Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఇచ్ఛారూపధారి...!!! Mega trailer
#91
అభీర్ చెప్పిన మాటలు విని ఎంట్రా నువ్వు చెప్పేది అన్నయ్య నీ చంపడం ఎంటి అని అడిగిన దేవరాజ్ వైపు చురుగ్గా చూసాడు అభీర్...

[b]అసలు ఏమైంది అభీర్ అన్నయ్య ను ఎవరు చంపి ఉంటారు అంటూ రెండు అడుగులు ముందుకు వేసి తన గొంతు తగ్గించి అడిగాడు మహేంద్ర…[/b]
న్నయ్య ను చంపడానికి ముందు చాలా హింసించారు.అడవి లో ఎక్కువ దూరం పరిగెట్టించారు.దాంతో చెట్ల కొమ్మలు వొళ్ళు మొత్తం గిసుకుపోయాయి.కాళ్ళకు ఉన్న చెప్పులు ఊడిపోవడం తో కాళ్ళు కూడా బాగా కొట్టుకుపోయాయి..

అలాగే చనిపోయేముందు గజేంద్ర నీ తల క్రిందులుగా వెలాడదియడం వల్ల బ్లడ్ సర్కులేషన్ సరిగా జరగక అప్పటికే దెబ్బ తిన్న కాళ్ళు బాగా వాచిపోయాయి.పాయిజన్ వొంట్లోకి ఇంజెక్ట్ చేయడానికి ముందే బాడీ మీద కూడా పడటం తో బాడీ మొత్తం లోపల కాలిపోయింది ..

అలాగే చనిపోయిన తర్వాత కూడా ఏదో బలం అయిన దానికి విసిరి కొట్టడం తో వెన్నపూస విరిగిపోయింది.అలాగే పుర్రె ఇంకా కొన్ని చోట్ల ఎముకలు నుజ్జు నుజ్జు అయ్యాయి.ఇదంత పోస్టుమార్టం రిపోర్టు ద్వారా తెలిసింది అంటూ అభీర్ తన అన్నలకు చెప్తూ… హేమరాజ్ వంక చూసాడు..

హేమరాజ్…కానీ గజేంద్ర నీ ఇంత క్రూరంగా చంపల్సిన అవసరం ఎవరికి ఉంది.మన బిజినెస్ లో ఉన్న శత్రువులు ఈ పని చేశారా అంటే లేదు వాళ్ళకి అంత ధైర్యం లేదు , నువ్వు కన్నెర్ర చేస్తే చాలు భయం తో పారిపోతారు మరి గజేంద్ర నీ ఇంత క్రూరంగా ఎవరు చంపి ఉంటారు ..

అభీర్…అదే కదా తెలియడం లేదు అంటూ తన మాట తోనే తన అన్నలను సైలెంట్ గా ఉండమని చెప్తూ కుర్చీలో తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు..

దేవరాజ్, హేమరాజ్ ఇంకా మహేంద్ర ఒకరిని ఒకరు చూసుకుంటూ ముగ్గురు అభీర్ నీ చూస్తున్నారు.ఆ గది మొత్తం నిశబ్దం గా ఉంది ఎంతలా అంటే ఆ ప్రశాంతకి ముగ్గురి గుండె చప్పుళ్ళు పైకి వినిపిస్తున్నాయి..

ఆ ప్రశాంతత నీ భరించలేక అభీర్ నీ పిలుద్దాం అనుకొని మహేంద్ర గొంతు విప్పేటప్పుడు వాళ్ళు ఉన్న గది తలుపు ఎవరో కొడుతున్న శబ్దం వినిపించింది..

అభీర్ ఇంకా కళ్ళు మూసుకొని అలాగే ఉండి కమ్ ఇన్ అంటూ పిలిచాడు.. మిగిలిన అన్నదమ్ములు వచ్చేది ఎవరా అనుకొని చూస్తున్నారు తలుపు వైపు ఆ తలుపు తెరుచుకొని లోపలకి వస్తున్న వ్యక్తి నీ చూసి ఈ ముగ్గురు ఒక అడుగు వెనక్కి వేశారు..

