత ని తీసుకొని తన రూం కి తీసుకెళ్ళి 'ఏమంటున్నాడు నా కొడుకు" అని అడిగితే
 
"చాలా నిగ్రహంగా ఉన్నాడు అత్త... అసలు కరగటం లేదు" అని ఉదయం జరిగిందంతా చెప్తుంది
 
"నువ్వు అసలు వదలకు ఈ పదహారు రోజులు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేయి... వాడు ఇక్కడ మారకపోతే బెంగళూరు వెళ్ళాక మార్చుకో" అని చెప్పి మోటివేట్ చేస్తుంది...
 
అలా ఆ రోజు నైట్ సీత రూమ్ లోకి రాగానే వర్క్ చేస్తున్నా రామ్ తలతిప్పి సీతను చూసి అలాగే చూస్తూ ఉంటాడు... సీత పల్చటి ఎల్లో కలర్ శారీ కట్టుకొని తన అందాలన్నీఆరబోస్తూ రూమ్ లోకి వస్తుంది... తనని అలా చూసి రామ్ గొంతు తడారిపోతుంది..
 
"ఏ ఏ ఏంటి ఈ చీర కట్టుకోవడం... ఇలా ఎవరైనా కట్టుకుంటారా???" గుటకలుమింగుతూ అడుగుతుంటే
 
"పెళ్లి అయిన అమ్మాయి భర్త దగ్గరికి ఇలాగే వెళ్లాలంట బావ... అత్త చెప్పి నన్నిలా రెడీ చేసింది.." అని అమాయకంగా చెప్తుంది
 
"అమ్మో అమ్మ ఈ రోజు నా నిగ్రహానికి పరీక్ష పెట్టింది..." అనుకుంటూ "సరే నువ్వు బెడ్ మీద పడుకో నేను సోఫా లో పడుకుంటా" అంటూ దిండు దుప్పటి తీసుకుంటుంటే
 
"ఏం బావా నా దగ్గర పడుకుంటే కంట్రోల్ పోయి నాతో కలిసి పోతానని భయమా!!!" అని అల్లరిగా అడుగుతుంది
 
"నాకు భయమా హ హ హ ఇక్కడ రామ్ అంత సీన్ లేదు నీకు" అని బింకంగా అంటాడు
 
"అయితే బెడ్ మీద నువ్వు పడుకో నేను పడుకుంటా!!!" అని చెప్పి సీత బెడ్ మీద వెల్లకిలా పడుకుంది...
 
అలా పడుకునే సరికి తన చీర నడుము దగ్గర చీర కొంచెం పక్కకి తొలగి నాభి అందమంతా కనిపిస్తూ ఉంటుంది... సీతని అలా చూసి రామ్ గుటకలు మింగుతూ " నీ నీ చీర అక్కడ పక్కకి పోయింది సరి చేసుకో" అని తడబడుతూ నడుము వైపు వేలు చూపించి నడుముని అలానే చూస్తూ ఉంటాడు..
 
"ఎక్కడ బావ???" అని అమాయకంగా అడుగుతూ తనవైపు తిరిగేసరికి తన ఎద భాగం దగ్గర కూడా చీర పక్కకి తిరిగే సరికి రామ్ గొంతు తడి ఆరిపోతుంటే "ఇది నన్ను ఈరోజు చంపేసేలా ఉంది" అనుకుంటూ బెడ్ కి ఒక చివర పడుకొని ఫుల్ గా దుప్పటి ముసుకు వేసుకొని కళ్ళు మూసుకుంటాడు...
 
రామ్ ని అలా చూసి నవ్వుకుంటూ సీత కూడా దుప్పట్లో దూరి "ఏంటి బావ అప్పుడే పడుకున్నావు?? నాతో కబుర్లు చెప్పు నాకు నిద్ర రావటం లేదు" అంటూ రామ్ చెయ్యిని తన నడుము మీద వేసుకొని రామ్ గుండెల మీద చేయి వేసి సున్నాలు చుడుతూ గారంగా అడుగుతుంది
 
సీత తన చేయిని తన నడుము మీద వేయగానే రామ్ శరీరమంతా జివ్వుమనిపించి నడుము దగ్గర తన పట్టుని బిగించి దగ్గరికి లాక్కుని నడుముని నలిపేస్తుంటే "బావ" అంటూ మత్తుగా మూలుగుతూ రామ్ చుట్టూ చేతులు వేస్తుంది...
 
