29-01-2023, 01:46 AM
పదిహేను నిమిషాల్లో పెద్దవాళ్ళు ఇద్దరూ రెడీ అయ్యి బయటకొచ్చారు. మానాన్న బయటకొస్తూనే… సంధ్య వైపు చూసి ఏమ్మా కొంచెం కాఫీ ఏమైనా ఉందా అన్నాడు. సంధ్య టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి… .ముందు టిఫిన్ చేయండి… ఈలోపు కాఫీ పెడతాను అంటూ లోపలికెళ్లి బ్యాగ్ లోంచి షుగర్ టాబ్లెట్ తెచ్చి మా అయ్య చేతిలో పెట్టింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా గీత, చిన్నాగడిని ఎత్తుకొని ఇంకో చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని నుంచోనుంది. థాంక్యూ గీత, అంటూ పాల ప్యాకెట్ తీసుకుంది. చిన్నాగాడు కాళ్ళు చేతులు ఆడిస్తూ గీత సంకలోంచి సంద్యవైపు దూకటానికి ట్రైచేస్తున్నాడు. గీత చేతిలోంచి చిన్నాగాడిని తీసుకొని ఎత్తుకుంది సంధ్య. చిన్నాగాడు తల్లికోతిని పట్టుకున్న పిల్లకోతిలాగ సంధ్య మెడచుట్టూ చేతులేసి కరుచుకుపోయాడు. సంధ్య నవ్వూతూ గితవైపు చూసి… కుమార్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు… లోపలకొచ్చి పలకరించవే అంది. అమ్మో ఆంటీకి దొరికితే పొద్దు పొద్దున్నే నా బుర్ర తినేస్తది నన్నోదిలేయి తల్లో అంది గీత. అదికాదే కొంచెం నాకు తోడుగా ఉండు కాసేపు అంది సంద్య… నీకుదండం… కావాలంటే వాళ్ళు వెళ్లినాక పిలువు నవరత్న ఆయిల్ తో నికు హెడ్ మసాజ్ చేసిపెడతా… అంతేగానీ…. ఆ టార్చర్ నావల్లకాదు నే పోతున్నా… విడ్ని కాసేపు నిదగ్గరుంచుకో… ఇంట్లో పనిచూసుకొని వచ్చి తీసుకెళ్తా అంటూ గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది గీత. హమ్ ఇది ఎస్కేప్ అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి సరాసరి వంటగదిలోకి వెళ్లి కాఫీ పెట్టడం మొదలెట్టింది. డైనింగ్ టేబుల్ దగ్గర అమ్మ నాన్న ఇద్దరు టిఫిన్ పెట్టుకొని తింటున్నారు. సంధ్య చిన్నగాడిని చంకలో ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఒక చేత్తోనే అన్ని పనులు చేస్తోంది. మా అమ్మ టిఫిన్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్న సంధ్యవైపు చూస్తోంది… చీర కట్టులో చాలా అందంగా పద్ధతిగా ఉంది సంధ్య, పైగా చంకలో పిల్లాడు, ఏదైనా అడిగితే చెప్పే సమాధానంలో గౌరవం, ప్రవర్తనలో వినయం అన్ని అమ్మకీ నచ్చుతాయి. కానీ సంధ్యని కోడలిగా అంగీకరించలేదు. నా జీవితం సంద్యవల్ల నాశనం అవుతోందని కోపం… పిల్లాడిని చంకలో వేసుకొని ఏదో ఇంటికి పెద్ద కొడలిలా సొంతింట్లో తిరిగినట్టు తిరుగుతుంటే సంధ్య మీద కడుపులో మండుతుంది మా అమ్మకి.