ఆరున్నర అడుగుల ఎత్తు తో , విశాలమైన ఛాతి భాగం, మర్రి చెట్టు మొదలు లాగా ఉన్న కాళ్ళు, బలమైన కండలు తిరిగి ఉన్న చేతులతో లోపలికి వచ్చాడు అభీర్ పర్స్నల్ బాడీ గార్డ్..

చూడటానికి అడవి మనిషి లా ఉన్న అతన్ని అభీర్ తీసుకొని వచ్చి ట్రైనింగ్ ఇప్పించి బాడీగార్డ్ లాగా తన వెంట ఉంచుకున్నాడు.. ఎక్కడ నుండి వచ్చాడో తెలీదు కానీ అభీర్ వరకు ఏదైనా చేరాలంటే ముందు ఇతన్ని దాటి వెళ్ళాలి.. మల్లయుద్ధము నుండి ముష్టియుద్దం , బల్లెం విసరడం దగ్గర నుంచి బాంబులు వేసేవరకు ఇలా ప్రతి దాంట్లో ట్రైన్ చేయబడ్డాడు. ఆ బాడీగార్డ్ అల నడుస్తూ వస్తుంటే అడవిలో సింహం మీదకు వస్తుందా అనేలా ఉంది.. సగం మంది అభిర్ ప్రత్యర్థులు ఇతన్ని చూసి భయం తో పారిపోతారు, ఎవరైనా దైర్యం చేసి ముందుకు వచ్చిన ప్రాణాలతో మిగిలిన అవకాశం లేదు..

........

వీదొకడు మన ప్రాణాలకు, ఇంత బలంగా ఉండే మనమే వీరికి భయపడుతున్నాము.ఈ అభీర్ కి వీడు ఎక్కడ దొరికాడో అమ్మో మనసులో కూడా వీడికి ( అభీర్)గౌరవం ఇవ్వలేదని తెలిస్తే చంపేస్తాడు  అని  దేవరాజ్ తనలో తాను అనుకుంటున్నాడు..

అభీర్ తన బాడీగార్డ్ తో మాట్లాడుతూ ..

ఏమైనా తెలిసిందా నిరాగి..( నిరాగీ అనే పేరు ఒక జపనీస్ వెబ్ సిరిస్ లో విలన్ నేమ్ నాకు బాగా నచ్చింది అందుకే తన పేరు వాడుతున్న)

** నాగు పాము కన్న ప్రమాదకరం అయిన వాడు అని అభిర్ ఇతనికి ఆ పేరు పెట్టాడు . నిజానికి అసలు నిరాగి ఎవరు అతని పేరేంటి ? ఎక్కడ నుండి వచ్చాడు .? అనేది అభీర్ కి కూడా తెలియదు ..**

అభీర్ ఒక సారి నల్లమల అడవుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు వొళ్ళంతా రక్తం కారుతూన్న ప్రాణాలు విడవకుండా అతన్ని చూసి ఆశ్చర్యపోతూ పైకి లేపటానికి ప్రయత్నిస్తూ మొఖం మీద నీళ్ళు చల్లుతాడు అభీర్..దాంతో సృహ లోకి వచ్చిన అతను తన పక్కన ఉన్న చెట్టు మొదలు పట్టుకోని ఒక్కపెట్టున దాని భూమి లో నుండి పీకి అభిర్ తల బద్దలు కొట్టబోయి ఆ చెట్టు పక్కన పడేసి ఎవరు నువ్వు అని అడిగాడు..

వొంట్లో ఓపిక లేని స్థితిలో కూడా అతను స్పందించిన తీరు అలాగే చెట్టు ను మొదలు తో సహా ఊడబికడం చూసి అభీర్ ఆశ్చర్యపోతూ మరో వైపు భయపడుతూ ఆ వ్యక్తి అడిగిన దానికి సమాధానం ఇచ్చాడు.