 
"ఏంటే "అని మత్తుగా అంటూ తన చేయి కొంచెం కొంచెం పైకి తీసుకొని వస్తూ తన వీపు నిమురుతూ ఉంటే సీత రామ్ ని గాఢంగా హత్తుకుని తనే మొదట రామ్ పెదవులు అందుకుని కిస్ చేయటం స్టార్ట్ చేస్తుంది
 
రామ్ కూడా ఏదో మైకం కమ్మినట్టు అనిపిస్తుంటే తను కూడా సీత పెదవుల్ని వదలకుండా తన చేతితో సీత నడుముని సవరదీస్తూ ముద్దుని ఊపిరి అందనంత గాఢంగా మారుస్తాడు
 
సీత కూడా తనకి సహకరిస్తుంటే ఇంకా రెచ్చి పోయి సీత గట్టిగా తనకేసి అదుముకుని కిందపెదవిని కొరకి తన పెదవులని వదిలి సీత వైపు అల్లరిగా చూస్తుంటే
 
సీత సిగ్గుపడుతూ రామ్ గుండెల్లో వదిగిపోతుంది...‌
 
రామ్ నవ్వుతూ తనని గట్టిగా హత్తుకొని వీపు మీద జో కొడుతుంటే సీత చిన్నగా నిద్రపోతుంది
 
"రాక్షసి ఎలా ఉన్నా వాడిని ఎలా తయారు చేస్తున్నావు!!! నిన్ను చూస్తే నన్ను నేను కంట్రోల్ లో ఉంచుకోలేక పోతున్నా!!! ఇలాగైతే ఎలాగే" అనుకుంటూ సీత ని చూస్తూ తను కూడా నిద్ర పోతాడు
 
అలా అక్కడ ఉన్న 16 రోజులు సీత ఏదో ఒకటి చేసి రామ్ విగ్రహానికి పరీక్ష పెడుతూనే ఉంటుంది... అయినా రామ్ తనని తాను కంట్రోల్ చేసుకొని కొంచెం దూరం పెడుతూనే ఉన్నాడు అలా 16 రోజుల పండుగ చేసుకొని బెంగళూరు వెళ్తారు
 
రామ్ డైరెక్ట్ గా తను ఉండే ఫ్లాట్కి తీసుకువెళ్ళాడు... అది డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్...సీత మొత్తం చుట్టి నవ్వుతూ రామ్ వైపు చూస్తుంటే "బాగుందా???" అని ఆతృతగా అడుగుతాడు
 
సీత రెండు చేతులు బార్లా చాపి "ఇంత బాగుంది" అని నవ్వుతూ అంటుంది
 
"సరే ఇంట్లోకేంమేం కావాలో షాపింగ్ చేద్దాం లిస్ట్ రాసుకో" అని చెప్పి ఇద్దరు ఫ్రెష్ బయటే టిఫిన్ చేసి షాపింగ్ కి వెళ్లి కావాల్సిన అన్ని కొనుక్కుని వస్తారు... రెండు రోజుల్లో సీత తనకి నచ్చినట్టుగా ఫ్లాట్ మార్చేస్తుంది...
 
ఆ రోజు నైట్ భోజనం చేశాక రామ్ సీత ని ఉడికించడానికి "నువ్వు ఈరూమ్ లో పడుకో నేను ఈ రూమ్ లో పడుకుంటా" అని నవ్వుతూ అంటాడు
 
"అదేంటి బావా!!! నేను ఎందుకు ఆ రూమ్ లో పడుకోవాలి???" అని అమాయకంగా అడుగుతుంది
 
రామ్ లోపల నవ్వుని దాచేస్తూ "నేను నీకు పెళ్లికి ముందే చెప్పాను కదా!!! నిన్ను ఓన్లీ మరదలు గానే చూస్తానని... అందుకే ఇక్కడ మన ఇద్దరం సెపరేట్ గా ఉందాం. . ఇంటి దగ్గర ఆంటే అమ్మ నాన్న ఉంటారు కాబట్టి ఒకే గదిలో ఉన్నం... ఇప్పుడు అలా కాదు నువ్వు ఈ రూమ్ లో పడుకో నేను ఈరూమ్ లో పడుకుంటాను" అని చెప్పి వెళ్తుంటే
 
రామ్ నవ్వాపుకోవడం చూసి "బావ నాతోనే గేమ్సా!!! ఇప్పుడు చూడు" అనుకుంటూ రామ్ అడ్డంగా నిలబడి వయ్యారంగా నడుము పై చేయి పెట్టుకుని తల పక్కకి వంచి రామ్ ని ఓరగా చూస్తూ "అదేంటి బావా అలా అంటావ్!!! ఈ రెండు రోజులు నీతో నేను పడుకున్నా కదా!!! ఇప్పుడు పడుకుంటే నిగ్రహానికి భంగం కలుగుతుందని భయమా???" అని రెచ్చగొడుతుంటే
 
రామ్ సీత నడుమునే చూస్తూ "నేను అంత వీక్ కాదు అని నీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది..‌ నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు మూసుకొని వెళ్ళి పడుకో" అని చూపు తిప్పకుండా అంటాడు
 
"ఇక ఇలా అంటే మాట వినడు" అని "నువ్వు అవునన్నా కాదన్నా మనిద్దరం మొగుడు పెళ్ళాలం... కాబట్టి ఇద్దరం ఒకే గదిలో పడుకోవాలి... నువ్వు వస్తే రా లేకపోతే లేదు" అనిచెప్పి లోపలికి వెళ్ళి పడుకుంటుంది
 
రామ్ లోపలికి వెళ్తే ఏం జరుగుతుందోనన్న భయంతో బయట సోఫా లో పడుకుంటాడు... అరగంట చూసినా రామ్ లోపలికి రాకపోయేసరికి సీత డోర్ తీసి బయటికి వచ్చి చూస్తే రామ్ సోఫాలో నిద్ర పోతున్నాడు... దాంతో కోపం వచ్చి లోపలికి వెళ్లి ఒక అరగంట బయటికి వచ్చి రామ్ పక్కనే సోఫాలో తనని హత్తుకుని పడుకుంటుంది...
 
