20-01-2023, 09:38 AM
S04E02
రోజూ లేవడం ఇంటి వెనక్కి వెళ్లి మెట్ల మీద కూర్చుని మానస సమాధి చూస్తూ కూర్చోవడం, టైముకి అన్నం తినడం.. కొంచెం సేపు పడుకోవడం మళ్ళీ రాత్రి నిద్ర వచ్చేవరకు మానస సమాధి చూస్తూ కూర్చోవడం ఇదే విక్రమాదిత్య పని అయిపోయింది.. ఉన్న ఆస్తుల గురించి కానీ కంపెనీల గురించి కానీ పట్టించుకోవడం ఎప్పుడో మానేసాడు.. ఏదో ఉన్నాడంటే ఉన్నాడన్నట్టు ఇంట్లో ఉంటున్నాడు ఆలోచనలు మొత్తం చిన్నప్పటి నుంచి తనూ మానస బంధం గురించి వాళ్ళిద్దరి మధ్యా జరిగిన సంభాషణల గురించి ఆలోచిస్తూ, గుర్తుచేసుకుంటూ కూర్చునేవాడు.
అనురాధ, సంధ్య ఇద్దరు విక్రమాదిత్యని మార్చడానికి ఈ బాధలో నుంచి బైటికి తీసుకురావడానికి వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు కానీ లాభం లేదు, ఇటు తల్లీ భార్య ఎవరు తన పక్కన ఉన్నా.. వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు, చెప్పిన పని చేస్తున్నాడు, పిల్లలని ఆడిస్తున్నాడు కానీ మానస ఆలోచనల నుంచి మాత్రం బైటికి రాలేకపోతున్నాడు.. అనురాధ బాధపడటం తప్ప ఇంకేం చెయ్యలేకపోయింది.
రెండేళ్లు గడిచిపోయాయి విక్రమాదిత్య నవ్వి, అనురాధ కూడా ఏమి అడగలేకపోతుంది.. తనతో ప్రేమగానే ఉంటున్నాడు. పిల్లలీద్దరికీ అటు మానస మరియు తన పిన్ని శశి ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ఒకరికి మానస్ అని ఇంకొకరికి శశికాంత్ అని పేర్లు పెట్టాడు అన్ని బానే ఉన్నాయి కానీ ఇంతకముందు తనాకి తెలిసిన ఆ విక్రమ్ మాత్రం లేడు.. ఆ కొంటెతనం, ఆ చిలిపితనం, అనురాధ డామినేట్ చేస్తే తల వంచుకుని నిలబడే ఆ విక్రమ్.. అనురాధ మాట జవదాటని ఆ విక్రమ్ ఇక రాడేమో ఇక తనని అలా చూడలేనేమో అని భయపడింది.
రోజులు గడుస్తుండగా ఒకరోజు విక్రమాదిత్య పిన్ని అయిన శశి దెగ్గర శిష్యరికం చేసే ఒకరి దెగ్గరనుంచి కబురు వస్తే ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు, తన పిన్ని ప్రియ విద్యార్థి అయిన సామాన్య అనే అమ్మాయి దెగ్గర శశి తన సంతానాన్ని పిండ రూప పద్ధతిలో దాచిందని తెలిసి ముందు ఆశ్చర్యపోయాడు.. తన పిన్ని తన మీద పెట్టుకున్న నమ్మకానికి తనపై చూపించే ప్రేమకి తన మీద ప్రేమ కలిగింది.
ఎంతకీ పిండం చీల్చుకుని బిడ్డలు బైటికి రావట్లేదని చెప్పడంతో విక్రమాదిత్య ముద్రగడ ప్రజలకి కబురు చేశాడు. తెగ పెద్ద ఇది చూసి తన వల్ల కాదని తమ తెగ పూర్వికులు ఆఫ్రికా అడవుల్లో ఉన్నారని చెప్పగా విక్రమాదిత్య ఒక్కడే బైలుదేరాడు.