అభీర్…నేను నీకు హాని తలబెట్టేవాడిని కాదు అని అన్నాడు.

అభీర్ చెప్పింది వింటూ ఈ అడవిలో ఉన్న చెట్టు చేమ కూడా నాకు హాని చేయాలని చూస్తాయి,సాయం చేయాలి అని కాదు..కానీ నువ్వు నాకు సాయం చేసావు అంటే అర్థం అవుతుంది నువ్వు ఈ అడవి లో వాడివి కాదు అని.అయిన ని వాలకం చూస్తే అడవి మనిషి లాగా లేవు లే అంటూ ఆ వ్యక్తి చుట్టూ వెతుకుతూ తన పక్కన ఉన్న పొదలో చెయ్యి పెట్టీ ఏదో పట్టుకోని బయటకు లాగాడు.

[b]మనిషి కంటే ఎత్తు,బరువు,బలం కలిగి ఉన్న ఒక పెద్దపులి శవం దాన్ని చూడగానే అభీర్ కి వణుకు పుట్టింది..[/b]

[b][b]కానీ ఆ వ్యక్తి మాత్రం తీరిగ్గా కూర్చొని తన మొలలో దోపుకొని ఉన్న కత్తి తీసి ఆ పులి గోర్లు పికుతున్నాడు.
[/b]
[/b]

అది చూసి అభీర్ ఎమ్ చేస్తున్నావు..? అని అడిగాడు.దానికి ఆ వ్యక్తి హా కనపడటం లేదా అంటూ తన చేతిని నేల మీద పెట్టి మట్టిలో ఏదో వెతుకుతూ పట్టుకోని పైకి లాగాడు . అది ఒక అడవి చెట్టు తీగ దానిని తీసుకొని ఒక గోరు శుభ్రం చేసి దాన్ని ఆ తీగ తో కట్టి మెడ లో వేసుకొని మిగిలిన గోర్లు భద్రపరిచాడు..ఇన్నాళ్లు నా చేతికి చిక్కకుండా తప్పించుకుంటూ తిరిగింది,తీర చేతికి చిక్కిన చావకుండా ఉండలేదు ,కానీ నన్ను బాగా గాయపరిచింది అంటూ పక్కనే ఉన్న మంచి నీటి సెలయేరు లో మొఖం ఇంకా గాయాలు కడుక్కొని అక్కడి కొన్ని చెట్ల ఆకులు తుంచి వాటి పసరు పిండి గాయాల మీద అడ్డుకున్నాడు..



ఆ వ్యక్తి నీ చూస్తూ అభిర్ నాతో వస్తావా అని అడిగాడు..



వస్తె ఏమి ఇస్తావు అని అడుగుతూ చుట్టూ ఉన్న ఎండు పుల్లలు ఏరి మంట వెలిగించడానికి అగ్గి పెట్టె అడిగాడు.



అభీర్ వాటిని వెలిగిస్తూ నువ్వు ఎన్నడూ చూడనంత డబ్బు ఇస్తాను అని అన్నాడు.



నేనేం చేయాలి అంటూ ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తి తో పులి చర్మం వోలుస్తున్నాడు..



అభీర్ ఆ వ్యక్తి చేస్తున్నది చూస్తూ నాకు బాడీగార్డ్ గా ఉండాలి అని అన్నాడు.



పులి మాంసాన్ని మంటల మీద వేస్తూ బాడీ గార్డ్ అంటే ఏమి చేయాలి అని అడిగాడు..



అభీర్…అనుక్షణం నా వెంట ఉండాలి,నాకు కాపలా గా ఉంటావా అని అడిగాడు.