రామ్ సీత వస్తున్నప్పుడే పట్టీల శబ్దం విని వచ్చిందని అర్థం అయ్యి కళ్ళు తెరవకుండా అంతే పడుకుని ఉంటాడు... కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుందో అని సీత వచ్చి పక్కన పడుకోగానే వెంటనే కంగారుగా తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుని "పడిపోతావ్" అని అప్పుడు తనని పరీక్షగా చూసి గుటకలు మింగుతూ "ఎప్పుడూ లేనిది ఇలాంటివి వేసుకున్నవు ఏంటి??? అని అడుగుతుంటే
 
రామ్ మొహం లో మారుతున్న ఫీలింగ్స్ ని చూసి నవ్వుకుంటూ మత్తుగా "మొగుళ్ళు దగ్గర పెళ్ళాల కి ఇలాంటి బట్టలు కంఫర్ట్ గా ఉంటాయి అని అత్త చెప్పింది... అందుకే ఇక నుంచి ఇవే వేసుకుంటాను..." అని ఇంకా దగ్గరికి జరిగి రామ్ ని హత్తుకుని పడుకుంటుంది
 
"మా అమ్మ ఒకటి నా ప్రాణానికి" అనుకొని షోల్డర్ లెస్ నైటీ లో ఉన్న సీతను చూసి గుటకలు మింగుతూ "ఇక్కడ ఉండి ఏదో అయిపోయే లోపల బెడ్ పై పడుకోవటం మేలు" అనుకొని సీత మీద చేతులు తీసి లోపలికి వెళ్లి నిండుగా దుప్పటి కప్పుకొని పడుకుంటాడు..
 
సీత నవ్వుకుంటూ "అది అలా రా దారికి లేకపోతే ఈ సీతతోనే ఆటల" అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళేసరికి రామ్ నిద్ర పోవడం చూసి తన పక్కన వెళ్లి పడుకొని రామ్ ని చూస్తూనే నిద్రపోతుంది
 
సీత నిద్రపోయింది అనుకున్నాక కళ్ళు తెరిచి "ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నావ్ రాక్షసి... నిన్ను ముందుంచుకుని మడి కట్టుకొని కూర్చోవటం ఎంత కష్టంగా ఉందో నాకే తెలుసు... నువ్వు ఆ రోజు అలా అనకుండా ఉండి ఉంటే ఈ రోజు ఇద్దరం సంతోషంగా ఉండే వాళ్ళం... నీకు తెలియాలి కదా నా ప్రేమ విలువ" అనుకొని తన దగ్గరగా జరిగి "ఏం చేస్తున్నావే??? వీటిలో నిన్ను చూస్తుంటే గొంతు తడారిపోతుంది... ఇలా అయితే కష్టమే" అనుకుంటూ నగ్నంగా ఉన్న తన భుజం మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకొని తను కూడా నిద్ర పోతాడు
ఇంకా ఉంది
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
రామ్ weds సీత - by k3vv3 - 25-01-2023, 10:58 PM
RE: రామ్ weds సీత - by Manoj1 - 26-01-2023, 10:01 PM
RE: రామ్ weds సీత - by k3vv3 - 27-01-2023, 09:44 AM
RE: రామ్ weds సీత - by k3vv3 - 27-01-2023, 09:46 AM
RE: రామ్ weds సీత - by Manoj1 - 27-01-2023, 03:16 PM
RE: రామ్ weds సీత - by Ravi9kumar - 27-01-2023, 11:39 PM
RE: రామ్ weds సీత - by prash426 - 31-01-2023, 10:00 AM
RE: రామ్ weds సీత - by k3vv3 - 01-02-2023, 11:50 AM
RE: రామ్ weds సీత - by Manoj1 - 02-02-2023, 01:55 AM
RE: రామ్ weds సీత - by k3vv3 - 02-02-2023, 06:59 PM
RE: రామ్ weds సీత - by Manoj1 - 03-02-2023, 08:48 PM
RE: రామ్ weds సీత - by prash426 - 04-02-2023, 09:58 AM
RE: రామ్ weds సీత - by Udaykumar - 08-02-2023, 12:10 PM
RE: రామ్ weds సీత - by Pallaki - 08-02-2023, 09:59 PM
RE: రామ్ weds సీత - by sri7869 - 18-08-2023, 10:18 PM
RE: రామ్ weds సీత - by utkrusta - 05-03-2024, 06:56 PM



Users browsing this thread: 3 Guest(s)