రెండు కప్పుల్లో కాఫీ, చిన్నాగాడి కోసం పాలు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, చెరో కప్పు వాల్ల ముందు పెట్టింది. చిన్నాగాడి పాలు తీసుకొని సోఫా దగ్గరకెళ్ళి కింద కూర్చొని వాడికి పాలు తాపిస్తోంది. చిన్నాగాడు సంధ్య వళ్ళో కూర్చొని పాలు తాగుతూ సంధ్య మెళ్ళో ఉన్న తాళిబొట్టుని చేతిలోకి తీసుకొని ఆడుకుంటున్నాడు. చిన్నాగాడి చేతిలో తాళిబొట్టు చూసేసరికి ఇంక మా అమ్మకి కడుపులో మంట ఎక్కువై… ఏమే వాడిని లేపవా? ఇంకా ఎంతసేపు పడుకుంటాడు… రాత్రేమన్నా మందుకొట్టాడా అంది. సంధ్య తపదించుకొని… లేదండీ… రాత్రి లేటుగా వచ్చారు అని లోవాయిస్ లో చెప్పింది… ఆలా చిన్నగా నసుగుతావే నంగనాచిలా… నువ్వు ఉండగా కూడా లేటుగా వచ్చాడా? బాగానే బొంకుతున్నావే… రంకు చేసేదానికి… బొంకటం ఎంతపని అంటూ తిడుతోంది. సంధ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా చిన్నాగడికి పాలు పడుతోంది. కానీ మాఅమ్మ తిట్టే తిట్లకి చిన్నాగాడు అమ్మవైపు కన్నార్పకుండా తీక్షణంగా చూస్తున్నాడు, వదిలితే మమ్మ మీదకి ఎగబడెలాగున్నడు. వాడి చూపు చూసి ఏంట్రా ఆ చూపు… ఏంటే… వీడు గీత కొడకా అంది అమ్మ. అవును అంటూ చిన్నాగాడి తల తనవైపుకు తిప్పుకొని పాలగ్లాసు నోట్లో పెట్టింది. దాంతో అమ్మ… చూసారా… చుట్టుపక్కల వాళ్ళని కూడా బాగానే వశపర్చుకుంది… ఇంక ఈ దరిద్రాన్ని వదిలించుకోవటం కష్టమే అంటూ మానాన్నవైపు చూసి… వింటున్నారా అంది. కాఫీ తాగుతున్న మానాన్న… ఆ వింటున్నా… అంటూ మళ్ళీ కాఫీ తాగుతున్నాడు. ఏం వింటున్నారు… చిన్న పిల్లలు కూడా పొద్దున్నే లేచారు… వీడు ఇంక లేవలేదు… రాత్రంతా ఏం మాయ చేసిందో ఏమో… ఇంతకీ వాడు మనతో వస్తున్నాడా లేదా అంది. దాంతో మాయ్యకి చిర్రెత్తుకొచ్చింది… ఏహే… ఆపు… నీ కొడుకు కుంబాకర్నుడిలా పడుకుంటే ఆ పిల్లనంటావే… కావాలంటే వెళ్లి వాడ్నిలేపి అడుగు… రాత్రంతా ఎక్కడ తిరిగొచాడో అంటూ అమ్మని విసుక్కుంటూ సంధ్య మీద నుంచి అమ్మని నావైపు డైవర్ట్ చేశాడు నాన్న.
ఇంక లాభంలేదు… అమ్మరూపంలో మిస్సైల్ నామీద పడీలోపు మనం రియాక్ట్ అవ్వాలి అని నేను ముసుగు తీసి… ఏయ్… అని పెద్దగా పిలిచా సంధ్యని. ఆఆ అంటూ చిన్నాగాడిని తీసుకొని ఫాస్ట్ గ బెడ్రూంలోకొచ్చింది సంధ్య… నేను మంచం మీద కూర్చొని సంధ్యని దగ్గరకు లాక్కొని తన బొడ్డు మీద ముద్దు పెట్టి…. ఏంటే గోల సౌండ్ లేకుండా పనిచేసుకొలేవ… పొద్దున్నే ఎవరితో మీటింగ్ పెట్టావ్… ఇక్కడ మనిషి నిద్రపోతుంటే హాల్లో ఏంటి గోల హ? అని పెద్దగా అరుస్తూ సంధ్య నడుం పిసుకుతూ బొడ్డు దగ్గర కొరికేసరికి… ఆఆ అంటూ చిన్న కేకపెట్టింది, వెంటనే నేను పక్కనున్న దిండు తీసుకొని బయటకి విసిరేసా… బయట మా అమ్మ మాత్రం నేను సంధ్యని కొట్టానేమో అని కంగారుపడుతూ నాన్నని కదిలిస్తూ వెళ్లి చూడమంటోంది. సంధ్య నా జుట్టు పట్టుకొని పక్కకి లాగుతూ… అమ్మా నాన్న వచ్చారండి అంది సంధ్య. ఓహో అందుకని ఇల్లంతా గెంతులేస్తున్నావా… ఆ? అంటూ సంధ్యని చిన్నాగడితో సహా వాటేసుకొని సంధ్య పెదాల మీద ముద్దు పెడుతూ సంధ్య పిర్రలమీద పిసకటం మొదలుపెట్టా… స్… ఆఆ… అంటూ అరిచింది సంధ్య. నేను సంధ్యని కోరికేస్తున్నానేమో అనుకొని చిన్నాగాడు నా మొకం మీద చేతులేసి నెడుతున్నాడు. సంధ్య నన్ను విడిపించుకొని… రండి కాఫీ ఇస్తాను అంటూ… బయటకెళ్ళి… ఒకచేత్తో మూతి తుడుచుకుంటూ… ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టీ… తన చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆ సీన్ కి మా అమ్మ సైలెంట్ అయిపోయి… వంటగదివైపు జాలిగా చూస్తోంది. ఇంక ఇదే అదునుగా నాన్న తన వాయిస్ రేజ్ చేసి… ఏమే ఇప్పుడు సంతోషమేకదా… పొద్దుపొద్దున్నే నీ కొడుకుచేత అపిల్లని తన్నించావ్… కడుపు నిండిందా లేదంటే ఇంకో రెండు ఇడ్లీ తిను అని దెప్పిపొడిచి లేచి బెడ్రూంలోకి వస్తున్నాడు. నేను అది గమనించి ఫాస్ట్ గా బాత్రూంలో దూరాను.
