29-01-2023, 01:41 AM
(This post was last modified: 29-01-2023, 01:41 AM by anothersidefor. Edited 1 time in total. Edited 1 time in total.)
పదిహేను నిమిషాలాకి ఫోన్ లో అలారం మోగింది… నేను తలతిప్పి. చూసేసరికి సంధ్య ఫోన్ అందుకొని అలారం ఆపేసి… నా పిర్రమీద కొట్టి…. హు హు… కుమార్ టైం ఐదు అయ్యింది… నీ… నన్ను నిద్రపోనీకుండా చేశావ్… హా హా హా… అంటూ నా వీపు మీద కొట్టింది సంధ్య. ఆప్పుడూ గుర్తొచ్చింది నాకు అసలు విషయం… నేను సంధ్య గడ్డం పట్టుకొని… బంగారం ప్లీజ్ ఎదొలాగ మేనేజ్ చెయ్యవే… అంటూ బ్రతిమాలేసరికి… చి ఎప్పుడు ఇంతే… నన్నే బుక్ చేస్తావ్… లే… నేను రెడీ అవ్వాలి అంది సంధ్య. అబ్బా కాసేపు ఇలా ఉండవే ఇంక టైం ఉందిగా అన్నా… కుమార్ టైం సరిపోదు… చాలా పనుంది… లే… అంటూ నన్ను పక్కకి తోసేసి బాత్రూంకి పరిగెత్తింది సంధ్య.
టైం 5:30, సంధ్య బయటకి వచ్చి కాంపౌండ్ గేట్ లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వచ్చి కిచెన్లోకీ వెళ్ళింది. దాదాపు అరగంట తరువాత కాలింగ్ బెల్ మోగింది. అప్పటిదాక హుషారుగా వంట చేస్తున్న సంధ్యలో కొంచెం తత్తరపాటు వచ్చింది. పరుగునులంటి నడకతో డోర్ దగ్గరకెల్లేటప్పటికి మళ్ళీ ఇంకోసారి మోగింది కాలింగ్ బెల్. ఒక్క క్షణంకూడా ఆలస్యం చెయ్యకుండా తలుపుతీసింది… ఎదురుగా ఐడదుగుల బ్రహ్మరాక్షసి నిలబడి కళ్ళతోనే నమిలి మింగేసెల చూస్తూ… ఇంకా తెల్లారలేదా దొరసానికి… అలచూస్తావే తీస్కో అంటూ చెయ్యి ముందుకు చాపింది. సంధ్య కొంచెం తేరుకొని ఆ రాక్షసి చేతిలోనుంచి బ్యాగ్ తిసుకుంది. ఆ రాక్షసి ఎవరో కాదండోయ్ మా అమ్మే. ఇంతలో రాక్షసి వెనక్కితిరిగి… మా అమ్మ వెనక సాదు జీవిలా నుంచున్న మానాన్నవైపు చూసి…. చూసారా… నేను చెప్పలా… ఈ పాపిష్టిది ఇక్కడే ఉంటదనీ అంటూ… సంద్య వైపు తిరిగి తప్పుకో అని హుంకరించింది. సంధ్య ఉలిక్కిపడి పక్కకిజరిగేసరికి పాతకాలపు అంబాసిడర్ కార్లాంటి మా అమ్మ లోపలికొచ్చి సోఫాలో పార్క్ చేసి కూలబడింది. నాన్న లోపలకొస్తూ ఏమ్మా బాగున్నావా అంటూ సంధ్యని పలకరించాడు. బాగున్నా మావయ్యా అని చిన్నగా అంటూ భయంగా అమ్మవైపు చూసింది సంధ్య. మావయ్యా అనేమాట వినపడగానే మమ్మ బస్సున లేచి ఎవడెనీకు మావయ్యా… వరసలు కలిపవంటే నోటిమీద వాత పెడతా జాగర్త… అంటూ మా నాన్నవైపు చూస్తూ… దాంతో ఏంటి మాటలు త్వరగా వెళ్ళండి… వెళ్లి త్వరగా రెడీ అవ్వండి అంది. ఆదేబ్బతో మా అయ్య మాట్లాడకుండా సంధ్య దగ్గర బ్యాగ్ తీసుకొని నా రూంలోకి వచ్చాడు, నేను దుప్పటి ముసుకుతన్ని పడుకొని దుప్పటి లోపలినుండి అన్ని వింటూ కదలకుండా పడుకున్న. బ్యాగ్ మంచంపైన పెట్టి…. ఒరెయ్….