నీకు నేను ఎందుకు కాపలా గా ఉండాలి అని అంటూనే ఆ వ్యక్తి అక్కడ ఉన్న మంట లో నుండి సన్నని పుల్ల ఒకటి తీసి దాన్ని నేరుగా అభీర్ మీదుగా విసిరాడు.ఆ పుల్ల అభీర్ చెవి కి పక్కగా దూసుకుపోయి అభీర్ నీ కాటు వేయడానికి పడగ విప్పి ఉన్న ఒక త్రాచుపాము పడగ లో దిగబడింది..



ఆ కర్ర పుల్ల తన మీదకే వస్తుందని భయం తో బిగుసుకుపోయి అలానే చూస్తున్నాడు అభీర్.



కర్రపుల్ల ఆ పాము పడగ లో దిగబడగానే తస్సాడియ్య నన్ను తప్పించుకు పోవాలి అనుకున్నావా , నీకు తల లో మాత్రమే విషం కానీ నాకు వొళ్ళంతా విషం అంటూ పాము నీ దూరంగా విసిరేశాడు…



తనకంటే బలమైన పులిని చంపడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాటిని ఉపయోగించుకుంటూ ఆపద వచ్చిప్పుడు రెప్పపాటు కాలం లో స్పందించే తీరు ను చూసి ఇతన్ని ఎలాగైనా నా పక్కనే ఉంచుకోవాలి అని కృతనిత్యంతో 

చూడు నువ్వు నాతో వస్తె నీకు ఎంత డబ్బు కావాలంటే అంతా డబ్బు ఇస్తాను,ఇప్పుడు ఎలా అయితే ఆ పాము కాటు నుండి నన్ను కాపాడావో అలాగే నా పక్కన ఉండి ప్రమాదం సంభవిస్తే నన్ను కాపాడు చాలు అని అన్నాడు అభీర్.



డబ్బులు ఇస్తాను అంటున్నావు కాబట్టి వస్తాను.కానీ ఏదైనా నాకు నచ్చినట్టు చేస్తాను ఎందుకు ఏమిటి అని అడగకూడదు.నీకు ప్రమాదం రాకుండా అయితే కాపాడుతా కానీ అందుకు నేను ఏమి చేసినా నువ్వే చూసుకోవాలి నాకు సంబంధం లేదు . మరి అందుకు నువ్వు సిద్దమేనా అని అభిర్ నీ అడిగాడు.



అభీర్…హా సిద్ధమే నువ్వు నా పక్కన ఉండు చాలు మిగితాదంత నేను చూసుకుంటాను . అయితే మరి నువ్వు నాతో వస్తున్నావు కదా అని ఆ వ్యక్తి నీ చూసాడు.



హా వస్తున్నా అంటు కాలిన పులి మాంసాన్ని తీసుకొని తింటున్నాడు. ఆభిర్ నీ చూస్తూ తింటావా అని అడిగాడు.



అభీర్ నాకు వద్దు నువ్వు తిను అయ్యాక వెళ్దాం , సరే నీ పేరు ఏమిటి అని అడిగాడు ఆ వ్యక్తి నీ.



నాకు ఒక పేరు అంటూ ఎది లేదు ,ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు నువ్వు కూడా నీకు నచ్చిన పేరు తో పిలువు అని అన్నాడు.



అభీర్ బాగా ఆలోచించి ఆ వ్యక్తి స్పందిస్తున్న తీరు అతని బలం చూసి ఇప్పుడు నుండి నీ పేరు నిరాగి అని అన్నాడు..



అతను హ్మ్మ్ సరే నిరాగి అంటే ఏమిటి అని అడిగాడు..


[b][b]అభీర్…ఒక్కల్ల మీద ఆధారపడి ఉండకుండా తనే ఒక సైన్యం లా ప్రవర్తించే వాడు అని అర్థం .. అలాగే నువ్వు ఇప్పటి నుండి నన్ను సార్ అని పిలవాలి అలాగే నేను ఏమి చేసినా ఎందుకు ఏమిటి అని అడగకూడదు అర్థం అయిందా అని అన్నాడు..[/b][/b]

[b][b][b]నిరాగీ తినడం పూర్తయ్యాక పైకి లేచి వెళ్దామా అని అన్నాడు. 
[/b]
[/b]
[/b]



అప్పుడు నుండి అభీర్ ఆ అడవి మనిషి నీ తన బాడీగార్డ్ గా పెట్టుకున్నాడు..