పెద్దాయన చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ ప్రయాణం సాగించాడు.. ముద్రగడ ప్రజలు, వీళ్ళ అసలు ఆనవాళ్లు ఉన్నది ఆఫ్రికాలోనే అక్కడ నుండి విడిపడి ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు.. వారి దెగ్గర నుంచి యుద్ధ విద్యలు మిగతా కావాల్సిన విద్యలు నేర్చుకున్నారు కానీ వైద్యానికి సంబంధించిన విద్యని నేర్చుకోలేకపోయారు. కారణం లేకపోలేదు ఎందుకంటే ఈ తెగ వాళ్ళని అక్కడి వాళ్ళు బహిష్కరించారు.
ఆఫ్రికా అడవుల్లో నివసించే మంధీ తెగ, మిధాలి తెగ, బిజారి తెగ మొదలగు పదముడు తెగల్లో ముద్రగడ తెగ ఒకటి.. ఇందులో ముద్రగడ తెగ ప్రజలకి మిగతా పన్నెండు తెగల విద్యలు మరియు రహస్యలు తెలుసుకోవాలన్న పిచ్చి కోరిక పుట్టింది దాని వల్ల వాళ్లలో వాళ్ళకే గొడవలు పుట్టి చివరికి ముద్రగడ తెగను బహిష్కరణ చేశారు, కానీ దాని తరవాత అందరూ విడిపోయారు.. ఇంతకముందులా కలిసి మెలిసి ఉండలేకపోయారు, ఒకరిమీద మరొకరికి అనుమానాలు మొదలయ్యాయి.
ఇంకా తెగలకి సంబందించిన విషయాలు అన్నిటి గురించి తెలుసుకుని విక్రమాదిత్య ఆఫ్రికా అడవుల్లో అడుగుపెట్టాడు.. ముందుకు వెళుతున్న కొద్దీ ఎవ్వరు కనిపించకపోవడంతో ఇంకొంత ముందుకు వెళ్ళగా దూరంగా మంటలు కనిపిస్తుంటే అటు వైపు వెళ్ళాడు.. అడవి మధ్య పెద్ద పెద్ద చెట్ల మధ్యలో విశాల ప్రాంగణంలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది అక్కడ.. పన్నెండు తెగల ప్రజలు కొట్టుకు చస్తున్నారు.. విక్రమాదిత్య అక్కడికి వెళ్లి ఒక చెట్టు పక్కన నిలబడ్డాడు, దూరంగా ఒక సింహాసనం లాంటి రాతి కుర్చీ ఒకటి ఉంది.. బహుశా కొండనే ఆ విధంగా చెక్కి ఉంటారు దాని ముందు ఒక గొడ్డలి నిలబెట్టి ఉంది, బంగారపు రంగులో ఉంది కానీ బంగారంలా అనిపించలేదు .. ప్రతీ ఒక్కరు ఆ గొడ్డలిని అందుకోడానికి వెళుతుంటే ఒకరిని ఒకరు ఆపుకుంటు దొరికిన వాడిని దొరికినట్టు పొడుచుకుంటున్నారు.
యుద్ధంలో భాగంగా ఎవరో నలుగురు వచ్చి విక్రమాదిత్య మీద పడగా వారిని వారించబోయాడు కానీ వాళ్ళు వినకపోవడంతో తప్పక నలుగురిని మట్టి కరిపించాడు.. అందరూ ఒకసారి విక్రమాదిత్య వైపు చూసారు.. తమ వాళ్ళని ఒక బైట వాడు వచ్చి కొట్టాడు అని తెలియగానే వాళ్ళున్న క్రోధపు క్షణాల అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.. అందరూ విక్రమాదిత్య మీదకి వెళుతుంటే విక్రమాదిత్యకి సహనం నశించింది..
చిన్నప్పటి నుంచి తాను ఎదురుకున్న కష్టాలు, కోపాలు, నష్టాలు, మోసాలు అన్నిటికీ మౌనంగా సహనంగా ఓపిక పట్టీ పట్టీ ఉన్నాడు.. అవన్నీ మానస చావుతో ఎప్పుడో పటాపంచలయ్యాయి కానీ ఎవరి మీద చూపించాలో తెలియలేదు ఇంట్లో ఉన్న అమ్మ మీద భార్య మీద పిల్లల మీద చూపించలేక ఇన్ని రోజులు అణుచుకున్నాడు కానీ ఇప్పుడు ఆ అవసరం కనిపించలేదు.. పిడికిలి బిగించి గట్టిగా అరిచాడు.. తెగ నాయకులు అది చూసి వాళ్ళ వాళ్లకి సైగ చెయ్యగా విక్రమాదిత్య మొదటి యుద్ధం మొదలయ్యింది.
ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే తెగ నాయకలు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే విక్రమాదిత్య కొట్టె ప్రతీ దెబ్బ చాలా బలంగా సరిగ్గా తను అనుకున్న చోటే తగులుతున్నాయి వాళ్లకి.. వెనక నుంచి బాణాలు, బల్లాలు కూడా పడుతుంటే చుట్టూ ఆయుధం కోసం చూసాడు కానీ ఏమి కనిపించలేదు ఒక్కటి తప్ప.. అదే గొడ్డలి.. విక్రమాదిత్య కొట్టుకుంటూ అందినవాడి మొహం మీద పిడి గుద్దులు గుద్దుతూ అటువైపు కదులుతుంటే విక్రమాదిత్య కోపానికి తన శరీరం చిన్నగా మెరవడం నాయకులు గమనించి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని అందరూ తమ తమ సైన్యానికి సైగ చేశారు.. యుద్ధ తీవ్రత పెరిగింది.
విక్రమాదిత్య చూపిస్తున్న క్రొధానికి తెగ వాళ్ళు సైతం తట్టుకోలేకపోతున్నారు, అస్సలు తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోయి అందరినీ కొట్టుకుంటూ వెళుతున్నాడు, తన చూపు మొత్తం ఆ గొడ్డలి మీదే ఉంది. ప్రతీ ఒక్కడు అడ్డుపడుతున్న కొద్దీ ఆ గొడ్డలిని అందుకోవాలన్న తన కోరిక ఇంకా ఎక్కువ అవుతుంది.. విక్రమాదిత్య ఎంతలా అయిపోయాడంటే చివరికి ఒక్కొక్కడిని ముట్టుకోకుండానే కింద పడేస్తున్నాడు. తెగ వాళ్ళు ఇది చూసి బెంబేలెత్తిపోయారు.
దాదాపు వంద మంది విక్రమాదిత్య గొడ్డలిని ముట్టుకోకుండా అడ్డుగా నిలుచుంటే విక్రమాదిత్యకి ఇంకా పంతం పెరిగిపోయింది, మొదటి మెట్టు మీద అడుగుపెట్టి అందరినీ తోసుకుంటూ, కొడుతూ వెళ్లి ఒక్కసారిగా ఎగిరి గొడ్డలి మీద చెయ్యి వేసి దాన్ని పట్టుకున్నాడు.. అంతే గొడ్డలి ఆ కొండ రాయి నుంచి పెకిలి విక్రమాదిత్య చేతిలోకి వచ్చింది.. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
కొన్ని వందల ఏళ్ల నుంచి ఆ తెగ మొదటి నాయకుడు మాత్రమే ఆ గొడ్డలిని ఎత్తాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు దాని వల్లే ఆయన మృత్యువు కూడా సంభవించింది మళ్ళీ ఇన్నేళ్లగా ఎవ్వరికి ఆ గొడ్డలి లొంగలేదు, ఎవ్వరూ ఆ సాహసం కూడా చెయ్యలేదు, పిచ్చి ప్రవర్తనతో ఒకరి మీద ఒకరికి అనుమానాలు, ఈర్ష్య వల్ల అది మాకు చెందాలంటే మాకు చెందాలని కొట్టుకుంటున్నారు కానీ అలాంటిది విక్రమాదిత్య చేతిలో నిషితంగా ఉండటం చూసి ఇప్పుడు జరిగే వింత చూసి ఎవరి నోటా మాట బైటికి రావట్లేదు తెగ నాయకులు సైతం భయపడ్డారు.
యుద్ధంలో కింద పడ్డ ఓ చిన్నపిల్లాడు తన తండ్రిని అడిగాడు, నాన్న ఆ గొడ్డలి ఎవ్వరికి లొంగదు కదా కాని ఆయన పట్టుకున్నాడు అని చూపించగా ఆయన ఆశ్చర్యపోయి భయపడుతూ నోరు విప్పాడు.