నాన సరాసరి బాత్రూం దగ్గరకొచ్చి… ఏరా బయటకొస్తావా… మేం వెల్లిందాక రావా? అంటూ కేకేసాడు. ఆ వస్తున్నా ఫైవ్ మినిట్స్ అని చెప్పి ఒకటి రెండు కానిచ్చి బ్రెష్ చేసుకొని మొఖం కడుక్కొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం కిల్ చేసి బయటకొచ్చి మొకం తుడుచుకుంటూ నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటూ వెనకనుంచి వాటేసుకున్నా. అబ్బా వచ్చాడండి రాజావారు అంతపురంలోంచి… ఏం నాయన తెల్లారిందా… అంది అమ్మ. నేను అమ్మ పక్కనున్న చైర్ లో కూర్చొని… రాత్రి బాగా లేట్ అయ్యిందే… అందుకే లేవలేకపోయా అంటుండగానే సంధ్య కాఫీ తెచ్చి నాముందు పెట్టింది. మేము వస్తున్నాం అని తెలుసుగా… రెడీగా ఉండక్కర్లా? అంది అమ్మ. ఇప్పుడేమైందే అమ్మా… నేను లేవకపోతే ఏం… నీకొడలు అన్ని చూసుకుందిగా మంచిగా అనేసరికి… అమ్మ సర్రుమని లేచి… కొడలు గీడలు అన్నావంటే చెప్పుతో కొడతా అంటూ వెళ్లి సోఫాలో కూర్చుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగేసరికి వెళ్లి తలుపు తీసా… ఎదురుగా డ్రైవర్ కృష్ణ నుంచొని గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఆ కృష్ణ కార్ రివర్స్ చేసుకో వస్తున్నారు అని చెప్పి వెనక్కి చూసేసరికి మానాన్న బ్యాగ్ తో రెడీగా ఉన్నాడు. సంధ్య వచ్చి ఒక చిన్న బాక్స్ బ్యాగులో పెడుతూ… మావయ్యా ఇందులో కొంచెం టిఫిన్ పెట్టాను… మద్యలో ఆకలేస్తే తినండి… అలాగే ఎక్కువసేపు అక్కడ ఉండకుండా… లంచ్ టైం కల్లా వచ్చేయండి అంది. మానాన్న సరే అనెలోపూ… అమ్మ తగులుకుని… ఏం అవసరంలేదు… మేం బయట తింటాం అంది. సంధ్య నా వైపు చూసి… ఏమండి సరిగ్గా లంచ్ టైం కి రావాలని చెప్పండి… లేదంటే డిస్కషన్ ఇంట్లోనుంచి వీదిలోకి మార్చాల్సి వస్తది అంటూ… మానాన్నావైపు చూసి ఒక్కనిమిషం మావయ్యా అని మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. మా అమ్మ మాత్రం ఏం మాట్లాడలేక పళ్ళు పటపట కొరుకుతూ సోఫాలో హు లేచి నాదగ్గరకొచ్చి డోర్ దగ్గర నిలబడింది., ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో సేమ్ సీన్ కి పెద్ద పెంట చేసింది సంధ్య. అందుకే ఇప్పుడు అమ్మ నాన్న చివరికి నాతో సహా అందరం సౌండ్ చేయకుండా సైలెంట్ గా మూసుకున్నాం. చిన్నాగాడు మాత్రం ఎప్పుడెక్కాడోగాని సోఫాలోకి ఎక్కి నిలబడి అమ్మవైప్పు చూస్తున్నాడు… అమ్మ వాడ్ని గమనించి… నాబుజం మీద తట్టి… ఏంట్రా వాడు అలా చూస్తున్నాడు అంటూ వాడివైపే చూస్తోంది. ఏంలేదంమ్మా ఎవరైనా గట్టిగా మాట్లాడితే…ఏదో గొడవ జరుగుతుందని