ప్రస్తుతం…



నిరాగి ఏమైనా తెలిసిందా..



లేదు సార్ ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు.కానీ గజేంద్ర గారి తో పాటు కార్లో మరొక వ్యక్తి కూడా ఉన్నారు ఆ రోజు రాత్రి మరి అది ఆడ, మగ అనేది తెలియాలి.

అని చెప్పిన నిరాగి నీ చూస్తూ నువ్వు ఎలా చెప్పగలవు ఈ విషయం అని అడిగాడు దేవరాజ్..



కార్ లో గజేంద్ర గారి పక్క సీట్ నుండి వస్తున్న మొగలిపువ్వుల పరిమళాలతో , అయితే అది కొన్ని రకాల సువాసన సాధనాల్లో విరివిగా వాడుతారు.ఒక వేళ సెంట్ అయితే అది ఆడ మగ ఇద్దరు వాడే అవకాశం ఉంది అందుకే ఎవరు ఆయనతో పాటు ఉన్నారో చెప్పలేము అని చెప్పాను అని అన్నాడు నిరాగి..



నిరాగి సమాధానానికి గర్వంగా ఫీల్ అవుతూ, హత్య జరిగి రెండు రోజులు అయిన నువ్వు ఆ సువాసన ఎలా కనిపెట్టావు నిరాగి అంటూ తన అన్నల కన్న తానే తెలివైనవాడిని అన్నట్టు వాళ్ళ వంక చూస్తూ నిరాగి నీ ప్రశ్నించాడు అభీర్..



….



సార్ మామూలు పూల వాసన అంటే గులాబీ,మల్లె పూలు ఇలాంటివి అయితే వాటి వాసన సీట్ వెనుక భాగం వరకే ఉంటుంది కానీ సీట్ మొత్తం వ్యాపించదు పైగా ఆ వాసన ఎక్కువ సేపు ఉండదు .

అలా సీట్ మొత్తం వ్యాపించింది అంటే పెర్ఫ్యూమ్ అయిన అవ్వాలి లేదా సెంట్( అత్తరు) అయిన అవ్వాలి. పెర్ఫ్యూమ్ కూడా కొద్ది గంటలు మాత్రమే ఉంటుంది . 

అదే సెంట్ అయితే దాని సువాసన రోజుల తరబడి అలాగే నిలిచిపోతుంది,పైగా మొగలిపువ్వు లాంటి ఘాటైన పువ్వుల తో చేసిన సెంట్ అయితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది.

అందుకే మనం ఇంట్లో బట్టలు పెట్టుకునే బీరువా లో ముక్కి వాసన రాకుండా ఉండటానికి సెంట్ బుడ్డి పెట్టేది ..కార్ డోర్ లాక్ చేసి ఉండటం తో ఆ సువాసన అక్కడే నిలిచిపోయింది.



( మిత్రులారా మీకోసం perfume and sent bottle pic పెడుతున్న చూడండి)



అని చెప్పిన నిరాగి నీ శభాష్ నిరాగి అంటూ ఇప్పుడు అర్థం అయింది కదా అని తన అన్నల వంక చూసాడు అభీర్…



వాళ్ళు తల దించుకొని నిలబడి ఉన్నారు.ఇప్పుడు మనం ఆ హంతకుడిని పట్టుకోవడం ఎలా నిరాగి అని అభిర్ అడిగాడు..



నిరాగి…మనం కనిపెట్టలేము సార్ అని అన్నాడు..దాంతో దేవరాజ్, హేమరాజ్ ఇంకా మహేంద్ర తలలు ఎత్తి అభీర్ వంక చూసారు..