అది పరుశురాముడి గొడ్డలి.. మన తెగలు ఏర్పాటు చేసుకున్న కొత్తలో రాక్షసులు మన మీదకి దండేత్తి ఆడవాళ్ళని తీసుకెళ్లిపోతుంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఒక్కరిని చూసి మన పూర్వికులకి ధైర్యం వచ్చింది.. ఆయనే పరుశురాముడు ఈ రాజ్యాన్ని పాలించే రాజు తన దెగ్గర ఉన్న పదిలక్షల మంది సైన్యంతో ఒక్కడు యుద్ధం చేస్తున్నారని తెలిసి అది నిజామా కాదా అని వెళ్లి చూసారట.. పొద్దున మొదలు పెట్టి సూర్యాస్తమయం అయ్యే లోపు ఒక్కడే పది లక్షల మందిని, ఆ తరవాత రాజుని నరికేసాడు.. ఇక్కడుండే ప్రజలకి విముక్తిని స్వాత్రంతాన్ని ప్రసాదించాడు.. ఇప్పుడు నువ్వు చూస్తున్నావే ఆ గొడ్డలితోనే అనగానే పిల్లవాడు భయంగా విక్రమాదిత్య వైపు గొడ్డలి వైపు చూసాడు.
యుద్ధం అయ్యాక ఆయనలో మళ్ళీ ఒక సాధువునే తప్ప వీరుడిని చూడలేకపోయేసరికి ఆశ్చర్యపోయి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి ఆయనని సేవించుకుని గోడు వెళ్ళబోసుకోగా ఆయన ఆ రాక్షసులను చంపేశాడు. ఇక ఆయన హిమాలయాలకి వెళ్లిపోతున్నానని మళ్ళీ తిరిగి రానని మీకు కాపలాగా ఈ గొడ్డలి ఉంటుందని తనకి ఎదురుగా కనిపిస్తున్న ఆ కొండ మీదకి విసిరేసి అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు.. చాలా ఏళ్ల తరువాత మన మొదటి తెగ నాయకుడు ఆ గొడ్డలిని ఒక్కసారి అయినా ముట్టుకోవాలని వెళ్లి అక్కడికక్కడే రక్తం కక్కుకుని చనిపోయాడు.. అప్పటి నుంచి అందరం ఆ గొడ్డలి వెనకాలే మన స్థావరాలు, మన ఉనికి ఏర్పరుచుకున్నాము.. అని ముగించాడు
ఈదురు గాలుల శబ్దాలు చెవుల్లో మారుమొగుతుంటే అందరూ మౌనంగా ఆశ్చర్యంగా విక్రమాదిత్య వంకే చూస్తున్నారు తరువాత ఏం జరుగుతుందా అని.. పక్కనే ఉన్న చెట్టు మీద పిడుగు పడటంతో పెద్ద మంట వచ్చింది.. అందరూ అటు వైపు చూసారు.. ఆకాశంలో ఉరుములు మెరుపులు, సూర్యుడిని మబ్బులు కమ్మేసాయి.. పెను తుఫాను వచ్చేలాగా మారిపోయింది ఒక్కసారి ఆ వాతావరణం.. పెద్దగా ఓం నమస్సివాయ అన్న ఖంఠం విని అందరూ ఆ వైపున చూసారు.
ఏడడుగుల వజ్రకాయం కలిగిన ముని ఒంటి మీద రుద్రాక్షలతో కోపంగా వేగంగా నడుచుకుంటూ వస్తుంటే, ఆ అపార తేజస్సుని తట్టుకోలేక అక్కడున్న వాళ్లంతా స్పృహ తప్పి పడిపోతుంటే విక్రమాదిత్య మాత్రం చేతిలో గొడ్డలితో వస్తున్న ఆ ముని వంక చూస్తూ ఉన్నాడు. ఇంకా విక్రమాదిత్య కోపం తగ్గలేదు సరైన శత్రువు కోసం చూస్తున్నాడు.