వాడి బయం అంతే అనెలోపు… నాకలా అనిపించట్లా… నేను దాన్ని తిడుతున్నానని నామీద గుర్రుగావుంది వాడికి… ఏరా…నువ్వు దానికి చెంచావా?... అంటూ… ముక్కుమీద వేలు పెట్టుకొని… ముక్కు కోస్తా రౌడీ వెదవ అంది అమ్మ. దానికి చిన్నా కూడా కళ్ళుమూసుకొని మొహం చిట్లించి ముక్కు మీద వెలుపెట్టుకొని… యాయ్యియేతృత్ఫ్… అంటూ వాడి బాషలో బండబూతేదో తిట్టి ముక్కు కోస్తా అన్నట్టుగా వేలుచుపించాడు. ఆ దెబ్బకి సౌండ్ పడిపోయింది అమ్మకి. ఇంతలో సంధ్య ముసిముసిగా నవ్వుకుంటూ వచ్చి రెండు చాక్లెట్స్ తీసి బ్యాగ్ సైడ్ జిప్ లో వేస్తూ… సడెన్గా షుగర్ డౌన్ అయితే… ఈ చాక్లెట్స్ తినండి అంటూ నాన్నకి చెప్తోంది.. అబ్బో ఎంత ప్రేమ వలకబొస్తుందో వయ్యారి అంది అమ్మ. సంధ్య అదేం పట్టించుకోకుండ నావైపు వచ్చి ఇంకో టిఫిన్ బాక్స్ చేతిలో పెట్టి… డ్రైవర్ కి ఇవ్వండి అని చెప్పి చిన్నా దగ్గరకి వెళ్ళింది. అయ్యిందిగా ఇంక బయల్దేరండి అంది అమ్మ. ముగ్గురం బయటకొచ్చి వాళ్ళిద్దరినీ కారెక్కించి పంపించి ఇంట్లోకి వచ్చేసరికి చిన్నాగాడికి పాలు తాపిస్తోంది సంధ్య. నేను డైరెక్ట్ గా డైనింగ్ టేబుల్ దగ్గరకెళ్ళి ప్లేట్ లో టిఫిన్ పెట్టుకొని వచ్చి సంధ్య దగ్గర కూర్చొని సంధ్యకి టిఫిన్ తిపిస్తూ నేను కూడా టిఫిన్ తినేసా. ఈలోపు చిన్నాగాడు పాలుతాగి చిన్నగా నిద్రలోకి జారుకొని సంధ్య వళ్ళో నిద్రపోయాడు. సంధ్య నావైపు చూసి… కుమార్ నాకు కూడా నిద్రొస్తుంది… ఒక గంట తరవాత లేపుతావా వంట పని చేయాలి అంది. సరే బంగారం… అమ్మ మాటలు పట్టించుకోకు… నాకు నువ్వే ముఖ్యం … ప్లీజ్ అంటూ సంధ్య నుదుటిమీద ముద్దు పెట్టా. సంధ్య నా వైపు చూసి… అదేం లేదు కుమార్… కనీసం తిట్టడానికి… నాకంటూ ఒక కుటుంబం ఉంది… అదిచాలు నాకు అంటూ నా పెదాలమీద ముద్దు పెట్టింది. ఏమో సంధ్య అమ్మని ఎలా కన్విన్స్ చేయాలో మాత్రం తెలియటంలేదు అన్నా. అదంతా తరవాత చూద్దాం లే… అంటూ పైకి లేచి ఒక ఒన్ హవర్ లో లేపి నన్ను అని బెడ్రూం లోకి వెల్లింది సంధ్య.
ఏంటో ఈ సబ్జెక్ట్ ఏటుపోతుందో ఏమో… అనుకుంటూ లేచి బెడ్రూంలోకి వెళ్ళా. చిన్నాగాడిని పక్కలో వేసుకొని పడుకొని ఉంది సంధ్య. నేను బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చేసి టీషర్ట్, షార్ట్ వేసుకొని హాలోకి వచ్చి సిస్టమ్ ఆన్ చేసి ఈవినింగ్ మీటింగ్ కి సంబంధించి డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ కూర్చున్నా. ఒక ఒన్ హావర్ తరవాత కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తె ఎదురుగా గీత నిలబడి ఉంది.