వాళ్ళ చూపుల్లో హేళన కనిపించి అవమానంగా ఫీల్ అవుతూ ఎందుకు కనిపెట్టలేము నిరాగి అంటూ కోపంగా పైకి లేచి నిలబడ్డాడు అభీర్…



…..దక్కన్ పీఠభూమి ప్రాంతం లో విస్తరించి ఉన్న అడవుల్లో ఒక చోట అర్ధరాత్రి సమయం…



ఆ కటిక చీకటిలో చీకటి కూడా భయపడే కారు నలుపు రంగు లో కొన్ని వింత జీవులు గాలి లో తిరుగుతూ అరుస్తున్నాయి..వాటి అరుపు ఆ ప్రదేశం అంతా మార్మోగుతోంది దాంతో అడవిలోని జంతువులు భయం తో పారిపోతున్నాయి.చెట్ల మీద గుళ్ళలో ఉన్న పిట్టలు,గువ్వలు అక్కడ నుంచి కిందపడిపోితున్నాయి..



ఆ జీవాలు అన్ని ఒక చోటకి దిగి అరుస్తూ ఉంటే నిశబ్దం అంటూ వాటి గుంపు లో నుండి ఒక జీవి ముందుకు వచ్చింది.అది దాని రెక్కను చేతి కర్రలాగా నేలకు ఆనించి కుంటుతు నడుస్తుంది..



ఆ జీవి ముందుకు వచ్చి మహారాణి జాడ కనిపెట్టారా అని అడిగింది.. మిగిలిన వాటిలో ఒకటి ముందుకు వచ్చి లేదు కుకృతి మాకు ఎటువంటి జాడ దొరకలేదు అంటూ వింత శబ్దం చేస్తూ చెప్తుంది.దాని గొంతు నుండి ఆ మాట రాగానే అక్కడ అలుముకొని ఉన్న చీకటి నీ చీలుస్తూ ఒక మెరుపు వచ్చి ఆ జీవి నీ చంపేసింది..



మిగిలిన జీవులు అన్ని ఆ మెరుపు వచ్చిన వైపు చూస్తూ అక్కడ ఉన్న ఆకారాన్ని చూసి భయం తో వణుకుతూ వాటి తలలు కిందకు దించి కాకసురా ప్రణామం అంటూ నమస్కరించాయి..



10 అడుగుల ఎత్తు తో వొళ్ళంతా నల్ల రంగు పులుముకున్నట్టు ఉన్న కేసాలాతో మోకాళ్ళ వరకు చేతులు ఒక చేతి లో ఏదో ప్రాణి యొక్క వెన్నపూస మరొక చేతిలో సింహం తల అలాగే మెడ లో కాకుల తలలతో చేసిన మాల , కొమ్ముల లాగా తలను దాటి ఉన్న చెవులు , అసలు పెదాలు ఉన్నాయ్యా అని అనుమానం కలిగే రీతి లో ఉన్న పళ్ళ వరుస నడుము వరకు మనిషి మిగిలిన భాగం జంతువు తో ఉన్న కాకసురుడు వాళ్ళ ముందు కి వచ్చాడు , వచ్చిన శవాల వాసన కొడుతున్న కాకసురుడు అల ముందుకు నడిచి వస్తుంటే ఆ వింత జీవాలు అన్ని దారి అడ్డం తప్పుకుంటు ఉన్నాయి.



కాకసురుడు…ఎంటి మీ అసమర్థత ఇంకా ఎన్నెళ్లు వేచి చూడాలి మళ్ళీ రెండు సం "లలో ఆ ఘడియలు వస్తున్నాయి కుకృతీ కానీ మీకు ఇంకా మహారాణి ఆచూకీ తెలియలేదు అంటే నేను మిమ్మల్ని నమ్ముకోవడం నా తెలివితక్కువ తనం అంటూ దిక్కు పెక్కటిల్లెలా అరుస్తున్నాడు..దాంతో వీచే గాలి కూడా క్షణకాలం ఆగిపోయింది..