నువ్వు మెలుకువగానే ఉన్నావని నాకుతెలుసులేరా… లే… అని లాగిపెట్టి నా పిర్రమీద ఒక్కటిచ్చాడు. అబ్బా అని పిర్ర రుద్దుకుంటూ… నాన్నా గట్టిగా అనకు అమ్మ వింటది అంటూ దుప్పటి తిసా. లేకపోతే నీ ఆక్టింగ్ నాదగ్గరా? బయట అమ్మ ఉంది వెళ్లి కనపడు పో అన్నాడు. అయ్య నాన్నో… ఇప్పుడు అమ్మ కంటపడితే… నన్నుకూడా మీతోపాటు రమ్మంటది… నావల్లకాదు… ఆబాదలేవో నువ్వే పడు… ఆల్రెడీ కార్ తీసుకురమ్మని డ్రైవర్ని పంపించా, ఇంకో అరగంటలో వస్తది… నువ్వు రెడీ అవ్వు… నేను లాస్ట్లో వచ్చి కనపడతా… నన్ను మాత్రం లాగకు… అని మళ్ళీ ముసుగు కప్పుకున్న. ఇంతలో ఏమిటి వాడు లేచాడా లేదా అంటూ అమ్మ కేక. ఆఆ లేదు వాడింక లేవలేదు వాడు వచ్చే పరిస్తితిలో లేడులే… నువ్వు త్వరగా రెడీ అవ్వు అంటూ టవల్ తీసుకొని బాత్రూంలో దూరాడు మానాన్న. ఇంతకీ మా అమ్మ నాన్న గురుంచి చెప్పలేదు కదూ. మా అమ్మ పేరు సుమిత్ర కానీ క్యారెక్టర్ మాత్రం సూర్యకాంతం, మా నాన్న పేరు నారాయణ. మా అమ్మ మాట జవదాటనట్టు నటించే భారతీయ సమాజపు సగటు భర్త. కానీ ప్లాన్ వేసాడంటే మాఅమ్మ తనంతటతనే వచ్చి మానాన్న వేసిన స్కెచ్ లో పడుద్ది… అంతటి సైలెంట్ కిల్లర్ మాఅయ్య… హైకాలేజ్ హెడ్ మాస్టర్ గా చేస్తున్నాడు. ఎప్పుడూ మా అమ్మ కొంగు పట్టుకొని గుళ్ళు గోపురాలు తిరుగుతూ… అదేదో హనీమూన్ ట్రిప్ లా ఫీలైపోతుంటాడు… ఇప్పుడు కూడా అదే పనిమీద వచ్చారు, చిలుకూరులో ఉన్న గుడికి వెళ్ళటానికి. ఉండేది మాత్రమ్ విజయవాడలో. రాత్రి బయల్దేరి పొద్దున్నే దిగారు, మళ్ళీ సాయంత్రం జంప్, అంతవరకు కొంచెం మా అమ్మతో జాగర్తగా ఉండాలి, దొరికానంటే నా బుర్ర తినేస్తది. ఇంతలో మా అమ్మ మాటలు వినిపిస్తున్నాయి సంధ్యని ఎస్కుంటుంది అమ్మ. ఏమే వాడెంటి అంత మొద్దు నిద్రపోతున్నాడు… అంటూ సొఫలోంచి లేచి సెకండ్ బెడ్రూంలోకి వెళ్తూ… ఆ బ్యాగ్ పట్రా అందులో బట్టలున్నాయ్ అంది.
సంధ్య ఫాస్ట్ గా నా బెడ్ దగ్గరకొచ్చి బ్యాగ్లోంచి మా నాన్న బట్టలు తీసి బెడ్ మీద పెట్టి… బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఆగి నా పిర్రమీద కొట్టింది… నీయమ్మ ఇదికూడా ఇక్కడే కొట్టింది అనుకుంటూ దుప్పటి తీశా… నన్ను లేచి రమ్మంటూ సైగ చేసింది. నేను సంద్యకో దండంపెట్టి… రాత్రి లేటుగా వచ్చాడని చెప్పుపో అని మళ్ళీ ముసుగు కప్పుకున్నాను… బ్యాగ్ తో ఒకపోటు పొడిచి పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరకెల్లింది. సంధ్య బ్యాగ్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి బాత్రూంకి వెళ్లి కొత్త పేస్టు, సోప్, షాంపూ ఒపెన్చేసి పెట్టి బయటకొచ్చి డోర్ దగ్గరకెళ్ళి నిలబడి ఇంకేమైనా కావాలా అంది సంద్య. ఏం అవసరం లేదు పో… పోయి వాడ్నిలేపు… మి అమ్మ బాబు వచ్చారు ఒకసారి వచ్చి మొహం చుపించమను అంటూ కసురుకుంది. ఒక్కఉదుటున సంధ్య బయటకొచ్చి డోర్ వేసి సరాసరి కిచెన్లోకి వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి డీప్ ఫ్రిడ్జ్ ఎదురుగా మొహం పెట్టి… హమ్మ దీనెమ్మ ముసల్ది… ఈ వయసులోకూడా గోరోజనానికి ఎం తక్కువలేదు అని రిలాక్స్ అవుతుండగా పొయ్యిమీద కుక్కర్ విజిలేసింది. ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి కిచెన్లో పని మొదలెట్టింది సంధ్య.