శాంతి.. శాంతి కాకసుర నువ్వు ఒడిపోయావు అని అనుకోకు ముముక్షి ఇంకా తిరిగిరాలేదు అంటే దాని అర్థం తనకు మహారాణి గురించి ఏదైనా విషయం తెలిసే ఉంటుంది .కాబట్టి తను వచ్చే వరకు ప్రశాంతం గా ఉండు ఈ రూపాన్ని విడిచి మామూలు స్థితికి రా అంటూ కుకృతి చెప్పింది..



అది విని కాకసురుడు తన రాక్షస రూపం వదిలి మామూలు రూపం లోకి వచ్చాడు…



కాకసురుడు అక్కడ ఒక చితి వెలిగించి దాని ముందు కూర్చొని ఏవో మంత్రాలు చదువుతూ నా మానస పుత్ర ఎక్కడ ఉన్నావ్ అంటూ ఆ చితి లో జంతువుల రక్తం వేస్తున్నాడు..



….. ఇప్పుడు ఒక మాట చెప్పాలి ఈ కథ 2037 లో జరుగుతుంది….



తమిళనాడు రాష్ట్రం లో ఒక ప్రాంతం.



ప్రశాంతంగా నిద్ర పోతున్న 20 ఏళ్ల యువకుడు ఒక్క సారిగా నిద్ర లేచి చుట్టూ చూస్తున్నాడు. అతని పక్కన పడుకొని ఉన్న ఒక ముసలాయన కూడా నిద్ర లేచి ఆ యువకుడిని చూస్తూ ఏమైంది చిన్నా నిద్ర రావడం లేదా అని అడిగాడు.



చిన్నా ఆ ముసలాయన ను చూస్తూ అభిరామ్ బాబాయ్ అది తను మళ్ళి పిలుస్తున్నాడు అని తడబడుతూ చెప్పాడు..



అభిరామ్ …ఎవరు చిన్నా ఎవరు పిలుస్తున్నారు మొత్తం నీ భ్రమ మాత్రమే నీళ్ళు తాగి పడుకో అంటూ నీళ్ల బాటిల్ ఇచ్చాడు.



చిన్నా…ఆరోజు మనల్ని కాపాడిన ఆ వ్యక్తి ఆఆ ఆఆ ఆఆ..అంటూ చెవులు రెండు గట్టిగా మూసుకొని అల్లాడిపోతున్నాడు..



అదంత చూస్తూ హేయ్ చిన్నా పడుకో అదేమీ లేదు అంటు నచ్చజెప్పడానికి చూసాడు అభి..



చిన్నా తన తల తిప్పి అభి నీ చూస్తున్నాడు , చిన్నా కళ్ళు పచ్చ రంగు లోకి మారిపోయాయి మొఖం మీద నరాలు నల్లగా ఉబ్బి కనిపిస్తున్నాయి..


[b][b][b]తను నన్ను పిలుస్తున్నాడు అని చెప్పకదా వినవ ముసలి నా కొడకా అంటూ అభి నీ ఒక చేత్తో ఎత్తి గోడకు విసిరికొట్టాడు.చిన్నా ఉన్నట్టుండి గాలిలోకి లేచి గట్టిగా అరుస్తూ తలుపు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చాడు.అక్కడ ఉన్న తన బైక్ స్టార్ట్ చేసుకొని ఆ శబ్దం తనకు వినిపిస్తున్న వైపు ప్రయాణం మొదలు పెట్టాడు…[/b][/b][/b]
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 9 users Like Jani fucker's post
Like Reply


Messages In This Thread
RE: ఇచ్ఛారూపధారి...!!!...( రెండవ భాగం) ఈరోజు 5- జనవరి - by Jani fucker - 18-01-2023, 01:50 PM



Users browsing this thread: 3 Guest(s)